Cricketer Yuvraj Singh Arrested: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్‌డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు.
చదవండి: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment