Teachers MLC election
-
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి. -
TG: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. -
తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
-
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలోని ఉభయగోదావరి- కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించకపోవటంతో దాదాపు 93 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,93,794 మంది ఓటర్లుండగా.. బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లుండగా.. 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. విశాఖ-విజయనగరం- శ్రీకాకుళం ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నామినేషన్లు వేసారు. తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు.. పట్టభద్రుల కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మద్దతుతో గ్రూప్ వన్ ఆఫీసర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. లక్షా 96వేల321మంది పట్టభద్రులు, 23వేల 214మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇద్దరిమ ధ్యే పోటీ కనిపిస్తోంది. పీఆర్టీయూ నుంచి పూల రవీందర్‌ను టీఆర్ఎస్ బలపరుస్తోంది. యూటీఎఫ్ మద్దతుతో అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చాడ హైదరాబాద్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిని బలపరుస్తూ అధికార టీఆర్ఎస్ అధికార దుర్వినియో గానికి పాల్పడుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర అభ్యర్థులకు మద్దతునిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడం విచారకరమన్నారు.