Azad
-
ఇది ఆజాద్ పార్క్..!
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) పేరు వినగానే త్రివేణి సంగమం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ఆనందభవన్ గుర్తు వస్తుంది. గూగుల్‌లో వెతికితే అలహాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో ఆజాద్ పార్క్ కనిపిస్తుంది. టూర్ ప్లాన్‌లో పార్కులెందుకు, టైమ్ వేస్ట్ అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆజాద్ పార్కును చూసి తీరాలి. నగరం మధ్యలో 133 ఎకరాల విశాలమైన పార్కు, పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. వాహనాల రణగొణ ధ్వనులు వినిపంచనంత ప్రశాంత వాతావరణం అలరించి తీరుతుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కళ్లు చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ కోసం వెతుకుతాయి. ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారీ, ఆజాద్ అనేది ఆయన బిరుదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశమే ఈ పార్కు.చదువరుల పార్కుఆజాద్ పార్క్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైంది. అప్పుడు దాని పేరు ఆల్ఫ్రెడ్ పార్క్. జాతీయోద్యమవాదులు ఈ పార్కులో తలదాచుకుని ఉద్యమవ్యూహాలు రచించేవారు. అలా చంద్రశేఖర్ ఈ పార్కులో ఉన్న సమయంలో ఆ సమాచారం తెలుసుకున బ్రిటిష్ పోలిస్ అధికారి, తన బృందంతో మోహరించాడు. ఆజాద్ తన తుపాకీతో ముగ్గురు పోలీసులను చంపేశాడు. ఆ కాల్పుల్లో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలిసుల చేతిలో చిక్కకుండా తన తుపాకీతో కణత మీద కాల్చుకుని ప్రాణత్యాగం చేశాడు ఆజాద్. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆజాద్ విగ్రహాన్ని స్థాపించి ఆజాద్ మెమోరియల్‌గా తీర్చిదిద్దారు. ఆ పార్కుకు ఆజాద్ పేరు పెట్టారు. విగ్రహం దగ్గర నిలబడి ఆజాద్‌కి సెల్యూట్ చేసి మౌనంగా నివాళి అర్పించి బరువెక్కిన గుండెతో ముందుకు సాగిపోతారు పర్యాటకులు.పార్కులో లైబ్రరీ!ఆజాద్ పార్కులో ఆజాద్ మెమోరియల్తోపాటు విక్టోరియా మెమోరియల్ కూడా ఉంది. అయితే అందులో ఇప్పుడు విక్టోరియా స్టాచ్యూ లేదు. ప్రయాగ్‌రాజ్ సంగీత్ సమితి, మదన్ మోహన్ మాలవ్యా స్టేడియం, అలహాబాద్ మ్యూజియం ఉన్నాయి. అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ స్లైట్ నిర్మాణాలు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో 5వేల మందికి పైగా సందర్శిస్తారని అంచనా. టికెట్ ఐదు రూపాయలు మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఇక్కడకు నగరవాసులు రెగ్యులర్‌గా వస్తుంటారు. మంత్లీ టికెట్ వంద రూపాయలు. ఏడాదికి పాస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు. పార్కులోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం. రెగ్యులర్‌గా వాకింగ్‌కి వచ్చే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ నడక వేగం తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు. కోచ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. లైబ్రరీలో సివిల్స్‌కి ప్రిపేరయ్యే వాళ్లు కనిపిస్తారు. ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కో చోట దుప్పటి పరుచుకుని పుస్తకాలు పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. వారి ఏకాగ్రత స్థాయి ఎంతలా ఉంటుందంటే పర్యాటకులు వారి పక్కనే నడిచి వెళ్తున్నా సరే... పుస్తకంలో నుంచి తలతిప్పి చూడరు. వారి చదువుకు భంగం కలిగించకూడదనే పర్యాటకులే ఒకరికొకరు సైగ చేసుకుంటూ శబ్ధం చేయకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు ఐదు రూపాయలే కానీ పార్కు గేటు దగ్గర కొబ్బరిబోండా డెబ్బై రూపాయలు. లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది. 45 నిమిషాలపాటు సాగే ఈ షోలో మోతీలాల్ నెహ్రూ ఇల్లు ఆనందభవన్, అందులో సాగిన స్వాతంత్య ఉద్యమ రచన వివరాలు, ఆజాద్ పార్కులో సాగిన ఉద్యమ ఘట్టాలతో షో నడుస్తుంది. ఆజాద్ మరణంతో ముగిసే ఈ షో మరోసారి మనసును బరువెక్కిస్తుంది. ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువుల వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో? లైట్ అండ్ సౌండ్ పూర్తయి పార్కులో నుంచి బయటపడేటప్పటికి ఎనిమిది గంటలవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
Haryana: అసెంబ్లీ ఎన్నికల్లో చౌతాలా-ఆజాద్ దోస్తీ
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జననాయక్ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా, ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయన్నారు.నేతలు దుష్యంత్ చౌతాలా, చంద్రశేఖర్ ఆజాద్‌లు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 36 సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. రైతులు, యువత, మహిళల సమస్యలను వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నామని దుష్యంత్ చౌతాలా తెలిపారు. ఈ ఎన్నికల్లో జేజేపీ 70 స్థానాల్లో, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నదన్నారు. రైతులకు వారి హక్కులు దక్కేలా చూడటమే తమ ప్రయత్నమని చంద్రశేఖర్ అన్నారు. -
‘ప్రమాణ స్వీకారం తర్వాత అందుకే నినాదాలు చేశా’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు. తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు. -
ఆజాద్ ఇంజినీరింగ్ @ రూ. 740 కోట్లు సమీకరణ లక్ష్యం
ఇంజినీరింగ్ ప్రొడక్టుల కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లిస్టింగ్ కోసం ఈ హైదరాబాద్ కంపెనీ సెపె్టంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్, మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్ తదితర గ్లోబల్ దిగ్గజాలున్నాయి. కాగా.. ఇప్పటికే పార్క్ బ్రాండ్ హోటళ్ల కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, హెల్త్‌టెక్ సంస్థ మెడీ అసిస్ట్ హెల్త్‌కేర్ సరీ్వసెస్, క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫరీ్నచర్ తయారీ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవోలు చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. -
ఇంటిపేరు మార్చుకున్నందుకు నన్ను టెర్రరిస్ట్‌లా చూశారు : నటి
సబా ఆజాద్.. నటనలోనే కాదు, సంగీతం, దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకుంటున్న మహిళ. ఇప్పుడు వెబ్ వీక్షకులకూ తన ప్రజ్ఞను పరిచయం చేస్తోంది.. సబా ఆజాద్ పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే. ఆమె మేనమామ సఫ్దర్ హష్మీ ప్రముఖ స్ట్రీట్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. ఆ స్పూర్తితోనే తాను ఆర్టిస్ట్ కావాలనుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో ఒడిస్సీ, లాటిన్ అమెరికన్ ఫోక్, క్లాసికల్ బాలే, జాజ్లలో శిక్షణ తీసుకుంది. సుమారు వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అప్పటికే థియేటర్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు సంపాదించుకుంది. 2008లో ’దిల్ కబడ్డీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా ఆడలేదు. తర్వాత చేసిన ’ముర్గన్సే ఫ్రెండ్షిప్ కరోగే’ కూడా అంతే. దీంతో సినిమాల కంటే నాటకాలే మేలు అనుకొని, 2010లో సొంత థియేటర్ కంపెనీ స్థాపించింది. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించింది. మరికొన్నింటికి సంగీతం అందించింది. 2012లో స్నేహితులతో కలసి ‘మ్యాడ్ బాయ్’ పేరుతో సొంత బ్యాండ్ ప్రారంభించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న ’విల్ యు బి మై క్వారంటైన్’తో అలరిస్తోంది. చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న ఈ కుల, మత విభేదాలను నిర్మూలించాలని ఉంది. అందుకే ఆజాద్ (స్వేచ్ఛ)ను నా ఇంటి పేరుగా మార్చుకున్నా. ఇలా మార్చుకున్నందుకు చాలా మంది నన్నో టెర్రరిస్ట్‌లా చూశారు. – సబా ఆజాద్ -
‘చట్టాల’తో దళితులను కుమ్ముతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ‘భీమ్ ఆర్మీ’ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏడాది దాటి పోయింది. 2017, మే నెలలో సహరాన్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు కారకుడన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. ఆ నెలలో దళితుల ఇళ్లపై అగ్రవర్ణాల వారు దాడి చేయడంతో మొదలైన ఇరు వర్గాల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఇతరులతోపాటు ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం నవంబరు నెలలో ఆజాద్ కేసు అలహాబాద్ కోర్టుకు రాగా, ఆజాద్‌పై ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవంటూ ఆక్షేపించిన జడ్జీలు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేశారు. ఆజాద్‌ను బేషరతుగా విడుదల చేయాల్సిన పోలీసులు వెంటనే ఆయనపై భయానకమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ఎలాంటి చార్జిషీటు, విచారణ లేకుండా ఎవరినైనా ఏడాది పాటు ఈ చట్టం కింద జైలు నిర్బంధంలో ఉంచవచ్చు. ఏడాది కాగానే మళ్లీ అదే చట్టాన్ని మరో ఏడాది పొడిగించవచ్చు. ఈ చట్టం కింద ఉన్న కాస్త భద్రత ఏమిటంటే....ముగ్గురు హైకోర్టు జడ్జీలతో కూడిన సలహా సంఘం ముందు మూడు నెలల నిర్బంధం అనంతరం నిందితుడు అప్పీల్ చేసుకోవచ్చు. మరి ఆజాద్‌కు అలాంటి అవకాశాన్ని కల్పించినదీ, లేనిది తెలియదు. ఆజాద్‌పై పోలీసులు చేసిన నేరారోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినంటూ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ మరింత కఠినమైన చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు మళ్లీ జడ్జీల ముందు ఆజాద్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారని అనుకోలేం. హింసాకాండ కేసులోనే అగ్రవర్ణాలకు చెందిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిలో ఒక్కరిపై కూడా ఈ జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించలేదు. వారంతా బెయిల్‌పై బలాదూర్ తిరుగుతున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కూడా ఈ జాతీయ భద్రతా చట్టం లాంటిదే. ‘బ్యాటిల్ ఆఫ్ బీమా కోరెగావ్ (1818, జనవరి ఒటటవ తేదీన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి దళిత సైనికులు పేశ్వా బాజీ రావు సేనలను ఓడించారు)’ 200 వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 31, 2017న ఘర్షణలు చెలరేగి ఒకరు మరణించడంతో మహారాష్ట్ర పోలీసులు టాప్ మావోయిస్టులను ‘చట్ట విరుద్ధ కార్యకలాపాలా నిరోధక చట్టం’ కింద అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఆ రోజు దళితులకు అడ్డంపడి గొడవ చేసిందీ కాషాయ దళాలు. కాషాయ జెండాలు ధరించి వారు దాడులు చేయడంతో ఘర్షణ జరిగింది. ఘర్షణ కారణమంటూ ప్రముఖ హిందూత్వ నాయకులు మిలింద్ ఎక్బోటే, సంబాజీ భిడేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిపై మాత్రం ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించలేదు. ఈ చట్టాన్ని కూడా ఎవరిపైనైనా సరే, ప్రయోగించవచ్చు. ఎలాంటి చార్జిషీట్లు, విచారణ లేకుండా నెలల తరబడి జైళ్ళలో ఉంచవచ్చు. యూపీలో ఘర్షణలు జరిగినందుకు దళితుల చీఫ్ ఆజాద్‌పై మొదటి చట్టాన్ని ప్రయోగించగా ఇక్కడ మహారాష్ట్రలో దళితుల కోసం పోరాడున్న మావోయిస్టులపై రెండో చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. ఈ రెండు చట్టాల్లో కూడా నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన లేదు. తాము నేరం చేయలేదంటూ నిందితులే రుజువు చేసుకోవాలి. ఇంతటి రాక్షస చట్టాలను ఎత్తివేసేందుకు ఉద్యమాలు రావాలి. కానీ ఆ ఉద్యమాలను కూడా ఈ చట్టాలతోనే అణచివేస్తారేమో! -
'శ్రీశ్రీ రవిశంకర్ మమ్మల్ని మోసంచేశారు'
శ్రీనగర్: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు కశ్మీర్లో ఊహించని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్లో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. యువకులు ఒక్కసారిగా 'ఆజాదీ' నినాదాలు ఇచ్చారు. దీంతో రవిశంకర్ ఉలిక్కిపడ్డారు. అసలు రవిశంకర్ అంటే ఎవరో తమకు తెలియదని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. తాము ఇక్కడికి వచ్చామని స్థానిక యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చాక 'మెసేజ్ ఆఫ్ లవ్' గురించి ప్రసంగాలు చేస్తున్నారని, వాటికి తాము వ్యతిరేకమని సభ మధ్యలోనే వారు వెళ్లిపొయారు. మరికొందరు యువకులు క్రికెట్ కిట్లు, డబ్బులు ఇస్తామంటే చాలా దూరం నుంచి వచ్చామని, రవిశంకర్ మమ్మల్ని మోసం చేశారని బారాముల్లా నుంచి వచ్చిన యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య కశ్మీర్ నుంచి వచ్చిన మరికొంతమంది ఇస్లాం మతగురువులు వస్తున్నారని చెప్పి, ఈ ఆధ్యాత్మిక గురువును తీసుకొచ్చారని నిర్వాహకులపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన రవిశంకర్ కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, శాంతిని నెలకొల్పాలని ఇక్కడ సభను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత, సంతోషంతో కూడిన సుహృద్భావ వాతావరణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. -
ఇంటర్ వార్షిక పరీక్షలకు రెడీ
► హాజరుకానున్న 48,500 మంది విద్యార్థులు ► ఉదయం 9గంటలు దాటితే అనుమతి ఉండదు విద్యారణ్యపురి : వరంగల్ అర్బన్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా కేంద్రాల గుర్తింపు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేసినట్లు ఇంటర్ విద్య డీఐఈఓ కే.వీ.ఆజాద్ తెలిపారు. 56 కేంద్రాల్లో ఏర్పాట్లు ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 48,500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 56మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 56మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ తీరు పరిశీలనకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. ఇంకా ఓ హైపవర్ కమిటీని కూడా ఏర్పాటుచేశామని డీఐఈఓ ఆజాద్ వివరించారు. ప దిహ ేను నిమిషాల ముందే రావాలి.. ఇంటర్ పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు విద్యార్థులు నిరే్ధశించిన సమయానికి పదిహేను నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, నిర్ణీత సమయమైన ఉదయం 9గంటలు దాటాక ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని డీవీఈఓ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే విద్యార్థుల హాల్‌టికెట్లు కూడా కళాశాలలకు పంపించామని, అక్కడి తీసుకోవాలని ఆయన సూచించారు. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
వ్యూహా రచనలో దిట్ట
ఏఓబీ ఎన్కౌంటర్లో కన్నుమూసిన గాజర్ల రవి మిలటరీ వ్యూహాల్లో పేరుపొందిన మావోయిస్టు అగ్రనేత పోలీసు స్టేషన్లపై వరుస దాడులు లెంక లగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై బాంబుదాడి ఏటూరునాగారం, కరకగూడెం పోలీస్స్టేషన్ల పేల్చివేతలో కీలకం మావోయిస్టుల ప్రతినిధిగా శాంతి చర్చలకు... అన్నదమ్ముల్లో ముగ్గురు మావోయిస్టు నేతలే ఇప్పటికే ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ కొద్దినెలల కింద లొంగిపోయిన గాజర్ల అశోక్ చిట్యాల, ఇల్లెందు, పెద్దపల్లి, హైదరాబాద్: ఏఓబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ (46) మెరుపు దాడులకు, మిలటరీ వ్యూహరచనలో దిట్టగా పేరు పొందారు. చిన్న వయసులోనే పోరుబాట పట్టిన ఆయనది 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. అసలు వారి కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. రవి 1990లో ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మరణించేదాకా ప్రజాపోరులో కొనసాగారు. దళంలో చేరిన ఎనిమిది నెలలకే దళ కమాండర్‌గా ఎదిగిన నేపథ్యం ఆయనది. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో మావోయిస్టుల తరఫున ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. 1992లో ఉద్యమంలోకి రవి అలియాస్ గణేశ్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) చిట్యాల మండలం వెలిశాలలో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు. 1986 నుంచి 1988 వరకు పెద్దపల్లి ఐటీఐలో ఫిట్టర్ కోర్సు చేశారు. ఇంటర్మీడియట్ హన్మకొండలో పూర్తిచేశారు. 1990 నుంచి ఉద్యమానికి ఆకర్షితుడై 1992 వరకు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన అన్న ఆజాద్ పీపుల్స్‌వార్ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దాంతో పోలీసులు గణేశ్‌ను చిత్రహింసలు పెట్టడంతో వెలిశాలకు వచ్చి టేకుమట్లలో పోలీస్ కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేశారు. తర్వాత అన్న ఆజాద్ స్ఫూర్తితో 1992లో పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉత్తర తెలంగాణలో పీపుల్స్‌వార్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. నక్సలైట్ గ్రూపులన్నీ కలసి మావోయిస్టు పార్టీగా ఏర్పాటయ్యాక కీలక నేతగా మారారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోన్ కారదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మల్కన్‌గిరి సరిహద్దు ఇన్చార్జిగా వ్యవహరించారు. మెరుపు దాడుల్లో మావోయిస్టు ఉద్యమంలో రవి ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. విధ్వంసాలు, దాడులు, మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా ఆయనకు పేరుంది. పీపుల్స్‌వార్‌లో ప్లాటూన్లను ఏర్పాటు చేసిన కాలంలో ఆజాద్ ఆ వ్యవహారాలు చూసేవాడని చెబుతారు. 1994 సార్వత్రిక ఎన్నికల సమయంలో మంథని డివిజన్ లెంకలగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడిచేసి ఆరుగురిని చంపిన ఘటనలో గణేశ్ పాత్ర కీలకమైనదని అంటారు. గణేశ్ వ్యూహంతోనే 1999-2000 మధ్య ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. కరకగూడెం, కొత్తగూడ, ఏటూరునాగారం పోలీస్స్టేషన్లపై దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో మహదేవపూర్ పోలీస్‌స్టేషన్‌పై బస్సు బాంబు దాడి చేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కార్యదర్శిగా కూడా పనిచేశారు. కారేపల్లి, బోడు పోలీస్స్టేషన్ల మీద జరిగిన దాడులతోపాటు ఇల్లెందు, పాకాల, మణుగూరు, పాల్వంచ, ఏటూరునాగారం, ములుగు ఏరియాల్లో జరిగిన అనేక సంఘటనలకు ఆయన నాయకత్వం వహించారు. గుండాల మండలం చెట్టుపల్లి సమీపంలో ప్రజాపథం వాహ నం పేల్చి వేసిన సంఘటన గణేశ్ నేతృత్వంలోనే జరిగిందని చెబుతారు. చెట్టుపల్లి గుట్టల్లో జరిగిన కా ల్పులు, కాచనపల్లి సమీపంలో జరిగిన కాల్పుల ఘటన, గుండాల-లింగాల మధ్య ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్బంధం తీవ్రం కావడంతో కేకేడబ్ల్యూ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకొని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లా రు. వందకుపైగా ఎన్కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని, కేడర్‌ను కూడా రక్షించాడని రవితో పనిచేసిన మాజీ మావోయిస్టులు చెబుతుంటారు. శాంతి చర్చల ప్రతినిధిగా.. 2004-05లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో శాంతి చర్చల్లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ (ఆర్కే)తో కలసి గణేశ్ ముఖ్య భూమిక పొషించారు. ఏవోబీ కమిటీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో గణేశ్ ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, పాకాల కొత్తగూడెం, ఏటూరునాగారం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి మావోయిస్టు ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. మణుగూరులో జరిగిన బహిరంగసభలో జనశక్తి నేత అమర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సెక్రెటరీగా మావోయిస్టు పార్టీని విస్తరింప జేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే శాంతి చర్చలకు జనశక్తి ప్రతినిధిగా హాజరైన రియాజ్ బదనకల్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. శాంతి చర్చలకు బ్రేక్ పడిన పదేళ్ల తర్వాత గణేశ్ ఏవోబీ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతుల్లో కంకణాలపై ప్రచారం ఎన్కౌంటర్ మృతుల్లో కాల్వశ్రీరాంపూర్ మండలం కి ష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి ఖమ్మం వెళ్లిన ఆయన ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు పార్టీలో ఉన్నారని కొందరు భావిస్తుండగా.. ఇటీవలి కాలంలో ఏవోబీకి వెళ్లారని కూడా అంటున్నారు. తాజా ఎన్కౌంటర్లో రాజిరెడ్డి కూడా మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కుటుంబమంతా పోరుబాటే... గాజర్ల కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మావోయిస్టు నేతలే సాక్షి, వరంగల్/భూపాలపల్లి: వెలిశాల.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) టేకుమట్ల మండలంలోని ఓ ఊరు.. ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచింది. ఒకప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన నాయకులను అందించింది. భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను ఎదుర్కొనేందుకు ఈ గ్రామానికి చెందిన గాజర్ల కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు సాయుధ ఉద్యమ బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతలు సారయ్య అలియాస్ ఆజాద్, అశోక్ అలియాస్ ఐతు, రవి అలియాస్ గణేశ్‌లు ఉద్యమంలో తమదైన ముద్ర వేశారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ-మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌లు సంతానం. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, గీత వృత్తి వారి జీవనాధారం. ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో సారయ్య, రవి, అశోక్‌లు వారి జీవితాన్ని ఉద్యమానికే ధారపోశారు. 1987లో వెలిశాలలో సింగిల్ విండో ఎన్నికలు జరిగాయి. డెరైక్టర్ పదవి కోసం పోటీ చేసిన ఆజాద్.. ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి జిత్తుల కారణంగా ఓడిపోయారు. పెత్తందార్ల అప్రజాస్వామిక వైఖరితో ఎన్నికల ఫలితాలు మారిపోయాయని గ్రహించి.. 1989లో పీపుల్స్‌వార్ బాటపట్టారు. అన్న మార్గంలో నడిచిన గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత 1994లో అశోక్ కూడా ఉద్యమంలో చేరారు. గాజర్ల సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లక ముందే వారి తల్లిదండ్రులు కన్నుమూశారు. పెద్ద సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆజాద్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు. 2008 ఏప్రిల్ 2న ఏటూరునాగారం మండలం కంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన, ఆయన భార్య రమ మృతిచెందారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికీ న్యాయ విచారణ కొనసాగుతుండడం గమనార్హం. వీరికి వరుసకు సోదరుడయ్యే గాజర్ల నవీన్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసి నేర్లవాగు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అశోక్.. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దినెలల కింద లొంగిపోయారు. గణేశ్ సోమవారం నాటి ఏవోబీ ఎన్కౌంటర్లో కన్నుమూశారు. -
టీవీవీ నేత ఆజాద్ అరెస్ట్
ములుగు : విద్యార్థిగా కొనసాగుతూ మావోయిస్టు భావాజాలంతో ఆ పార్టీ అగ్రనేతలకు సహకరిస్తున్న ములుగు మండలం మల్లంపల్లికి చెందిన విద్యార్థి నేత బౌతు ఓదేలు అలియాస్ ఆజాద్‌ను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. ఓదేలు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో గురువారం యూనివర్సిటీలో అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి తన కార్యాలయంలో శుక్రవారం అతడి అరెస్టు చూపారు. ఏఎస్పీ కథనం ప్రకారం... ఓదేలు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ(ఫిలాసఫీ) చదువుతున్నాడు. మావోయిస్టు సానుభూతి సంఘమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ విద్యార్థుల్లో మావోయిస్టు భావాలను రేకెత్తించాడు. ఈ క్రమంలో టీవీవీ సభ్యులైన నర్సంపేట మండలం ఖ మ్మంపల్లికి చెందిన మిట్టగడప చిరంజీవి, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన మేర్గు రాజుతోపాటు మరి కొంత మందితో కలిసి బయట విద్యార్థి సంఘం ముసుగులో పనిచేస్తూ మావోయిస్టు కార్యకలాపాలు, పార్టీ విస్తరణ, రిక్రూట్మెంట్లాంటి పనులను చేపట్టి పార్టీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, కేకేడబ్ల్యూ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు గతంలో అనేక విధ్వంసాలకు పాల్పడ్డాడు. ఆజాద్‌పై నమోదైన కేసులు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎర్రమట్టి క్వారీలో ప్రొక్లయిన్ దహనం, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తాడ్వాయిలోని వనకుటీరంలో అటవీశాఖ జీపు, గుడిసె దహనం, మే నెలలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీ ప్రొక్లయిన్ దహనంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఓదేలుపై గతంలో అసెంబ్లీ ముట్టడి కేసు, ఉస్మానియా క్యాంపస్‌లో అల్లర్ల కేసు, గత ఏప్రిల్ నెలలో సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదు కాగా జైలుకు వెళ్లొచ్చాడు. ఓదేలును పట్టుకోవడంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై మల్లేశ్‌యాదవ్ కృషి చేసినట్లు తెలిపారు. కాగా ఇటీవల ములుగు పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఓదేలు రాష్ర్ట హోంశాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఏఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై మల్లేశ్‌యాదవ్, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ అశోక్, అసిస్టెంట్ కమాండర్ రాజేశ్, సిబ్బంది ఉన్నారు. -
చిత్రహింసలు పెట్టి చంపేశారు
వారం క్రితమే నా కొడుకును పట్టుకుని నిర్బంధించారు: ఆజాద్ తండ్రి నర్సీపట్నం: తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి పోలీసులు అమానుషంగా చంపేశారని ఆజాద్ తండ్రి లక్ష్మణరావు ఆరోపించారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి మృతదేహాలను గురువారంరాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘ ప్రతి నిధులు శుక్రవారం ఉదయమే ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుడు ఆజాద్ తండ్రి లక్ష్మణరావు విలేకరులతో మాట్లాడుతూ 15 మంది పోలీసులు కాల్పులు జరిపితే కేవలం ఒకే ఒక్క తూటా ఆజాద్‌కు తగలడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారం క్రితమే ఆజాద్‌ను పట్టుకుని నిర్బంధించి, కన్ను సైతం పీకి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేతల మృతదేహాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఎన్కౌంటర్ మాదిరిగానే పోస్టుమార్టం సైతం బూటకంగానే జరిగిందన్నారు. అజాద్ సోదరి ఝాన్సీ మాట్లాడుతూ మానవత్వం లేకుండా మృతదేహాలను మూటలుగా కట్టి వదిలేశారన్నారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తలు చూసి తామంతా ఇక్కడకు చేరుకున్నామని వివరించారు. కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆజాద్ కుటుంబసభ్యులు, ఆనంద్ సోదరుడు నాగేశ్వరావు నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. కమల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోనే భద్రపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. ఎన్కౌంటర్ వాస్తవమే.. విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ విశాఖ జిల్లా కొయ్యూరు మండ లం యు.చీడిపాలెం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ వాస్తవమేనని విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఇక్కడ తెలి పారు. ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురిని ఆజాద్ (ఈస్ట్ డివిజన్ చీఫ్), ఆనంద్(ఈస్ట్‌డివిజన్ డిప్యూటీ చీఫ్), కమల (ఏరియా కమిటీ మెంబరు)గా గుర్తించామన్నారు. కొయ్యూరు మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా శిక్షణలో ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణార్థం పోలీ సు లు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు. ఆజాద్ కుటుంబసభ్యులు, బంధువులు, పౌరహక్కుల సంఘం నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం నిబంధనలకు లోబడి పూర్తిచేశామని చెప్పారు. ఘటనాస్థలంలో లభ్యమైన విప్లవ సాహిత్యం, ఏకే 47 తుపాకీ, రెండు ఎస్ఎల్ఆర్లు, 9 ఎంఎం పిస్టల్, రేడియో, జీపీఎస్, డెరైక్షనల్ మైన్, డే బైనాక్యులర్, 9 కిట్ బ్యాగులను ఆయన పరిశీలించారు. -
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు?
విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది. కొయ్యూరు మండలం మర్రిపాకల వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆజాద్ అనే పురుషుడు ఉన్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 తుపాకీతోపాటు కిట్బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించటం లేదు. -
దుర్గగుడి కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ
ఇంద్రకీలాద్రి : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కృష్ణా పుష్కరాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, దేవస్థానం ఉద్యోగుల ఆందోళనలను త్వరలోనే సమసిపోతాయన్నారు. ఇప్పటివరకు ఉన్న ఈవో నరసింగరావుపై అర్చకులు ఆరోపణలు చేయడం, ఆందోళనకు దిగడంతో గతంలో ఈవో వ్యవహరించిన ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆందోళన విరమించిన అర్చకులు దేవస్థానం అర్చకులు శుక్రవారం తమ ఆందోళన విరమించారు. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు ఈవోగా వ్యవహరించిన నరసింగరావు వేధింపుల కారణంగా ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావు వైద్యానికి అయ్యే ఖర్చును దేవస్థానమే భరించాలని, అలాగే నరసింగరావును మాతృవిభాగమైన రెవెన్యూ విభాగానికి సరెండర్ చేసి సస్పెండ్ చేయాలని అర్చకులు పలు డిమాండ్లు వినిపించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈవో ఆజాద్ చెప్పడంతో... భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆందోళనను విరమిస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. -
‘కార్మికులకు అన్యాయం చేస్తే శిక్ష తప్పదు’
నల్లగొండ: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక ద్రోహపూరిత వైఖరిని తాము ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం నల్లగొండలోని ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్ సంస్థలో నెలకు రూ.8వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కార్మికులను పట్టించుకోలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయిన కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిపై పెట్టిన కేసులను రద్దు చేసి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎన్నాళ్లీ అక్రమ నిర్బంధం?
మందస: ‘జనజీవన స్రవంతి కలసిపోవాలన్న ఉద్దేశంతో ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయిన నా కుమారునిపై కేసులు ఉన్నాయంటూ ఒడిశా పోలీసులు తీసుకుపోయారు. ఏళ్ల తరబడి జైలులో నిర్బంధించడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. విధి లేక ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. పరామర్శకు వెళ్లిన తనకు ఈ విషయం తెలియజేస్తూ కొన్ని డిమాండ్లతో కూడిన లేఖను నాకు అందజేశాడు. నిరాహార దీక్ష చేస్తే నా కుమారుడి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ఆంధ్ర, ఒడిశా పోలీసులు కరుణించి నా కుమారుడి విడుదలకు సత్వర చర్యలు చేపట్టాలి’.. ఇదీ మాజీ మావోయిస్టు దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ తల్లి కాములమ్మ కన్నీటి నివేదన. తన కుమారుడు ఇచ్చిన లేఖను మంగళవారం తన స్వగ్రామం నల్లబొడ్డులూరులో విలేకరులకు ఆమె అందజేశారు. లొంగిపోయినా నిర్బంధంలోనే.. ఈ సందర్భంగా ఆమె అందజేసిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాత జీవితం గడిపాడు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు 2011 మే 18న అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ద్వారా డీజీపీ అరవిందరావు సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే పోలీసులు వచ్చి పలాస డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఒడిశా పోలీసులు విచారణ జరిపి పంపేస్తామని చెప్పి తీసుకెళ్లారు. పలు కేసుల పెండింగులో ఉన్నాయంటూ భువనేశ్వర్‌లోని జార్పడ్ జైలులో నిర్బంధించారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టును మూడున్నరేళ్లకుపైగా జైలులో ఉంచడం, దఫదఫాలుగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేయడానికి నిరసనగా గతంలోనూ ఆజాద్ జైలులోనే నిరాహార దీక్ష చేపట్టాడు. తన కుమారుడిని విడుదల చేయాలని కాములమ్మ పలుమార్లు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలను కోరినప్పటికీ స్పందన లేదు. దీంతో విసిగిపోయిన ఆజాద్ తనను కారుణ్య మరణానికి(మెర్సీ కిల్లింగ్) అనుమతించాలని కోరుతూ కేంద్ర హోంశాఖతోపాటు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలకు, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు, పలు ప్రజా సంఘాలకు లేఖ రాశాడు. లేఖలో నాలుగు డిమాండ్లు కాగా ఇటీవల కుమారుడిని చూసేందుకు జార్పడ్ జైలుకు వెళ్లిన తల్లి కాములమ్మకు అధికారులను ఉద్దేశించి రాసిన నాలుగు డిమాండ్లతో కూడిన లేఖను ఆజాద్ అందజేశాడు. కోర్టుల్లో ఉన్న కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఏళ్ల తరబడి జైలులో ఉన్న సమయంలోనే కొత్త కేసులు కట్టడం, బెయిల్‌పై విడుదలైన తరువాత జైలు గేటు వద్దే అరెస్టు చేసి మళ్లీ కేసులు పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశాడు. అరెస్టు అయిన వ్యక్తిపై ఇతర అభియోగాలు ఉంటే నిర్ధిష్ట సమయంలో కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని, మావోయిస్టు పేరుతో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. న్యాయమైన ఈ డిమాండ్లను తీర్చే వరకు ఈ నెల 23 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తన కుమారుడితో పాటు ఇటువంటి వేధింపులే అనుభవిస్తున్న మరో ఏడుగురు కూడా జైల్లో దీక్షకు పూనుకున్నారని కాములమ్మ చెప్పారు. కాములమ్మ ఇంటికి పోలీసులు ఈ నేపథ్యంలో నల్లబొడ్డులూరులోని కేశవరావు ఇంటికి మంగళవారం సోంపేట సీఐ సూరినాయుడు, మందస ఎస్సై వి.రవివర్మ వెళ్లారు. ఆయన తల్లి కాములమ్మతో మాట్లాడారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని అనంతరం కాములమ్మ చెప్పారు. ఈ విషయం సీఐ వద్ద ప్రస్తావించగా మాజీ, ప్రస్తుత మావోయిస్టుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించడం సాధారణమేనని చెప్పారు. -
ఆజాద్ ఎన్కౌంటర్ తీర్పు వాయిదా
ఆదిలాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఆలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్ కేసు తీర్పు మార్చి 13కు వాయిదా పడింది. శుక్రవారం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉండగా, ప్రతివాదులకు రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మున్సిఫ్ కోర్టు అవకాశం ఇవ్వడంతో తీర్పును వాయిదా పడిందని ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ తరపు న్యాయవాది నరేష్కుమార్ జోషి తెలిపారు. -
నాన్న డ్యూటీలో అమీర్‌ఖాన్ బిజీ.. బిజీ!
అమీర్ ఖాన్ ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారు. సినిమాలు ఎక్కువైపోవడం వల్ల అనుకుంటున్నారా.. కాదు. కొడుకును ఎత్తుకుని తిప్పడం, వాడి బాగోగులు చూసుకోవడం లాంటి డ్యూటీల్లో బాగా బిజీ అయిపోయాడు. ఎందుకంటే, అమీర్ భార్య కిరణ్ త్వరలో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లనుంది. ఆ సమయంలో వాళ్ల కొడుకు ఆజాద్ తన తండ్రితోనే ఉండబోతున్నాడు. కొన్నేళ్ల క్రితం దంపతులిద్దరూ కలిసే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లారు. ఈసారి మాత్రం కిరణ్ ఒక్కరే వెళ్తున్నారు. నాన్న పనులు చేయడం తనకు చాలా ఇష్టమని, అసలు అందుకోసమే కిరణ్‌ను తాను అక్కడికి, ఇక్కడికి పంపుతున్నానని అమీర్ ఖాన్ చెప్పారు. రాబోయే రెండు వారాల పాటు ఆమె ఊళ్లో ఉండదు కాబట్టి ఆజాద్ తనతోనే ఉంటాడని తెలిపారు. వాళ్ల అమ్మ లేనప్పుడు మాత్రమే ఆజాద్ తనవద్దకు వస్తాడని, లేకపోతే అస్సలు లెక్కచేయడని అమీర్ అన్నారు. దాంతో.. ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా కొడుకును దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఈ మిస్టర్ పెర్ఫెక్ట్. -
ఏడాదిన్నరపాటు కొనసాగిన ఆజాద్ ఎన్కౌంటర్ వాదనలు
కోర్టుకు హాజరైన ఆజాద్ భార్య తీర్పు ఈ నెల 23కు వాయిదా ఆజాద్ ఎన్కౌంటర్ రాజకీయ హత్యేనన్న ఆజాద్ సతీమణి పద్మ ఆదిలాబాద్ క్రైం : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఆలియాస్ అజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్ కేసు వాదనలు ఎట్టకేలకు పూర్తయ్యా యి. శుక్రవారం ఆజాద్ భార్య కె.పద్మ, ఆమె తరఫు న్యాయవాదులు సురేష్, రఘునాథ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ (ప్రథమ శ్రేణి న్యాయస్థానం) కోర్టుకు హాజరయ్యారు. ఏడాదిన్నరగా ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై ఈ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు మూడు గంటలపాటు వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 23కు వాయిదా వేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు సురేష్‌కుమార్, రఘునాథ్ పేర్కొన్నారు. సీబీఐ విచారణ ఇలా.. మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్టు పాండేల ఎన్‌కౌంటర్‌పై సుమారు రెండేళ్లపాటు విచారణ సాగింది. కేంద్ర, మావోయిస్టు పార్టీల అగ్రనేతలకు స్వామి అగ్రివేశ్ మధ్యవర్తిత్వం నడుపుతున్న సమయంలో 2010 జూలై 2న జిల్లాలోని సర్కేపల్లి-జోగాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ బూటకం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆజాద్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చి చంపినట్లు పిటిషన్లో పేర్కొంటూ.. అందుకు తగిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలు సమర్పించారు. నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటీషన్లో పేర్కొన్న అంశాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీం కోర్టు ఎన్‌కౌంటర్‌పై వాదనలు వినిపించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులతో ప్రభుత్వ వాదనలను వినిపించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు 2011 ఏప్రిల్ 15న కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సుమారు రెండేళ్లపాటుసీబీఐ విచారణ జరిపింది. మూడు నెలల్లో విచారణ, ఆరు వారాల్లో మధ్యంతర నివేదికలు సమర్పించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్కౌంటర్ ప్రదేశాన్ని అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఎన్కౌంటర్ నిజమైందేనంటూ 2012లో 192 పేజీల నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించింది. అయితే.. ఈ నివేదిక ప్రతులను అప్పుడే బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించినా.. ఎన్కౌంటర్లో భాగస్వాములైన పోలీసుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు ఏడాది తర్వాత సీబీఐ నివే దికలను అందుకున్న ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేష్ 2013 జూలై 2న ఆదిలాబాద్ కోర్టులో ఈ ఎన్కౌంటర్ బూటకమని, బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసులో స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్రవరిలో హాజరై తన వాదనను వినిపించారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతూ వచ్చాయి. శుక్రవారం ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇక తీర్పు ఎవరి వైపు వస్తుందో వేచిచూడాలి మరి..! తీర్పు తమకే అనుకూలం.. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కోర్టుకు హాజరైన పిటిషనర్ తరఫు న్యాయవాదులు భరోసా వ్యక్తం చేశారు. వాదనలు పూర్తయ్యాక వారు మాట్లాడారు. నేరస్తులను తప్పించేలా అప్పటి ప్రభుత్వం సీబీఐతో తప్పుడు నివేదికలు తయారు చేయించిందన్నారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిందంబరం ఆదేశాల మేరకే ఆజాద్ ఎన్కౌంటర్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమేనన్నారు. ఆత్మరక్షణ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇంత వరకు వాదనలు జరగలేదని, ప్రస్తుతం ఆజాద్ ఎన్కౌంటర్ కేసు వాదనలు పూర్తయినందున తమకు న్యాయం జరుగుతుందనే భరోసాతో ఉన్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందునా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ దర్యాప్తు చేపట్టాలని వారు కోరారు. రాజకీయ హత్యలే.. రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్కౌంటర్లన్నీ రాజకీయ హత్యలేనని ఆజాద్ భార్య పద్మ పేర్కొన్నారు. ఆజాద్, హేమచంద్రల ఎన్కౌంటర్ బూటకమని, పోలీసులు వారిని పట్టుకుని కాల్చిచంపారని ఆరోపించారు. పోలీసులు దగ్గర నుంచే కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినా సీబీఐ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై నిజమైన ఎన్‌కౌంటర్‌గా తప్పుడు నివేదికలు తయారు చేయించాయని ఆరోపించారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌కు సంబంధమున్న పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. -
కంప్లీట్మ్యాన్..ఆమిర్‌ఖాన్
చక్కటి సూట్ వేసుకొని మీటింగ్ నిర్వహిస్తుంటాడు కంపెనీ యజమాని. ఆ ఠీవికి అందరూ ముగ్ధులవుతుంటారు. పురుషుడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నట్టుగా ఉంటుంది ఆ యాడ్! ఇది డెబ్భైల నాటి రేమండ్స్ కంపెనీ యాడ్. భార్యాభర్తలు ఆఫీస్‌కి రెడీ అయి వెహికల్ ఎక్కేస్తారు. భర్త డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అంతలో ఒక్క నిమిషం అంటూ కారు దిగి ఇంట్లోకి వెళ్తుంది భార్య. ఐదు నిమిషాల తరువాత వచ్చి, కారెక్కి.. మళ్లీ ఒక్క నిమిషం అని కారు దిగి లోపలకు వెళ్తుంది. భర్త కారు దిగి భార్య వచ్చే వరకు పేపరు తిరగేస్తుంటాడు. ఆమె వచ్చాక ఇద్దరూ కార్లో కూర్చుంటారు. ఆమె అన్యమనస్కంగా ఉండటాన్ని అతను గమనిస్తాడు. ఈసారి ఇద్దరూ కారు దిగి ఇంట్లోకి వెళ్తారు. కాసేపటికి భర్త నెలల పసికందును భుజాన వేసుకొని బయటకు వస్తాడు భార్యను ఆఫీస్‌కి పంపడానికి బై చెప్తూ. డ్రైవింగ్ సీట్లో ఉన్న భార్య బిడ్డను వదల్లేనన్నట్టు చూస్తుంటే ‘మరేం పర్లేదు’ అన్నట్లు కళ్లతోనే భరోసా ఇస్తాడు. ఇది రేమండ్స్ ప్రెజెంట్ చేస్తున్న ఇప్పటి కంప్లీట్ మ్యాన్! డెబ్భైల నాటి యాడ్‌కి నేటి యాడ్‌కి ఎంత తేడా! ఇది కాలం మగవాడిలో తెచ్చిన మార్పు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఆధునిక తండ్రే. దర్శకురాలైన తన భార్య కిరణ్‌రావు పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటే అప్పటికి నెలల వయసున్న తమ కొడుకు ‘ఆజాద్’ బాధ్యతను ఆమిరే చూసుకున్నాడట. అంతేకాదు ఆజాద్‌ను బడిలో దింప డం, తీసుకురావ డం... రాత్రి కథలు చెప్తూ నిద్రపుచ్చడంకూడా ఇష్టంగా చేస్తాడట. -
'కాంగ్రెస్‌ను నిందించాల్సిన అవసరం లేదు'
-
ఆజాద్ ఎన్కౌంటర్ బూటకం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్కౌంటర్ బూటకమని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో సాక్షిగా సోమవారం జిల్లా క్రిమినల్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. మెజిస్ట్రేట్ మేరి సారదనమ్మ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆజాద్, హేమచంద్ర పాండేలను పోలీసులు దారుణంగా కాల్చిచంపారని పేర్కొన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపించేందుకు మధ్యవర్తిగా ఉండాలని కోరినట్లు తెలిపారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తనతో స్వయంగా మాట్లాడడంతో శాంతి చర్చలకు ఒప్పుకున్నాని పేర్కొన్నారు. ఆ తర్వాత 72 గంటలు కాల్పుల విరమించుకున్నామని, మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది మావోయిస్టులు బయటకు వచ్చారన్నారు. వాంకిడి అడవుల్లో కాల్చివేత మావోయిస్టు నేత ఆజాద్ కూడా బయటకు రాగానే పోలీసులు ఆయనను నాగ్‌పూర్‌లో బంధించి ఆదిలాబాద్‌లోని వాంకిడి అడవులకు తీసుకొచ్చి ఆజాద్‌తోపాటు జర్నలిస్టు హేమచంద్ర పాండేను కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించాలని చెప్పడంతో ఇక్కడ న్యాయపోరాటం చేసేందుకు దీనికి బాధ్యులైన వారిపై పిటిషన్ వేయడం జరిగిందన్నారు. బూటకపు ఎన్కౌంటర్ జరిగిందని కోర్టులో వివరించినట్లు తెలిపారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తుందన్నారు. తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. బూటకపు ఎన్కౌంటర్ నిజమైన ఎన్‌కౌంటర్‌గా చూపించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసును ప్రత్యేక న్యాయ విచారణ బృందంతో దర్యాప్తు చేపట్టాలని కోరారు. అనంతరం ఆజాద్ భార్య పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్కౌంటర్లు రాజకీయ హత్యలేనని పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఈనెల 20న కోర్టుకు హాజరుకావాలని వాయిదా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. వీరితోపాటు పద్మ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ ఉన్నారు. ‘తెలంగాణ’ తప్పక వస్తుంది.. తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పాటవుతుందని సామాజిక కార్యకర్త అగ్నివేశ్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో బాబు తనను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాఫియా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం గురించి చర్చించారు. -
ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ సీడీపీవో
శ్రీకాకుళం కలెక్టరేట్/టెక్కలి, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. గత రెండు నెల ల్లో శ్రీకాకుళం టౌన్లో ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఇద్దరు కానిస్టేబుళ్లు, శ్రీకాకుళం, పాలకొండ మున్సి పల్ కమిషనర్లు ఇద్దరు అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కారు. తాజాగా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి లంచం తీసుకుంటూ ఏసీబీకి శుక్రవారం చిక్కారు. ఆమెతో పాటు భర్త కొండయ్యరాజు కూడా అవినీతిలో భాగస్వామ్యం కావడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయంలో ఆమెకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో ఉమాదేవి అవినీతిపై ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయ నగరం సీఐలు ఆజాద్, లక్ష్మణ్‌జీ, రమేష్‌లు ఆపరేషన్ నిర్వహించారు. ఇలా పట్టుబడ్డారు కోటబొమ్మాళి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పు, ఇతర ఆహార పదార్థాలను స్వరాజ్మ్యాజిక్ వాహనంలో రవాణా చేసేందుకు నెలకు రూ 21,500 వంతున చెల్లించేందుకు కోటబొమ్మాళికి చెందిన తంగుడు సునీల్‌కుమార్‌తో సీడీపీవో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది నెలలుగా ఆయన సరుకులను రవాణా చేస్తున్నారు. అయితే, అద్దెను బడ్జెట్ ఉన్నమేరకు రెండు నెలల కోసారి చెల్లించాలి. సీడీపీవో ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించకుండా తిప్పుతున్నారు. దీంతో అద్దెబకాయి రూ.లక్షా 72 వేలకు చేరుకుంది. బిల్లు చెల్లించాలంటే కొంత ఖర్చు అవుతుందని చెబుతూ ఆమె వాయిదాలు వేస్తూ వచ్చారు. కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన సునీల్‌కుమార్ ఖర్చులు చెల్లిస్తానని చెప్పడంతో సీడీపీవో మొదట రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. పలుమార్లు బిల్లుల కోసం తిరిగితిరిగి విసిగిపోయిన సునీల్ ఈ నెల 19న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పౌడర్ చల్లిన రూ 15 వేలును ఆయనకు ఇచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని విశాఖ-బి కాలనీలో ఉన్న సీడీపీవో ఉమాదేవి ఇంటికి వెళ్లి ఆయన నగదును అంద జేశారు. తీసుకున్న నగదును భద్రపరచాలంటూ ఉమాదేవి తన భర్త కొండయ్యరాజుకు అందజేసింది. ఆయన భద్రపరిచేందుకు ముందే ఏసీబీ అధికారులు ఇంట్లోకి చొరబడి కొండయ్యరాజును, ఉమాదేవిని పట్టుకున్నారు. కొండయ్యరాజు కూడా వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కావడంతో ఇద్దరిపైనా కేసు నమోదుచేశారు. అక్కడి నుంచి కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయానికి వారిని తీసు కెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో పట్టుబడ్డ వార్త జిల్లా వ్యాప్తంగా దావానంలా వ్యాపిం చడంతో నియోజకవర్గంలోని ఐసీడీఎస్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. ఇటీవల అంగన్వాడీలో అక్రమాలపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురి తమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అవినీతి పరులు పట్టబడడంతో అందరిలోనూ ఇదే చర్చ సాగింది. ఫిర్యాదు మేరకే దాడులు సీడీపీవో అవినీతిపై వచ్చిన ఫిర్యాదు మేరకే దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. రెండు రోజుల్లో రూపొందించిన పథకం ప్రకారం పౌడర్ చల్లిన డబ్బును సునీల్‌కుమార్ చేత పంపించామని, ఆమె తీసుకొని భర్త ద్వారా భద్రపరుస్తుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి, లంచగొండి తనం జరిగితే తమ దృష్టికి తేవాలని కోరారు. -
వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే తెలంగాణ బిల్లు : ఆజాద్