
సబా ఆజాద్.. నటనలోనే కాదు,
సంగీతం, దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకుంటున్న మహిళ.
ఇప్పుడు వెబ్ వీక్షకులకూ తన ప్రజ్ఞను పరిచయం చేస్తోంది..
సబా ఆజాద్ పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే. ఆమె మేనమామ సఫ్దర్ హష్మీ ప్రముఖ స్ట్రీట్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. ఆ స్పూర్తితోనే తాను ఆర్టిస్ట్ కావాలనుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో ఒడిస్సీ, లాటిన్ అమెరికన్ ఫోక్, క్లాసికల్ బాలే, జాజ్‌లలో శిక్షణ తీసుకుంది. సుమారు వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అప్పటికే థియేటర్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు సంపాదించుకుంది. 2008లో ’దిల్ కబడ్డీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా ఆడలేదు.
తర్వాత చేసిన ’ముర్‌గన్‌సే ఫ్రెండ్‌షిప్ కరోగే’ కూడా అంతే. దీంతో సినిమాల కంటే నాటకాలే మేలు అనుకొని, 2010లో సొంత థియేటర్ కంపెనీ స్థాపించింది. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించింది. మరికొన్నింటికి సంగీతం అందించింది. 2012లో స్నేహితులతో కలసి ‘మ్యాడ్ బాయ్’ పేరుతో సొంత బ్యాండ్ ప్రారంభించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న ’విల్ యు బి మై క్వారంటైన్’తో అలరిస్తోంది.
చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న ఈ కుల, మత విభేదాలను నిర్మూలించాలని ఉంది. అందుకే ఆజాద్ (స్వేచ్ఛ)ను నా ఇంటి పేరుగా మార్చుకున్నా. ఇలా మార్చుకున్నందుకు చాలా మంది నన్నో టెర్రరిస్ట్‌లా చూశారు.
– సబా ఆజాద్
Comments
Please login to add a commentAdd a comment