Gurmeet Singh Ram Rahim
-
డేరా బాబాకు మరో దెబ్బ
సాక్షి, ఛండీగఢ్ : డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుర్మీత్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛండీగఢ్ హైకోర్టు కొట్టేసింది. బాధిత మహిళల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గుర్మీత్ వాదనను తోసిపుచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ అతను ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, ఇద్దరు సాధ్వీలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల శిక్షను గుర్మీత్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుర్మీత్ తరపున ఏ వాదనతో కూడా కోర్టు అంగీకరించలేకపోయింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా సీబీఐ న్యాయస్థానం తీర్పును సమర్థించింది. -
ముస్లిం మతంలోకి గుర్మీత్ సింగ్ డేరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న హరియాణాలోని స్వచ్ఛా డేరా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హిందూ మతంలో కల్లోలం సృష్టించి అయినా సరే జైలు నుంచి బయట పడేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. దేశంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని, అందులో భాగంగానే గుర్మీత్ బాబాను అక్రమంగా కేసులో ఇరికించి జైలుపాలు చేశారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దాడుల నుంచి రక్షించుకునేందుకు ముస్లిం మతంలోకి మారడం ఒక్కటే శరణ్యం అంటూ ముఖానికి ముసుగేసుకున్న వ్యక్తితో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అవును, ముస్లిం మతం పుచ్చుకోవడమే అందరికి మంచిదని, ముస్లింలు రాళ్లు విసిరినా వారి జోలికి ఎవరూ వెళ్లరని ఆ ముసుగు వ్యక్తి ఆ వీడియోలో సమాధానం ఇచ్చారు. ‘మన మాతృ భూమిలో హిందువుగా ఉండడమే నేరం అయినప్పుడు హిందూ మతాన్ని ప్రేమించడం వల్ల కన్నీళ్లే మిగులుతాయి. మన మత విశ్వాసంపై దాడి జరుగుతున్నప్పుడు మనం మతం మారితే తప్పేందీ? నాలా ఆలోచిస్తున్న వారితో నేను ముస్లిం మతంలోకి మారుతున్నాను’ అని సందీప్ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘ఒట్టి చేతుల్తో కూడా మనం బుల్లెట్లను ఎదుర్కోగలం. ముస్లిం మతంతో చేరే విషయమై మన నాయకుడు ముస్లిం నాయకులతో మాట్లాడుతున్నారు. కనీసం లక్ష మంది బాబా అనుచరులు మతం మారేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని బాబా అనుచరుడొకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముస్లిం రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారిలతో సంప్రదింపులు జరుపుతున్నారని సందీప్ మిశ్రా వ్యాఖ్యానించడం కూడా ఆ వీడియోలో ఉంది. ఇదంతా ఉత్తుత్తి బెదిరింపులేనని, సంక్షోభ సమయంలో మతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెల్సినవాడు గుర్మీత్ సింగ్ అని, ఆయన గురించి బాగా తెల్సిన విశ్వసనీయులు మీడియాతో వ్యాఖ్యానించారు. జైల్లో ఒంటరిగా గడుపుతున్న గుర్మీత్ సింగ్ ఎలాంటి ఫోన్ వినియోగించడం లేదని, ఎవరితో మాట్లాడడం లేదని జైలు అధికారులు చెప్పడం కూడా అబద్ధమేనని వారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగిన గుర్మీత్ జైలు నుంచే తన డేరా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని వారు అంటున్నారు. తాను వాడే రెండు ఫోన్ నెంబర్లను జైలు అధికారులకు గుర్మీత్ సరెండర్ చేసినట్లు చెబుతున్నారుగానీ, అవి ఒరిజనల్ నెంబర్లేనా ? కాదా? అన్న విషయాన్ని కూడా జైలు అధికారులు ఇంతవరకు తనిఖీ చేయలేదని వారు తెలియజే స్తున్నారు. -
ఎట్టకేలకు హనీప్రీత్ అరెస్ట్
హరియాణా : ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ మంగళవారమిక్కడ ధ్రువీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. కాగా గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమె మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన విషయం విదితమే. తాను దేశం విడిచి పారిపోలేదని, త్వరలో కోర్టులో లొంగిపోతానని హనీప్రీత్ అంతకు ముందు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను హరియాణా పోలీసులు ...చంఢీగఢ్ హైవే సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా గత 38 రోజులుగా ఆమె రహస్య జీవితం గడిపారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. చిట్టచివరకు ఆమెంతట ఆమె అజ్ఞాతం వీడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. రేప్ కేసులో గుర్మీత్ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె కోసం రెండు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో సోమవారం ముందస్తు బెయిల్‌కు హనీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పంజాబ్-హర్యానా హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించింది. అజ్ఞాతంలో ఉన్న హనీతోపాటు డేరా బాబా సహచరులైన ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్‌ను అరెస్టు చేయాలని పంచకుల కోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో.. ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఆమె ఢిల్లీలోని తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆమె న్యాయవాది ఇంటికి వెళుతుండగా నమోదైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది ప్రదీప్ ఆర్య ద్వారా ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోలీసుల గాలింపులు డేరా బాబా గుర్మీత్ సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్, ఇతర సహచరుల కోసం హర్యానా పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గాలించారు. ఆమె కోసం ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2లోనూ సోదాలు జరిగాయి. డేరా బాబా అకృత్యాలు, ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లులో హనీతోపాటు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. వీరి గురించి అంతర్జాతీయంగా అలర్ట్ ప్రకటించారు. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
-
'చూద్దాం ఎవరు నన్ను జైల్లో పెడతారో'
ముంబై: డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రాంరహీం సింగ్‌ను అనుకరించి హాస్యం పండించినందుకు టీవీ నటుడు, కామెడియన్ కికు శార్దాను అరెస్టు చేయడంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రంగా ప్రతిస్పందించింది. కికు శార్దాకు అండగా నిలిచింది. తనను తాను 'రాక్‌స్టార్ బాబా'గా పేర్కొంటూ సినిమాలు చేస్తున్న గుర్మీత్‌సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు గుర్మీత్‌సింగ్ తీరును తప్పుబట్టారు. కికు శార్దాకు మద్దతుగా బాలీవుడ్ అలనాటి హీరో రిషీకపూర్ ట్విట్టర్లో స్పందించారు. గుర్మీత్ సింగ్ ఫొటోను చూపిస్తూ 'ఈ ఫొటోను చూడండి. ఈ రాక్‌స్టార్ తరహాలో నేను సినిమాలో నటించాలనుకుంటున్నా. చూద్దాం నన్ను ఎవరు జైల్లో పెడతారో' అని ట్వీట్ చేశారు. ఆరో తరగతి పాసై.. ఎంఎస్‌జీ వంటి సినిమాలు తీసే గుర్మీత్ రాం రహీంను ఎందుకు అరెస్టు చేయలేదని అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఘోర కలియుగంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయంటూ నెటిజన్లు కూడా కికు శార్దాను అరెస్టును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో ఫేమస్ అయిన కికు శార్దా తాను గుర్మీత్సింగ్ను అనుకరించడంపై క్షమాపణలు చెప్పారు. అయినా ఆయనను అరెస్టుచేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. దీనిపై స్పందించిన గుర్మీత్‌సింగ్ కికు శార్దాను క్షమిస్తున్నట్టు తెలిపారు. See this picture!I would like to play this rockstar in a film. Let me see who puts me behind bars? Go Kiku Sharda! pic.twitter.com/8Dfre237NY — rishi kapoor (@chintskap) January 13, 2016