Sabha
-
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం..!
-
టచ్ చేస్తే మసే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, మహబూబాబాద్: ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్ చెప్తున్నారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు .. నీ దగ్గర ఉన్నోళ్లు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా తోడేళ్లలా వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. కంచె వేసి కాపాడుకునే పవర్ఫుల్ హైటెన్షన్ వైర్ లాంటివాడు. కరెంటు తీగ మీద కాకి వాలితే ఎట్లా అయితదో.. కాంగ్రెస్ వైపు చూస్తే అట్లానే షాక్ కొట్టి మాడిమసై పోతారు. ప్రయత్నం చేసి చూడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో, పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం మహబూబాబాద్‌లో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయా చోట్ల సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మా కారు కొంచెం పాడైంది. గ్యారేజీకి పొయిందని నిన్న, మొన్న కేటీఆర్ అంటున్నారు. కారు రిపేరవడం కాదు.. ఇంజిన్ సహా మొత్తం పాడైపోయింది. ఇనుప సమాన్ల కింద తూకానికి అమ్ముడే. నీ కారే కాదు.. తండ్రి కేసీఆర్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.. ఇంకా నడవలేకపోతున్నరు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను పాతేసినా.. ఇంకా పొంకనాలు కొడుతున్నరు. మీ ఎమ్మెల్యేలే నీవెంబడి ఉంటలేరు. అలాంటిది ఎదుటి పార్టీల 20 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతావా? ఇంకెన్ని రోజులు ఇలా కథలు చెప్పి బతుకుతరు? మోదీ, కేసీఆర్ ఒక్కటే.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు. వారిలో ఎవరికి ఓటేసినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. తెలంగాణకు ద్రోహం చేసినట్లే.. పదేళ్లు పాలించిన ఇద్దరు రాష్ట్రానికి చేసింది శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టకుండా కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడింది ప్రధాని కాదా? పదేళ్లలో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమరి్ధంచినది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏ ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? పదేళ్లు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు ఓట్లు వేయాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టింది బీజేపీ కాదా? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటుపోయింది? తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు? ఉత్తర భారత దేశంలో కుంభమేళా, గంగానది పరిరక్షణ కోసం వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. మన మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు కేటాయించి అవమానించింది. 42 మంది తెలుగు మాట్లాడే ఎంపీలుంటే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అదే యూపీలోని 60 మంది ఎంపీలకు 12 మంత్రి పదవులు, 26 మంది ఎంపీలు ఉన్న గుజరాత్‌కు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వివక్ష చూపారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదని గ్రహించే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. కేసీఆర్ తన బిడ్డ కవితకు బెయిల్ మంజూరు చేయించుకునేందుకు.. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లను వదిలేశారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించిన తెలంగాణ ప్రజలు.. ఈ ఎన్నికల్లో మోదీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయం. కమ్యూనిస్టులు, టీజేఎస్ మద్దతు తీసుకుంటాం పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల మద్దతు తీసుకుంటాం. వారితో చర్చించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కలిసొచ్చే ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతాం. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఇచ్చి న ప్రతీ హామీని నెరవేస్తుంది. తెలంగాణ బిడ్డల చావులను చూసిన సోనియా గాంధీ మనసు తల్లడిల్లి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 14 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్తాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా? శత్రువు చేతిలో కత్తి పెడితే.. వాడు పక్కోన్ని పొడవడు. మన కడుపులోనే పొడుస్తడు. నిన్న మొన్నటివరకు పదేళుŠల్ కేసీఆరే సీఎంగా, మోదీ పీఎంగా ఉన్నారు కదా. పాలమూరుకు పది పైసలన్నా తెచ్చారా? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చారా? అది తేలేదుగానీ డీకే అరుణమ్మ మాత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది. పాలమూరులో ఆమె గెలిస్తే గడీలో ఉన్న బంధువులకు మేలే తప్ప పాలమూరుకు ఏ న్యాయమూ జరగదు. గల్లీ నుండి కేసీఆర్ వచ్చి నా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి నా ఈ గడ్డ మనది. నాడు తట్టపనికో, మట్టి పనికో వలసలు పోయినం. ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికొచ్చినం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తలెత్తుకునేలా గౌరవాన్ని ప్రదర్శించినం. కేసీఆర్‌ది అసత్య ప్రచారం: మంత్రులు మహబూబాబాద్ సభలో మంత్రులు ప్రసంగించారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ.. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ అసత్యపు ప్రచారం చేయడం మాజీ సీఎంకు అలవాటుగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులే అయిందని, ఈ కాస్త సమయంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. గత పదేళ్లలో గిరిజనుల కోసం ఏమీ చేయని బీజేపీకి గిరిజనులు బుద్ధి చెప్తారని మంత్రి సీతక్క చెప్పారు. -
ఇక ‘హస్తం’ ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడినట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో సన్నాహక భేటీలు నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతల నేతృత్వంలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలను ఈనెల 20లోపు ముగించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సమావేశాల అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల రాకతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా లోక్‌సభ ఎన్నికల కోసం తన ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు చోట్ల ప్రచారం నిర్వహించేలా ఆయన సభల షెడ్యూల్ తయారవుతోంది. తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. ఇక్కడ సోమవారం నిర్వహించే సభకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నేడు కేసీ రాక..: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి ని సమీక్షించేందుకుగాను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చా ర్జులు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ఏఐసీసీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్, సభల నిర్వహణ ఎక్కడన్న దానిపై కూడా టీపీసీసీ నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ బీజేపీ రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ముఖ్యంగా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తోన్న నియోజకవర్గాల నుంచి కమలనాథులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సంగారెడ్డి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జి పులిమామిడి రాజు, మక్తల్ నేత జలంధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. త్వరలోనే మరింత మంది అసెంబ్లీ స్థాయి బీజేపీ నేతలకు కాంగ్రెస్ గాలం వేయనుందని సమాచారం. -
నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో శనివారం తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్లగొండ, కరీంనగర్‌లలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించింది. అయితే ఈ రెండు సభలూ రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో బీఆర్ఎస్ తొలి సభ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు బహిరంగ సభలు నిర్వహించాలా.. లేక కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలా అనే అంశంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సుమారు 20 రోజుల పాటు కేసీఆర్ పాల్గొనే సభలు, బస్సు యాత్ర షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సోషల్ మీడియా సమన్వయకర్తలను ప్రకటించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానానికి అభిలాశ్‌రావు రంగినేని, మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఆశప్రియ ముదిరాజ్ సమన్వయకర్తలుగా పనిచేస్తారు. -
మోసగాళ్లను నమ్మొద్దు
చంద్రబాబు ఈ రోజు శింగనమలకు వెళ్లారు. వైఎస్సార్సీపీ ఓ టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్‌గా తన కాళ్లపై నిలబడ్డాడు. వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీ జగన్ 175 అసెంబ్లీ, 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. పేదవారికి అండగా ఉండే జగన్‌కు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలది. అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప. చంద్రబాబు అక్కడికి వెళ్లి ఉపాధి హామీ కూలీకీ జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా.. ఉపాధి కూలీ, పేదవాడైన లక్కప్పకు టికెట్ ఇచ్చాం. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా. మాది పేదల పార్టీ. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతో వారు మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనకూ, మాట తప్పిన చంద్రబాబుకూ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ చేసిన మంచిని, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మోసం చేసిన వారి తోకలు కత్తిరించే స్టార్ క్యాంపెయినర్లు మీరే. ఈ ఐదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్నాం. మీకు మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో మాట్లాడారు. జన సముద్రంగా మారిన ఎమ్మిగనూరు సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు. మే 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలిచి పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని ప్రశ్నించారు. సిద్ధం అంటూ చేతులు పైకెత్తిన ఈ మహా సైన్యం.. పైకి లేచిన ప్రతి చేయి, ఉప్పొంగిన ప్రతి గుండె మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెబుతోందన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.., – సాక్షి ప్రతినిధి, కర్నూలు పిల్లల భవిష్యత్ కోసమే సంస్కరణలు ♦ మా ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయని, మా పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయని ప్రతీ గుండె చెబుతోంది. రాష్ట్రంలో ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 10–16 ఏళ్ల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన బడుల్లో, విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. నిలబెట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికేలా అవకాశాలు మన విద్యా విధానంలో తీసుకొచ్చాం. ♦ బడులకు పంపే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడిని తీసుకొచ్చాం. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, తరగతి గదులు, కార్పొరేట్ కంటే గొప్పగా 6వ తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు, విద్యా కానుక కిట్లు, గోరుముద్ద, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మంచి మార్పులు తీసుకొచ్చాం. ♦పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పేదల పెద్ద చదువులకు అండగా నిలిచాం. బోధనలో మార్పులు, ఇంటర్న్‌షిప్‌తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. పిల్లలకు ఓట్లు ఉండవని, వారి చదువుల గురించి గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేదు. వారి బతుకులు మారాలన్న తపన, తాపత్రయంతో మనం అడుగులు ముందుకు వేశాం. ఈ ఎన్నికలు కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు తూతూ మంత్రంగా ఓటు వేసేవి కాదు. పిల్లల భవిష్యత్, వారి తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆడబిడ్డలు ఎదిగేలా అడుగులు వేశాం ♦ మన బంగారు తల్లులు ఆడబిడ్డలు, అవ్వల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే చెప్పేందుకు ఒక్కటైనా ఉందా? మన రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. బాల్య వివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదు. తన బిడ్డను, వారి భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి తల్లుల చేతుల్లో లేదంటే.. అలాంటి పాలకులు ఉన్నా, లేకున్నా ఒకటే. ♦ పాదయాత్రలో నా కళ్లతో చూసిన మరో విషయం చెబుతా. పూలు, వరి, తృణధాన్యాల దాకా ప్రతి గింజ ఎవరి నోట్లోకి వెళుతుందో భగవంతుడు రాస్తాడు. ప్రతీ గింజ పండించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్లతో చూశా. పని వాళ్లుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న లక్షల మంది వారి బతుకులను ఎంత కష్టంగా లాగుతున్నారో చూశా. వారి బతుకులు మారాలని ఈ 58 నెలల్లో అడుగులు ముందుకు వేశాం. ♦రోజు కూలీ, దోశలు.. ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్ నడిపే ఓ చెల్లి ఇలా వీరంతా బాగుపడాలి. వీరందరి జీవితాల్లో వెలుగులు రావాలని పథకాలు తీసుకొచ్చాం. ఈ ఆలోచనల నుంచే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా పుట్టాయి. కుదేలైన పొదుపు సంఘాలు ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఇవాళ తలెత్తుకుని నిలబడ్డాయి. 45–60 ఏళ్ల వయస్సులో నా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అనే పథకాలు పుట్టాయి. చేతల్లో సామాజిక న్యాయం ♦ స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో సామాజిక న్యాయం అంశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇందులో 75 శాతం పైచిలుకు నా.. నా.. అని పిలిచే నా సామాజిక వర్గాలకే వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే వరకూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు ఏకంగా మరో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఈ వర్గాల వారే. నామినేషన్‌పై ఇచ్చే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి ఈ వర్గాలకే వచ్చేట్లు చేసింది కూడా మీ ప్రభుత్వమే. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ, మంత్రి పదవుల వరకూ ఈ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇవ్వడం సప్తవర్ణాల మిశ్రమం, సామాజిక ఇంధ్ర ధనస్సు అని చెప్పేందుకు సంతోష పడుతున్నా. భవిష్యత్‌ను మార్చే ఎన్నికలివి ♦ దేశంలో తొలిసారి ఆలయ బోర్డులు, మార్కెట్ కమిటీలు, రాజకీయ నియామకాల్లో ఏకంగా 50 శాతం పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. ప్రతిపక్షం మాయలు, మోసాల్ని నమ్ముకుంటే.. మీ ప్రభుత్వం మీకు చేసిన మంచిని నమ్ముకుంది. ఈ ఎన్నికలు 2.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు.. వారి భవిష్యత్, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు పెట్టుకోవాలి. ♦రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఇది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతు చేతిలో పెట్టాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్ వచ్చేది. ఈ రోజు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి రైతులకు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. వరదలు, తుపాన్లు వచ్చి రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. అసైన్డ్, ఇనాంతో పాటు 22ఏకు సంబంధించిన 35 లక్షల ఎకరాల భూములపై శాశ్వత భూ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇది. రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా? మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి ♦ నా చేతికి మాత్రమే కాదు.. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరుతున్నా. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. దిశ యాప్ ద్వారా 35 వేల మంది అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే వారికి భద్రత కల్పించిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టాలి. మహిళా పోలీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. అవ్వా, తాతలకు.. అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు ఒకటో తేదీన, సెలవైనా సూర్యోదయానికి ముందే వారి చేతిలో పింఛన్ పెట్టేందుకు వలంటీర్‌ను ఇంటికే పంపిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. ♦ పింఛన్ తీసుకునే 66 లక్షల మందిలో అవ్వలు, వితంతు అక్క చెల్లెమ్మలు 45 లక్షల మంది ఉన్నారు. వీరందరూ మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. ఈ 58 నెలల్లో లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం. అందులో రూ.1.90 లక్షల కోట్లు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి మహిళ సాధికారతను ఉద్యమంగా నడిపిన ప్రభుత్వం ఇది. వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. బాబు తోక కత్తిరించండి ♦ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ది చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన వారు, బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అనే చంద్రబాబు తోకను మరోసారి కత్తిరించాలని కోరుతున్నా. నాన్న ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా, గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న బాబును ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? ఈ వర్గాలన్నీ నేను అక్కున చేర్చుకున్న వర్గాలు. ♦ బాబుకు నా.. నా.. అని పిలచుకునే వర్గాలు హైదరాబాద్ మెట్రోలో హైటెక్‌సిటీలో ఉన్నాయి. ఇక్కడ లేవు. ఓ ఈనాడు, ఆంధ్ర‡జ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసాలు మాత్రమే. ఐదేళ్ల కిందట ఓ దత్తపుత్రుడు, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకుని ఇదే చంద్రబాబు 2014లో మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలు తీసుకొచ్చారు. 650 హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు మర్చిపోతారు అని ముఖ్యమైన హామీలు అంటూ ఓ కరపత్రం (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సంతకం చేసి ప్రతీ ఇంటికి పంపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లో ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మోసాలు ఇవిగో.. ♦ రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. రూ. 87,612 కోట్లు మాఫీ చేశాడా? ♦ డ్వాకా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.4,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చారా? ♦ అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు సాయం ఇస్తామన్నారు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా? ♦రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, మహిళ రుణాలు మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతీ నగరాన్ని హైటెక్‌సిటీగా నిర్మించడం ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. మీ నగరంలో, జిల్లాలో హైటెక్‌సిటీ ఎక్కడైనా కన్పించిందా? ♦ ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు మోడీ ఫొటో పెట్టుకుని ఇంటింటికీ పంపిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైనా చేశారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? మన టార్గెట్ 175కు 175 ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ దత్తపుత్రుడు, చంద్రబాబు, మోడీ ఇదే ముగ్గురూ కలిసి సూపర్‌సిక్స్, సూపర్సెవన్ అంటున్నారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి మోసాల నుంచి రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను కాపాడుకోవాలా? వద్దా? ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? సిద్ధం అంటే జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి పేదవాడి భవిష్యత్ కోసం మేమంతా సిద్ధం అని లైట్ వేసి పిలుపునివ్వండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ ఆన్ చేసి మద్దతు పలికారు). మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175. 25కు 25 ఎంపీలు గెలవాలి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ ఎమ్మెల్యేలుగా బుట్టారేణుక, సాయిప్రసాద్‌రెడ్డి, విరూపాక్షి, ఇంతియాజ్, డాక్టర్ సతీశ్, బాలనాగిరెడ్డి, శ్రీదేవిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలి. సంక్షేమంతో ఎమ్మిగనూరుకు రూ.650 కోట్లు.. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అమోఘం. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.650 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే. గాజులదిన్నె ప్రాజెక్టును ఆధునీకరించడం, గాజులదిన్నెకు హంద్రీనీవా నుంచి 3 టీంఎంసీల నీటిని తరలించే అవకాశాన్ని కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి టైక్స్‌టైల్ హబ్‌ను విస్తరించడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరుతున్నా. పేద వర్గాలకు అందుతున్న పథకాలు కొనసాగాలన్నా, మరింత మెరుగుపర్చాలన్నా వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. బీసీ మహిళనైన నాకు ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.– బుట్టా రేణుక, ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిన్నా.. నేనున్నా! ♦ చూపులేని చిన్నారికి సీఎం భరోసా ♦ తక్షణమే స్పందించిన సీఎంవో కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి శుక్రవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైన సమయంలో గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె పింజరి జుహతో కలసి ఆయన వద్దకు వచ్చింది. పుట్టుకతోనే తన కుమార్తెకు రెండు కళ్లు కనిపించవని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పాపకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారని విలపించింది. కనీసం పెన్షనైనా మంజూరు చేస్తే పాపకు అవసరమైన మందులకు ఉపయోగపడుతుందని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తన పీఏ ద్వారా సమాచారాన్ని సీఎంవోకు చేరవేశారు. సీఎంవో కార్యాలయం అధికారులు పాపకు సంబంధించి వివరాలను సేకరించారు. -
ఉల్లం'ఘను'లు .. యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
ప్రొద్దుటూరు/ చిత్తూరు అర్బన్/ కొమ్మాది(విశాఖ)/ పాలకొల్లు (సెంట్రల్)/భాకరాపేట(తిరుపతి జిల్లా)/హిందూపురం అర్బన్: ఈసీ ఆదేశాలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కోడ్‌కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలను సైతం ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లకు చీరలు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ప్రొద్దుటూరులో.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి స్థానిక టీడీపీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో మంగళవారం సాయంత్రం టీచర్స్ కాలనీలో సమావేశానికి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి హాజరై ప్రసంగించారు. బుధవారం ఉదయం గోపవరం గ్రామంలో 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్‌గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వరదరాజులురెడ్డి ప్రసంగించారు. విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి సంఘటన స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై ఎన్నికల కోడ్‌కు సంబంధం లేదంటూ అధికారితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆమె ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు వరదరాజులరెడ్డితోపాటు మహ్మద్ గౌస్‌పై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వరదరాజులురెడ్డి బుధవారం సాయంత్రం గోపవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం హాజరవడం గమనార్హం. రెండు రోజుల్లో నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వరదపై ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైద్యం పేరుతో వల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు వైద్యం పేరుతో ఓటర్లకు వల వేస్తున్నారు. విశాఖ నగరం 8వ వార్డు గొల్లల ఎండాడలో బసవతారకం, గీతం ఆస్పత్రులు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ, జనసేన నాయకులు ప్రారంభించారు. ఇది వైద్య శిబిరంలా కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమంలా సాగింది. ఇటీవల 39వ వార్డు లక్ష్మీటాకీస్ ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రి, గీతం ఆస్పత్రి సంయుక్తంగా వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి భరత్, జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై.. ఓటర్లను ప్రభావితంచేసేలా కార్యక్రమం చేపట్టారు. పార్టీ గుర్తుతో పూజలు ఎన్నికల నియమావళి ప్రకారం ఆలయాల్లో రాజకీయ ప్రచారాలు చేయకూడదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు సైకిల్ గుర్తును చొక్కాకు పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈశ్వరుని ఆలయంలో పూజలు చేశారు. అదేరీతిలో బుధవారం రాత్రి చిత్తూరు కట్టమంచి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలోనూ టీడీపీ కండువా ధరించి పూజలు నిర్వహించారు. తొలగించని టీడీపీ పోస్టర్లు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన వాల్ పోస్టర్లు, ట్రీ గార్డులపై పేర్లు తొలగించలేదు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ వాల్‌పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీకి చెందిన వాల్‌పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం. టీడీపీ ప్రచారంలో కానిస్టేబుల్, ఏఎన్ఎం టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిశ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌పై భాకరాపేట పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెళుతుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో టీడీపీ శ్రేణులు మార్గమధ్యలో స్వాగతం పలికారు. దిశ కానిస్టేబుల్ టీడీపీ నాయకులతో కలసి పూలమాలలు వేయడం, భాకరాపేటలో పార్టీ కరపత్రాలు పంచుతూ టీడీపీకి ఓటు వేయమని అభ్యర్థించడం, వాటర్ బాటిళ్లపై సైతం టీడీపీ నాయకుల ఫొటోలు వేయించుకోవడం చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పడాల్ ఉత్తర్వులిచ్చారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా చౌడేపల్లి సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎం లతను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. హిందూపురంలో ప్రలోభాలు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. యథేచ్ఛగా చీరల పంపిణీ చేపడుతోంది. బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో టీడీపీ వర్గీయులు ఓటర్ల జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తుండగా అధికారులు కొన్ని చీరలు, ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్
-
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్‌సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్‌ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్‌పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్‌ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
మరో ఫ్లాప్ షో.. ప్రజాగళం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట: ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభ ప్రధానికి అవమానంతో మొదలై, జనం రాక, మైకులు పనిచేయక చివరకు నవ్వులపాలై ఓ ఫ్లాప్ షోగా మిగిలింది. ప్రధాని మోదీ వస్తుండటంతో 15 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని చెప్పారు. తీరా చూస్తే సభకు పట్టుమని లక్ష మంది కూడా రాలేదు. మేనిఫెస్టో కూడా లేదు. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు పది లక్షలు, పదిహేను లక్షల జనంతో విజయవంతమై చరిత్ర సృష్టించాయి. వాటి స్థాయిలో నిర్వహించాలన్న భావనతో టీడీపీ, జనసేన ఏర్పాట్లు చేశాయి. తీరా చూస్తే కనీసం లక్ష మంది కూడా రాలేదు. మరోపక్క జనం లేకపోవడాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో చేయించిన హడావుడి ప్రధాని మోదీని అసహనానికి గురి చేసింది. టీడీపీ కార్యకర్తలు సౌండ్ బాక్సుల పైకి దూసుకురావడంతో చాలాసార్లు మైకులు మొరాయించాయి. కార్యకర్తలు సౌండ్ బాక్సుల టవర్లు, లైటింగ్ టవర్ల పైకి ఎక్కడంతో మోదీ తీవ్రంగా వారిని హెచ్చరించారు. 100 ఎకరాల్లో సభకు 30 ఎకరాలే బొప్పూడి వద్ద సుమారు దాదాపు 100 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో పార్కింగ్‌కి పోను కేవలం 40 ఎకరాలను సభ కోసం కేటాయించారు. అందులో వేదిక, హెలీప్యాడ్ల కోసం పది ఎకరాలు కేటాయించగా మిగిలిన 30 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 2 వేల కుర్చిలు వేశారు. అవి కూడా ఒక కుర్చికి ఇంకో కుర్చికి మధ్య రెండు అడుగులు గ్యాప్ ఉండేలా వేశారు. మొత్తం 48 వేల కుర్చిలు వేసినట్లు చెబుతున్నారు. వాటిలో 6 వేల కుర్చిలు కూడా నిండలేదు. మోదీ ప్రసంగం మొదలైన నిమిషానికే మైకు మొరాయించడంతో రెండు నిముషాలు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఎక్కువ మంది లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. మోదీ మాట్లాడే సమయంలో మూడుసార్లు అంటే దాదాపు ఏడు నిమిషాలకు పైగా మైకులు ఆగిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. టీడీపీ ప్రోద్బలంతో టవర్లెక్కిన కార్యకర్తలు.. హెచ్చరించిన ప్రధాని సభా వేదికపైకి మోదీ వచ్చిన సమయానికి కూడా జనం లేకపోవడంతో చంద్రబాబు, పవన్‌లో ఆందోళన కనిపించింది. మోదీ వేదిక మీదకు వచ్చిన తరువాత పవన్, బాబు ప్రసంగించారు. దీన్ని గమనించిన చంద్రబాబు అండ్ టీం పరువు కాపాడుకోవడానికి తమకు తెలిసిన టక్కుటమార విద్యలను ప్రదర్శించారు. ఖాళీ కుర్చిల నుంచి మోదీ దృష్టి మళ్లించేందుకు సభలో టీడీపీ కార్యకర్తలతో గందరగోళం సృష్టించి జనం భారీగా వచ్చారన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. ముందు ఉన్న కార్యకర్తలు స్టేజ్ వద్దకు దూసుకువస్తున్నట్టు ప్రయత్నించారు. సౌండ్ బాక్స్ టవర్లను సైతం ఎక్కి హడావుడి చేశారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది మైక్ టవర్స్, లైటింగ్ కోసం కట్టిన టవర్లపై ఎక్కడాన్ని మోదీ గమనించారు. పవన్‌ను ఆపి మోదీ మాట్లాడారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు ఎదురౌతాయని, దయచేసి దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ కార్యకర్తలు టవర్ల పైనుంచి కిందికి దిగారు. మొరాయించిన మైకులు..ప్రధాని అసహనం ప్రధాని మోదీ మాట్లాడుతుండగా మైకులు పదే పదే మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనం రాకపోవడాన్ని కవర్ చేయడంలో భాగంగా చంద్రబాబు తన కార్యకర్తలతో చేయిస్తున్న హడావుడిలో భాగంగా వారంతా సౌండ్ సిస్టం వద్దకు దూసుకుపోయారు. వారి తాకిడితో వైర్లు, ఇతర పరికరాలు కదిలిపోయి మైకులు మొరాయించాయి. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఒకటి, రెండుసార్లు అంతరాయం కలిగింది. ప్ర«ధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో తొలుత మూడు నిమిషాలు మైకులు పనిచేయలేదు. తరువాత ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా మరోసారి ఐదు నిమిషాల దాకా అంతరాయం కలిగింది. దీంతో మోదీ అసహనానికి గురయ్యారు. ‘దయ ఉంచి అక్కడ ఉన్నవారంతా వెనక్కి వెళ్తే మైక్ పనిచేస్తుంది. సభకు అంతరాయం కలిగించవద్దు. మీ ఉత్సాహం, మీ జోష్ నాకు ఇష్టమే. కానీ మీరు కొంచెం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారు. మీరెందుకు హడావిడి చేస్తున్నారు’ అంటూ మోదీ చిరాకు పడ్డారు. తొలి మీటింగే ఫెయిలవడంతో... బీజేపీతో పొత్తు కుదరడంతో టీడీపీ నిర్వహించిన తొలి సభ విఫలమవడంతో టీడీపీ, జనసేన కేడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. గట్టిగా ఓ మీటింగ్ నిర్వహించలేకపోతున్నాం.. ఇదేమి ఖర్మ.. అంటూ టీడీపీ కార్యకర్తలు అక్కడే వ్యాఖ్యానించారు. మరోవైపు సభలో సామాన్య ప్రజలు కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. చిలకలూరిపేట సమీపంలో టీడీపీ నేతల మిల్లుల్లో పనిచేసే నార్త్ ఇండియా వలస కూలీలు కూడా సభలో అధిక సంఖ్యలో కనిపించారు. మహిళలు ఈ సభకు దూరంగా ఉన్నారు. సభలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆర్టీసీ బస్సులతోపాటు నారాయణ, భాష్యం వంటి టీడీపీ అనుకూల విద్యా సంస్థల నుంచి వందలాది బస్సులు గ్రామాలకు పంపినా జనం లేక ఖాళీగానే వచ్చాయి. కొన్నింటిలో సగం మంది కూడా లేరు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1,000 దాకా నగదు, మందు బాటిల్, బిర్యానీ పొట్లం ఇచ్చినా సభకు రాలేదని నేతలు చిరాకుపడ్డారు. బొçప్పూడి సభతో ప్రజల నాడి అర్థమవుతోందన్న భావన వారిలో నెలకొంది. ప్రజలు సీఎం వైఎస్ జగన్ వైపు ఉన్నారన్న విషయం ఈ సభ ద్వారా మరోసారి రుజువైందని టీడీపీ కార్యకర్తలే సభ బయట వ్యాఖ్యానించారు. వైఫల్యాన్ని పుల్లారావుపై నెట్టేశారు సభ వైఫల్యాన్ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పైకి తోసే ప్రయత్నం మొదలైంది. సభ అట్టర్ ఫ్లాప్ అవడం, ప్రధానికి వేదికపై అవమానం జరగడం, మైకులు పనిచేయకపోవడానికి పుల్లారావే కారణం అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెట్టింది. మైక్ సిస్టమ్‌కు సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని, అసలు ఏర్పాట్లను పుల్లారావు పట్టించుకోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యాఖ్యాతను కూడా సరైన వారిని పెట్టలేదంటూ కామెంట్లు మొదలుపెట్టారు. దీంతో పుల్లారావు మీడియా ముందుకు వచ్చి పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. సభకు ప్రజలు రాకపోవడానికి కారణాన్ని ఎల్లో మీడియా కూడా పోలీసులపై నెట్టేసింది. ట్రాఫిక్ జామ్ అయ్యిందని, పోలీసులు సరిగా పర్యవేక్షించలేదంటూ ఎల్లో మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సభా వేదికపై ప్రధానికి అవమానం రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్డీఏ కూటమి సభకు హాజరైన ప్రధాన మంత్రి మోదీకి సభా వేదికపైనే అవమానం జరిగింది. దేశ ప్రధాని కోసం కనీసం ఒక పూల బొకే తీసుకురావాలన్న ఆలోచన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేసన టీడీపీ అధినేత చంద్రబాబుకు, వందలాది పుస్తకాలు చదివానని చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాలేదు. ప్రధాని హెలికాప్టర్ దిగి వేదిక పైకి రాగానే వట్టి చేతులతోనే ఆహా్వనం పలికారు. ఆయన కూర్చున్న తర్వాత ప్రధాని మంత్రి మోదీని చంద్రబాబునాయుడు సన్మానిస్తారని, పవన్ పూల బొకే ఇస్తారని వ్యాఖ్యాత చెప్పారు. దీంతో మోదీ సహా అందరూ లేచి నిల్చున్నారు. అయితే, అక్కడ శాలువా లేదు, పూల బొకే లేదు. దీంతో చంద్రబాబు, పవన్ దిక్కులు చూస్తూ నిల్చున్నారు. శాలువా కోసం అటూఇటూ చూశారు. విషయం గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాను సభ పూర్తి అయిన తర్వాత మోదీని సన్మానించేందుకు తీసుకువచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబుకు మోదీ క్లాస్! ఏ సభలో అయినా ఉత్సాహంగా ప్రసంగించే ప్రధాని మోదీ ఈ సభలో జనం లేకపోవడం, పదే పదే మైకులు మొరాయించడంతో కొంత కోపంగా ప్రసంగించారని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని సభా వేదికపై ఉన్నంతసేపూ కోపంగానే ఉన్నారు. చంద్రబాబు, పవన్‌తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. మీటింగ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకినట్టు సమాచారం. సభ జరుగుతున్నంత సేపు చంద్రబాబు, పవన్‌ల మొహాల్లోనూ ఏమాత్రం ఆనందం లేదు. అన్నమో ‘నారాయణా’ ♦ ప్రజాగళం సభకు నుంచి జనాన్ని పంపిన మాజీ మంత్రి నారాయణ ♦ ఒంగోలు వద్ద భోజనం పెడతామని పంపారు.. సాయంత్రం 4 దాటినా భోజనాలు అందని వైనం ♦ ఆకలితో అలమటించిన మహిళలు ♦ సభకు వెళ్లకుండానే వెనక్కి వెళ్లిన బస్సులు మద్దిపాడు: చిలకలూరిపేట సమీపంలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు బయల్దేరిన జనం ఆకలితో అలమటించి, మధ్యలోనే ఆగిపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలను తరలించారు. నెల్లూరు, చుటుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రజలను ఈ సభకు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ విద్యా సంస్థల బస్సులను తెప్పించి, మధ్యాహ్నం 12 గంటలకే వాటిలో కార్యకర్తలు, మహిళలను తరలించారు. వారికి మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద భోజనాలు అందిస్తారని చెప్పారు. వారు అక్కడికి మధ్యాహ్నం వేళ చేరారు. అక్కడ నారాయణ పంపిన బస్సుల్లోని వారికి భోజనాలు అందలేదు. సాయంత్రం 4 దాటినా భోజనం పెట్టలేదు. బస్సుల్లో ఉన్న మహిళలు ఆకలికి తట్టుకోలేకపోవడంతో వారితో వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలు గుండ్లాపల్లి సమీపంలో బస్సులు నిలిపి స్థానికంగా ఉన్న ధాబాల వద్ద వారికి భోజనం పెట్టించి వెనక్కి తీసుకువెళ్లారు. మీటింగ్‌కు వెళ్లరా.. అని ద్వితీయ శ్రేణి నాయకులను అడగ్గా.. మీటింగ్ సంగతి ఎత్తితే మహిళలు కొట్టేలా ఉన్నారని, తెలిపారు. మీటింగ్‌కు వెళ్లడానికి డబ్బులు ఇచ్చారా... అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. -
కలిసొచ్చిన కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ శంఖారావానికి భారీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే ఊపులో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా... నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభ కృష్ణా జలాల అంశంపైనే కాగా, కరీంనగర్ సభను మాత్రం ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమనే వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నికల సభలను కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కలిసొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఇందుకు మరోసారి వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు సంబంధించి సన్నాహక సమావేశం శుక్రవారం జరగ్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ యంత్రాంగంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నా యకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించగా, ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. కాగా కరీంనగర్లో బీఆర్ ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, నాయకులపై కేసులు నమోదు అంశంపైన కూడా శుక్రవారం నాటి సమా వేశంలో చర్చ జరిగింది. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారికి భరోసా ఇవ్వడం పైనా... బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్క ర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్‌లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గంగుల కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కూడా శుక్రవారం గ్రౌండ్స్‌కు వెళ్లి పరిశీలించారు. ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌కు తరలివస్తారని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్‌ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్‌గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్‌చెరులోని పటేల్‌గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్‌హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్‌హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్‌లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్‌హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్‌లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
జెండా సభలో జనం లేక ‘జంట’ షాక్
సాక్షి, అమరావతి: రహస్య అజెండాతో ఐదేళ్లుగా ముసుగులో గుద్దులాట.. బేరసారాల అనంతరం ప్రకటించిన టీడీపీ – జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోనే బెడిసికొట్టింది! పొత్తులు కుదిరాక తొలిసారిగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా సభ’ జనం లేక వెలవెలబోయింది. పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, కేడర్ ఈ సభను బహిష్కరించి దూరంగా ఉండటం గమనార్హం. ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు ఐదారు లక్షల మంది తరలివస్తారంటూ రెండు పార్టీల అగ్రనేతలు ఎంతో నమ్మకం పెట్టుకోగా కేవలం 40 వేల నుంచి 50 వేల మంది లోపే హాజరైనట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనం లేక సభా ప్రాంగణం కళ తప్పడంతో ఇరు పక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడారు. తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన వారిద్దరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా సీఎం జగన్‌పై పోటీ పడి దూషణలకు దిగడం ఇరు పక్షాల శ్రేణులను విస్మయానికి గురి చేసింది. ‘గూడెం’ దెబ్బకు గుండె గుభేల్ ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభే అట్టర్ ప్లాప్ కావడంతో టీడీపీ–జనసైన శ్రేణులు నైతిక స్థైరాన్ని కోల్పోయాయి. దీంతో ఎన్నికలకు ముందే కాడి పారేసే దిశగా కదులుతున్నాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతోపాటు ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ఘన విజయం ఖాయమని జీ న్యూస్ మ్యాటరైజ్, జనాధార్ ఇండియా, టైమ్స్ నౌ లాంటి డజనకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహంతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. పొత్తు ఆదిలోనే ‘చిత్తు’.. పొత్తులో భాగంగా 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలను జనసేనకు కేటాయించాక కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో సభను నిర్వహించడం ద్వారా బలం చాటుకోవాలని తాడేపల్లిగూడెంను వేదికగా ఎంచుకున్నారు. అయితే అవకాశవాద పొత్తును ప్రజలు ఆదిలోనే చిత్తు చేశారనేందుకు ఆ సభ వెలవెలబోవడమే నిదర్శనమని పేర్కొంటున్నారు. 2014లో జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు నష్టం జరుగుతుందని చంద్రబాబు వారించడంతో పోటీకి దూరంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. నాడు టీడీపీ–బీజేపీ కూటమిలో చేరి చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి నుంచి వేరుపడ్డ పవన్ బీఎస్పీ–సీపీఐతో జతకట్టి పోటీ చేశారు. ఇప్పుడు చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా మళ్లీ టీడీపీతో జత కలిశారు. వీటిని పరిశీలిస్తున్న ప్రజలు చంద్రబాబు కోసం.. చంద్రబాబు చేత.. చంద్రబాబే ఏర్పాటు చేయించిన పార్టీ జనసేన అని భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణుల దూకుడు..: సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తూ సీఎం జగన్ ‘సిద్ధం’ సభలను తొలుత భీమిలిలో ఆ తర్వాత దెందులూరులో నిర్వహించారు. ఆ రెండు సభలకు సముద్రాన్ని తలపించే రీతిలో జనం కదలి వచ్చారు. ఇక ఈనెల 18న రాప్తాడులో నిర్వహించిన మూడో ‘సిద్ధం’ సభకు 10–11 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచిపోయింది. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీకగా రాప్తాడు సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేయడం, పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లను పారదర్శకంగా అందించడం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తేవడంతో సీఎం జగన్‌పై విశ్వాసం ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నాడిని గుర్తించేందుకు పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ♦ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 0–1 స్థానంలో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని టైమ్స్‌నౌ సర్వే తేల్చింది. ♦ రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకుగానూ 19 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ విజయభేరీ మోగిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితం అవుతుందని జీన్యూస్ మ్యాటరైజ్ సర్వే స్పష్టం చేసింది. ♦ 49.2 శాతం ఓట్లతో 125 శాసనసభ, 17 లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 46.3 శాతం ఓట్లతో 50 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని జనాధార్ ఇండియా సర్వే వెల్లడించింది. 62 శాతం మంది ప్రజలు సీఎం వైఎస్ జగన్ పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. -
నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభ.. లక్షల్లో గొప్పలు.. వేలుదాటని కుర్చీలు
సాక్షి, అమరావతి: పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా ప్రత్తిపాడు వద్ద నేడు తలపెట్టిన తొలి సభను జనవాణినితో ఉప్పొంగిన ‘సిద్ధం’ సభలతో పోలుస్తూ చంకలు గుద్దుకుంటోంది. చంద్రబాబు – పవన్ కోసం రెండు హెలిప్యాడ్లు, సేద తీరడం కోసం సభా ప్రాంగణంలో సగం స్థలంలో ఏర్పాట్లు చేశారని, అక్కడి మైదానంలో వేల మంది మాత్రమే కూర్చునే వీలుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమరనాదంతో వైఎస్సార్సీపీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జన సముద్రాలను తలపించాయి. మార్మోగుతున్న రణ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వతేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. సీఎం జగన్ సమర శంఖం పూరించిన ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద నిర్వహించారు. వేదికపోనూ కార్యకర్తలు, అభిమానులు కూర్చొని సభను వీక్షించడానికి 110 ఎకరాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6 – 7 లక్షల మందికిపైగా ఈ సభకు తరలివచ్చారు. ఇక రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసానికి ‘సిద్ధం’ సభలు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. స్థైర్యం నింపేందుకు పాట్లు... జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఎల్లో మీడియా తంటాలు పడుతోంది. మొత్తం 33 వేల కుర్చీలు టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌ల నిర్మాణానికి ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంటే 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు పట్టే అవకాశం ఉంది. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్రమే హాజరయ్యే సభలను జన సముద్రాలతో పోల్చడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభకు ఓ నమస్కారం! సాక్షి, భీమవరం: టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలిసభ ‘తెలుగు జనజెండా’కు అసమ్మతి సెగ తగిలింది. పొత్తుల పేరుతో 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు, శ్రేణులు ఈ సభకు ముఖం చాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సభా ప్రాంగణం, ఏర్పాట్ల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద తణుకు నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు నిరసన గళం వినిపించారు. తణుకులో ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పిలవకపోవడంతో ఆయన వర్గీయులు హాజరు కాలేదు. కొత్తపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, ఆయన అనుచరులు డుమ్మా కొట్టారు. మండపేటలో ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడంపై జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ గుర్రుగా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటు కందుల దుర్గేష్‌కు సీటు కేటాయించపోవడంతో సభకు దూరంగా ఉండాలని ఆయన వర్గం భావిస్తున్నట్లు సమాచారం. -
LIVE: మేము సిద్ధం..మా పోలింగ్ బూత్ సిద్ధం
-
జగన్ మామ.. జగన్ మామ పాటకు.. పరవశించిన రాప్తాడు సభ
-
నవ చరిత్రకు రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/రాప్తాడు: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఓ వైపు ప్రజాబలమే గీటు రాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరో వైపు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 65 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలిలో గత నెల 27న, ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించి ఈనెల 3న ఏలూరులో ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించారు. భీమిలి సభకు సముద్రపు కెరటాలతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం పోటెత్తితే.. ఏలూరు సభకు ఉత్తర కోస్తా ప్రజలు కడలిలా కదలివచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా మూడో సభను ఆదివారం అనంతపురానికి సమీపంలో రాప్తాడు వద్ద నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. పొత్తులు తేలక ప్రతిపక్ష పార్టీల సభలు వెలవెలబోతున్నాయి. సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి శనివారం పరిశీలించారు. సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుందని, రాయలసీమలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి వేర్వేరుగా ఈ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారే తప్ప తాము రాష్ట్రానికి ఇది చేశామని చెప్పుకోలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమీ ఉండబోదని తేల్చిచెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రజలందరూ జగనన్నకు తోడుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ, శింగనమల సమన్వయకర్తలు విశ్వేశ్వర రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల తదితరులు పాల్గొన్నారు. -
నేడు నల్లగొండలో కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేర బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సభకు ప్రాధాన్యం గత ఏడాది డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ నేతలతో నందినగర్ నివాసంలో, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయిన కేసీఆర్, ఇప్పటివరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అదేరోజు తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా, కేసీఆర్ వాటికి దూరంగా ఉన్నారు. కానీ నల్లగొండ సభలో కేసీఆర్ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణభవన్ నుంచి నల్లగొండ సభకు పార్టీ ముఖ్య నేతలు తెలంగాణభవన్ నుంచి బయలుదేరేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరవుతారు. కేటీఆర్ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళతారు. కేసీఆర్ మాత్రం హెలికాప్టర్ ద్వారా నల్లగొండకు చేరుకొని, సభ అనంతరం తిరిగి వాయుమార్గాన హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నల్లగొండసభకు కీలక నేతలు హాజరు కావడం ద్వారా ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
సంగివలసలో సమరోత్సాహం
సాక్షి, విశాఖపట్నం: పెత్తందారులపై పేదల తరఫున పోరాటానికి సిద్ధమంటూ వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. గుంపులుగా వస్తున్న జెండాలు, పెత్తందారుల అజెండాలపై యుద్ధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినిపించిన రణన్నినాదంతో భీమిలి నియోజకవర్గం సంగివలస సభా ప్రాంగణం జయహో జగన్ అంటూ ఉప్పెనలా ప్రతిధ్వనించింది. బంగాళాఖాతానికి ఎనిమిది కిలోమీటర్లలో దూరంలో ఉన్న ఆ ప్రాంతం శనివారం జన సాగరాన్ని తలపించింది. జై జగన్.. వైనాట్ 175 నినాదాలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. సీఎం జగన్మోహన్రెడ్డి కార్యకర్తల చెంతకు వచ్చి వారికి అభివాదం చేస్తూ.. వారితో మమేకమై మనమంతా ఒకటిగా రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామంటూ ఇచ్చిన పిలుపునకు ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఎగసిపడింది. కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం చూస్తే.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఖాయమని శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాబోయే ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన ‘సిద్ధం’ సభ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. కౌరవ సైన్యంపై యుద్ధానికి మేము సైతం.. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. అంటూ కార్యకర్తల్ని తనతో పాటు సమర సన్నద్ధం చేశారు. జగనన్న వెంటే.. మా పయనమని.. యుద్ధానికి సిద్ధమంటూ అధినేతతో లక్షల గొంతులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి. కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్న జగనన్న రథసారథిగా.. ఆయనతో కలిసి సాగేందుకు కోట్లమంది కార్యకర్తలు ‘సిద్ధం’’గా ఉన్నామంటూ సంగివలస సభ చాటిచెప్పింది. దాదాపు గంటకు పైగా సాగిన అధినేత ప్రసంగం.. వేదికపై ఉన్న నాయకుల్లోనే కాదు.. తరలివచ్చిన లక్షలాది మంది పార్టీ కుటుంబ సభ్యుల్లోనూ ఎన్నికల సమరోత్సాహాన్ని నింపింది. వైఎస్ జగన్ ప్రసంగం వింటూ మైమరచిపోయిన కార్యకర్తలు.. ఇక తగ్గేదేలే.. మళ్లీ సీఎం కుర్చీపై జగనన్నని కూర్చోబెట్టేదాక శ్రమిస్తామంటూ నినదించారు. చంద్రబాబు అండ్ కోకి ఉన్నట్లుగా మనకు దుష్టచతుష్టయం లేదని.. ప్రతి ఒక్కరి దగ్గరా ఉన్న సెల్‌ఫోనే మన ఆయుధమంటూ జగన్ చెప్పిన వెంటనే పార్టీ కార్యకర్తలంతా సెల్‌ఫోన్ బయటకు తీసి జగన్‌కు చూపించారు. దుర్మార్గులపై పోరుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ అధినేత పిడికిలి బిగించగానే.. లక్షలాది మంది పార్టీ శ్రేణులు పిడికిలి బిగిస్తూ మద్దతు పలికారు. పార్టీ శ్రేణులే కాదు.. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తాము కూడా సిద్ధమంటూ చేతులు పైకెత్తి నినదించారు. తరలివచ్చిన ఉత్తరాంధ్ర పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించిన దానికంటే లక్షల్లో కార్యకర్తలు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి జనాల్ని నట్టేట ముంచిన చంద్రబాబు మార్కు రాజకీయాల్ని ఎండగట్టిన వైఎస్ జగన్.. ఈ 56 నెలల పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె, మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఇది తమ బాధ్యతంటూ కార్యకర్తలు నినదించగా సభా స్థలి హోరెత్తింది. ఏ గ్రామానికి వెళ్లినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని.. ఇది జగనన్న పాలన అని ప్రజలకు చెప్పాలంటూ అధినేత చేసిన ప్రసంగానికి ముగ్ధులైన శ్రేణులు జోష్‌లో మునిగిపోయారు. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ప్రసంగం మొదలవుతుందని తెలిసినా.. ఉదయం 10 గంటల నుంచే సభా స్థలికి పార్టీ శ్రేణులు క్యూ కట్టాయి. రాత్రి 7 గంటల వరకూ ఏ ఒక్కరూ సంగివలస నుంచి బయటకు వెళ్లకుండా ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. సభా ప్రాంగణంపై నుంచే హెలిప్యాడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు జై జగన్ అంటూ నినదించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి అభివాదం చేయగానే.. సభా స్థలి దద్దరిల్లింది. సభాస్థలికి చేరుకోలేక వందలాది బస్సుల్లో వేల మంది పార్టీ శ్రేణులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. మరికొందరు బస్సుల్లోనే జగన్ ప్రసంగాన్ని వింటూ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ వేదిక నుంచి నేరుగా కార్యకర్తల మధ్యలోకి వచ్చి అభివాదం చేసేలా నిర్మించిన ర్యాంప్.. శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 5 నిమిషాల పాటు ప్రతి కార్యకర్తకూ అభివాదం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ.. ర్యాంప్‌పై వైఎస్ జగన్ ముందుకు సాగారు. తమ వద్దకు వచ్చి పలకరించిన అధినేతని చూసిన ప్రతి కార్యకర్త మురిసిపోయాడు. జగనన్నా అంటూ పలకరిస్తూ.. జై జగన్ అని నినదించారు. ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ ప్రత్యేకంగా అవసరం లేదనీ.. ప్రతి లబ్ధిదారుడితో పాటు తామూ స్టార్ క్యాంపెయినర్లుగా మారుతామంటూ అధినేతకు శ్రేణులు హామీ ఇచ్చాయి. ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావానికి తరలి వచ్చిన అశేష జనవాహిని చూసి ఇప్పటికే ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టింది. ఇకపై వైఎస్సార్సీపీ కుటుంబం గురించి మాట్లాడాలంటే సంగివలస సభ గుర్తుకు తెచ్చుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో. ప్రతి కార్యకర్తకు జగన్ భరోసా ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. – కంబాల జోగులు, ఎమ్మెల్యే, పాయకరావుపేట జగనన్న పవర్ చూపించాం సంగివలసలో మోగిన ఎన్నికల నగారాతో.. ప్రతిపక్ష పార్టీల ఓటమి ఖరారైపోయింది. రాబోయే ఎన్నికలకు ఉత్తరాంధ్ర నుంచి మేం సిద్ధమంటూ సభతో స్పష్టం చేశాం. జగనన్న పవర్ ఏంటో చూపించాం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లేందుకు ఇదో గొప్ప సభ. పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకుల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల జోష్ నింపారు. ఇదే స్ఫూర్తితో ఈ 70 రోజులూ సైన్యంలా పనిచేస్తాం. – కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త, నెడ్ క్యాప్ చైర్మన్ భీమిలి సభ అద్భుతం ఇలాంటి సభ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో చెప్పలేం. ఇలాంటి సభ మళ్లీ నిర్వహించాలంటే అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన సభ ఇది. కేడర్‌కు మరింత ఉత్తేజాన్నిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన దిశా నిర్దేశం నాయకుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వైఎస్సార్సీపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారన్నదానిపై జగన్మోహన్రెడ్డి చెప్పిన విధానం కార్యకర్తలకు ఒక గైడ్ లాంటిది. దీన్ని అనుసరించి ప్రజల్లోకి మరింత వెళ్తాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ ఎన్నికల జోష్ వచ్చేసింది సభ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఎన్నికల జోష్ వచ్చేసింది. సిద్ధం.. సిద్ధం.. అంటూ కార్యకర్తలంతా స్పందించారు. జగన్ చేసిన ప్రసంగం కేడర్ని ఆలోచింపజేసింది. ఆయన దిశానిర్దేశంతో ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు దోహదపడనుంది. రానున్న ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధిస్తాం.– రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యే సంగివలస సభ సూపర్ సక్సెస్ సంగివలసలో సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు రవాణా ఏర్పాట్లు సరిపోక సభకు రాలేకపోయారు. కేవలం క్యాడర్ వస్తేనే ఇంత స్పందన ఉందంటే ఇక ప్రజలందరినీ తీసుకొస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని చెప్పడానికి సంగివలస సమావేశం నిదర్శనం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే -
ప్రతిపక్షాలవి నక్కజిత్తుల రాజకీయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. పంచుతున్నాడంటున్నారే గానీ.. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్మోహన్రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్‌విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు చెడు తలపెట్టాలని కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం జగన్‌ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం. – భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్ పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
ఏయూపై ఎల్లో మీడియా విషం
విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంపై పచ్చ మీడియా విషం కక్కుతోంది. వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం ఇవ్వలేదన్న అక్కసుతో అసత్య కథనాన్ని ప్రచురించింది. ఆ మైదానంలో ఆదివారం వరకు ఆర్గానిక్ మేళా జరిగిన విషయం, దాని కోసం వేసిన భారీ టెంట్లు, షెడ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. కళ్లున్న కబోదిలా విషపు రాతలు రాసింది. విఖ్యాత విద్యా సంస్థ ఆంధ్రా యూనివర్శిటీకి రాజకీయాలను ముడిపెడుతూ అవాస్తవాలు రాసిన పచ్చపత్రికపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానిక్ మేళా కారణంగా.. లోకేశ్ పాదయాత్ర ముగింపు సభను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించడానికి అనుమతి కోరారు. అయితే ఆ మైదానంలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు సేంద్రీయ రైతులు, ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ మేళా నిర్వహించారు. దీని కోసం ఏయూ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఈ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం రాత్రి మేళా ముగిసింది. ఇప్పటికీ మైదానంలో వేసిన టెంట్లు, షెడ్లు, ఇతర సామగ్రి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బుధవారం భారీ బహిరంగ సభ కోసం మైదానం కేటాయించాలని టీడీపీ నాయకులు కోరారు. ఆర్గానిక్ మేళా టెంట్లు, సామగ్రి తొలగించడానికి మరికొంత సమయం పడుతుంది. టీడీపీ సభకు వేదిక, ఇతర ఏర్పాట్లకు కనీసం నాలుగు రోజుల ముందే మైదానాన్ని అప్పగించాలి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సభకు మైదానం కేటాయించడం సాధ్యం కాదని ఏయూ అధికారులు టీడీపీ నాయకులకు సమాధానమిచ్చారు. ఆ విషయాన్ని వారు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ, పచ్చ పత్రిక మాత్రం లోకేశ్ సభకు మైదానం కేటాయించలేదన్న అక్కసుతో తప్పుడు రాతలు రాసింది. అసలు విషయాన్ని వక్రీకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే మైదానం ఇవ్వలేదని ఏయూపైన, వైస్ చాన్సలర్పైనా అవాస్తవాలను ప్రచురించింది. ఏయూ వీసీ, ప్రొఫెసర్లు వైసీపీ ప్రతినిధులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఏయూ సొమ్ము వాడుకున్నది చంద్రబాబే.. వాస్తవానికి ఆంధ్రా యూనివర్శిటీ సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్న ఘనుడు చంద్రబాబే. 2018లో జ్ఞానభేరి పేరుతో చంద్రబాబు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. ఈ సమయంలో సొంత డబ్బా కొట్టుకోడానికి ఆంధ్రా యూనివర్శిటీ నిధులు రూ.6 కోట్లు వాడుకున్నారు. ఆయన సొంత ప్రచారం కోసం ఏయూ సొమ్ముని, మైదానాలను వాడుకున్న విషయాన్ని పచ్చ పత్రిక ప్రశ్నించదు. కానీ, అనివార్య కారణాల వల్ల మైదానం కేటాయించలేదన్న అక్కసుతో పిచ్చి రాతలు రాయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేడు హైదరాబాద్‌కు నడ్డా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల విజయ సంకల్పసభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగసభలు, రోడ్‌షోలలో ఆయన పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా నారాయణపేటకు చేరుకుని ఒంటిగంట నుంచి రెండుగంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్‌షోలలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. కాగా, సోమవా రం (20న) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. -
బీఆర్ఎస్కు వీఆర్ఎస్
2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా కుటుంబ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ పార్టీ రెండు తరాల 2జీ.. ఓవైసీ పార్టీ మూడు తరాల 3జీ. కాంగ్రెస్ పార్టీ 4జీ.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, ఇప్పుడు రాహుల్‌గాంధీ. ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. చందమామపైకి చంద్రయాన్‌ను తీసుకెళ్లిన మోదీకి అవకాశం ఇవ్వాలి. అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అక్రమాలు, ఆక్రమణలు, కుంభకోణాల రాష్ట్రంగా తయారు చేసింది. బీఆర్ఎస్ అంటేనే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డులో రూ.3,300 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపి జైలుకు పంపడం ఖాయం. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, వరంగల్: తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని.. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పంచుతామని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శనివారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నల్లగొండ జిల్లా కేంద్రం, వరంగల్‌లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అబద్ధాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేదు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు రూ.3 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారింది. దళితబంధు పథకం పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా, కేసీఆర్ మోసపూరిత అబద్ధాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించాలి. కమలం గుర్తుపై బటన్ నొక్కి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం తెలంగాణలో 52 శాతం ఓబీసీలే. 135 బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలు. అవి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశాయి. బీసీల గురించి ఆలోచించే బీజేపీ ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో తన కుమారుడిని సీఎం చేయాలని కేసీఆర్ చూస్తుంటే.. కేంద్రంలో తన కుమారుడిని ప్రధానిని చేయాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు. అదే బీజేపీ అధికారంలోకి వస్తే మా బిడ్డలో, కొడుకులో, బంధువులో సీఎం, ప్రధాని కారు. ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం చేస్తాం. తెలంగాణ బడ్జెట్లో బీఆర్ఎస్ సర్కారు ఎంబీసీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి.. రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేంద్రంలోని ప్రధాని మోదీ కేబినెట్లో 27మంది బీసీ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ కూడా బీసీయే. ఈ ఘనత బీజేపీకే దక్కుతుంది. జాతీయ బీసీ కమిషన్‌కు సర్వాధికారాలు ఇచ్చాం. సవరణ చేయడానికి రాష్ట్రాలకు హక్కు కల్పించాం. జాతీయ స్థాయిలో జరిగే ఎంబీబీఎస్ పరీక్షల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్ ఇచి్చన ఘనత బీజేపీదే. పేపర్ లీకేజీలతో యువత జీవితాలు నాశనం బీఆర్ఎస్ సర్కారు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో యువత జీవితాలను నాశనం చేసింది. పేపర్ లీకేజీల వల్ల ప్రవళిక, రహ్మత్ల ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పారదర్శకంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం కాంగ్రెస్ 70 ఏళ్లుగా అయోధ్య రామమందిర నిర్మాణ విషయాన్ని వివాదాస్పదం చేసింది. కానీ మోదీ రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 22న మందిరాన్ని ప్రారంభిస్తాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం..’’ అని అమిత్‌షా ప్రకటించారు. ఈ సభల్లో సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్ కాళీప్రసాద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పాలి: డీకే అరుణ ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నాయకుడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అన్ని వర్గాలను మోసం చేసి, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు గుణపాఠం చెబితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. కారు స్టీరింగ్ ఒవైసీల చేతుల్లో.. నిజాం పాలన నుంచి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణకు స్వేచ్ఛ ప్రసాదిస్తే.. సీఎం కేసీఆర్ ఒవైíసీకి లొంగిపోయి విమోచన దినోత్సవం చేయడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని రాష్ట్ర అవతరణ దినంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ గుర్తు కారు అయినా.. దాని స్టీరింగ్ ఒవైసి చేతుల్లో ఉంది. ముస్లింలను సంతోషపెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. భద్రాచలంలో రాములవారికి సీఎం పట్టువ్రస్తాలు సమర్పించే ఆనవాయితీని మరిచిపోయారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ వస్తే వాటిని రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. వాల్మికుల సమస్యలను కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే వారి సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణ అభివృద్ధికి ఐదు లక్షల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ సర్కారు ఉమ్మడి ఏపీకి రూ.2లక్షల కోట్లు ఇస్తే.. తర్వాతి తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది. తెలంగాణలో హైవేల అభివృద్ధికి, సమ్మక్క–సారలమ్మ జాతర, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు, వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్లలతోపాటు ఇతర అభివృద్ధి పనులు కలిపితే రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంజీఎంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్‌లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో రోడ్‌షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్‌షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్‌షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్‌లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్‌రావుల రోడ్‌షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. వార్‌రూమ్‌లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్‌లోని సెంట్రల్ వార్‌రూమ్‌తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్‌రూమ్‌లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
బీసీ గర్జన సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
నేడే మోదీ బీసీ గర్జన సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు.. నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. గంటన్నర పాటు పర్యటన ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
దేశంలో సామాజిక సాధికారత సాధించిన తొలి సీఎం జగన్
అవనిగడ్డ: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసి సామాజిక సాధికారత సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ పేదలకు ఉన్నతస్థాయి విద్య, వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. ప్రతి పేద పిల్లవాడికి ఫీజుల నుంచి చదువుకోవడానికి అవసరమైన అన్ని వనరులు సీఎం జగన్ సమకూరుస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, వందల కోట్లు తీసుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో చంద్రబాబు బీసీల తోక కట్ చేస్తానని అన్నారని, ఎస్సీల్లో పుడతారని ఎవరు కోరుకుంటారని హీనంగా మాట్లాడారన్నారు. 2019 ఎన్నికల్లో ఆ బీసీలు, ఎస్సీలే చంద్రబాబు తోక కట్‌చేశారని చెప్పారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకే పవన్‌కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా యాదవులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారన్నారు. పౌష్టికాహారం సూచీలో 24వ స్థానం నుంచి 8వ స్థానానికి తెచ్చారని, పేదరికాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్‌దే అని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో ఎందరో మేధావులు సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా సాధ్యం కాలేదని, ముఖ్యమంత్రి వైస్ జగన్ దానిని సాధ్యం చేసి చూపించారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం, లక్షలాది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్ధలాలు, నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాలను ఆధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారని, సీఎం జగన్ సమూలంగా ప్రక్షాళన చేసి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్య, అత్యాధునిక వైద్యం, అవినీతి రహిత సంక్షేమం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. మాజీ సీఎం చంద్రబాబు పేదల ఇళ్లలో దీపాలు ఆర్పే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నో అవమానాలకు గురిచేసి, జైలుకి పంపించారని, అదే వర్గాలను సీఎం జగన్ అక్కున చేర్చుకొని, పార్లమెంట్‌కు పంపించారని చెప్పారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు రాకుండా కోర్టుల ద్వారా అడ్డుపడిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. సీఎం జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారన్నారు. గతంలో చాలా మంది నాయకులు పేదరికాన్ని తగ్గిస్తామని మాటలే చెప్పారని, సీఎం జగన్ దానిని ఆచరణలో చేసి చూపించారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. సీఎం జగన్ రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలను బలోపేతం చేశారని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినప్పటికీ, బీసీ అయిన తనకు ఆ సీటు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతకు అసలైన అర్ధం చెప్పారని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చెప్పారు. 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చెప్పింది చేసే ఏకైక సీఎం జగన్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): చెప్పింది చేసే ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇచ్చి న మాట ప్రకారం బేడ (బుడ్గ) జంగాలను ఎస్సీ కులాల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సాహసోపేతమైన నిర్ణయం అని బేడ (బుడ్గ) జంగాల నేతలు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్‌కు బేడ (బుడ్గ) జంగాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత కోసం ఆలోచన చేసే ఏకైక సీఎం జగన్ అన్నారు. సంచార జాతులైన బేడ (బుడ్గ) జంగం కులాలకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మంచి చేశారని, తరువాత వచ్చి న ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. మళ్లీ సీఎం జగన్ వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. పెత్తందార్ల వ్యవస్థను చంద్రబాబు ప్రోత్సహిస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ నావాళ్లే అనుకునే నాయకుడు సీఎం జగన్ అన్నారు. పేదలు ఏ కులంలో ఉన్నా వారికి మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. మా కళను గుర్తించాలి ఏపీ రాష్ట్ర బేడ (బుడ్గ) జంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై పార్లమెంట్లో కూడా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కులాల్లోని కళను గుర్తించి గుమ్మెట తంబూర కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని, శ్రీశైలంలో తమ సామాజికవర్గీయుల అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని కోరారు. పేదల పక్షాన ఈ ప్రభుత్వం: సజ్జల సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లలో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మేలు చేసిందని చెప్పారు. ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అయితే.. అట్టడుగు వర్గాల ప్రజల కోసమే రాజకీయం అన్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నారు. తండ్రి బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని, ఆయన వద్ద చేయిచాచాల్సిన పని లేదని, హక్కుగా ఆయన దగ్గరకు రావచ్చన్నారు. గతంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేలా ఏర్పాటు చేశారని అన్నారు. రోగాల పేరుతో జైలు నుంచి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు వెనుక పెత్తందార్లు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు మాట్లాడారు. బీజెహెచ్పీఎస్ వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షత వహించిన ఈ సభలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి న బేడ, బుడ్గ, జంగం కులాల నాయకులు పాల్గొన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఇప్పుడే వెలుగులు చూస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం బాపట్ల అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును వివరించారు. ఈ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేకూర్చారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బడుగు, బలహీనవర్గాలు సగర్వంగా సామాజిక సాధికార యాత్ర చేసే అవకాశం కల్పించారని తెలిపారు. కేబినేట్లో 15 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో భాగాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి లేరని అన్నారు. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకునే వారని, ఈ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభ సభ్యులను చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోందని వివరించారు. మోషేన్ రాజును శాసన మండలి చైర్మన్‌ను చేశారన్నారు. నెట్లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చంటున్న పవన్ కళ్యాణ్.. అతని పిల్లలకూ అలానే నేర్పుతారా అంటూ నిలదీశారు. ఈ యాత్రను లోకేశ్ గాలియాత్ర అంటున్నారని, ఇది గాలియాత్ర కాదని, ప్రజా వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ కోపై దండయాత్ర అని చెప్పారు. సాధికార యాత్రకు జనం లేరని రాధాకృష్ణ, రామోజీ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే వచ్చి ఈ యాత్రలకు ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూడాలని సవాల్ చేశారు. జగన్ కటవుట్ చూస్తేనే జనం ఇలా వస్తే.. జగనే స్వయంగా వస్తే బాపట్ల పట్టుద్దా అని అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి: ఎంపీ మోపిదేవి వైఎస్ జగన్ పాలనలో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి పొందిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు లభించాయని చెప్పారు. జగనన్న పాలనలో మహిళా ఆర్థికాభివృద్ధి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా సాధికారిత జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. భువనేశ్వరి ఏనాడూ మహిళల కోసం బయటకు రాలేదని, ఈ రోజు అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం బయటకు వచ్చి డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే కోన రఘుపతి రాష్ట్రంలో వైఎస్ జగన్ అందిస్తున్న పరిపాలన దేశానికే రోల్‌మోడల్‌గా ఉందని, దేశం మొత్తం మనవైపే చూస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెపాపరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి జగనన్న ఆలోచిస్తున్నారన్నారు. పేదల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. మనకు జిల్లాను ఇచి్చనందుకు, మెడికల్ కళాశాల ఇచ్చినందుకు తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు. జగనన్నతోనే పేదల అభ్యున్నతి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేద పిల్లల ఉచిత చదువుల కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం కోసం, రైతు భరోసా కోసం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనుడు జగనన్న అని చెప్పారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అవహేళన చేస్తే.. వైఎస్ జగనన్న ఎస్సీలు మేనమామలని అన్నారని గుర్తు చేశారు. అమరావతి భూములతో చంద్రబాబు అవినీతి చేస్తే, ఆ భూములను పేదలకు పంచిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు రూ.370 కోట్లు కాజేస్తే అది చిన్న అమౌంటేనని పవన్ చెప్పడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఎస్సీ, బీసీలను దొంగలని జైల్లో పెడితే జగనన్న ఢిల్లీలో కూర్చొపెట్టారని చెప్పారు. వైఎస్ జగన్‌కు భయం పరిచయం చేస్తానని లోకేశ్ అంటున్నాడని, సోనియా గాంధీకే ఆయన భయపడలేదని, పిల్లకుంక లోకేశ్ ఎంత అని ఎద్దేవా చేశారు. -
వైఎస్సార్సీపీ పాలనలోనే సాధికారత
తెనాలి (పట్నంబజారు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకు సంక్షేమాన్ని తీసుకెళ్లారని మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కేవలం ఒక సామాజిక వర్గం, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే పాలన అందించారని మంత్రి సురేష్ తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాల పేదలకు పరిపాలనను చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎన్ని దాడులు చేసిందో అందరికీ అనుభవమేనన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి లేని పాలన, సమర్థవంతమైన నాయకత్వం నాలుగు స్థంభాలుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. 70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారని తెలిపారు. సామాజిక సాధికారత కోసం తాము యాత్ర చేస్తుంటే రిమాండ్ ఖైదీ కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షపాత పార్టీ అని మంత్రి జోగి రమేష్ చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో చేసింది చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను చేస్తున్న దమ్మున్న నేత సీఎం జగన్ అని అన్నారు. ఇప్పటివరకు రూ.2.31 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు. 2019లో ఓటు వేయని వారు కూడా వైఎస్ జగన్ పరిపాలన చూసి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. సినిమాల్లో హీరోగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌గా మారిపోయారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌ను తట్టుకోలేక టీడీపీ, జనసేన భూస్థాపితం కావడం తథ్యమన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన చేర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న రావడానికి ముందు అన్నీ స్కామ్‌లేనని, జగనన్న వచ్చాక అన్నీ స్కీములేనని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. టీడీపీ మైనార్టీలకు చేసింది ఏమిలేదని చెప్పారు. మాయమాటలతో బీసీల ఓట్లు వేయించుకునే రాజకీయాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లు చీటి రాశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. జన్మభూమి అనే పనికిమాలిన కమిటీల ద్వారా టీడీపీ సిగ్గుమాలిన పాలన చేసిందని, అందుకు భిన్నంగా పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, ఇంకా చేస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అంబేడ్కర్ భావజాలాన్ని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. సీఎం జగన్ బీసీ సాధికారతను చేతల్లో చూపించారని మాజీ ఎంపీ బుట్ట రేణుక తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రూ.1,800 కోట్ల తో సంక్షేమం, అబివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. దేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు రోశయ్య, షేక్ మహ్మాద్ ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు. సామాజిక సాధికార రణభేరి ఇది తెనాలి: దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సామా జిక న్యాయాన్ని నెలకొల్పారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తలెత్తుకొని తిరిగేలా చేశారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలు, జెండాలు, అజెండాలు లేకుండా అందరం మనసున్న జగనన్న బాటలోనే నడుస్తామని చెప్పారు. ఇది సామాజిక సాధికార రణభేరి అని, సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి జరిగింది కాబట్టే, సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించమని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. కొలకలూరు బాపయ్యపేట వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడే కుండల తయారీలో ఉన్న శాలివాహనులను పలకరించిన అనంతరం మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికేంద్రీకరణ మంత్రంతో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సాధికారత చేకూరిన విధానాన్ని ప్రజలకు వివరించి, వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను ధైర్యంగా కోరతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, ముస్తాఫా, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి పాల్గొన్నారు. -
నేడు మరో మూడు కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మరో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబా బాద్ సభకు వస్తారు. అనంతరం వరంగల్ నగరం భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా పరిధిలోని సభల ఏర్పాట్లను గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్, శంకర్‌నాయక్ తదితరులు పరిశీలించారు. -
ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. భలే మంచి ఆదాయ మార్గం.. ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట. ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం. గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు. రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి. పార్టీలకు కూడా సౌలభ్యమే.. పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది. -
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్‌బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్‌కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
బీఎస్పీకి అధికారం ఖాయం
సాక్షి, హైదరాబాద్, గన్‌పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్‌లోకి అమిత్ షా సభ
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రాను న్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ఇటీవలే అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన ఖరారవగా ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సభ ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ టూర్ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. -
10న ఆదిలాబాద్‌లో అమిత్ షా సభ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. 10న రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్‌లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. మేధావుల సదస్సు సక్సెస్‌పై ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్‌తోపాటు ఇతర మేధావులతో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్ సభలో అమిత్ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు. ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు. -
కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రికెట్లో వెస్టిండీస్ టీం మాదిరిగా తయారైందని.. ఒకప్పుడు వరల్డ్‌కప్ గెలిచిన ఆ టీం ఇప్పుడు ఇదే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కూడా కాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా క్వాలిఫై కాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని.. బీజేపీ డకౌట్ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో హరీశ్‌రావు పర్యటించారు. ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబి్ధదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు ప్రసంగించారు. రాష్ట్రంలో 30 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం తాగునీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం కోసం అమలుకు వీలు కాని హామీలను ఇస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. హంగ్ కాదు.. హ్యాట్రిక్... బీజేపీ తీరును కూడా మంత్రి హరీశ్ తూర్పారబట్టారు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణలో హంగ్ రాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో గెలువలేని జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరం’ముంపునకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్‌రావు హామీనిచ్చారు. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ప్రాణహిత, గోదావరి వరదలతో నష్టపోకుండా సర్వే చేయిస్తామని చెప్పారు. వరద ముంపు సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్‌రావుకు బాల్క సుమన్ వేదికపైనే పాదాభివందనం చేశారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది కాంగ్రెస్ గురించి రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని హరీశ్‌రావు అన్నారు. టీడీపీలో ఉండి సోనియాగాం«దీని బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అని పొగుడుతున్నాడని విమర్శించారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుల గుర్తుతో పార్టీ పెట్టీ బీజేపీలో చేరారని, నాటి పీసీసీ అధ్యక్షుడు బొత్స వైసీపీలో చేరారని, నువ్వు ఏబీవీపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావని, రేపు ఏ పార్టీలోకి వెళ్తావని రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గోదావరిపై నిర్మిస్తున్న పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం, 33/11కేవీ సబ్‌స్టేషన్, చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం, దోభిఘాట్‌కు శంకుస్థాపన, సుద్దాల వంతెనను మంత్రి ప్రారంభించారు. దోనబండ సభ, చెన్నూరు పట్టణంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్ అవుతుందన్నారు. మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్క సుమన్‌ను భారీ మెజారీ్టతో గెలిపించాలన్నారు. -
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్‌లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్‌గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్‌సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాస్వామ్యం బలోపేతం
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న సంకల్పంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీశక్తి వందన్ అధినియమ్’ను తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్లో ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో మొదటి సెషన్లో తొలిసారిగా ప్రసంగించారు. సమాజం ప్రభావవంతంగా పరివర్తన చెందడం వెనుక రాజకీయాల పాత్రను వివరించారు. ఆధునిక యుగంలో మహిళలు ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా, స్టార్టప్ కంపెనీల నుంచి స్వయం సహాయ సంఘాల దాకా అన్ని రంగాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ ‘‘నారీశక్తి వందన్ అభియాన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా మన తల్లులకు, సోదరీమణులకు, బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చట్టంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని మహిళలకు హామీ ఇస్తున్నా. ఈ బిల్లుతో మన ప్రజాస్వామ్యం మరింత బలం పుంజుకుంటుంది. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ అనే విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని ప్రశంసించాయి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ ఇనుమడిస్తోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలోనూ వారి భాగస్వామ్యం పెరగాలి. తద్వారా దేశ అభివృద్ధిలో వారి పాత్ర, సహకారం పెరుగుతుంది. ఈ చారిత్రక దినాన మహిళామణుల కోసం అవకాశాల ద్వారాలు తెరవాలని ఎంపీలను కోరుతున్నా. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం మహిళల సారథ్యంలో ప్రగతి అనే తీర్మానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నాం. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృత పర్చడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పార్లమెంట్ సభ్యులందరికీ నా విజ్ఞప్తి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చాలా ఏళ్లపాటు ఎన్నో చర్చలు, సంవాదాలు, సంప్రదింపులు జరిగాయి. బిల్లు చుట్టూ వివాదాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్లో బిల్లును ఆమోదించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో పలు సందర్భాల్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అంకెలు సహకరించకపోవడంతో ఆమోదం పొందలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే స్వప్నం నెరవేరలేదు. లక్ష్మణ రేఖ దాటొద్దు పార్లమెంట్లో కొత్త భవనంలో కొలువుదీరాం. ఎంపీలందరూ పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మర్చిపోవాలి. నూతన అధ్యయాన్ని ప్రారంభించాలి. కొత్త భవనంలో ఎంపీలు చేసే ఏం చేసినా సరే అది దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పార్లమెంట్ సమావేశా లను ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. సభ్యులు అధికార పక్షంలో ఉంటారా? లేక ప్రతిపక్షంలో ఉంటారా? అనేది వారి ప్రవర్తనే నిర్దేశిస్తుంది. పార్లమెంట్ సంప్రదాయాలను సభ్యులంతా పాటించాలి. లక్ష్మణ రేఖ దాటకుండా జాగ్రత్తపడాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఈ పార్లమెంట్ ఏర్పాటైంది కేవలం దేశ ప్రగతి కోసమే తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు. దేశానికి సేవలందించే విషయంలో పార్లమెంట్ స్థానం అత్యున్నతం. పార్లమెంట్ కొత్త భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం. ఇంజనీర్ల, శ్రామికుల శ్రమతోనే ఈ భవనం రూపుదిద్దుకుంది. 30 వేల మందికిపైగా కారి్మకులు స్వేదం చిందించారు. వారి వివరాలతో డిజిటల్ బుక్ తీసుకొచ్చాం. పవిత్ర ‘సెంగోల్’ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టించుకున్నాం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సెంగోల్‌ను స్వీకరించారు. ఎన్నో ఘట్టాలు సెంగోల్‌తో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. చరిత్రలో నిలిచిపోతుంది మహిళలకు హక్కులు కల్పించడం, వాటిని కాపాడడం, వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడం వంటి గొప్ప పనుల కోసం భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడేమో! అందుకే ఆ దిశగా మన ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం నిన్న(సోమవారం) ఆమోదముద్ర వేసింది. ఈ రోజు(సెప్టెంబర్ 19) చరిత్రలో నిలిచిపోతుంది. ఏ దేశ అభివృద్ధి ప్రయాణంలోనైనా చరిత్రను సృష్టించే సమయం వస్తుంది. అలాంటి సమయం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. -
‘ఆరు గ్యారంటీ’లతో మోసగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 6 గ్యరంటీలు అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సభలో రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీనేతలు మాఘం రంగారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, సీహెచ్ విఠల్, రాకేశ్‌రెడ్డి, జె.సంగప్పలతో కలిసి అరుణ మంగళవారం మీడియాతోమాట్లాడారు. ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం, మోదీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోవడంతో మతఘర్షణలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కవిత లేఖతో బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదమని అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కనీసం 15% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నూతన పార్లమెంటు భవనంలో తొలిబిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెట్టినందుకు బీజేపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి డీకే అరుణ ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మహిళానేతలు ఆకుల విజయ, బండా కార్తీకారెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలవికాని హామీలు.. అబద్ధపు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: అలవికాని హామీలు.. అబద్ధాల ఆరోపణలు.. చరిత్ర వక్రీకరణలతో కాంగ్రెస్ సభ సాంతం పరనిందగా సాగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్‌కే ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగసభపై హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టే కాంగ్రెస్ నాయకులు బూటకపు హామీలను ఇస్తున్నారని, ఆ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు అన్నీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే..రాష్ట్రానికో మేనిఫెస్టో కాకుండా, హైదరాబాద్ సభలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా.. ఎందుకు చేయలేదు? తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఇలానే బూటకపు హామీలిస్తే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని, 2019లో 52 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వలేదని, యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని చెప్పారు. కావాలంటే పేపర్లు తిరగేసి తెలుసుకోవాలని సూచించారు. ‘ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా? గుజరాత్ ఎన్నికలపుడు భారత్ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి మద్దతివ్వడం మీకు తెలియదా? ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధించడం మీకు కనిపిస్తలేదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ అవడం అన్నది ప్రపంచానికి తెల్సిన విషయమేనని అన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, పోరాడి గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
17న విజయభేరికి జాతరలా తరలి రావాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: హైదరాబాద్ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి సభకు ప్రజలు జాతరలా తరలిరావాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి నేతలు, కేడర్ ప్రజాక్షేత్రంలోకి కదలి వెళ్లాలని సూచించారు. సభలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు డిక్లరేషన్లు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటిస్తారని, ఇవి ప్రజల భవిష్యత్‌ను మార్చే పునాదిరాళ్లు అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆరీష్ నసీంఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో లూటీ చేసి.. మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. సన్నాహకంలో ఆగ్రహావేశాలు ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారితోపాటు వారి అనుచరులు హాజరయ్యారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని, పాత నేతలను కాదని కొత్త వారికి ఇస్తే సహించేది లేదని నినాదాలు చేశారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతుండగా నినాదాలు ఒక్కసారిగా మిన్నంటాయి. వేదికపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండగానే కార్యకర్తలు ఆందోళనకు దిగగా... భట్టి, పొంగులేటి వారిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తంగా ఈ సన్నాహక సమావేశం చివరి వరకు రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 60 సీట్లు ఇవ్వాల్సిందే.. అన్నీ పార్టీలకు బీసీ సింహగర్జన సభ డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ హుడా కాంప్లెక్స్: అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు 60 అసెంబ్లీ సీట్లతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కేటాయించాలని రాజకీయ పార్టీలను బీసీ సింహగర్జన సభ డిమాండ్ చేసింది. బీసీలకు సముచిత స్థానం కల్పించని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. బీసీలకు 60 సీట్లు ఇవ్వాలిందేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా అంతే సంఖ్య లో సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఈట లను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ మనుగడ ఉంటుందని సభలో నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ సింహగర్జన సభ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుర్గయ్యగౌడ్, అమృతరావు, చిన్న శ్రీశైలం యాదవ్, గొడుగు మహేశ్, నవీన్ యాదవ్, కుందారం గణేశ్‌చారి తదితరులు ఇందులో పాల్గొ న్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యారు. కులానికో సీటు.. బీసీలకే ఓటు నినాదంతో.. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ అలా జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. రెడ్లకు 40 టికెట్లు ఇచ్చిందని, జనాభాలో 60శాతం ఉన్న బీïసీలకు మాత్రం 23 టికెట్లే ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. మంత్రివర్గంలోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని ప్రకటిస్తామని.. ‘కులానికో సీటు.. బీసీలకే ఓటు’నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని.. చట్టసభల్లో బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాకే మహిళా బిల్లును ఆమోదింపజేయాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలని కోరారు. అగ్రకుల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను నిలుపుతామని ప్రకటించారు. -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్‌మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
నా విజన్‌తో యువత ఆకాశానికి
సాక్షి అమలాపురం: తన విజన్‌తో యువత ఆకాశానికి ఎగిరిపోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. తన సైన్యం యువతని.. వారికి ఉపాధి కల్పించే బాధ్యత తనదేనన్నారు. అమలాపురంలో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని.. ఇక్కడే ఉంటూ అమెరికాలో పనిచేసేలా చేస్తానని వెల్లడించారు. బీసీల్లో 150 కులాలకు మేలు చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయిస్తానని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌కు ఎక్స్‌పెయిరీ డేట్ వచ్చిందన్నారు. ఆయనలా తాను అప్పులు చేయనని.. సంపద సృష్టించి సంక్షేమం వైపు నడిపిస్తానని తెలిపారు. జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అమ్మకాలతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చిరుతలు ఉంటే మీకు కర్రలు ఇస్తారంట.. ఇంటికొక కర్ర పట్టుకుని వైఎస్సార్సీపీ దొంగలను కొట్టండని ప్రజలను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తెచ్చారా అని నిలదీశారు. కోనసీమలో కొబ్బరి, ఆక్వాలకు ప్రత్యేక పాలసీ తెస్తానని చెప్పారు. ఈ సభలో పార్టీ నేతలు గంటి హరీష్ మాధుర్, అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. అమలాపురం సభ అట్టర్ ఫ్లాప్ కాగా అమలాపురంలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుకున్న దానిలో మూడో వంతు కూడా జనం రాలేదు. తొలి నుంచి జనం రాక మీద నమ్మకం లేని పార్టీ నేతలు గడియారస్తంభం సెంటర్లో సమావేశ వేదికను రివర్స్‌లో ఏర్పాటు చేశారు. జనం రాకపోతే సెంటర్‌కు ఆనుకుని ఉన్న రోడ్లు ఖాళీగా కనిపించే ప్రమాదముందని ఇలా చేశారు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డును ఇరుకుగా చేసినా జనం రాకపోవడంతో పార్టీ నేతలు డీలా పడ్డారు. -
ఆట, పాట, మాటతో.. జన హృదయాలు గెలిచారు
చిక్కడపల్లి (హైదరాబాద్): గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో జనహృదయాలను గెలిచారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. చెప్పదలచుకున్న విషయాన్ని జన హృదయాలను తాకేటట్టు నేర్పుగా చెప్పగల గొప్ప వాగ్గేయకారుడు గద్దర్ అని ప్రశంసించారు. బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నిర్వహణలో లలిత కళావేదికపై ప్రజా యుద్ధనౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంతాప సభ జరిగింది. ఇనాక్ తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ సాహిత్యం సిలబస్‌గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, గద్దర్‌లో విప్లవభావాలు, తెలంగాణ భావన, దళిత వర్గాల అభ్యుదయం పట్ల ఆలోచనలను పంచుకున్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్.. పాట ఉన్నంతకాలం నిలిచి ఉంటారని అన్నారు. గద్దర్‌లో భిన్న కోణాలు ఉన్నాయని బేవరేజెస్ పూర్వ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా’అన్న గద్దర్ పాటను లయబద్ధంగా పాడి తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ, గద్దర్ గొప్ప కళాకారుడు అయినప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అని ప్రశంసించారు. -
ఆ 3 పార్టీలూ ఒక్కటే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు కుటుంబ పార్టీలే. వాటి డీఎన్ఏ కూడా ఒకటే. అందుకే ఆ మూడు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)ను వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళలకు హక్కులు వద్దంటున్నాయి..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఈ మూడు పార్టీలు ఒకే గూటి పక్షులు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కు వేసినట్లే..’అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్‌టవర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఏ పార్టీతో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని చెప్పారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కా రని ధ్వజమెత్తారు. కుటుంబాల చేతుల్లో అధికారం ఉంటే దేశం బాగుపడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పటికీ వైఎస్ హయాంలోని రేషన్ కార్డులే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్‌కార్డులే తప్ప.. తెలంగాణలో కొత్తవి రాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులివ్వాలనే సోయి కేసీఆర్ సర్కారుకు లేదని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, దళితబంధు స్కీంను అమ్ముకుంటున్నారని, బీసీ బంధు పేరిట ఆ వర్గాలను మభ్యపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆట కట్టించాలి.. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు కోట్లకు పైగా ఇళ్లు కట్టించామని, తెలంగాణలోనూ ఇళ్లు కట్టించాలని కోరినా ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పేదలకు ఇళ్లు లేవు కానీ.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి రాజభవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ ఆట కట్టించాల్సిన అవసరముందని అన్నారు. నియంత పాలనను అంతమొందిస్తాం: డీకే అరుణ తెలంగాణలో నియంతపాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ వదలబోమని, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
7న తిరుపతిలో ఓబీసీ జాతీయ మహాసభ
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): ఆగస్టు ఏడో తేదీన తిరుపతిలో ఓబీసీ జాతీయ మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. -
సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్
-
అధికారంలో లేకపోవడంతో అరాచకంగా తయారైన బాబు
-
డ్రోన్ కింద ప్రాణాలు..బాబు పిచ్చికి అమాయక జనం బలి
-
చంద్రబాబు ఖమ్మం సభ అట్టర్ ప్లాప్
-
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లా: జయప్రద
-
గత ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా సాధికారత సారధులకు అభినందనలు తెలియజేశారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ప్రభుత్వం రూ.1,258 కోట్లు చెల్లించిందని, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, వరుసగా ఇప్పుడు మూడో ఏడాది రూ. 1,261 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్ తెలియజేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రసంగం అనంతరం.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి జమచేశారు. చదవండి👉🏼: దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్ -
వరంగల్‌లో TRS సభకు అడ్డంకులు
-
మంత్రి శ్రీనివాస్ రెడ్డి సభలో మహిళల ఆందోళన
-
ఇంద్రవెల్లి సభకు రాలేను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత వారం రోజులుగా తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇంద్రవెల్లి దళిత, గిరి జన దండోరా సభకు తాను రాలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన తాను సభకు రానంత మాత్రాన చిలువలు పలువలు చేయొద్దని, కాంగ్రెస్ కేడర్ కూడా గందరగోళానికి గురికావద్దని వెల్లడించారు. తనకు జ్వరం వచ్చినందున కోర్టుకు కూడా వెళ్లలేకపోయానని, అందుకే వారంట్ కూడా జారీ అయిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ విజయవంతంపై ఆయనతో చర్చించిన రేవంత్, సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
మాట్లాడే అవకాశం ఇవ్వరా?
సాక్షిప్రతినిధి, వరంగల్/కమలాపూర్: తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ఓ మహిళా ఎంపీపీ ఆందోళన చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగింది. కమలాపూర్ మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ.29.51 లక్షల విలువ గల వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకందిన సమాచారం మేరకు స్థానిక ఎంపీపీ రాణి సభ మధ్యలో వచ్చారు. మంత్రి ప్రసంగం అనంతరం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంటానని కోరారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం మంత్రి మాట్లాడిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి ఉండదని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభా వేదికపైనే తనకు మాట్లాడే అవకాశం ఎందుకివ్వరంటూ నిలదీశారు. వెంటనే ఆమెను వేదికపై నుంచి కిందకు పంపించేశారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. శనిగరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నిగ్గుల వేణు వాట్సాప్, ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని, శనివారం తమ ఇంటి ముందు బైక్ ఆపి ఈలలు వేస్తూ, సైగలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలతో తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో కలసి హుజూరాబాద్– పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. -
ఇంటిపేరు మార్చుకున్నందుకు నన్ను టెర్రరిస్ట్‌లా చూశారు : నటి
సబా ఆజాద్.. నటనలోనే కాదు, సంగీతం, దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకుంటున్న మహిళ. ఇప్పుడు వెబ్ వీక్షకులకూ తన ప్రజ్ఞను పరిచయం చేస్తోంది.. సబా ఆజాద్ పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే. ఆమె మేనమామ సఫ్దర్ హష్మీ ప్రముఖ స్ట్రీట్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. ఆ స్పూర్తితోనే తాను ఆర్టిస్ట్ కావాలనుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో ఒడిస్సీ, లాటిన్ అమెరికన్ ఫోక్, క్లాసికల్ బాలే, జాజ్లలో శిక్షణ తీసుకుంది. సుమారు వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అప్పటికే థియేటర్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు సంపాదించుకుంది. 2008లో ’దిల్ కబడ్డీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా ఆడలేదు. తర్వాత చేసిన ’ముర్గన్సే ఫ్రెండ్షిప్ కరోగే’ కూడా అంతే. దీంతో సినిమాల కంటే నాటకాలే మేలు అనుకొని, 2010లో సొంత థియేటర్ కంపెనీ స్థాపించింది. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించింది. మరికొన్నింటికి సంగీతం అందించింది. 2012లో స్నేహితులతో కలసి ‘మ్యాడ్ బాయ్’ పేరుతో సొంత బ్యాండ్ ప్రారంభించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న ’విల్ యు బి మై క్వారంటైన్’తో అలరిస్తోంది. చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న ఈ కుల, మత విభేదాలను నిర్మూలించాలని ఉంది. అందుకే ఆజాద్ (స్వేచ్ఛ)ను నా ఇంటి పేరుగా మార్చుకున్నా. ఇలా మార్చుకున్నందుకు చాలా మంది నన్నో టెర్రరిస్ట్‌లా చూశారు. – సబా ఆజాద్ -
బీజేపీ విజయోత్సవ సభ
-
తెనాలిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
-
ఈ నెల 17న ఏలూరులో బీసీ బహిరంగ సభ
-
ఫిబ్రవరి 15, 16న దుబాయిలో 'లోక కేరళ సభ'
‘లోక కేరళ సభ’ (ప్రపంచ కేరళ వేదిక) ప్రాంతీయ సమావేశం ఫిబ్రవరి 15, 16న దుబాయిలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళీయులను మాతృభూమి కేరళతో సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా అనుసంధానపరిచే యోచనతో ‘లోక కేరళ సభ’ (ఎల్‌కేఎస్)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసింది. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటూ, కేరళకు చెందిన 100 మంది ప్రవాస భారతీయులు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న 40 మంది కేరళ ప్రవాసులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన 30 మంది కేరళ మేధావులు మొత్తం 351 మంది సభ్యులుంటారు. ప్రవాసీ కేరళీయుల కష్టాలను, ఆకాంక్షలను తెలుపుకోవడానికి, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్ శ్రీరామక్రిష్ణన్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత రమేష్ చెన్నితలతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేరళ ప్రవాసీ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగాఉన్న 200 కు పైగా ఎల్‌కేఎస్ సభ్యులు (65 మంది గల్ఫ్ నుండి) తో సహా 1500 మంది దుబాయి సభకు హాజరవుతారు. ఈ సందర్బంగా నెలవారీ ఆదాయాన్నిచ్చే ప్రవాసి డివిడెండు పథకంతో సహా నాలుగు సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారు. ఉపాధినిచ్చే నైపుణ్యాలు, పార్థీవ దేహాల తరలింపు, పునరావాసం తదితర ఏడు ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. -మంద భీంరెడ్డి +91 98494 22622 -
బోధన్ ఎన్నికల ప్రచార సభలోనైనా..
సాక్షి, బోధన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ సభకు వస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, ప్రతినిధులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ వారసత్వ సంపద, ఈ ప్రాంత అస్తిత్వం అవునా? కాదా? ప్రత్యేక రాష్ట్రసాధనోద్యమంలో షుగర్ ఫ్యాక్టరీ సమస్యను చోదక శక్తిగా ఉపయోగించుకున్నారా? లేదో? జవాబు చెప్పాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విడిపించి, ప్రభుత్వపరం చేసుకోకుండా, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, నడిచే ఫ్యాక్టరీని మూసివేసి కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆంధ్రప్రాంత ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాల లాబీయింగ్ ప్రభావంతో ఈ ప్రాంత షుగర్ ఫ్యాక్టరీలను మూసివేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది మంది చెరుకు రైతులు ఇబ్బందులపాలయ్యారని, ఉపాధి కోల్పోయి ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని కెసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం అంశంపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ప్రతినిధులు గంగాధర్ అప్ప, వరదయ్య, మల్లేష్, షేక్‌బాబు, శంకర్ గౌడ్, యేశాల గంగాధర్, ఎండీ గౌస్, సుల్తాన్ సాయిలు, ఎన్డీఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవి, శంకర్‌గౌడ్, ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను అన్నివిధాలా ఆదుకుంటాం
సాక్షి,బాన్సువాడ(నిజామాబాద్): ముదిరాజ్ కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో కొత్త బాన్సువాడ ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తు చేసిన తీర్మాణ పత్రాన్ని మంత్రికి అందజేశారు. మంత్రికి పూలు, పండ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడలో ఉన్న పేద ముదిరాజ్ కులస్తులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలాలు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చేందుకు మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎకరం, అర ఎకరం భూమి ఉన్న ముదిరాజ్‌లకు సబ్సిడిపై పూలు, పండ్లు పెంపకం కోసం పాలీహౌస్ను మంజురు చేయిస్తామని అన్నారు. విత్తనాలు, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పాత బాన్సువాడ ముదిరాజ్ కళ్యాణ మండపంకు రూ. 30 లక్షలు, కోటగిరిలో ముదిరాజ్ కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్ సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నియోజకవర్గ నాయకులు గురువినయ్, మండల అధ్యక్షులు గడుమల లింగం, కొత్త బాన్సువాడ అధ్యక్షులు ఉప్పరి లింగం, వైస్ ఎంపిపి జిన్న రఘురామయ్య, జిల్లా నాయకులు మామిళ్ల రాజు, టీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, ఏజాస్, పాత బాలక్రిష్ణ, పంతులు రాము, నార్ల ఉదయ్, రాజేష్ తదితరులు ఉన్నారు. -
నేడు బీసీ సింహగర్జన సభ
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నిర్వహించనున్న బీసీ సింహగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో సభ ప్రారం భం కానుంది. ఎన్నికలు సమీపించిన తరుణం లో భారీ ఎత్తున తలపెట్టిన ఈ సింహగర్జనకు ప్రాధాన్యం ఏర్పడింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు, సంక్షేమ ఫలాలు అందించాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయని, ప్రస్తుతం ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో బీసీ డిమాండ్లు చేర్పించాలనే లక్ష్యంతో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. బీసీలకు 50శాతం సీట్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమన్నారు. -
కులాంతర పెళ్లిళ్ల రక్షణకు ప్రణయ్ చట్టం చేయాలి
హైదరాబాద్: కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటల రక్షణ కోసం ప్రణయ్ చట్టం తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల చోటుచేసుకున్న ప్రణయ్ హత్యను నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట దళిత, వామపక్ష, మైనార్టీ, విద్యార్థి జేఏసీ, బీసీ విద్యార్థి తదితర 30 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి ఆగ్రహసభ జరిగింది. ఈ సందర్భంగా కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. కులహత్యలపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రణయ్‌ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, ఆల్ మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ అధ్యక్షత వహించగా తెలంగాణ ఇంటి పార్టీ అధినేత డాక్టర్ చెరుకు సుధాకర్‌తోపాటు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.కంచ ఐలయ్య, ప్రజాగాయకుడు గద్దర్, సామాజిక వేత్త ఉ.సా.ప్రజాగాయకురాలు విమలక్క, పీవోడబ్ల్యూవో నేత సంధ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, ప్రణయ్ తండ్రి బాలస్వామి, డాక్టర్ సూరెపల్లి సుజాత, కేవీపీఎస్ నేత స్కైలాబ్‌బాబు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు వరంగల్ రవి, మాందాల భాస్కర్, పుల్లారావు యాదవ్, ఆర్ఎన్ శంకర్, రమేష్, మోడం రవి, బద్రీ, నలింగటి శరత్, గుడివల్లి రవి, దర్శన్, రంజిత్, ఆర్ఎల్ మూర్తి, జాన్ వెస్లీ, కొమ్ము శేఖర్, అశోక్‌యాదవ్, నాగేశ్వర్రావు, సత్య, గౌతమ్‌ప్రసాద్, అశోక్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కుల హత్యలకు గురైన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించి సభను ప్రారంభించారు. సభలో ప్రజాకళాకారుడు ఏపూరి సోమన్న పాటలు, మాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. -
నా తర్వాతే నరేంద్రమోదీ
సాక్షి, విజయవాడ: ‘నా తర్వాతే ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చారు.. నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్ని.. నేను 1995లో సీఎం అయితే, ఏడేళ్ల తర్వాత 2002లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే అవకాశం రావడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారని గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జ్ఞానబేరి’ సభలో అన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రానికి న్యాయం చేస్తారనుకుంటే నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా అన్ని చేస్తామని నమ్మకంగా చెప్పి, నాలుగు ఏళ్లు ఏమీ పట్టించుకోకుండా నట్టేట ముంచారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూత ఇస్తే గుజారాత్‌ను దాటిపోతుందని నరేంద్రమోదీ భావించారన్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని మనకు న్యాయం చేయలేదని, అయినా మన రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని అన్నారు. నరేంద్రమోదీ వచ్చిన తరువాత దేశం అభివృద్ధి ఆగిపోయిందని అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయని, నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి పనులు చేయడం లేదని సీఎం దుయ్యబట్టారు. దక్షిణ భారత దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ పన్నులు వెళుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దమౌతోందన్నారు. విభిన్న స్టేట్మెంట్స్..... భారతదేశంలో జరిగిన అభివృద్ధికి మనమే చిరునామా.. జీఎస్టీపీ గ్రోత్ రేట్ బాగా పెరిగింది. కేంద్రం సహకరించకపోయినా రెండంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం మనదేనని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు ఉన్న ఎకానమినీ ఒక ట్రిలియన్ ఎకానమీగా తీసుకువెళతామని చెప్పారు. మరొక సందర్భంలో మాట్లాడుతూ కేంద్రం సహకరించక పోవడంతో వల్ల దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడి పోయామని చెప్పారు. దీనిపై ధర్మ పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సింది వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. అమరావతికి ప్రపంచంలో గుర్తింపు ఉన్న యూనివర్శిటీలను తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్ధి కె.ఈశ్వరసాయి ‘ఒన్ టచ్ ఈ గవర్నన్స్’ అనే యాప్ తయారీ గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై పవన్ చక్రధర్, కుమారి రిషిత డెయిరీ టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్ నుంచే ‘షురూ’!
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 30న సోనియాగాంధీని ఆహ్వానించి పెద్ద ఎత్తున బహిరంగసభను నిర్వహించడం ద్వారా ఎన్నికల కదనరంగంలోకి దూకేలా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. అదేరోజు గజ్వేల్‌తోపాటు ఉత్తమ్ సొంత జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కూడా బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈనెల 30న రాష్ట్రానికి రావాలని కోరుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ద్వారా సమాచారమిచ్చారు. ఇందుకు సోనియా కూడా సమ్మతించినట్టు సమాచారం. దీంతో ఈనెల 30న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభలను నిర్వహించడం దాదాపు ఖాయమైపోయింది. సోనియా వచ్చే విషయంలో మార్పు జరిగితే తప్ప ఈ షెడ్యూల్లో మార్పు ఉండే అవకాశం లేదని టీపీసీసీ నేతలు చెపుతున్నారు. సోనియా సభల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి భారీ బహిరంగసభలు నిర్వహించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో రాహుల్‌తో 10 సభలు నిర్వహించాలని, ఈసారి ఎన్నికలలో తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించాలని కూడా టీపీసీసీ ఇప్పటికే అధిష్టానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కనీసం ఉమ్మడి జిల్లాకో బహిరంగ సభను సోనియా లేదా రాహుల్‌లతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. -
మరో బహిరంగ సభకు కేసీఆర్ సన్నాహాలు
-
కేసీఆర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే..
-
సెప్టెంబర్2 న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ
-
నేడు కరీంనగర్లో ‘నిరుద్యోగ గర్జన’ : గట్టు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని గట్టు డిమాండ్ చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
‘పోలీస్ పవర్’ ఫేమ్ శివ జొన్నలగడ్డ హీరోగా సభ, లిఖిద హీరోయిన్స్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ రెడ్డి అక్కలను దర్శకునిగా పరిచయం చేస్తూ వసుంధర సమర్పణలో టి. రమేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ‘పోలీస్ పవర్’ నిర్మాత గుద్దేటి బసవప్ప కెమెరా స్విచ్చాన్ చేయగా, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ప్రసన్నకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నా చిత్రాలకు దర్శకత్వశాఖలో పని చేసిన నా శిష్య బృందం అంతా కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు. ‘‘క్రైమ్, లవ్, రొమాన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు సురేష్ రెడ్డి అక్కల. శివరాం నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌కుమార్, సంగీతం: సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ మట్టా. -
3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన
సాక్షి, హైదరాబాద్: రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా జూన్ 3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సింహగర్జన పోస్టర్లను ఆయ న విడుదల చేశారు. తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించే సభకు దేశంలోని రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గంలో 3 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో అధిక శాతం పేదరికంతో బాధపడుతున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో రూ.1,000 కోట్లు, జాతీయ స్థాయిలో రూ.10 వేల కోట్లతో జాతీయ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేజర్ జనరల్ సిన్హా కమిటీ రెడ్డి సామాజిక వర్గంలో అధిక శాతం వెనకబడి ఉన్నారని, వీరిని ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కమిటీ నివేదికను పార్లమెంట్లో చర్చించి ఆమోదించాలన్నారు. కార్యక్రమంలో బసిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి, విరాణిరెడ్డి, రవీందర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, సూర్యకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేడే టీజేఎస్ ఆవిర్భావ సభ
సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు నేతలు కసరత్తు చేశారు. సభా వేదికపై 1000 మంది ఆసీనులు కానున్నారు. ఒకే వరుసలో కనీసం 200 మంది కూర్చోవడానికి వీలుగా ఐదు వరుసల్లో స్టేజీ నిర్మాణం జరుగుతోంది. ముందు వరుసలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన సహా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూర్చుంటారు. రెండో వరుసలో అన్ని కోర్టుల న్యాయవాద సంఘాల ప్రతినిధులు, నేతలు, ఆ తర్వాత జేఏసీ స్టీరింగ్ కమిటీలో పనిచేసి టీజేఎస్‌లో చేరిన ముఖ్యనేతలు ఆసీనులవుతారు. మహిళా సంఘాల నేతలు, వివిధ రంగాల్లో పేరున్న మహిళలు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబీకులు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబీకులు, ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన వారి కుటుంబాలు, ఖమ్మం రైతులు కూడా వేదికపై కూర్చుంటారు. తెలంగాణ కళా సంస్కృతుల ప్రదర్శన కోసం వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 800 కళాకారులతో ఒగ్గు కథ, లంబాడీ నృత్యాలు, కోయ, థింసా వంటి అన్ని కళా రూపాలను ప్రదర్శించనున్నారు. వేదికపై భవిష్యత్ కార్యాచరణ ప్రొఫెసర్ హరగోపాల్, నాగేశ్వర్ ప్రత్యేక వక్తలుగా సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కళాకారుల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగానే మధ్యమధ్యలో అమరుల కుటుంబాలు, రైతు, విద్యార్థి, న్యాయవాద, ఇతర నేతలు ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కోదండరాం వేదికపైకి చేరుకుంటారు. అదే సమయంలో టీజేఎస్‌కు కోదండరాంను అధ్యక్షుడిగా అధికారంగా ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యుల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7.30 లోపు సభ ముగించేందుకు టీజేఎస్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఉన్నా వీలైనంత తొందరగానే ముగించడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ ఏర్పాటుకు కారణాలు, లక్ష్యం, భవిష్యత్ కార్యాచరణపై టీజేఎస్ అధ్యక్షుడిగా కోదండరాం సభలో వివరించనున్నారు. ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యం: కోదండరాం నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు తావు లేకుండా పోయిందని ఎం.కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు లేకుండా పోయాయని, సమస్యలున్నాయని చెప్పుకోవడానికి వేదికలు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని ‘సాక్షి’తో పేర్కొన్నారు. ‘‘నిరుద్యోగంతో యువత క్షోభ పడుతోంది. రైతుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. యువతకు ఉద్యోగాల భర్తీ కోసం కేలండర్‌ను ప్రకటించాలని, ఉపాధి కోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి, రైతుల మౌలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు’’ అని విమర్శించారు. అధికారం ఒకే కుటుంబానికి పరిమితమైందని, మంత్రులు, అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యాల కోసం సాగిందో వాటిని సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. టీజేఏసీకి కోదండరాం రాజీనామా టీజేఏసీ చైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా చేశారు. తెలంగాణ జన సమితిలో చేరుతున్నందున రాజీనామా చేస్తున్నట్టుగా శనివారం ప్రకటించారు. జేఏసీ నేతలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను టీజేఏసీ కన్వీనర్ కె.రఘు అందించారు. చైర్మన్ పదవిలో లేకుంటే కన్వీనర్‌గా ఉన్న వారే పూర్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. దీని ప్రకారం టీజేఏసీ చైర్మన్‌గా రఘు వ్యవహరించనున్నారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై జేఏసీ చైర్మన్, ఇతర కమిటీని ఎన్నుకోనున్నారు. పూర్తిస్థాయి చైర్మన్‌గా రఘును స్టీరింగ్ కమిటీ ఎన్నుకోనుంది. 2009 డిసెంబర్లో ఆవిర్భవించిన టీజేఏసీకి కోదండరాం వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిపాదన మేరకు అప్పుడు జేఏసీ భాగస్వామ్య పార్టీల ప్రతినిధులుగా కె.చంద్రశేఖర్‌రావు(టీఆర్ఎస్ అధినేత), కె.జానారెడ్డి(కాంగ్రెస్), నాగం జనార్దన్‌రెడ్డి(టీడీపీ)తో పాటు బీజేపీ, న్యూడెమొక్రసీలతోపాటు టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ మాల మహానాడు వంటి రాజకీయేతర సామాజిక, ఉద్యోగసంఘాల ప్రతినిధులంతా కోదండరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం మిలియన్ మార్చ్, సాగరహారం వంటి భారీ కార్యక్రమాలను జేఏసీ నిర్వహించింది. జేఏసీకి చైర్మన్‌గా కోదండరాం తొమ్మిదేళ్లుగా నాయకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమంలో తనకు సహకరించిన రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలకు, మీడియాకు ఈ సందర్భంగా కోదండరాం కృతజ్ఞతలను తెలియజేశారు. -
పరువు తీసుకుంటున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక సభలు, శాంతియుత నిరసనలపై ఇష్టమొచ్చినట్లు ఆంక్షలు విధించడంతో ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్బంధాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ప్రభుత్వాలు జవాబుదారీతనం గా ఉండాలని, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పాలన జరగాలని హితవు పలికారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తేనే ఆంక్షలు పెట్టొచ్చని చెప్పారు. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది లేకున్నా తమ సభలకు, నిరసనలకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వింత కారణాలు చెబుతున్న పోలీసులు అధికారంలో ఉన్న వారికి ఇది ప్రజాస్వామ్య దేశమని పదేపదే గుర్తుచేయాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, అభిప్రాయాలు వెల్లడించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. జనసమితి సభను హైదరాబాద్‌లో నిర్వహించుకునేందుకు 7 ప్రాంతాలను గుర్తించి, అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ చిత్ర, విచిత్రమైన కారణాలను చూపిస్తూ సభకు అనుమతిని నిరాకరిస్తోం దని ఎద్దేవా చేశారు. వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ ఆగిపోయి, వాయు కాలుష్యం పెరిగి, ప్రజలకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందంటూ పోలీసుల సమాధానాలకు విస్తుపోయామని చెప్పారు. జన సమితి సభకోసం అడిగిన మైదానంలోనే ఇటీవలే ఓ సినిమాకు సంబంధించి ఫంక్షన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. పర్యావరణానికి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రం ఎలా వస్తుందని దుయ్యబట్టారు. మేమంటేనే సమస్యలు గుర్తొస్తాయా? తెలంగాణ జేఏసీ ఏ కార్యక్రమం నిర్వహించినా, జన సమితి సభలు పెట్టుకున్నా పోలీసులకు ఎన్నో సమస్యలు గుర్తుకొస్తున్నాయని కోదండరాం విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ ఇక్కడే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్బంధంగా చెప్పడం అప్రజాస్వామికమని, ఇలాంటి అప్రజాస్వామిక ధోరణిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసమితి అంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు, నిర్బంధాలతో గెలుస్తామని అధికారంలో ఉన్నవారు అనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని బయటకు చెప్పుకుంటున్నా ఓడిపోతామనే భయం టీఆర్ఎస్కు పట్టుకుందన్నారు. జనసమితి సభ ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలను, ప్రజలకు జరుగుతున్న నష్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామనే భయంతోనే అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు, ఎందరో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం ఒకే కుటుంబానికే పరిమితం కావడం బాధ కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అందరినీ సమానంగా చూడాలని, ఆ కుర్చీకి ఉన్న హోదాతో బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. -
టీజేఎస్ సభకు అనుమతి నిరాకరణపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ నెల 29న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సీతారామమూర్తి విచారించారు. టీజేఎస్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో సభకు అనుమతి ఇవ్వకపోతే ఎన్టీఆర్ స్డేడియం లేదా ఎల్బీ స్టేడియంలోనైనా సభ జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో 29న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సభను నిర్వహించుకుంటామని చెప్పారు. అన్ని విధాలుగా హామీ ఇస్తున్నా సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. తాము సభ నిర్వహిస్తామంటే పోలీసులు ఏదో ఒక సాకు చెప్పి నిరాకరించడం పరిపాటిగా మారిందని, చివరి వరకూ కాలయాపన చేసి ఆపై పోలీసులు అనుమతి ఇస్తే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పడం సర్వసాధారణమైందని ఆమె విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో సినిమా ఫంక్షన్లకు, ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవాలు, డ్వాక్రా మేళాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నారని తెలిపారు. టీజేఎస్ సభకు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని రచనారెడ్డి కోరారు. పిటిషనర్ అభ్యర్థనపై ప్రభుత్వ/పోలీసుల వివరణ చెప్పాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. -
ఆశీర్వదించండి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహేర్ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు. చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. అధికారం కష్టమేమీ కాదు.. త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, 140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప, గురూజీ బాబుసింగ్రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై తీరుపై అసహనం ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు. -
ఇది అంతం కాదు.. ఆరంభం
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్మోహన్రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు. మద్దతు ధర ఏది? రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్‌ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురజాల ఎమ్మెల్యేగా మహేష్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్‌రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు. ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్‌జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలనకు చరమగీతం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన ఆడుతున్న ఫెడరల్, థర్డ్‌ఫ్రంట్ డ్రామాకు ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న కొత్త నాటకానికి కూడా తెరవేసే సమయం ఆసన్నమైందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం కేసీఆర్.. డిసెంబర్లో జరిగే ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కటకం మత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రకుంతియా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌తో పట్టం కడితే, ఆ ప్రజలకు మేలు చేసే అంశాలను మరిచిన కేసీఆర్ రోజుకోతీరుగా బక్వాసు మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని.. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో జరిగే ఈ సభే సమాధానం చెబుతుందన్నారు. ఈ సభని చూస్తే మంత్రి ఈటల రాజేందర్ పనైపోయినట్టే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి రూ.4 వేలు ఎకరానికి ఈ మేనెలలోనే ఇస్తామంటూ ఓట్లకోసమే డ్రామాలు అడుతున్నాడన్నాడన్నారు. గిట్టుబాటు, మద్దతు ధర కోసం అనేక ఆందోళనలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయని విషయాన్ని ప్రజలు మరిచపోలేదన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. విద్యాహక్కు చట్టం, వందరోజుల పని, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీయే అని అన్నారు. రూ.300 కోట్ల ట్రాక్టర్ల సబ్సిడీ కుంభకోణం.. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసిఆర్, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.69 వేల కోట్లు అప్పు ఉంటే, ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లకు పెరిగిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని, నాలుగేళ్ల కాలంలో నాయకులు ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రధానంగా తెలంగాణలో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులను చేసి, రూ.వేల కోట్లు గుంజుకుంటోందని పేర్కొన్నా రు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆబ్కారీ శాఖ ఆదా యం రూ.8 వేల కోట్లు ఉంటే, ప్రస్తుతం ప్రభుత్వ ఆదా యం రూ.20 వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందిస్తామని చెప్పిన మంత్రి ఈటల రాజేందర్, మిడ్‌మానేరు నీళ్లను మంత్రి హరీష్‌రావు తీసుకెళ్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన సీఎం కేసిఆర్ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 4 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. ∙ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సోనియాగాందీ దయతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జమ్మికుంట పట్టణంలో 20 రోజులకోసారి తాగునీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుందన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పులు చెప్తున్న సీఎం కేసిఆర్, 4 ఏళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేయగా.. అందులో సీఎం విలాస జీవితానికే అధికం మొత్తంలో నిధులు ఖర్చు చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో మాత్రమే డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. ఇతర జిల్లాల్లోని మంత్రులు మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లేకుండా చేస్తాననడం ఆయన తరం కాదని పేర్కొన్నారు. ∙ నాలుగేళ్లుగా రాష్ట్రంలో దమనకాండ జరుగుతోందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. వీణవంక మండలంలో అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబానికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రజలను మాటలతోనే మభ్యపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు అదనంగా ఉన్న బడ్జెట్‌ను మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు లోటు బడ్జెట్‌గా చేసి ఖజానా ఖాళీ చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2.18 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మిగిలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లను డబుల్ రోడ్లు వేస్తూ, డబుల్‌రోడ్లుగా ఉన్న వాటిని ఫోర్‌లేన్‌గా వేస్తేనే అభివృద్ధి చేసినట్లా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ హన్మంత్‌రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసిఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని సోనియాగాందీ వద్ద చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళితుడినే సీఎం చేస్తానని చెప్పి మోసం చేశాడని, నక్సలైట్ల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండా అని చెప్పి, నక్సలైట్లనే పిట్టల్లా కాల్చి చంపతున్నాడని విమర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లికి రాజ్యసభ సీటు ఇవ్వాలన్నారు. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత ఢిల్లీకి వెళ్లాలని హితవు పలికారు. ∙ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ముగింపు సభకు వచ్చిన రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో శాసనమండలి ఫ్లోర్‌లీడర్ షబ్బీర్‌అలీ, వి.హన్మంతరావు, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, సీనియర్ కాంగ్రెస్ నేతలు టి.సంతోష్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, నేరేళ్ల శారద, రమ్యారావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ప్యాట రమేష్, స్వర్గం రవి, పరిపాటి రవీందర్‌రెడ్డి, విజయరమణారావు, మల్లు రవి, సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం..హుజూరాబాద్ సభలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను మంత్రి రాజేందర్ అక్రమంగా సంపాదించుకున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో బస్సుయాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా ఘాటైన ఆరోపణలు చేశారు. కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లర్లకు రారైసుకు క్వింటాల్‌కు రూ.15లు, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50లకు పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయన్నారు. రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్ అభ్యంతరాలతో బయటపడిందన్నారు. వీటిని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తే మిల్లర్లు సమ్మెకు దిగారన్నారు. 2014–15 సంవత్సరంలో కేంద్రం లెవీ కింద లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించామని రూ.1,670 కోట్లకు ప్రతిపాదనలు పంపిన దానిలో రూ.600 కోట్ల మేరకు చేతులు మారితే తాను చేసిన ఫిర్యాదుల మేరకు కేంద్రం విచారణ జరిపిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే.. ఆర్థికశాఖ మంత్రి గుడ్డిగా సంతకం చేసిన మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్ అక్రమాలలో కీలకపాత్ర ధారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన వెంట ఈటల రాజేందర్ కూడా వెళ్లక తప్పదన్న రేవంత్‌రెడ్డి.. తాను విసిరిన సవాళ్లకు దమ్ముంటే విచారణకు రావాలని అన్నారు. -
రాహుల్ వచ్చిండు..కేసీఆర్ రాలే..!
నిర్మల్: తెలంగాణ ప్రజల కలను సోనియమ్మ నెరవేరిస్తే.. బంగారు రాష్ట్రం చేస్తామని కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను దగా చేశాడని, రైతు ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడని టీపీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలన సాగి స్తోందని, ఇక కుటుంబ పాలనను గద్దెదించాల్సిందేనని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి సోన్‌లో ప్రవేశించిన వచ్చిన యాత్రకు జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ వాహన ర్యాలీతో జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో గల సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, బస్సుయాత్ర కన్వీనర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో హామీలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ప్రజలకే చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఢిల్లీ నుంచి తమ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. నిర్మల్ జిల్లాలో మహేశ్వర్‌రెడ్డితో కలిసి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల కుటుంబాలను పరామర్శించి, రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారన్నారు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాత్రం ఒక్క రైతు కుటుంబం వద్దకు రాలేదని, ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. నాలుగేళ్లుగా రైతులను పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఎన్నికల ముంగిట కరెంట్ ఇస్తున్నామని, ఎకరాకు రూ.4వేలు ఇస్తామని నమ్మబలుకుతోందన్నారు. రైతుల ఓట్లను గంపగుత్తగా కొనేందుకే ఇలాంటి ఎన్నికల స్టంట్లను కేసీఆర్ చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకునే ఫ్రంట్ నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే అన్ని పంటకు అధిక మద్దతు ధరలను ఇస్తామని చెప్పారు. మహిళలకు డ్డీలేని రుణాలను పెంచుతామని, అభయహస్తం పింఛన్ పునరుద్దరిస్తామని, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో రెండు లక్షల ఎకరాలకు ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా నీరందిస్తామని, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చారు మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయం : రేవంత్ నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల సంక్షేమం పట్టని మంత్రి తన స్వప్రయోజనం కోసం ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిండన్నారు. 2014లో దళితులు, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటానంటూ బీఎస్పీలో చేరాడన్నారు. ఏనుగు బొమ్మపై గెలిచి పీనుగు పార్టీలోకి మారాడన్నారు. దొరలకు అమ్ముడు పోయిన ఘనత ఇంద్రకరణ్‌రెడ్డి అదన్నారు. కల్లు అమ్ముకునే ఇంద్రకరణ్‌రెడ్డిని సీఎం ఇళ్ల మంత్రిని చేశాడన్నారు. జిల్లాలో తన స్వగ్రామం ఎల్లపెల్లిలో తప్ప ఈ మంత్రి ఎక్కడైనా ఇల్లు కట్టించిండా.. అని సభికులను ప్రశ్నించారు. దీనికి ముక్తకంఠంతో లేదు.. అని సమాధానం వచ్చింది. దేవాదాయ మంత్రిగానూ ఇంద్రకరణ్‌రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. వేములవాడలో లేగదూడలు కబేళాలకు తరలుతుంటే.. భద్రాద్రిలో సీతమ్మ తాళిబొట్టు పోతే.. బాసరలో రోజుకో అపచారం జరుగుతుంటే.. కనీసం పట్టించుకోలేదన్నారు. భద్రాద్రి రాములవారి కల్యాణంలో సీఎం మనుమడు పట్టువస్త్రాలు సమర్పిస్తుంటే మంత్రి బంట్రోతుగా ఆ పిల్లాడి వెంట నడువడం జిల్లా ప్రజలకే అవమానమన్నారు. త్యాగాల పునాదులపై నిర్మాణమైన తెలంగాణను సోనియమ్మ ఇచ్చిందని, దాన్ని కేసీఆర్ దోపిడీ తెలంగాణ మార్చాడన్నారు. థర్డ్ ఫ్రంట్ బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగమని అన్నారు. ఏ టెంట్ లేనోళ్లే ఈ ఫ్రంట్ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2017 డిసెంబర్ లోపల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించకపోతే, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఇవ్వాళ ఏ మొఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారన్నారు. మైనార్టీలకు మోసం : షబ్బీర్‌అలీ 12శాతం రిజర్వేషన్ల పేరిట మైనార్టీలు, ఎస్టీలను కేసీఆర్ మోసం చేశాడని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి మైనార్టీల ను మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని తన మహల్‌పై కూర్చుండే అసదుద్దీన్‌కు కింద గుడిసెల్లో ఉంటూ బండ్లపై పండ్లు అమ్ముకుం టున్న మైనార్టీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : జానా దేశాన్ని అభివృద్ధి బాట పట్టించింది కాంగ్రెస్సేనజానారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టులను నిర్మించామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. నామీద గెలిచే దమ్ముందా : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముందునుంచీ అండగా నిలిచింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ ప్రాంతాలేనని డీసీసీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకు కష్టకాలంలో ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. కానీ కల్లబొల్లి మాటలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశాడన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి ఒక్క ఏడాదిలో చేసిన అభివృద్ధి అంత కూడా నాలుగేళ్లలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేయలేదని విమర్శించారు. తన ఊళ్లో తన జీతగాళ్ల కోసమే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించుకున్నాడని, నాలుగేళ్లలో గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉండి జిల్లాలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. తన తమ్ముడికి వెయ్యికోట్లతో చనఖా,కోర్ట ప్రాజెక్టు పనులు ఇప్పించాడని, కొడుకు భూమి ఉందని జిల్లాకేంద్రంలోని ధర్మసాగర్ చెరువును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాసరలో అవినీతి అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖామంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలో 40ఎకరాల స్థలం ఉన్నా.. తన 300ఎకరాల ప్లాట్ల కోసం ఎల్లపెల్లిలోని చెరువులో కలెక్టరేట్ కట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో నిర్మల్ నియోజకవర్గానికి మంత్రి ఏం చేశాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాకుంటే.. కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా సరే నిర్మల్‌లో వచ్చి తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. నిర్మల్ ప్రజలను నమ్ముకునే తాను ముందుకు సాగుతున్నానన్నారు. నక్సల్స్ ఎజెండా అన్నడు : వీహెచ్ తనది నక్సల్ ఎజెండా అని, పేదోళ్లను ఆదుకుంటానని వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తున్నాడని సీనియర్ నేత హనుమంతరావు అన్నా రు. తమను అంతం చేయాలని చూసినోళ్లను వదిలిపెట్టరని, కేసీఆర్ నక్సల్స్ నీ పనిచేస్తరు.. జర హుషారుగ ఉండు అన్నారు. 106 సీట్లు తామే గెలుస్తామని సర్వేలు చెప్పాయన్న సీఎం ఇప్పుడు కాంగ్రెస్ యాత్రను చూసి ఫ్రంట్ పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆకట్టుకున్న నాయకులు.. ‘2014లో ఒకవేళ మహేశ్వర్‌రెడ్డినే గెలిపించి ఉంటే.. తానే అందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చేవారని..’ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. క్రికెట్లో ఒక్కసారి అవుటైతే మళ్లీ తర్వాతి మ్యాచ్ ఉంటుందని, ఇక్కడ ఒక్కసారి ఓడితే మాత్రం ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. ‘పోతావ్రో కేసీఆర్.. రైతుల ఉసురు తగిలి.. ఎవరి పాలైందిరో తెలంగాణ.. దొరల, దొంగల పాలైందిరో తెలంగాణ..’ అంటూ పాటలతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆకట్టుకున్నారు. ఆదివాసులకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను సాధించుకుందామని లంబాడీ భాషలో మాట్లాడి మాజీ ఎంపీ బలరాం నాయక్ పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మల్లు రవి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు రాంచంద్రారావు, రామారావు పటేల్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్‌పాండే, నరేశ్‌జాదవ్, హరినాయక్, జాదవ్ అనిల్, సత్యం చంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, వినాయక్‌రెడ్డి, జుట్టు దినేశ్, సంతోష్, చిన్ను, జమాల్, చరణ్, జునైద్, హైదర్, సరికెల గంగన్న, లింగారెడ్డి, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. -
ఎన్నికల సమరానికి సర్వసన్నద్ధం కావాలి
రావులపాలెం (కొత్తపేట) : ఎన్నికల సమరానికి ఎంతో సమయం లేదని, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్సీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, ప్రతి 100 మందికి ఒక బూత్ సభ్యుడు ఉండేలా కన్వీనర్లు నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇందుకు ఉత్సాహవంతులు, పార్టీ కోసం పని చేసేవారిని తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నాయకులకు వివరించి, పరిష్కరించడం ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు వారథులుగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల సూక్ష్మస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, అతడితో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా, చంద్రబాబు అదే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తూ, 53 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. తమ అనుకూల ఎల్లో మీడియాలో పదేపదే రాజధాని ఊహాచిత్రాలను చూపిస్తూ ప్రజలను మ«భ్యపెడుతున్నారని, వాస్తవంగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు ఓడించడానికి జన్మ«భూమి కమిటీలనే ఒక్క కారణం చాలని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసినా, స్పీకర్ ఇంతవరకూ వారిపై అనర్హత వేటు వేయకపోవడం, వారిలో నలుగురితో మంత్రులుగా సాక్షాత్తూ గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలను అందించారని, కానీ చంద్రబాబు తమకు ఓటు వేస్తేనే లబ్ధి చేకూరుస్తామనే నీచమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గడచిన 70 ఏళ్లలో ఇంత అన్యాయమైన పాలన ఏనాడూ చూడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కమీషన్లపై కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందని ధర్మాన అన్నారు. మరో ముఖ్య అతిథి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లేని పోల్ మేనేజ్మెంట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అనే రెండు కొత్త స్కీములు అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, రెండేసి ఓట్లు ఎలా వేయాలో పోల్ మేనేజ్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే.. చేసిన దూబరా ఖర్చులను కప్పిపుచ్చడానికి ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయాన్ని వ్యాపారం, నేరమయంగా మార్చేశారన్నారు. మాజీ మంత్రి, అమలాపురం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి గొల్ల పల్లి డేవిడ్‌రాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రొఫెసర్లు రవికుమార్, నారాయణరెడ్డిలు పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, సామాజిక మాధ్యమాలు, వర్తమాన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ఆవిర్భావం, ఆదర్శవాదం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం ధర్మాన, బోస్ తదితర నాయకులను జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. -
ఏప్రిల్ 29న గొల్ల, కురుమల సభ
సాక్షి, హైదరాబాద్: గొల్ల, కురుమల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఆదివారం జరిగిన గొల్ల, కురుమల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొర్రెల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై నిధులిస్తుందని పేర్కొన్నారు. 31 జిల్లాల్లో గొల్ల, కురుమల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషిచేస్తానని హామీనిచ్చారు. సభ విజయవంతానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జన సమీకరణ కోసం ఏప్రిల్ మొదటి వారంలో జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు రవీందర్‌యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. సీఎం దృష్టికి కురుమల సమస్యలు కురుమల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ మహావేదిక ఆవిర్భావ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. అత్యంత వెనుకబడిన కురుమలను ఎంబీసీల్లో చేర్చాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
► ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభ ఏర్పాట్లు పరిశీలించిన ఉత్తమ్ ► జన సమీకరణ, ఏర్పాట్లపై జిల్లా నేతలతో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 1న సంగా రెడ్డిలో నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా గర్జన’ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్న ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు, అదేస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కృషి చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, రైతులకు వ్యవసాయ పనుల ఒత్తిడి ఉన్న ఈ సమయంలో సభను నిర్వహించొద్దని అధి ష్టానానికి పలువురు నేతలు విన్నవించినా రాహుల్ పట్టించుకోకుండా సభకు హాజరవు తున్నారని ఓ టీపీసీసీ నేత వెల్లడించారు. ఈ సభను భారీగా నిర్వహించి సత్తా చూపించాలని ఉత్తమ్ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతు న్నా యి. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో ఉత్తమ్ సమావేశమై జనసమీకరణ ఏర్పాట్లపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా నుంచి లక్షమంది వరకు జనాన్ని సమీకరిం చాలని స్థానిక నేతలకు సూచించారు. మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మరో లక్ష మందిని సమీకరించేందుకు అక్కడి నేతలను అప్రమత్తం చేశారు. జూన్ 1న రాష్ట్రానికి రాహుల్.. జూన్ 1న రాహుల్ రానున్న నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టును ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సోమవారం పరిశీలిం చారు. మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. -
బేగంపేట నుంచి సంగారెడ్డిదాకా రోడ్డు మార్గంలోనే..
► జూన్ 1న రాహుల్ గాంధీ పర్యటన తీరిదీ.. ► రూట్ మ్యాప్ విడుదల చేసిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: జూన్ 1న సంగారెడ్డిలో జరగనున్న సభ కోసం రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలోనే అక్కడికి వెళ్లనున్నారు. రాహుల్ పర్యటన రూట్‌మ్యాప్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో వెల్లడించారు. 1న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహం దగ్గరకు చేరుకుని, పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ వద్ద కొద్దిసేపు ఆగి కార్యకర్తలను కలుస్తారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో కార్యకర్తలతో మాట్లాడటానికి కొద్దిసేపు ఆగుతారు. పటాన్చెరు నుంచి నేరుగా సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ అతిథిగృహంలో పార్టీ ముఖ్య నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారితోనూ రాహుల్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు సభ: ‘తెలంగాణ ప్రజాగర్జన’ పేరుతో టీపీసీసీ నిర్వహిస్తున్న సభా వేదిక వద్దకు రాహుల్ సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సభ ముగుస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. సంగారెడ్డిలో సభ పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు చేరుకుని, రాహుల్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని వివరించారు. మోసాన్ని ఎండగడ్తాం..: బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల మోసాలను, హామీల అమలులో వైఫల్యాలను సంగారెడ్డిలో జరిగే తెలంగాణ ప్రజాగర్జనలో ఎండగడ్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి కుంతియా, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో కలసి రాహుల్ పర్యటన రూట్‌మ్యాప్‌ను విడుదలచేసిన సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాల మోసాలపై ప్రజాగర్జనలో చార్జీషీటును విడుదల చేస్తామని ప్రకటించారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
► జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం ► ఏర్పాట్లపై ఉత్తమ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సంగారెడ్డిలో జూన్ 1న నిర్వహించబోయే సభను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లవు తున్న సందర్భంగా జరుగుతున్న ఈ సభను.. వచ్చే ఎన్నికలకు సన్నాహక కార్యక్రమంగా నిర్వహించనుం ది. ఇందుకోసం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది. సభకు భారీగా జన సమీకరణ చేయాలని, ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఉండాలని నిర్ణయించింది. ఇదే సరైన సమయం... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ నిర్వహ ణకు సంబంధించి బుధవారం ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఎన్ని కలకు రెండేళ్లు ఉండగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్న విషయాన్ని ఆయ నకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రైతులపై కేసులు, బేడీలు వేయడం, రుణమాఫీలో వైఫల్యం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు (ఎస్టీలకు, ముస్లింలకు), కేజీ టు పీజీ వంటి కీలకమైన హామీల్లో ప్రభుత్వ విఫలమైందని చెప్పారు. ధర్నాచౌక్ ఎత్తివేతపై రాష్ట్రం లో ప్రజాతంత్ర వాదులు, మేధావులు, విద్యావం తులు, ప్రజాస్వామికవాదులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఈ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని వివరించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా.. భారీ కార్యక్రమాలను చేపట్టలేదని పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందువల్ల సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి హాజ రైతే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్టు అవుతుం దని రాహుల్‌ని ఉత్తమ్ కోరారు. ఈ ప్రతిపాదనకు రాహుల్‌గాంధీ అంగీకరించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారీగా జన సమీకరణ.. ర్యాలీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీపీసీసీ చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని ఎన్నికలకు సన్నాహ కసభగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. సంగారెడ్డిలో బహిరంగసభకు ముందు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి దాకా దాదాపు 45 కిలోమీటర్ల మేర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయిం చింది. సంగారెడ్డిలో సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై మెదక్‌జిల్లా నేతలతో ఉత్తమ్ సమావేశమ య్యి, ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగించారు. భారీ జన సమీకరణతో టీఆర్ఎస్కు గట్టి సందేశం ఇస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. -
మాదిగ ఉపకులాల సత్తా చాటాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కాకినాడ సిటీ : శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరుతూ నవంబర్ 20న హైదరాబాద్‌లో 30లక్షల మందితో చేపట్టనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభ ద్వారా మాదిగ ఉపకులాల సత్తా చాటాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కాకినాడ అంబేడ్కర్ భవన్లో జరిగిన ధర్మయుద్ధ సన్నాహాక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యానికి దగ్గరగా ఉన్నామని, శత్రువు నిరంతరం వెంటాడుతున్నందున ఈదశలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాల్ శతజయంతి సంవత్సరం ప్రకటించిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేసి దళితులపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీని కోరారు. దీన్‌దయాల్ కోరుకున్నట్టుగా అట్టడుగున ఉన్న దళిత వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే వర్గీకరణనే సరైన మార్గమన్నారు. వర్గీకరణ లక్ష్యం దీన్‌దయాల్ ఆశయం ఒక్కటే అంటూ అభివర్ణించారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగేంతవరకు సమసమాజ స్థాపన అసాధ్యమని అసమానతలు తొలగిన నాడే అది నెరవేరుతుందన్నారు. సామాజిక న్యాయంనకు కట్టుబడడమంటే వర్గీకరణను సమర్థించడమే అని, సామాజిక న్యాయానికి పర్యాయపదమే వర్గీకరణ అంటూ ఆయన తెలిపారు. వర్గీకరణ చేయడం ద్వారా దళితుల్లో అనేక కులాల పక్షాన బీజేపీ నిలబడినట్టవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ, జిల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు, సలహాదారు సుబ్బారావు, టి.సుగుణ కుమార్ పాల్గొన్నారు. -
జనసేన సభలో అపశ్రుతులు
చెట్టు కొమ్మలు విరిగి, గోడపై నుంచి పడి.. ఒకరు మృతి, నలుగురుకి గాయాలు బోట్‌క్లబ్ (కాకినాడ)/కుయ్యేరు (కాజులూరు) : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. జేఎన్టీయూకే గ్రౌండ్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో.. చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పాటు ఎత్తయిన గోడపై నుంచి కొందరు కిందపడిన సంఘటనల్లో ఒకరు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. ప్రధాన వేదికకు దూరంగా గోడపై పవన్ అభిమానులు కూర్చొన్నారు. ఈ క్రమంలో కొందరు గోడపై నుంచి కిందపడ్డారు. కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన నందికోళ్ల వెంకటరమణ(22) తలకు తీవ్ర గాయమైంది. అతడిని హుటాహుటిన అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అలాగే గ్రౌండ్లో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి పవన్ అభిమానులు సభను తిలకిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడంతో, ఆ బరువుకు చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. దీంతో కొందరు యువకులు కిందపడి, గాయాలపాలయ్యారు. ఆయా సంఘటనల్లో రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన రవ్వా రవి, పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన కర్రి రాజారావు, రామచంద్రపురం మండలం వెల్ల సావరానికి చెందిన కురసాల సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పుప్పాల ప్రసాద్ గాయాలపాలై, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా స్వల్పంగా గాయపడిన కొందరు ఆస్పత్రికి రాకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. విద్యుదాఘాతంతోనా? ఇలాఉండగా వెంకటరమణ గోడపై నుంచి పడడం వల్ల గాయపడి చనిపోలేదని, సంఘటన స్థలంలో ఉన్న సౌండ్‌బాక్సు వైర్ల కారణంగా విద్యుదాఘాతానికి గురైనట్టు సభకు హాజరైన కొందరు పేర్కొన్నారు. గోడపై నుంచి పడడం వల్లే తలకు గాయమైనట్టు పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి శనివారం పోస్ట్‌మార్టం చేయనున్నట్టు తెలిపారు. సర్పవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుయ్యేరులో విషాదం అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ను చూసి, ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెళ్లిన వెంకటరమణ మరణించడంతో కుయ్యేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అవివాహితుడైన వెంకటరమణ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇతడి తండ్రి తర్రయ్య(అబ్బులు) వ్యవసాయ కూలీ కాగా, తల్లి లక్ష్మి గృహిణి. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ్ముడు, మూగ చెల్లెలు ఉన్నారు. పెద్ద కొడుకు కావడంతో తానే కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. తమ్ముడు, చెల్లెలు బాగోగులు చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులకు అతడి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. -
అమిత్‌షా బహిరంగ సభను జయప్రదం చేయాలి
కట్టంగూర్ వరంగల్‌లో ఈనెల 17న నిర్వహించే బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆ పార్టీ మండల నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, బూతుస్థాయి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు మండల వెంకన్న, కోమటి భాస్కర్, కటికం శ్రీను, పాదూరి వెంకట్‌రెడ్డి, వీరమళ్ల శంకర్, పల్స సైదులు, గుండు వెంకన్న, శంకర్ ఉన్నారు. -
రేపు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ?
-
చంద్రబాబు సభలో డిష్యుం డిష్యుం
మహబూబ్‌నగర్ క్రైం: చంద్రబాబు నాయుడు గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ రణరంగాన్ని తలపించింది. సభలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తుండగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఏమవుతుందో అని పోలీసులు తెలుసుకునేలోగానే గాల్లోకి కుర్చీలు లేచాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి కుర్చీలు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీంతో తేరుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైకి కుర్చీలు విసిరారు. టీడీపీ కార్యకర్తలు లేచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో కొద్దిసేపు సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. చాలా సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు, నాయకులకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు, జర్నలిస్టులకు, పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో మిడ్జిల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త రాజు, మరో యువకుడు సభా ప్రాంగణం కప్పుపైకి వెళ్లి ఎమ్మార్పీఎస్ జెండాలతో చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులు పెకైక్కి వారిని దింపేందుకు ప్రయత్నించారు. అంతలో సభలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చెప్పులు, నీళ్ల బాటిళ్లు, కుర్చీలను ఎమ్మార్పీఎస్ నాయకులపైకి విసిరారు. టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నిస్తుండంతో పోలీసులు వలయంగా ఏర్పడి లాఠీచార్జి చేసి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. తేనెటీగల దాడికి యత్నం చంద్రబాబు సభలో నిరసన తెలిపేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తేనెటీగల దాడికి యత్నించారు. ఓ ప్లాస్టిక్ కవర్లో తేనెతుట్టెను తీసుకొచ్చి సభాప్రాంగణంపైకి విసిరేందుకు యత్నించారు. గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది దానిని వెంటనే నివారించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు.. సభప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా తమ కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి అన్నారు. కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉంచడంతో అధ్యక్షుడితో పాటు మరో 50మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతూ పోలీసులు కార్యకర్తలపై జులుం చేయడం సమంజసం కాదని చెప్పారు. ప్రశాంతంగా తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అత్యుత్సాహంగా తమపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులలో గాయాల పాలైన బాధితులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలు.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన సందర్బంగా ఎమ్మార్పీఎస్, టీడీపీ కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసురుకునే క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ యాదయ్య, మరో ఎస్ఐ తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ తలకు తీవ్ర గాయమైంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. గాయపడిన పత్రిక ఫొటోగ్రాఫర్‌కు లక్ష రూపాయల సాయం ప్రకటించారు. వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి కార్పెట్‌కు మంటలు అంటుకున్నాయి. అక్కడే కూర్చున్న కళాకారుల బృందం ఒక్కసారిగా పరుగులు తీయడంతో కలకలం చెలరేగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. -
ముగ్గురు టీడీపీ కార్యకర్తల దుర్మరణం
ఎర్రుపాలెం/చండ్రుగొండ, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లివస్తూ ఇద్దరు, వెళ్తూ ఒకరు రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందారు. ఖమ్మంజిల్లాలో గురువారం రెండు చోట్ల జరిగిన ఈ ప్రమాదాలకు సంబంధించి వివరాలు... ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దొండపాటి కృష్ణవర్దన్, దోమందుల వెంకటకృష్ణ అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మోటారు సైకిల్‌పై మధిర వెళ్లారు. అక్కడ చంద్రబాబు సభ ముగిసిన అనంతరం ఇరువురు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న వెంకటాపురం గ్రామం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం మోటార్‌సైకిల్‌ను ఢీ కొంది. దీంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడక్కడే మృతి చెందారు. వీరివురూ ఇంటర్మీడియట్ మొదటిసంవత్సరం పరీక్షలు రాశారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్థానిక ఎస్ఐ కె రామకృష్ణ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చంద్రబాబు సభకు వెళ్తూ.... చండ్రుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావూరి సత్యనారాయణ (40) కొత్తగూడెంలో చంద్రబాబు సభకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. గ్రామస్తుల కథనం ప్రకారం.... వెంకటాపురానికి చెందిన సత్యనారాయణ, మరో కార్యకర్త శివతో కలిసి తన మోటారుసైకిల్‌పై కొత్తగూడెం బయల్దేరాడు. మార్గ మధ్యలోని తిప్పనపల్లి వద్ద భద్రాచలం నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణతోపాటు శివ కాళ్లు విరిగాయి. వీరిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్యనారాయణను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య దుర్గమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'బన్ని n చెర్రి'
బస్టాప్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో నటించిన యంగ్‌హీరో ప్రిన్స్, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాతో క్రేజి యూత్‌ఫుల్ హీరోగా మారిన మహత్ రాఘవేంద్రులు హీరోలుగా, అందాలబామలు కృతి, సభా హీరోయిన్స్‌గా ప్రముఖ నిర్మాణసంస్థ మల్టీడైమన్షన్ సమర్పణలో, హరూన్ గని అర్ట్సు బ్యానర్లో నిర్మాత హరూన్ గనినిర్మిస్తున్నారు. రాజేష్ పులి దర్శకుడిగా పరాచయమవుతున్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరియూ కామెడి కింగ్ బ్రహ్మనందం కీలక పాత్రలు చేస్తున్నారు. -
సమైక్య శంఖారావం
-
జన శంఖారావం
-
ఉద్యమ శంఖం
-
మిమిక్రీ రమేశ్ ప్రసంగం @ సమైక్య శంఖారావం
-
వైయస్ మీద పాట పాడిన మిమిక్రీ రమేశ్ @ సమైక్య శంఖారావం
-
ఎల్.బి.స్టేడియంలో కళాకారుల ఆటపాటలు
-
హైదరాబాద్ పయనమవుతున్న జనం
-
ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిన మహిళలు
-
సభా ప్రాంగణానికి చేరుకున్న భారతి,షర్మిల
-
ఈనెల 11న నవభారత యువభేరీ