ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు రానప్పుడు.. నిరాధార ఆరోపణలు చేయటంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. అక్టోబరు 8, 10 తేదీల మధ్య, మళ్లీ అక్టోబర్ 14వ తేదీన హర్యానా ఎన్నికల సమయంలో విధానపరమైన అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
అక్టోబర్ 8వ తేదీన హర్యానా ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో రెండు గంటల పాటు అలస్యంపై కాంగ్రెస్ నేసిన ఆరోపణలను హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖండించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసి, ఆపై లెక్కించిన సయయంలో.. నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయవద్దని ఈసీ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలను హెచ్చరించింది.‘‘ బాధ్యతా రహితమైన ఆరోపణలు ప్రజల అశాంతి, అల్లకల్లోలం, గందరగోళానికి దారితీస్తాయని తెలిపింది. అదేవిధంగా దృఢమైన, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అనవసరపు ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది.
హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని, తమ పార్టీ విజయాన్ని బలవంతంగా లాక్కొన్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులను కలిసి, ఓట్ల లెక్కంపుపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినవి సాధారణ సందేహాలనే ఈసీ స్పష్టం చేసింది.
చదవండి: బాంబు బెదిరింపుల వెనక ఉగ్రవాదంపై పుస్తకం రాసిన రచయిత..
Comments
Please login to add a commentAdd a comment