చిత్రహింసలు పెట్టి చంపేశారు | azad father allegations on his son encounter | Sakshi
Sakshi News home page

చిత్రహింసలు పెట్టి చంపేశారు

Published Sat, May 7 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

చిత్రహింసలు పెట్టి చంపేశారు

చిత్రహింసలు పెట్టి చంపేశారు

వారం క్రితమే నా కొడుకును పట్టుకుని నిర్బంధించారు: ఆజాద్ తండ్రి
 
 నర్సీపట్నం: తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి పోలీసులు అమానుషంగా చంపేశారని ఆజాద్ తండ్రి లక్ష్మణరావు ఆరోపించారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి మృతదేహాలను గురువారంరాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘ ప్రతి నిధులు శుక్రవారం ఉదయమే ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుడు ఆజాద్ తండ్రి లక్ష్మణరావు విలేకరులతో మాట్లాడుతూ 15 మంది పోలీసులు కాల్పులు జరిపితే కేవలం ఒకే ఒక్క తూటా ఆజాద్‌కు తగలడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారం క్రితమే ఆజాద్‌ను పట్టుకుని నిర్బంధించి, కన్ను సైతం పీకి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు.

మావోయిస్టు కీలక నేతల మృతదేహాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం  చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఎన్‌కౌంటర్ మాదిరిగానే పోస్టుమార్టం సైతం బూటకంగానే జరిగిందన్నారు. అజాద్ సోదరి ఝాన్సీ మాట్లాడుతూ మానవత్వం లేకుండా మృతదేహాలను మూటలుగా కట్టి వదిలేశారన్నారు.  కేవలం మీడియాలో వచ్చిన వార్తలు చూసి తామంతా ఇక్కడకు చేరుకున్నామని వివరించారు.  కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆజాద్ కుటుంబసభ్యులు, ఆనంద్ సోదరుడు నాగేశ్వరావు నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. కమల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోనే భద్రపరుస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఎన్‌కౌంటర్ వాస్తవమే..
విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్

విశాఖ జిల్లా కొయ్యూరు మండ లం యు.చీడిపాలెం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ వాస్తవమేనని విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఇక్కడ తెలి పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురిని ఆజాద్ (ఈస్ట్ డివిజన్ చీఫ్), ఆనంద్(ఈస్ట్‌డివిజన్ డిప్యూటీ చీఫ్), కమల (ఏరియా కమిటీ మెంబరు)గా గుర్తించామన్నారు.  కొయ్యూరు మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా శిక్షణలో ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణార్థం పోలీ సు లు  ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు.  ఆజాద్ కుటుంబసభ్యులు, బంధువులు, పౌరహక్కుల సంఘం నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం నిబంధనలకు లోబడి పూర్తిచేశామని చెప్పారు. ఘటనాస్థలంలో లభ్యమైన విప్లవ సాహిత్యం, ఏకే 47 తుపాకీ, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, 9 ఎంఎం పిస్టల్, రేడియో, జీపీఎస్, డెరైక్షనల్ మైన్, డే బైనాక్యులర్, 9 కిట్ బ్యాగులను ఆయన పరిశీలించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement