Haryana elections
-
హర్యానా ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు రానప్పుడు.. నిరాధార ఆరోపణలు చేయటంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. అక్టోబరు 8, 10 తేదీల మధ్య, మళ్లీ అక్టోబర్ 14వ తేదీన హర్యానా ఎన్నికల సమయంలో విధానపరమైన అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అక్టోబర్ 8వ తేదీన హర్యానా ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో ఈసీ అధికారిక వెబ్సైట్లో రెండు గంటల పాటు అలస్యంపై కాంగ్రెస్ నేసిన ఆరోపణలను హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖండించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసి, ఆపై లెక్కించిన సయయంలో.. నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయవద్దని ఈసీ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలను హెచ్చరించింది.‘‘ బాధ్యతా రహితమైన ఆరోపణలు ప్రజల అశాంతి, అల్లకల్లోలం, గందరగోళానికి దారితీస్తాయని తెలిపింది. అదేవిధంగా దృఢమైన, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అనవసరపు ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది.హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని, తమ పార్టీ విజయాన్ని బలవంతంగా లాక్కొన్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులను కలిసి, ఓట్ల లెక్కంపుపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినవి సాధారణ సందేహాలనే ఈసీ స్పష్టం చేసింది.చదవండి: బాంబు బెదిరింపుల వెనక ఉగ్రవాదంపై పుస్తకం రాసిన రచయిత.. -
కాంగ్రెస్‌కు ‘హరియాణా’ దరువు!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్‌లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్‌కే. కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం. హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్‌వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది. ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్‌కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్‌కు లేదన్నది వాస్తవం.బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు. పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్‌కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు. 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్‌కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత! -
Editor Comment: ప్రమాదంలో ప్రజాస్వామ్యం హర్యానా ఫలితాల్లో బయటపడ్డ నిజం
-
కాంగ్రెస్.. దేశభక్తిని అణచివేయాలనుకుంటోంది: మోదీ
చంఢీగఢ్: కులతత్వం, మతం ద్వారా దేశంలోని దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానా అసెంబ్లీఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం పాల్వాల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారాయాన.‘‘దేశానికి ముఖ్యమైన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. జమ్ము కశ్మీర్లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకుండా చేశారు. కాంగ్రెస్ ముస్లిం సోదరీమణులను ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించలేదు. దేశ ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలను పరిష్కరించలేదు. బదులుగా సొంత కుటుంబాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంది.#WATCH | Palwal, Haryana: Prime Minister Narendra Modi says, "Congress wants to destroy patriotism from this country. Congress feels that the stronger the feeling of unity among the people of the country, the more impossible it will be for Congress to win. That is why Congress is… pic.twitter.com/V2d0BwKHUV— ANI (@ANI) October 1, 2024కాంగ్రెస్ నేటికీ ఎన్నో పాపాలు చేసి..ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. బీజేపీ మద్దతుదారులు దేశభక్తులు. దేశభక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులతత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా, ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని రెచ్చగొటట్టం ద్వారా దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని, ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మధ్యప్రదేశ్ విషయంలోనూ ఇదే విధంగా అపోహ పడింది’’ అని అన్నారు. -
ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్ లేఖ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే..
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం 21 మంది అభ్యర్థులతో రెండో జాబితానువ విడుదల చేసింది. బరోడా నుంచి బరిలోకి ప్రదీప్ సంగ్వాన్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కెప్టెన్ యోగేష్ బైరాగిని బీజేపీ పోటీకి నిలిపింది.Haryana elections | BJP releases its second list of 21 candidates. Pradeep Sangwan to contest from Baroda. pic.twitter.com/hisVZkD7Ix— ANI (@ANI) September 10, 2024కీలకమైన జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్‌కు పోటీగా కెప్టెన్ యోగేష్ బైరాగి పేరును బీజేపీ ప్రకటించగా.. ఆయన ప్రస్థానం గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ ప్రకారం.. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ హర్యానా స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ యోగేష్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక.. ఈ జాబితా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. గనౌర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మల్ రాణి స్థానంలో దేవేంద్ర కౌశిక్, రాయ్ ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణ గెహ్లావత్ స్థానంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీని బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కర్నాల్ నుంచి కాకుండా ఈసారి లాడ్వా సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపింది బీజేపీ.చదవండి: Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం! -
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఇదే
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్ 5కు మార్పు చేసింది. తొలుత అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్‌తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించననుంది.బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్‌కు భారీగా తరలివస్తారు. దీంతో ఎన్నికల సంఘానికి జాతీయ, స్థానిక పార్టీలు.. అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ సాధించింది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. -
Haryana: అసెంబ్లీ ఎన్నికల్లో చౌతాలా-ఆజాద్ దోస్తీ
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జననాయక్ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా, ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయన్నారు.నేతలు దుష్యంత్ చౌతాలా, చంద్రశేఖర్ ఆజాద్‌లు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 36 సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. రైతులు, యువత, మహిళల సమస్యలను వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నామని దుష్యంత్ చౌతాలా తెలిపారు. ఈ ఎన్నికల్లో జేజేపీ 70 స్థానాల్లో, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నదన్నారు. రైతులకు వారి హక్కులు దక్కేలా చూడటమే తమ ప్రయత్నమని చంద్రశేఖర్ అన్నారు. -
హర్యానా సీఎంగా ఖట్టర్ పేరు ఖరారు?
-
హర్యానా సీఎంగా ఖట్టర్ పేరు ఖరారు?
హర్యానాలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ పదవి చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ సీఎం పదవిని జాట్లకు ఇవ్వాలా.. నాన్ జాట్లకు ఇవ్వాలా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత నుంచి బీజేపీ అధినాయకులు బయటకు వచ్చినట్లే తెలుస్తోంది. దాంతో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అవుతారన్న విషయం స్పష్టమైపోయింది. ఖట్టర్‌కు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆయన కర్నాల్ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తానని ముందునుంచి చెబుతూ.. అలాగే భారీ ఆధిక్యంతో గెలిచారు. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 ఏళ్ల వయసున్న ఖట్టర్.. ఇప్పటికీ బ్రహ్మచారే. గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఏకంగా 47 స్థానాల్లో పాగా వేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 మాత్రమే. అంత చిన్న రాష్ట్రంలో ప్రచారం కోసం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తొమ్మిది సార్లు వచ్చారని, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారా అని కూడా ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా ఎద్దేవా చేశారు. కానీ ఎవరేమన్నా.. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. -
హర్యానా సీఎం పదవిపై మల్లగుల్లాలు
-
హర్యానా సీఎం పదవిపై మల్లగుల్లాలు
హర్యానా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు జాట్ వర్గీయులకే సీఎం సీటు అప్పగిస్తారని ప్రచారం జరగ్గా తాజాగా కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జాట్ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి రేసులో మనోహర్ లాల్ ఖట్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఖట్టర్‌కు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఆయన కర్నాల్ స్థానం నుంచి గెలుపొందారు. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ముందునుంచి ప్రధాని నరేంద్రమోదీకి ఈయన అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. 60 ఏళ్ల వయసున్న ఖట్టర్.. ఇప్పటికీ బ్రహ్మచారే. తొలుత కెప్టెన్ అభిమన్యు పేరును ముఖ్యమంత్రి పదవికి గట్టిగా పరిశీలనలోకి తీసుకున్నట్లు వినిపించింది. జాట్ వర్గానికి ఆ పదవి ఇచ్చేటట్లయితే ఇప్పటికీ అభిమన్యు ముందుంటారు. కానీ, వ్యూహం మార్చుకుంటే మాత్రం ఖట్టర్ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. -
ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా?
దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన. ఇక 90 స్థానాలున్న హర్యానాను కూడా మోదీ వదల్లేదు. అక్కడ ఏకంగా 11 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రాన్ని కూడా వశం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బ్రాండ్ పనిచేసిందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 19వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలంటే తగినంత స్థాయిలో అసెంబ్లీల బలం కూడా మోదీకి అవసరం. అందుకే ముందుగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఒకదశలో గొంతు సహకరించకపోయినా కూడా అలాగే ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత బోర్డర్ ఔట్‌పోస్టులపై దాడులు చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏం చేస్తారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే తెలుస్తోంది. అక్కడ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చని, అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీయే అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. -
మోదీ.. హర్యానా సీఎం కావాలనుకుంటున్నారా?
హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం 90 అసెంబ్లీ స్ధానాలున్న చిన్న రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి స్థాయి వచ్చి ప్రచారం చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత చిన్న రాష్ట్రంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 11 ర్యాలీలు నిర్వహించారని, ఆయనేమైనా హర్యానాకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని హూదా అడిగారు. ఇలాంటి చిన్న రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రీ వచ్చిప్రచారం చేయడం తాను చూడలేదన్నారు. ఒకవైపు తన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. హూడా మాత్రం తాపీగా ఉదయం బ్యాడ్మింటన్ ఆడుకుని, ఆ తర్వాత టీ తాగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!
చండీఘడ్: ర్యాప్ మ్యూజిక్ తో, ముఖ్యంగా 'లుంగీ డ్యాన్స్' పాటతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన రాప్ సింగర్ యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హర్యానాలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యోయో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు వెల్లడించారు. అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చౌతాలా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 తర్వాత అధికారాన్ని కోల్పోయిన చౌతాలా అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. -
హర్యానా ఎన్నికలు సవాలే!
గుర్గావ్: హర్యానాలో గెలవడం ఢిల్లీ కన్నా సవాల్‌తో కూడుకున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. ఇప్పటికే తమ పార్టీపై అనేక అంచనాలు ఉండటంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో 28 సీట్లు గెలిచి అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆప్ తొలిసారిగా గుర్గావ్లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ‘హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మాకు సవాల్‌తో కూడుకున్నవి. ఎందుకంటే ఈసారి పార్టీ ప్రదర్శనపై అంచనాకు మించిన ఆశలు ఉన్నాయ’ని అన్నారు. క్షుద్ర రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిన గుర్గావ్ జిల్లా ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి రహిత రాజకీయం కావాలనుకుంటున్నారని చెప్పారు. గుర్గావ్లో పుట్టినందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని తెలిపారు. ఇక్కడ అనేక మార్పులు జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. గతేడాది సమావేశం నిర్వహించినప్పుడు కేవలం 50 మంది సభ్యులం మాత్రమే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఈసారి ఆ సంఖ్య రెండింతలు అయిందన్నారు. హర్యానాలో కలసికట్టుగా పనిచేయాలనుకుంటున్నామన్న యోగేంద్ర అన్ని కాలనీల్లో ఆప్ విభాగాలను పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ పార్టీ తరఫున ఓటరు నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించామని చెప్పారు. గతంలో ఓటర్ జాబితాలో ఉన్న అనేకమంది పేర్లు ఈసారి కనిపించకుండా పోయాయని అన్నారు. కావాలనే వారి పేర్లు తొలగించడం జరిగిందని, వాటిపై ఆప్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఢిల్లీకి ముందు ఉన్న వాతావరణమే హర్యానాలో కూడా కనబడుతుందన్నారు. అనేక ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పునాదులను కదలించేందుకు ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకునేందుకు కలసికట్టుగా కృషి చేయడంలో సఫలమయ్యామన్నారు. హర్యానాలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న అధికార పార్టీతో ఆప్ తలపడాల్సి ఉందని తెలిపారు. అయితే ఆప్ తరఫున ఎంతమందిని బరిలోకి దింపాలనే దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి అశోక్ కెమ్కాను ప్రకటించడంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదన్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గుర్గావ్కు చెందిన వాలంటీర్లు హర్యానాలోనూ కీలకపాత్ర పోషిస్తారని జాతీయ మండలి సభ్యుడు రమేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హర్యానాలో ఆప్‌ని గెలిపించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఇలాంటి సమావేశాలనే మీవట్, రేవరిలో కూడా నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం నిధుల సేకరణను పార్టీ ప్రారంభించిందని హర్యానా ఆప్ కన్వీనర్ యశ్వంత్ గుప్తా చెప్పారు. నమ్మకమున్న వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని ఎన్నికలు గెలవవచ్చని తమ పార్టీ నిరూపించిందన్నారు. హర్యానాలో దాన్నే పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సృష్టించిన సంచలనాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పునరావృతం చేయాలని ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా కోరారు. ఈ బహిరంగ సభలో భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు పాల్గొన్నారు.