హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే.. | Haryana polls: BJP releases 2nd list who is against Vinesh Phogat | Sakshi
Sakshi News home page

హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే..

Published Tue, Sep 10 2024 3:38 PM | Last Updated on Tue, Sep 10 2024 4:46 PM

Haryana polls: BJP releases 2nd list who is against Vinesh Phogat

చంఢీఘడ్‌:  హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది.  మంగళవారం  21 మంది అభ్యర్థులతో రెండో జాబితానువ విడుదల చేసింది. బరోడా నుంచి బరిలోకి ప్రదీప్‌ సంగ్వాన్‌ను బీజేపీ బరిలోకి  దింపింది.  మొత్తం 90 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, స్టార్‌ రెజ్లర్‌  వినేశ్‌ ఫోగట్‌పై కెప్టెన్ యోగేష్ బైరాగిని బీజేపీ పోటీకి నిలిపింది.

కీలకమైన జులనా స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్‌కు పోటీగా కెప్టెన్ యోగేష్ బైరాగి పేరును బీజేపీ ప్రకటించగా.. ఆయన ప్రస్థానం గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌ ప్రకారం..  బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ హర్యానా స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్‌ యోగేష్‌  ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక.. ఈ జాబితా  బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం  ఇచ్చింది బీజేపీ. గనౌర్‌ నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిర్మల్‌ రాణి స్థానంలో దేవేంద్ర కౌశిక్, రాయ్ ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణ గెహ్లావత్ స్థానంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీని బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పటికే  తొలి జాబితాలో  67 మంది  అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసిందే.  ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కర్నాల్‌ నుంచి కాకుండా  ఈసారి లాడ్వా సెగ్మెంట్ నుంచి బరిలోకి  దింపింది బీజేపీ.

చదవండి:  Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్‌ రెండో జాబితా విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement