చెప్పింది చేసే ఏకైక సీఎం జగన్‌ | Jangala gratitude meeting for CM Jagan in Vijayawada | Sakshi
Sakshi News home page

చెప్పింది చేసే ఏకైక సీఎం జగన్‌

Published Fri, Nov 3 2023 3:04 AM | Last Updated on Fri, Nov 3 2023 3:25 PM

Jangala gratitude meeting for CM Jagan in Vijayawada - Sakshi

భవానీపురం (విజయవాడ పశ్చిమ): చెప్పింది చేసే ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇచ్చి న మాట ప్రకారం బేడ (బుడ్గ) జంగాలను ఎస్సీ కులాల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సాహసోపేతమైన నిర్ణయం అని బేడ (బుడ్గ) జంగాల నేతలు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌కు బేడ (బుడ్గ) జంగాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా­డుతూ.. సామాజిక సాధికారత కోసం ఆలోచన చేసే ఏకైక సీఎం జగన్‌ అన్నారు.

సంచార జాతులైన బేడ (బుడ్గ) జంగం కులాలకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మంచి చేశారని, తరువాత వచ్చి న ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. మళ్లీ సీఎం జగన్‌ వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. పెత్తందార్ల వ్యవస్థను చంద్రబాబు ప్రోత్సహిస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ నావాళ్లే అనుకునే నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. పేదలు ఏ కులంలో ఉన్నా వారికి మేలు చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు.  

మా కళను గుర్తించాలి 
ఏపీ రాష్ట్ర బేడ (బుడ్గ) జంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై పార్లమెంట్‌లో కూడా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కులాల్లోని కళను గుర్తించి గుమ్మెట తంబూర కళాకారులకు పింఛన్‌ మంజూరు చేయాలని, శ్రీశైలంలో తమ సామాజికవర్గీయుల అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని కోరారు.

పేదల పక్షాన ఈ ప్రభుత్వం: సజ్జల 
సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లలో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మేలు చేసిందని చెప్పారు. ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అయితే.. అట్టడుగు వర్గాల ప్రజల కోసమే రాజకీయం అన్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అన్నారు.

తండ్రి బాటలోనే సీఎం జగన్‌ నడుస్తున్నారని, ఆయన వద్ద చేయిచాచాల్సిన పని లేదని, హక్కుగా ఆయన దగ్గరకు రావచ్చన్నారు. గతంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్‌ ఉండేవారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్‌ ఉండేలా ఏర్పాటు చేశారని అన్నారు. రోగాల పేరుతో జైలు నుంచి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు వెనుక పెత్తందార్లు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు లేవన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు మాట్లాడారు. బీజెహెచ్‌పీఎస్‌ వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షత వహించిన ఈ సభలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి న బేడ, బుడ్గ, జంగం కులాల నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement