
హుస్నాబాద్ రూరల్: తెలంగాణలో టీఆర్‌ఎస్ గ్రాఫ్ పతన దశకు చేరుతోందని, అందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం వల్లే టీఆర్‌ఎస్‌ను ప్రజలు ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దు చేసి ప్రగతి నివేదిక పేరుతో అదే నెలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీని రద్దు చేయడం, ఎన్నికలపై చర్చించేందుకు బుధవారం మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీపీఐ సిద్ధంగా ఉందని చెప్పారు. హుస్నాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో కేరళ బాధితులకు రూ.10 లక్షలకు పైగా విరాళాలు సేకరించి పంపినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment