
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చాడ
హైదరాబాద్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థిని బలపరుస్తూ అధికార టీఆర్‌ఎస్ అధికార దుర్వినియో గానికి పాల్పడుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర అభ్యర్థులకు మద్దతునిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడం విచారకరమన్నారు.