కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఎన్‌సీఎంఎంకు 16వేల కోట్లు కేటాయింపు | Central Cabinet Approves National Critical Mineral Mission In India | Sakshi
Sakshi News home page

నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. 16వేల కోట్లు కేటాయింపు

Jan 29 2025 4:17 PM | Updated on Jan 29 2025 4:25 PM

Central Cabinet Approves National Critical Mineral Mission In India

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ పాలసీకి(NCMM) కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో వివరాలను ప్రకటించారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ 24 ఖనిజాలలో బెరిల్, కోబాల్ట్, కాడ్మియం, లిథియం, గ్రాఫైట్, నికెల్, సెలీనియం, ఇతరాలు ఉన్నాయి. కీలకమైన ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రవాణా మొదలైన ఇతర పరిశ్రమలకు కూడా ముఖ్యమైనవి. రక్షణ, ఏరోస్పేస్, వ్యవసాయ రంగాలకు కూడా కీలకమైనవని అన్నారు. ఈ క్రమంలో విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

అలాగే, సీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ కోసం అధిక ఎక్స్-మిల్ ధరను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు. మొలాసిస్‌తో ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ఎక్స్‌మిల్‌ ధర గతంలో లీటరుకు రూ.56.28 ఉండగా.. తాజాగా రూ.57.97కి పెంచుతూ కేబినెట్ ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఆఫ్‌షోర్ మైనింగ్ వేలాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పని చేస్తుందని కేంద్రం ప్రకటించింది.

ఇక, 2022-23 ఇథనాల్ సరఫరా సంవత్సరం (నవంబర్-అక్టోబర్) నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధరలను పెంచలేదు. చెరకు రసం, బి-భారీ బెల్లం, సి-భారీ బెల్లం నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ధరలు వరుసగా లీటరుకు రూ.65.61, రూ.60.73, రూ.56.28గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఇవాళ చక్కెర, ఇథనాల్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement