
ప్రతీకాత్మకచిత్రం
చండీగఢ్ : ఖాకీలకు సవాల్ విసురుతున్న 11 మంది కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌లను హర్యానా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోనీపట్‌కు సమీపంలోని బహల్గర్ ప్రాంతంలోని స్ధావరంపై పోలీసులు దాడి చేయగా వారిపై గ్యాంగ్‌స్టర్‌లు కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లకు గాయాలయ్యాయి. మొత్తం 11 మంది గ్యాంగ్‌స్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిపై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, లూటీ, కిడ్నాపింగ్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను క్రిషన్, పవన్, నీతూ, దినేష్, మహిపాల్, రవిందర్, అమిత్, ప్రమోద్, సునీల్ పునియా, రవిందర్‌లుగా గుర్తించారు. కాగా గ్యాంగ్‌స్టర్‌ల కాల్పుల్లో గాయపడిన ఓ పోలీస్‌తో సహా ముగ్గురిని స్ధానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
గ్యాంగ్‌స్టర్‌ల నుంచి అక్రమ ఆయుధాలు, రూ 10.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన గ్యాంగ్‌స్టర్‌లలో కొందరి తలలపై పోలీసులు గతంలో ఒక్కొక్కరిపై రూ 50,000 రివార్డు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment