
చండీగఢ్: గత నెల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా అల్లర్లతో సంబంధముందన్న కారణంతో బజరంగ్‌దళ్ సభ్యుడు గోసంరక్షకుడైన బిట్టు బజరంగీని అరెస్టు చేశారు హర్యానా పోలీసులు.
నూహ్ జిల్లా గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లోని జరిగిన అల్లర్లలో ఐదుగురు మరణించగా సుమారు 70 మంది గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఒక మసీదు ధ్వంసం కాగా వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి ప్రధానంగా బజరంగ్‌దళ్ కార్యకర్తలైన బిట్టు బజరంగీ, మోను మనేసర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో హర్యానా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిట్టు బజరంగీని ఫరీదాబాద్ లోని తన ఇంటి వద్దే పారిపోతుండగా వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డవడంతో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో పోలీసులు సాదా దుస్తుల్లో కనిపించగా వారి చేతుల్లో కర్రలు తుపాకులు కనిపించాయి. అతడితో పాటు అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు ఈ బృందంలోని ఒక పోలీస్ అధికారి. పోలీసుల విధులకు ఎవ్వరు ఆటంకం కలిగించినా విడిచిపెట్టేది లేదని.. సోషల్ మీడియాని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అసత్య సమాచారంతో తప్పుదోవ పట్టించినా సహించేది లేదని అన్నారు.
బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్ ఒక సాధారణ పండ్ల వ్యాపారి. ఫరీదాబాద్ లోని దాబువా మార్కెట్ లో పండ్ల వ్యాపారం చేసుకునే అతను ఒక గోసంరక్షణ గ్రూపును కూడా నిర్వహిస్తున్నాడు. గత నెలలోనే అతడిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. నూహ్ అల్లర్ల తర్వాత గోసంరక్ష బజరంగ్ చీఫ్ పైనా కేసు నమోదైంది. స్థానిక నూహ్ ఎమ్మెల్యే చౌదరి అఫ్తాబ్ మాట్లాడుతూ బిట్టు బజరంగ్, మోను మనేసర్ ఇద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలననే అల్లర్లు చెలరేగాయని ప్రజలు వారిపై కోపంగా ఉన్నారని అన్నారు.
बिट्टू बजरंगी को हरियाणा पुलिस ने किया गिरफ्तार
— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) August 15, 2023
पहले सुदर्शन न्यूज के रेजिडेंट एडिटर मुकेश कुमार जी की गिरफ्तारी
अब गौरक्षक #BittuBajrangi की गिरफ्तारी
ये कैसा अमृतकाल है खट्टर साहब ? स्वतंत्रता दिवस के दिन गौरक्षक की गिरफ्तारी क्यों ? pic.twitter.com/7PlI99F7QR
ఇది కూడా చదవండి: Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం