
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment