
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మరో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబా బాద్ సభకు వస్తారు.
అనంతరం వరంగల్ నగరం భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా పరిధిలోని సభల ఏర్పాట్లను గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్, శంకర్‌నాయక్ తదితరులు పరిశీలించారు.