త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జననాయక్ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా, ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయన్నారు.
నేతలు దుష్యంత్ చౌతాలా, చంద్రశేఖర్ ఆజాద్‌లు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 36 సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. రైతులు, యువత, మహిళల సమస్యలను వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నామని దుష్యంత్ చౌతాలా తెలిపారు. ఈ ఎన్నికల్లో జేజేపీ 70 స్థానాల్లో, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నదన్నారు. రైతులకు వారి హక్కులు దక్కేలా చూడటమే తమ ప్రయత్నమని చంద్రశేఖర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment