
సాక్షి, నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు సామాన్యుడి నడ్డి విరిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ విషయంలో హైకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తోందని, రాష్ట్రంలో నవాబ్ పాలన కొనసాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రుల్లో చాలామంది తెలంగాణ ద్రోహులేనని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తప్పుల తడకగా సాగిందని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలను గద్దె దించెందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment