చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు.
డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment