Paleru
-
పాలేరు BRS అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
CM KCR Paleru Meeting Photos: పాలేరులో భారాస ప్రజా ఆశీర్వాద సభ (ఫోటోలు)
-
రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
-
దొడ్డుబియ్యాన్ని పక్కనపెడదాం.. సన్నబియ్యమే తిందాం: సీఎం కేసీఆర్
పాలేరు(ఖమ్మం జిల్లా): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీల వైఖరి గమనించి ఓటేయమని కేసీఆర్ విన్నవించారు. ‘కాంగ్రెస్ మోసం చేస్తే.. కేసీఆర్ శవయాత్రనా?.. తెలంగాణ జైత్రయాత్రనా? అనే తలంపుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి. పార్టీల వైఖరి గమనించి ఓటు వేయండి. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశాం. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ మోసం చేస్తే నేను దీక్ష చేపట్టాను. అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వ్యవసాయం స్థిరీకరణ జరిగేలా చర్యలు చేపట్టాం. రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. రైతులకు గత ప్రభుత్వాలు ఎలాంటి మేలు చేయలేదు. దేశంలో అత్యధిక ధాన్యం పండించే రెండో రాష్ట్రం తెలంగాణ. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారు. 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయి. పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చాం. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాం. అన్ని అవకాశాలు ఇచ్చినా తుమ్మల నిలబెట్టుకోలేకపోయాడు. తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు. ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడు. ఇక్కడ ప్రజలు ఒకటి గమనించాలి. తుమ్మలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందా?, బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేశాడా? అనేది గమనించాలి. పాలేరులో ఉపేందర్‌రెడ్డిని గెలిపించండి. నేను ఒకే ఒక్క మాట చెబుతున్నా. దళితబంధు, రైతు బంధు కొనసాగిస్తాం.ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తాం. రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తాం. 3 కోట్ల టన్నులు వరిధాన్యం పండించే తెలంగాణలో రేషన్‌కార్డు దారలందరికీ సన్నబియ్యమే పంపిణీ చేస్తాం. వచ్చే మార్చి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల -
నేడు మరో మూడు కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మరో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబా బాద్ సభకు వస్తారు. అనంతరం వరంగల్ నగరం భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా పరిధిలోని సభల ఏర్పాట్లను గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్, శంకర్‌నాయక్ తదితరులు పరిశీలించారు. -
ఒంటరిగా 119 స్థానాల్లో వైఎస్సార్టీపీ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పాలేరుతోపాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ కూడా ఎన్నికల్లో నిలబడతారని తెలిపారు. వైఎస్సార్టీపీ తర ఫున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు. -
TS Election 2023: ప్రధాన పార్టీల్లో గ్రూపు రాజకీయాలు..
ఖమ్మం: పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆధిక్యంతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశం అభివృద్ధి. ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచిన మూడు నెలలలోనే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఇంతవరకు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేకపోవడంతో పాటు కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరి తనకు ఓట్లేసిన కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టించాడు. దాంతో ఆయనకు కాంగ్రెస్‌లో పార్టీలో వర్గపోరు మొదలైంది. -
హైదరాబాద్ నుంచి బయలుదేరిన తుమ్మల.. కన్నీటి పర్యంతం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా బీఅర్ఎస్లో తుమ్మల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానంతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు బాగోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి. కాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. నేడు భారీ బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంకు వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీగా బల ప్రదర్శన చేయనున్నారు. ఇక తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించగా.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన అశ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భంగపడ్డారు. పాలేరు టికెట్‌ను కందాల ఉపేందర్ రెడ్డికి అధిష్టానం కేటాయించడంతో.. పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై అలకబూనారు. రాయబారాలు, బుజ్జగింపులపై అసహనంతో ఉన్న తుమ్మల.. పొలిటికల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు. చదవండి: Paleru Assembly Constituency: పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర కాగా.. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా కూడా ఆయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది. వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 23.5 బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 16.1 పెదవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 11 కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు) తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు -
ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
వైఎస్ఆర్టీపీ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
-
Paleru: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?
ఖమ్మం జిల్లాలో పాలేరు పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటాయి. కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు వామపక్షాల బలం సైతం ఇక్కడ బాగానే ఉంది. అయితే పాలేరు కాంగ్రెస్‌కు కంచుకోట అనే చెప్పాలి. 1962లో పాలేరు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలిచాయి. గతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009లో జనరల్ సీటుగా మారింది. ఒకప్పుడు వారికి కంచుకోట నియోజకవర్గంలో మొత్తం 2,15, 631 ఓటర్లున్నారు. 2009, 2014లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అనారోగ్యంతో వెంకటరెడ్డి మరణించడం వల్ల జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి రామిరెడ్డి సుచరితరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటికే ఎమ్మెల్సీ కోటలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును అధికార TRS పార్టీ పోటీ చేయించగా ఆయన 45 వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు పై 7 వేల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలానికే కందాల హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. తుమ్మల చుట్టే రాజకీయాలు ఈ సారి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు YSRTP నుంచి వైఎస్ షర్మిల, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, CPI నుంచి సీనియర్ నాయకుడు మౌలానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే పాలేరు సీటుకే అధిక డిమాండ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ టీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకు కలిసొస్తుందని అంటున్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు కూడా షర్మిలకు మరో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయి కేసులు పెట్టుకోవడం..ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం..వ్యతిరేక సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి ఘటనలు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తుమ్మల లేదా కందాలలో ఎవరికైనా ఒక్కరికే గులాబీ పార్టీ సీటు ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా రెండో వ్యక్తి ప్రత్యర్థిగా మారే పరిస్థితులుంటాయి. పార్టీలోని వర్గ విభేదాలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందుతోంది. పోలోమంటూ షిఫ్టింగ్‌లు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశం సొంత డబ్బుతో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్, నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం, రైతులు వెళ్లేందుకు డొంక రోడ్ల మరమ్మతులు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు విరాళం అందించడంతో కొంత సానుకూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా సీపీఎం సైతం పాలేరు టిక్కెట్ ను ఆశిస్తున్నప్పటికీ గులాబీ పార్టీ మాత్రం టిక్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తుమ్మల సైతం బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీపై అసంతృప్తితో ఉన్న తుమ్మలను బీఆర్ఏస్ ఆవిర్భావసభ నేపథ్యంలో దగ్గరికి తీసుకుంది. మంత్రి హరీష్ రావ్ తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో తుమ్మల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను సైతం చూసుకున్నారు. పార్టీ కూడా తుమ్మలకు ప్రాధాన్యతను పెంచింది. దీంతో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటి ఇచ్చారు తుమ్మల. అయితే తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల కీలక భూమిక పోషించబోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసీటిలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు తుమ్మల. అటు వైఎస్ షర్మిల సైతం కర్ణగిరి సమీపంలో క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా స్వగ్రామం తెల్దారుపల్లిలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. అసంతృప్తి రాగాలు సామాజిక వర్గాల వారీగా చూస్తే..పాలేరులో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లే. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలనే ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ప్రారంభించిన రోడ్ల పనులు మాత్రం పూర్తి చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోవడంతో వారిలో నిరాశ కనిపిస్తోంది. భక్త రామదాసు ప్రాజెక్ట్ క్రింద ఇంకా 10 గ్రామాలకు త్రాగు నీరు అందించాల్సి ఉంది. అది కూడ త్వరగా నేరవేర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు తేలేకపోవడంతో పాటు పార్టీ మారడం..పార్టీలో గ్రూప్ తగాదాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు అక్కడి పబ్లిక్. కొందరు అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నేత అయితే షాడో ఎమ్మేల్యేగా వ్యవహరిస్తూ ఎమ్మేల్యే ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంట్రవర్సీ నేతలను కంట్రోల్ లో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేకు మైనస్‌గా మారే ప్రమాదం ఉందని లోకల్ గా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పాలేరులో కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ఉండగా.. బీజేపీ నుంచి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పోటీ చేసేవారి జాబితాలో ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరులో ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పాలేరు రిజర్వాయర్‌కు 100 ఏళ్ళు
-
నేనిక ‘పాలేరు’ బిడ్డను..ఇక్కడ నుంచే పోటీచేస్తా!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు మట్టిలో ప్రజల రక్తం, శ్రమ అన్నీ ఉన్నాయి.. పాలేరు మట్టి సాక్షిగా మాటిస్తున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డ.. ఈరోజు నుంచి పాలేరు బిడ్డ.. పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలుపంచుకుంటుంది.. ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ప్రజలకు సంక్షేమ పాలన అందించే వరకు ఈ పోరాటం ఆపదు’.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తన గుండెలో నిజాయితీ, సేవ చేయాలన్న తపన ఉన్నాయన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన వారి ఇంటికే చేరుస్తానని హామీ ఇచ్చారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ఐదేళ్లలోనే 46 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించారని తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జలాలు పారించి 70 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందించారని, మంచినీటి శుద్ధి పథకంతో 108 గ్రామాలకు తాగునీరు అందించారని, ఐదేళ్లలోనే 20వేల ఇళ్ల నిర్మాణం చేయించారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు నియోజకవర్గంలో వెయ్యి ఇళ్లయినా కట్టించారా..? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలెదురైనా ముందుకే.. షర్మిలమ్మ పార్టీ స్థాపించి 16 నెలలే అయినా.. అధికార పక్షం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్తోందని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీచార్జ్ చేశారని, రైతులను కాపాడు దొరా.. అంటే అరెస్ట్ చేశారని, ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో షర్మిలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమి పూజ.. షర్మిలమ్మ భవిష్యత్తుకు పునాది రాయని స్పష్టం చేశారు. ఈ కార్యాలయం పేద, బడుగు, బలహీన వర్గాలకు ద్వారం లాంటిదని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో షర్మిల పాదయాత్ర కో–ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గడిపల్లి కవిత, సాంస్కృతిక బృందం అధ్యక్షుడు ఏపూరి సోమన్న, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు పాల్గొన్నారు. (చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా -
ఖమ్మం: వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి భూమి పూజ
-
‘గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చింది’
ఖమ్మం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పాలేరు ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ విజయయ్మ విన్నవించారు. ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో భాగంగా షర్మిల, విజయమ్మలు జిల్లాకు వచ్చారు. దీనిలో భాగంగా వైఎస్సార్టీపీ కార్యాలయానికి షర్మిల, విజయమ్మలు భూమి పూజ చేశారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. తన బిడ్డను ఆశీర్వదించాలని పాలేరు ప్రజలను కోరారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా విజయమ్మ పేర్కొన్నారు. కాగా, పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Telangana: టికెట్ లేకపోతే పార్టీలో ఎందుకుండాలి?
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లని గులాబీ దళపతి కేసిఆర్ ప్రకటించేశారు. మరోవైపు పాలేరులో ఎర్ర జెండా ఎగరేస్తామంటున్నారు తమ్మినేని వీరభద్రం. మరి పాలేరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంగతేంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? టిక్కెట్ దక్కే చాన్స్ లేని తుమ్మల ఖీఖ లోనే ఉంటారా? పార్టీ మారుతారా? తుమ్మల ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? కారులో కష్టంగా ప్రయాణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు కారులో ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే పార్టీలో తుమ్మల ఒంటరి అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సత్తుపల్లిలో జరిగిన ఎంపీ సన్మాన సభకు పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని అందుకే హజరుకాలేదని తుమ్మల ఓపెన్ గానే చెప్పారు. పిలవకుండా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనతోనే అర్థమవుతోంది, ఖమ్మం టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో? ఆ సభకు తుమ్మలను పిలవకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒత్తిడితోనే తుమ్మలను పిలవలేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఇన్ని అవమానాల మధ్య పార్టీలో ఉండటం కష్టమని తుమ్మల అనుచరులు అంటున్నారు. ఇంకా నాన్చకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తుమ్మలకు చెప్పారట. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గాని పాలేరు పరిధిలో గాని జనవరి మాసంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖరులోగా ఈ సభపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై సభలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్‌లకే సీట్లంటే ఎసరొచ్చినట్టేనా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడినప్పటినుంచీ కారులో తుమ్మల పొలిటికల్ జర్నీ ఇబ్బందికరంగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. గత రెండేళ్ల నుంచి పాలేరులో జరిగే టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుమ్మలకు ఆహ్వనాలు అందడంలేదు. ఏదో పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటివల ప్రకటించిన నేపథ్యంలో.. టిక్కెట్‌పై ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే టిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పోత్తులు దాదాపు ఖారారు అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు సీపీఎంకి కేటాయించాల్సి ఉంటుంది. మేం పోటీ చేస్తామంటున్న కామ్రేడ్స్ పాలేరులో ఎర్ర జెండా ఎగరవేస్తామని అక్కడ పోటీ చేద్దామనుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే చెప్పారు. ఇన్ని వ్యవహారాల మధ్య ఇక పార్టీలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తుమ్మల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాజేడులో జరిగిన ఆత్మీయ సభ వరకు ఉన్న ఈక్వేషన్స్..సత్తుపల్లిలో జరిగిన టిఆర్ఎస్ సభ తర్వాతి పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం తుమ్మల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్ లో ఉన్నారని.. ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉన్నందునే.. పార్టీ పక్కన పెట్టిందంటూ ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. సత్తుపల్లి సభకు తుమ్మలను పిలకపోవడం కూడ ఇందులో బాగామేనన్న వాదన కూడా వినిపిస్తుంది. తుమ్మల విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది గనుక..ఇక తుమ్మల కూడా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొలిటకల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి
సాక్షి, భద్రాచలం/ఖమ్మం: తొలి తరం కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే, భద్రాచలానికి చెందిన భీమపాక భూపతిరావు(91) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఆయనను ఇటీవల భద్రాచలం తీసుకొచ్చారు. కాగా, సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందారు. భీమపాక నాగయ్య, పుల్లమ్మ కుమారుడైన భూపతిరావు.. రావి నారాయణరెడ్డి, దొడ్డా నర్సయ్య ఉపన్యాసాలకు ఆకర్షితులై తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, రజాకార్లకు వ్యతిరేకంగా నాడు మధిర, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పట్టాలు తొలగించిన ఘటనల్లో ఆయన పాల్గొన్నారు. భద్రాచలం ఏజెన్సీలో బంజరు భూములు, ప్రభుత్వ భూములను పేదలకు ఇప్పించడంలో భూపతిరావు కీలకపాత్ర పోషించారు. అందుకు కృతజ్ఞతగా ప్రజలు ఆ కాలనీకి ఆయన పేరు పెట్టుకున్నారు. చదవండి: Hyderabad: రాజాసింగ్ అరెస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే భార్య 1983లో పాలేరు ఎమ్మెల్యేగా విజయం.. 1950లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సీపీఐ సభ్యత్వం తీసుకుని డివిజన్ మొదలు రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా సీపీఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితం గడిపిన ఆయన ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పార్టీకి ఇచ్చేశారు. పార్టీ ఇచ్చే వేతనంతో జీవితాన్ని సాగించారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భూపతిరావు కుమారుడు నగేష్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ఎంపికయ్యారు. -
ఖమ్మంలో సై అంటే సై! స్పీడ్ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. (చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?) పాలేరులో పోటా పోటీ.. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. వైరా ‘గులాబీ’లో వార్.. జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తమకే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. సత్తుపల్లిలోనూ ఇదే సీన్.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ మట్టా దయానంద్ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో దయానంద్ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. (చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్ఏలకు పేస్కేల్! రెవెన్యూలోనే కొనసాగింపు? ) -
తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చు.. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చ నడుస్తోంది. పార్టీ మార్పుపై తుమ్మల నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ ఓవైపు.. మరోవైపు ఆయన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలను ఉద్దేశించి చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటనలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం టీఆర్ఎస్లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పాలేరు నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు. అయితే.. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ కార్యకర్తల చేరికతో తన వర్గ బలాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల పార్టీ మారతారనే చర్చ సైతం జోరుగా నడుస్తూ వస్తోంది. అయితే టికెట్ విషయంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది. -
వరదలో చిక్కుకుపోయిన 21 మంది కూలీలు.. రాత్రంతా అక్కడే!
సాక్షి, మహబూబాబాద్/మరిపెడ రూరల్/మద్దిరాల: వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కూలీలు. కూలికోసం ఏరు దాటి వెళ్లారు. రోజువారీగా పనిచేస్తుండగానే ఒక్కసారిగా వచ్చిన వరద చుట్టుముట్టింది. రెండు పాయలుగా ఉన్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం శివారులో పాలేరు వాగులో మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించి కూలీలను శనివారం ఉదయం బయటకు తీసుకొచ్చింది. నీళ్ల మధ్య చిక్కుకున్న కూలీలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని కోట్యాతండా, వాల్యతండా గ్రామ పంచాయతీల పరిధిలోని చౌళతండాకు చెందిన 17 మంది, వాల్యతండాకు చెందిన నలుగురు.. మొత్తం 21 మంది కూలీలు సరిహద్దు ప్రాంతంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన తిరుమలయ్య వ్యవసాయ క్షేత్రంలోని వరి నాటు వేయడానికి ఆటోలో శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ వాగు 2 పాయలుగా చీలిన ప్రదేశంలో రైతు వ్యవసాయ భూమి ఉంది. ఉదయం నాటు వేయడానికి వెళ్లినప్పుడు మాములుగానే ఉండటంతో కూలీలు వెళ్లి నాటు వేశారు. తిరిగివస్తుండగా వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఎటుచూసినా నీరు.. మధ్యలో కూలీలు ఉండిపోయారు. బయటికొచ్చే మార్గం లేకపోవడంతో ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పారు. వారు అధికారులకు సమాచారం అందించారు. ఉదయం సురక్షితంగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూలీలను బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి డ్రోన్ ద్వారా కూలీలకు ఆహారం అందజేశారు. రాత్రి 2గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకున్నా వర్షం కురుస్తుండటంతో కూలీలను ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఎన్డీఆర్ఎఫ్ బృంద ఇన్చార్జి మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో శ్రమించి బోటు సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో కూలీలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ శశాంక్ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. చీకట్లో గడిపాం పాలేరు వాగు మధ్యలో ఉండిపోయి రాత్రంతా కారు చీకట్లో ఉండిపోయాం. అధికారులు ధైర్యం చెప్పినా భయం వేసింది. తాగేందుకు నీళ్లు కూడా లేవు. రాత్రి మొత్తం బురదలో నిలబడే ఉన్నాం. –తేజావత్ దేవి నా కొడుకు గుర్తుకొచ్చాడు వాగులో చిక్కుకున్న. నా రెండేళ్ల కొడుకు గుర్తుకు వచ్చి ఏడ్చా. తోటి కూలీలు ధైర్యం చెప్పి నన్ను ఓదార్చారు. అయినప్పటికి కొడుకును చూస్తాను అనుకోలేదు. –ఆంగోతు కవిత, చంటి బిడ్డతల్లి ఇదీ చదవండి: Telangana: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పార్కు
-
పాలేరులో ఢీ అంటే డీ
-
శృతిమించిన ఎమ్మెల్యే అనుచరుల వర్గపోరు
సాక్షి, ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచరుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. టీఆర్ఎస్ మండలాల కమిటీల ప్రకటన సందర్భంగా గురువారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం విదితమే. ఇక శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్‌తో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన సతీమణి బేబీ హాజరయ్యారు. ఇదే సమావేశానికి సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు భార్య, సర్పంచ్ అరుణ కూడా వచ్చారు. చదవండి: 10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్‌కు వెళ్లని పిల్లలు, దాంతో.. ఇంతలోనే వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుండగా, అప్పటికే కార్యాలయంలో మొహరించిన శేఖర్ అనుచరులు కార్యాలయ గేట్ వద్ద వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకున్నా సీఐలు సతీష్, సత్యనారాయణరెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ -
ఉధృతంగా పాలేరు వాగు.. రాకపోకలు బంద్
సాక్షి, కర్నూలు: గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మహానంది-గాజులపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు ఎన్జీవో కాలనీలో 14.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. కదిరిలో రికార్డుస్థాయిలో 21 సెం.మీ, రామకుప్పం మండలం బండారుపల్లెల్లో 10.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తిరుమలకొండలు తడిచి ముద్దవుతోంది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడా వీధులు జలమయం అయ్యాయి. కాటేజీల ఆవరణలో వర్షుపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు ప్రకృతి అందాలను సంతరించుకుంది. భారీ వర్షాలకు చలి తీవ్రత తోడుకావడంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. మరోపక్క జలాశయాలలో వర్షపు నీరు చేరుతుంది. నీటిమట్టం పెరుగుతుంది. ఇప్పటికే భక్తులు తక్కవ సంఖ్యలో తిరుమల కి వస్తున్నారు. కరోనా వైరస్ శ్రీవారి దర్శనాల సంఖ్యను టిటిడి తగ్గించింది. దీంతో నీటి వినియోగం కూడా తగ్గింది. మరోపక్క వర్షాలు కూడా సకాలంలో కురుస్తుంది. దీంతో మరో ఎడాదిన్నర పాటు తిరుమలలో నీటి కొరత ఉండే అవకాశం లేదు అంటున్నారు అధికారులు. తిరుమలలో ఐదు జలాశయాలు ఉన్నాయి. గోగర్బం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార,పసుపు ధార డ్యాములలో వర్షపు నీటితో నిండుతున్నాయు. జలాశయాలలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలన్ని అందాలను సంతరించుకుంది. -
చేపతో కాజాలు ఎలా చేయాలంటే?
కూసుమంచి: ‘నీకేం తెలుసు.. చేపల పులుసు’ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చేపలతో 90 రకాల వెరైటీలు చేయొచ్చని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వంటకాల తయారీలో మహిళలకు శిక్షణనిస్తూ ఘు మఘుమలాడుతోంది ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. పోషకాహార విలువలు కలిగిన చేపలు.. చికెన్, మటన్‌తో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. చేపలతో చేసే విభిన్న వంటకాలకు ప్రస్తుతం మార్కెట్లో మం చి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే చేపల వంటకాల తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్య పరి శోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో మహిళలకు శిక్షణనిస్తున్నారు. ఇక్కడ ఇదే తొలిసారి మహిళా మత్స్యకారులు కేవలం చేపలను పట్టి విక్రయిస్తేనే లాభం లేదు.. చేపల ఉత్పత్తులతో వంటకాలు తయారుచేసి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మూడు దఫాలుగా 180 మంది మహిళా మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళలకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తున్నారు. ఇందుకు వేదికైన పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన 50 మంది మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. శిక్షణానంతరం వీరంతా తాము తయారుచేసే చేపల ఉత్పత్తులతో స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు. మాంసంతో పచ్చళ్లు.. స్నాక్స్ ఏపీలోని భీమవరానికి చెందిన చేపల ఉత్పత్తుల తయారీ నిపుణురాలు పెన్మత్స భాగ్యలక్ష్మి పలు వంటలను పరిచయం చేస్తున్నారు. చేపల పులుసు, ఫ్రై, పచ్చడితోపాటు చేప కాజాలు, చేప చపాతీ, చేప ఫింగర్స్, చేప బజ్జీ, చేప పసంద్, చేప బిర్యానీ, ఫిల్లెట్స్, లాలీపాప్, సమోసాలు, రొయ్యల పొడి, రొయ్యల రోల్స్.. ఇంకా చేప మెత్తటి మాంసంతో కూర, పచ్చళ్లు, బోన్స్.. అందులోని కీమాతో స్నాక్స్.. ఇలా చేపలతో 90 రకాల వంటలను చేయవచ్చని ఇక్కడ చెబుతున్నారు. -
ఫిషరీస్ విద్యార్ధులు వల విసరడం కూడా నేర్చుకోవాలి..
చేపల్ని తేలిగ్గా పట్టాలంటే వల 1.2 నుండి 3.6 మీటర్ల వ్యాసార్ధంతో ఉండాలి.. వలను నీటిలోకి విసిరే ముందు శరీర కదలికల్లో చూపే నైపుణ్యం, ఒడుపును బట్టి ఎన్ని చేపలు వలకు చిక్కుతాయనేది ఆధారపడి ఉంటుంది.. చేపల్ని పట్టాక ఎండలో ఉంచితే 45 నిమిషాల్లో చెడిపోతాయి. నీడలో ఉంచితే రెండున్నర గంటల వరకు తాజాగా వుంటాయి.. రవ్వ, బొచ్చె, బంగారుతీగ రకాల కంటే జయంతి రోహూ, అమూర్ కార్పు రకాలు 17 శాతం ఎక్కువ దిగుబడులనిస్తాయి.. ఇవీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) కోర్సు విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో భాగంగా నేర్చుకుంటున్న పాఠాలు.. పొందుతున్న శిక్షణ. సాక్షి, కూసుమంచి: ‘పిల్లలకు చేపల్ని కొనివ్వడం కాదు.. పట్టడం నేర్పిస్తే జీవితాంతం సుఖంగా బతుకుతారు’ అనేది వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పే పాఠం. దీనికి తగ్గట్టే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగావకాశాల బాటలు వేస్తోంది పాలేరులోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. ఇక్కడ తెలంగాణలోనే తొలి బ్యాచ్‌కు చెందిన బీఎఫ్ఎస్సీ విద్యార్థులు మరికొద్ది రోజుల్లో శిక్షణను పూర్తి చేసుకోనున్నారు. పెబ్బేరు టు పాలేరు మత్స్య రంగం అభివద్ధికి పలు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం 2017లో వనపర్తి జిల్లా పెబ్బేరులో తొలి మత్స్య కళాశాలను ఏర్పాటుచేసింది. ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ రాసిన విద్యార్థులకు.. ర్యాంకు ఆధారంగా ఇక్కడి నాలుగేళ్ల బీఎఫ్ఎస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు. 25 సీట్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 14 జిల్లాలకు చెందిన విద్యార్థులు కోర్సును అభ్యసిస్తున్నారు. ఇక్కడ పాఠ్యాంశాల బోధన పూర్తి కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక మత్స్య పరిశోధన కేంద్రమైన పాలేరులో వీరంతా 120 రోజుల శిక్షణ పొందుతున్నారు. గతేడాది నవంబర్ 12న శిక్షణ ప్రారంభమైంది. కాగా, పెబ్బేరులోని మత్స్య కళాశాల, పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం.. ఇవి రెండూ పీవీ.నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఔత్సాహికులకు మాత్రమే చేపల పెంపకం– యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్‌పై నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో విద్యార్థులకు చేపల పెంపకం దగ్గరి నుంచి వల విసరడం, ప్రాసెసింగ్వరకు శిక్షణనివ్వడం ఇదే తొలిసారని, ఇకపై ఏటా విద్యార్థులకు ఈ శిక్షణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. తొమ్మిది అంశాలపై శిక్షణ విద్యార్థులకు థియరీకి అనుగుణంగా తొమ్మిది అంశాల్లో ఇక్కడ రోజువారీ శిక్షణనిస్తున్నారు. వల విసరడం, చేపల పెంపకం, మేత తయారీ– యాజమాన్య పద్ధతులు, చేపపిల్లల ఉత్పత్తి, చేపల్లో వచ్చే వ్యాధులు–నివారణ చర్యలు, చేపల ప్రాసెసింగ్, చేపలతో విలువైన ఆహార ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పర్యావరణ సమతుల్యం–చేపల పాత్ర వంటి అంశాలపై ప్రయోగాత్మక శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా వలను నేర్పుగా ఎలా విసరాలి? చేపల్ని ఎలా పట్టుకోవాలి? వాటిని ఎలా ప్రాసెస్ చేయాలనే దానిపై పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో శాస్త్రవేత్త శాంతన్న, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ నాగరాజు, నందిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పెబ్బేరు మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కిషన్‌కుమార్ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉద్యోగం.. లేదంటే ఉపాధి ప్రస్తుతం విద్యార్థులు వంద రోజులకుపైగా శిక్షణను పూర్తిచేసుకోగా, చివరి పది రోజుల్లో వీరిని విశాఖపట్నం హార్బర్‌కు తీసుకువెళ్లనున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కలిగిస్తారు. ఇక్కడ నేర్చుకున్న శిక్షణ, కలిగిన అవగాహన ఆధారంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్డీఓ)గా ఉద్యోగ అర్హత లభిస్తుందని, లేదా కన్సల్టెంట్లుగా, ఆక్వా రైతులకు సలహాదారులుగా, చేప ఉత్పత్తులు, ఆహార పదార్థాల తయారీలో నిపుణులుగా, చెఫ్‌లుగా స్వయం ఉపాధినీ కల్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సొంతంగా మత్స్య పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చని, స్వయంగా చేపల పెంపకాన్ని చేపట్టవచ్చని అంటున్నారు. ఇదే తొలిసారి.. మా కేంద్రంలో ఇప్పటివరకు 2వేల మందికి శిక్షణనిచ్చాం. తొలిసారి మత్స్య కళాశాల విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. చేపపిల్లల పెంపకం దగ్గర్నుంచి.. అవి ఆహార పదార్థాలుగా మారే వరకు వివిధ దశల్లో ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అనేక అంశాల్లో అవగాహన కలిగించాం. – డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం తొలి కళాశాల.. తొలి బ్యాచ్ తెలంగాణలోనే మాది తొలి మత్స్య కళాశాల. మా పర్యవేక్షణలో తొలిబ్యాచ్ విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకుని సేవలందించబోతున్నారు. చేపల పెంపకానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీళ్లలో ఆక్సిజన్ తగినంతగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన చేపల్ని ఎలా పెంచాలి? అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చాం. – డాక్టర్ కిషన్‌కుమార్, అసోసియేట్ డీన్, పెబ్బేరు మత్స్య కళాశా ఎన్నో విషయాలు నేర్చుకున్నా చేపల్ని పెంచే నీటి వనరుల్లో ఆక్సిజన్ ఎంత మోతాదులో ఉండాలి? తగినంత ఆక్సిజన్ కోసం సున్నం చల్లాలనే విషయాలు, ఏ రకం చేపలతో ఎక్కువ దిగుమతి వస్తుంది.. చేపలలో వచ్చే వ్యాధులు–నివారణ ఇలాంటి మరెన్నో అంశాల్లో ఇచ్చిన శిక్షణ మత్స్య రంగంపై అవగాహన కలిగించింది. వల విసరడాన్ని నేర్చుకున్నాం. – డి.శివాని, ములుగు జిల్లా నేల, నీరు తక్కువున్నా.. నేల, నీరు తక్కువగా ఉన్నా కూడా.. ఆక్వాఫోనిక్ పద్ధతిలో చేపల్ని పెంచవచ్చని తెలిసింది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలా? స్వయం ఉపాధి కల్పించుకోవాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. –జ్ఞానేశ్వర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా శిక్షణలో భాగంగా చేపల వల విసరడం ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు.. మత్స్యకారుల కోసం.. మాది మహబూబాబాద్ జిల్లా. మా జిల్లాలో నీటి వనరులు పెరిగాయి. చేపల్లో వచ్చే జబ్బులు– నివారణ చర్యలు, చెరువుల్లో నీళ్లు ఏ రంగులో ఉండాలి? చేపలకు ఎటువంటి మేత వేయాలనేది నేర్పారు. ఎఫ్‌డీఓగా మా జిల్లా మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతాను. – కళారాణి, మహబూబాబాద్ కేజ్‌కల్చర్ బాగుంది.. నాలుగేళ్ల విద్య పూర్తిచేసుకున్నా. చేపలు పట్టడం, పెంపకం, నిల్వ, మార్కెటింగ్ నైపుణ్యాలపై మెలకువలు నేర్చుకున్నా. కేజ్‌కల్చర్ విధానంలో చేపల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఎఫ్‌డీఓగా మత్స్యకారులకు సేవలందిస్తా. – కె.మధు, నాగర్‌కర్నూల్ -
టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యే కందాల
-
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్..
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ’హ్యాండ్’ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కారు ఎక్కనున్న ఆయన గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కందాల మాట్లాడుతు...త్వరలో తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి...టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కొన్నిచోట్ల ...బలహీనంగా ఉండగా, రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కందాల చేరిక టీఆర్ఎస్కు లబ్ది కానుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ... ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అలాగే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్... టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. -
తస్మాత్ జాగ్రత్త..
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రమైన కూసుమంచిలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాళ్లాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరగటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈఘటనలు పోలీసులకు కూడా సవాల్‌గా మారడంతో వారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన ఓ పత్రికా విలేకరి, పురుగుమందుల వ్యాపారి ఎండీ రంజాన్ ఆలీ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును, ఎల్ఈడీ టీవీ ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల వ్యవథిలోనే మార్చి 8న గ్రామానికి చెందిన అర్వపల్లి మౌలాలీ ఇంట్లో దొంగలు పడి 5తులాల బంగారు ఆభరణాలు, 60వేల రూపాయకల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు గృహాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ దొంగలు చాకచక్యంగా చోరీలకు పాల్పడటంతో గృహాల వారికి కునుకు పట్టడం లేదు. ఈ ఘటనలతో బాధితులతో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బెడదను అరికట్టాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే వేసవికాలం చోరీలు ఎక్కువగా జరిగే సీజన్. ఇప్పటికే చోరీలు ప్రారంభం కావటంతో పోలీసులు నిఘాను పెంచారు. -
అటకెక్కిన ‘సాలీడ్‌వేస్ట్’ ప్రాజెక్ట్
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రంలో చెత్తా చెదారం, వ్యర్థాలు లేకుండా చేసేందుకు అధికారులు వినూత్నంగా చేపట్టాలనుకున్న సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా డస్ట్బిన్లు (చెత్త డబ్బాలను) ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేందుకు వీలుగా అధికారులు ప్రాజెక్టును రూపొందించారు. 2015లో ప్రతిపాదించిన ఈప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం మండల కేంద్రంలో నెలకు టన్నుల కొద్ది చెత్తా, వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇళ్లలోని చెత్తతోపాటు బస్టాండ్ సెంటర్లో ఉన్న బడ్డీకొట్లు, చికెన్ సెంటర్లు, పండ్లు తదితర దుకాణాల నుంచి చెత్త టన్నుల కొద్ది వస్తోంది. వీటిని నేలకొండపల్లి వెళ్లే రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో ఆరోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఉంటే ఈ వ్యర్థాలతో ఎరువును తయారు చేయవచ్చు. పొడిచెత్తను వేరుచేసి విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుండేది. కాగా ఈప్రాజెక్టుకు నిధులు లేకపోవటంతో అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. అధికారులు, ప్రభుత్వం ఈప్రాజెక్టుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరులోనూ అంతే... పాలేరు గ్రామ పంచాయతీలో కూడా చెత్త, వ్యర్థాలను నివాసాల దగ్గర లోనే రోడ్డు పక్కన పడవేస్తున్నారు. గ్రామంలోని చర్చి సమీపంలో వ్యర్థాలను వేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురికి కూపంగా మారిన ఆప్రాంతలో నివాసస్థుల పరిస్థితి వర్ణణాతీతం. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు కోసం కృషి చేస్తా మండల కేంద్రంలో సాలీడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి దాని అమలుకు కృషిచేస్తా. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. పంచాయతీ తరుపున చర్యలు చేపడతాం. – చెన్నా మోహన్, సర్పంచ్ -
పెద్ద రైతులకు రేషన్ బంద్..!
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్‌తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్‌కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది. విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశాలు.. జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. రైతు బంధుతో .. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్‌ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్‌కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్‌ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులకు ఇబ్బంది లేదు.. తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్‌ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు. – కె.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎస్ఓ, ఖమ్మం -
మంత్రి ఓటమితో టీఆర్ఎస్లో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధాన్ని పెనవేసుకుని అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందడంతోపాటు జిల్లాలో టీడీపీ, టీఆర్ఎస్ హయాంలో రాజకీయ చక్రం తిప్పిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి చెందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిపై ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం చెందడం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 1983లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తుమ్మల.. గెలుపోటములను అనేకసార్లు చవిచూశారు. సత్తుపల్లి, ఖమ్మం వంటి నియోజకవర్గాల్లో పలుసార్లు గెలిచారు... ఓడారు. 2016 ఉప ఎన్నికల నుంచి పాలేరు నియోజకవర్గంతో ముడిపడిన రాజకీయ అనుబంధం.. అభివృద్ధిపై తన ముద్ర ఉండాలన్న తపన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరిచిన పరిస్థితులు దృష్ట్యా ఆయన విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు విశ్వసించాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గల సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థి స్థానికత వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయని, దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు పార్టీని బలహీనపరిచేలా చేసి ఓటమి అంచుకు చేర్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. మంత్రిగా తుమ్మల చేసిన అభివృద్ధిని వేనోళ్ల కీర్తించిన పార్టీ నేతలు, తమ మండలాల్లో ఆ స్థాయిలో ఓట్ల రూపంలో ప్రభావాన్ని చూపలేకపోవడానికి గల కారణాలపై పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల అత్యంత ప్రీతిపాత్రంగా భావించి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన తిరుమలాయపాలెం మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆశించిన మెజార్టీ రాకపోవడం సైతం పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేసింది. కనీసం పదివేల మెజార్టీ ఈ మండలంలో లభిస్తే.. ప్రతికూల మండలాల్లో కొంత మెజార్టీ తగ్గినా గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ అంచనాలు వేశారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడాన్ని తుమ్మల సహా పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రి తుమ్మల కొంత కలుపుగోలుగా, కార్యకర్తలకు సన్నిహితంగా ఉండాలని నియోజకవర్గం కోరుకున్నదని, దాని ప్రభావం సైతం ఈ ఎన్నికలపై పడిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను పాలేరు నియోజకవర్గానికి చేయగలిగిన అభివృద్ధి చేశానని, తిరుమలాయపాలెం వంటి మండలంలో కరువు ఛాయలు రూపుమాపడానికి నిరంతరం శ్రమించానని ఫలితాల అనంతరం సన్నిహితులతో జరిగిన సమీక్షలో తుమ్మల అభిప్రాయపడినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటి సారి పోటీచేసి ఓటమి చెందారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి ఓడిపోయారు. 1994లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1996 నుంచి 99 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో తిరిగి సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో ఆయన ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఓడిపోయారు. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా తుమ్మలకు పేరుండటంతో తుమ్మ ల 2014 సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీకి రాజీనా మా చేసి టీఆర్ఎస్లో చేరారు. చేరిన కొద్ది కాలానికే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం లభించింది. రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి.. తుమ్మలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గాన్ని రాజకీయ సుస్థిర స్థానంగా పెంపొందిం చుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించవచ్చునని భావించిన తుమ్మల, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి భక్త రామదాసు ప్రాజె క్టు వంటి పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయిం చారు. తుమ్మల ఓటమికి కారణాలపై మాత్రం ఎవరి రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. -
చేతికందని చేను
సాక్షి, ఖమ్మంరూరల్: సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు.. ప్రస్తుతం తెగుళ్ల బెడద.. వెరశి పత్తి, మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలకు చీడపీడలు సోకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేలన్నీ ఎర్రబారి.. మొక్కలు ఎండిపోయి.. ఎదుగుదల ఆగిపోయి.. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి, 1.40లక్షల హెక్టార్లలో పత్తి పంటలను ఈ ఏడాది రైతులు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు కొనుగోలు చేసి నాటిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొద్దోగొప్పో ఆదాయం రాకపోదా అనే ఉద్దేశంతో వర్షాభావ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా పత్తిని అత్యధికంగా సాగు చేశారు. పూత దశలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తిని పేనుబంక, పచ్చదోమ తెగుళ్లు ఆశించాయి. సరైన మందులను పిచికారీ చేయకుంటే ఈ పురుగులు పంట చివరి దశ వరకు ఉండి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో వాటి నివారణకు ఏం పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయానికి గురయ్యారు. ఈ సమయంలోనే ఆ తెగుళ్లు చేయాల్సిన నష్టాన్ని చేశాయి. దీనికి తోడు పైరు పిందె, కాయ దశల్లో తెల్లదోమ, పిండి పురుగు, నల్లి, కాయ తొలిచే పురుగులైన నల్ల మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మొదటి కాపులో దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల ఇప్పటికే రెండో కాపు వచ్చినా.. తెగుళ్ల ఉధృతి పెరిగి ఈసారి దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. ఇదిలా ఉంటే.. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ప్రస్తుతం భక్త రామదాసు నీళ్లు చేలల్లో పారుతున్నాయి. దీంతో రైతులు పత్తికి తడులు కట్టారు. అయితే పత్తి చేలు కొద్దిగా పచ్చబడ్డాయి. కానీ.. ఈ ప్రాంతంలో రెండో కాపునకు పేనుబంక, పచ్చదోమ ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో రెండో కాపులో ఎకరానికి క్వింటా దిగుబడి కూడా వచ్చేలా లేదు. ఆ పంట అమ్మితే వచ్చే డబ్బులు కూలీలకు కూడా సరిపోవని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం ఉంది. మిర్చి రైతు దిగాలు.. జిల్లాలో మిరప తోటల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తెగుళ్ల బారినపడి మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం తోటలు పూత, కాపు దశలో ఉండగా.. వేరుకుళ్లు, ముడుత, గుబ్బరోగం, ఎండు తెగులు లాంటివి సోకడంతో మొక్కలు చనిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు చేసిన తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లు ఆశించి పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. పదెకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట వర్షాలు లేక మూడుసార్లు పత్తి విత్తనాలు వేశాం. మొక్కల ఎదుగుదల సమయంలో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తిరిగి నీళ్లు పెడితే కొంతమేర పచ్చబడింది. తర్వాత పంటను చీడపీడలు ఆశించాయి. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల చొప్పున పెట్టుబడి పెట్టా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వమే పత్తి క్వింటాకు రూ.8వేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి. – యాట శ్రీను, రైతు, కామంచికల్, రూరల్ మండలం ఎదుగుదల ఆగిపోయింది.. నాటిన కొద్దిరోజుల వరకు మిర్చి పంట బాగానే ఉంది. నెలరోజుల క్రితం గుబ్బరోగం వచ్చింది. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. వచ్చిన కొద్ది కాయలు కూడా గిడసబారి సైజు తక్కువగా ఉన్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా రోగం తగ్గడం లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాణోత్ నరేష్, రైతు, రావిచెట్టుతండా, రూరల్ మండలం పసుపు రంగు అట్టలతో నివారణ మిర్చిలో గుబ్బరోగం అనేది తెల్లదోమ ఆశించడం వల్ల వస్తుంది. ఇది వచ్చిన తర్వాత పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు. గుబ్బరోగం నివారణకు ఎకరాకు 20 నుంచి 30 వరకు పసుపు రంగు అట్టలు పెట్టుకోవాలి. అట్టలకు జిగురు పూసి పంట చేనులో పెట్టడం వల్ల దోమలు ఆ అట్టలకు అతికి చనిపోతాయి. దీంతో గుబ్బరోగం కొంతవరకు తగ్గుతుంది. – ఝాన్సీలక్ష్మీకుమారి,జేడీఏ -
అధికార పార్టీ అయితే ఓకే..
ఏ వ్యాపారంలోనైనా కష్టాలు తప్పవు. ఇసుక వ్యాపారం మాత్రం సిరులు కురిపిస్తోంది. మండలంలోని పాలేరు, మన్నేరు సమీపంలోని గ్రామాల ట్రాక్టర్ యాజమానులు కేవలం ఇసుకపై ఆధారపడి రూ.లక్షలు గడిస్తున్నారు. దీనికి అధికార పార్టీ నాయకులు అండ ఉంటే చాలు. పాలేరు, మన్నేరుల్లో నేల కనిపించేలా ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు మాత్రం ఇసుకను ట్రక్కుల్లో తీసుకెళ్తూ డబ్బును సంచుల్లో నింపుకుంటున్నారు. సాక్షి, కందుకూరు : మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధి వెంకన్నపాలెం, విక్కిరాలపేట పంచాయతీ మధ్యలో ఉన్న పాలేరు ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఇసుక నాణ్యంగా ఉండటంతో ఇళ్లు కట్టుకునే వారు ఆ ఇసుకనే ఎక్కువగా కోరుకుంటున్నారు. పాలేరులోకి వెంకన్నపాలేనికి చెందిన ట్రాక్టర్లు, విక్కిరాలపేట సమీపంలో ఆ గ్రామానికి చెందిన ట్రాక్టర్లు ఎక్కువగా వెళ్లి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. ఆయా ట్రాక్టర్ల యాజమానులకు స్నేహితులు, అనుచరులుగా ఉన్న వారి ట్రాక్టర్లు కూడా వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాయి. రోజుకు 200 ట్రిప్పులకుపైగా ఇసుక తరలి వెళ్తోంది. కందుకూరుకు ఇసుక తరలించాలంటే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరుకు రూ.2 వేలకుపైగా తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ యాజమాని రోజుకు నాలుగు నుంచి ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. వేకువ జామున, సాయంత్రం సమయంలో మాత్రమే ఇసుక కొల్లగొడుతున్నారు. వెంకన్నపాలెం వద్ద సుమారు 30 అడుగులకు పైగా తవ్వకాలు జరిపారు. పాలేరులో చివరకు నేల కనిపిస్తోంది. ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా గోపాలపురం వద్ద మన్నేరులో ఇసుక అవసరమైన వారికి అధికారుల అనుమతితో ఇసుక తీసుకెళ్తున్నారు. గోపాలపురం వద్ద ఇసుకకు అనుమతి తీసుకొని వెంకన్నపాలెం, విక్కిరాలపేట వద్ద ఉన్న పాలేరు నుంచి భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీ అయితే ఓకే ఇసుక లోడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుంటే ఆ ట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడిదై ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అదే ట్రాక్టర్ సాధారణ వ్యక్తిదై ఉంటే డ్రైవర్ జైలుకు, ట్రాక్టర్ సీజ్, జరిమానా విధిస్తున్నారు. ట్రాక్టర్ల యాజమానులు ఇసుక తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కొందరు ట్రాక్టర్ యాజమానులు ముందుగానే అధికారులతో మాట్లాడుకొని మామూళ్లు ఇస్తున్నారు. ఆ ట్రాక్టర్లు ఇసుకను తరలించే సమయంలో ఏ అధికారీ ఆ వైపు వెళ్లరు. మిగిలిన ఏ ట్రాక్టర్ వెళ్లినా వెంటనే అధికారులు ప్రత్యక్షమై వారిని జైలుకు పంపిస్తున్నారు. ట్రాక్టర్ యాజమానుల మధ్య ఘర్షణ ఆయా గ్రామాలకు సమీపంలోని ఇసుక రీచ్‌ల వద్దకు బయట గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను రానివ్వకపోవడంతో ఇటీవల యాజమానుల మధ్య ఘర్షణ జరిగింది. కందుకూరు పట్టణానికి చెందిన ట్రాక్టర్లను పాలేరులోకి రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో విక్కిరాలపేట, వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుకను కందుకూరు పట్టణంలో ఎలా విక్రయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు పాలేరు, మన్నేరు సమీపంలోని మంచినీటి పథకాల బోర్లు, వ్యవసాయ బోర్లు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన జీవనం సాగించే రైతులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇసుక లేకుండా నేల కనిపించేలా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
భక్తరామదాసు ప్రాజెక్టులో భారీ ప్రమాదం
పాలేరు: భక్త రామదాసు ప్రాజెక్టులో భారీ ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం తలెత్తటంతో సంప్ హౌస్ లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో మోటార్లు మునిగిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. స్పందించిన అధికారులు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నీరు రాకుండా అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టుగా ఈ ఎత్తిపోతల రికార్డు సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని జనవరి 31వ తేదీన ప్రారంభించారు. -
అమ్మమ్మే ఆయుష్షు తీసింది
ఆడపిల్ల పుట్టిందనే కోపంతో బావిలో పడేసింది నేలకొండపల్లి(పాలేరు): తన కూతురుకు ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అమ్మమ్మే 13 రోజుల పాపను నీటి బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారానికి చెందిన నందిగామ రాము, అర్పన దంపతుల 13 రోజుల పాప ఆదివారం మంచంలో నుంచి అదృశ్యమైంది. మంగళవారం రాము ఇంటి వద్దనున్న బావిలో పాప శవమై కనిపించింది. పోలీసులు వచ్చి పాప మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే, పాపను అమ్మమ్మ వసంతే చంపి ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తూ.. ఆమెపై దాడి చేసేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు విచారించగా.. ఆమె తానే చంపినట్లు ఒప్పుకుంది. -
పాలేరును పరిశీలించిన ఎన్నెస్పీ ఎస్ఈ
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్‌ను ఆదివారం ఎన్నెస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు పరిశీలించారు. ఎగువన భారీ వర్షాల కురిసిన కారణంగా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆయన సిబ్బందితో కలిసి సమీప నల్గొండ జిల్లాలోని నర్సింహాపురం వాగును పరిశీలించారు. వరద ఉధృతిని అంచనా వేశారు. రిజర్వాయర్‌కు ప్రమాదం తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రిజర్వాయర్‌కు సుమారు 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నాయక¯ŒSగూడెం వద్ద ఇ¯ŒSఫాల్ రెగ్యులేటరీ కాలువలో నీటి ప్రవాహాన్ని ఎస్ఈ పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సిబ్బందితో సమీక్షించారు. ఇ¯ŒSటేక్‌వెల్ రింగ్‌బండ తెగి పోయి ఇ¯ŒSటేక్‌వెల్‌లోకి నీరు చేరగా.. దీని గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఎక్కువైతే ఎడమ కాలువకు నీటి విడుదలను పెంచాలని సూచించారు. ఈ నీటితో చెరువులను నింపనున్నట్లు ఎస్ఈ వివరించారు. ఆయన వెంట డీఈలు మన్మధరావు, వెంకటేశ్వరరావు, జేఈలు రమేష్‌రెడ్డి, నరేందర్, వర్క్ ఇ¯ŒSస్పెక్టర్ వాసూ తదితరులు ఉన్నారు. -
పెరుగుతున్న పాలేరు నీటిమట్టం
జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగునీటి అవకాశం కూసుమంచి: సాగర్ నుంచి మెుదటి జోన్‌కు నీటిని విడుదల చేయగా ఆ నీరు పాలేరు రిజర్వాయర్‌కు చేరుతుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆదివారానికి నీటి మట్టం 10 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. రోజుకు రెండు క్యూసెక్కుల నీరు చొప్పున పది రోజుల పాటు సాగర్ నీరు రిజర్వాయర్‌కు చేరుతుంది. మెుత్తం జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగర్ నీరు పంటలకు అందే అవకాశం ఉంది. కాగా కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు, నాయకన్‌గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట పంచాయతీల్లో మేజర్లు, మైనర్ల ద్వారా సుమారు 12 వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందనుంది. అలాగే పాలేరు చిన్న కాలువ కూడా మెుదటి జోన్లోకే వస్తుండటంతో ఈ కాలువ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన 20 వేల ఎకరాలకు కూడా త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పాలేరు అవుట్‌ఫాల్ నుంచి రెండో జోన్ మెుదలవుతున్నందున ఈ జోన్‌కు సాగు నీటిని విడుదల చేయాలంటే సాగర్ నిండాల్సిందేనని అధికారులు చెపుతున్నారు. పాలేరు నీరు తాగునీటికే.... పాలేరును పూర్థి స్థాయిలో నింపే క్రమంలోనే రెండో జోన్ ఆయకట్టు పరిధిలో తాగునీటì ని విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఖమ్మం నగరానికి నీటిని విడుదల చేస్తారు. రెండో జోన్‌కు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో సాగుకు ఆ నీటిని వినియోగించకుండా తగు చర్యలను ఎన్నెస్పీ అధికారులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
సాగర్ నుంచి పాలేరు దాకా..
* నీటి లభ్యతను బట్టి సాగునీరివ్వాలని తీర్మానం * నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం * ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు నీరు విడుదల చేయాలని మంత్రుల బృందం తీర్మానించింది. అలాగే నీటి లభ్యతను బట్టి పాలేరు వరకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డుతో సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, నీటి వినియోగంపై శనివారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా ప్రాజెక్టులు, వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై మంత్రుల బృందం సుదీర్ఘంగా సమీక్షించింది. దిగువ మానేరు ఆయకట్టుకు: దిగువ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి లభ్యతను అంచనా వేసి డ్యాం ఎగువ ప్రాంతాల్లోని పరిమిత ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. అలాగే లోయర్ మానేరు డ్యాం దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి 95 వేల ఎకరాలకు నీరివ్వాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పనులను ఆగస్టు నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ పరిధిలో గతం లో ఏటా రూ.60 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లిం చగా, ప్రస్తుతం ఆ భారాన్ని రూ.5 కోట్లకు పరిమితం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా చెరువు లు నింపే అవకాశాలపై కూడా సమీక్షించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో జలాశయాల్లో చేరుతున్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని హరీశ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు సునీల్, ఖగేందర్‌రావు, భగవంతరావు, వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మున్నేరు, పాలేరును ఒడిసిపడదాం
ఉప నదుల్లో లభ్యత నీటి వినియోగానికి సర్కారు ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది ఉప నదులైన పాలేరు, మున్నేరులలో లభించే జలాలను వీలైనంత వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఉప నదు ల్లో కలిపి లభ్యతగా ఉన్న 74 టీఎంసీల్లో వీలైనంత ఎక్కువ నీటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తక్షణమే ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టాలని, వీలును బట్టి బ్యారేజీలు కూడా నిర్మించాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. పాలేరు ఉప నది వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతంలో పుట్టి ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తుంది. దీని పరిధిలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. పాలేరు రిజర్వాయర్ ద్వారా 4 టీఎంసీలు, ఇప్పటికే నిర్మించిన 10 చెక్‌డ్యామ్‌ల ద్వారా మరో 3 టీఎంసీల నీటిని విని యోగించుకుంటున్నారు. మిగతా నీరంతా కృష్ణాలో కలసి ఏపీకి వెళుతోంది. దీంతో మరో 8 చెక్‌డ్యామ్‌లు కట్టి మరో ఒకటి రెండు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మున్నేరు వాగు నర్సంపేట ప్రాంతంలో మొదలై బయ్యారం మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. మున్నేరులో అత్యధికంగా 56 టీఎంసీల లభ్యత ఉంటున్నా... వైరా కింద 4 టీఎంసీలు, పాకాల కింద 3, లంకసాగర్ ప్రాజెక్టు కింద ఒక టీఎంసీ మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే 6 చెక్డ్యామ్లున్నా వాటిద్వారా వాడుతున్న నీరు చాలా తక్కువ. ఈ క్రమంలో ఇక్కడ కొత్తగా 7 నుంచి ఎనిమిది చెక్‌డ్యామ్‌లు కట్టి రెండు మూడు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టినా.. నీటి వినియోగం తక్కువగా ఉండే దృష్ట్యా ఒక బ్యారేజీ కూడా కట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నీటిపై ఏపీ ప్రాజెక్టు! మున్నేరు, పాలేరుల వరద నీటిని ఒడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలను తీర్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతలకు దిగువన పాలేరు, మున్నేరు నీటిని వినియోగిస్తూ వైకుంఠపురం బ్యారేజీని నిర్మించనుంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే.. గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ అంగీకరించదనే నిర్ణయానికి వచ్చిన ఏపీ.. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఈ రెండు ఉపనదుల నీటిని విని యోగించుకునేందుకు పూనుకోవడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే చర్చకు దారితీస్తోంది. -
‘పాలేరు’ ప్రజల తీర్పు హర్షం
కొడకండ్ల : పాలేరు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు హర్షనీయమని మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సల్దండి సుధాకర్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును భారీ మేజార్టీతో గెలిపించిన అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల రమేష్, బొమ్మరబోయిన రాజుయాదవ్, వెంకన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఖమ్మం: పాలేరు శాసనసభాస్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జిల్లాలోని పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభంకానుంది. మొత్తం 15 రౌండ్లలో పూర్తయ్యే ఓట్ల లెక్కింపు 10.30 నిమిషాలలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. -
పాలేరు ఫలితం నేడే
♦ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం ♦ 18 రౌండ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు ♦ 10 గంటలకల్లా అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ప్రధానంగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరులో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 1,90,351 ఓట్లకు 1,71,061 ఓట్లు (89.87 శాతం) పోలయ్యాయి. గురువారం ఖమ్మం పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో ఈ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 243 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి.. 66 మంది సిబ్బంది 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. -
పాలేరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
పాలేరు(ఖమ్మం జిల్లా): పాలేరులో ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 13 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడుతోన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెల్సిందే. -
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో సహా తెలంగాణలోని పాలేరు ఉప ఎన్నికకు సోమవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులో 232 స్థానాలకు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చెన్నైలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో డీఎంకే చీఫ్ కరుణానిధి, సినీ ప్రముఖులు కమల్ హాసన్, అజిత్ కుమార్, ఖుష్బూ తదితరులు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి జయలలిత స్టెల్లామేరీ కాలేజీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాల్లో 3,776 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 65వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అరవకురిచి, తంజావూరు స్థానాల్లో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అక్కడ ఎన్నికలను ఈసీ మే 23కు వాయిదా వేసింది. మే 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 109 మంది మహిళ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేరళలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ, సినీనటుడు, ఎంపీ సురేష్ గోపీ తదితరులు ఓటు వేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 19 గురువారం వెలువడనున్నాయి. -
రేపే పాలేరు ఉప ఎన్నిక పోలింగ్
► ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ► బరిలో 13 మంది అభ్యర్థులు ► ప్రధాన పోటీ టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యనే ► 243 పోలింగ్స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి ► 19న ఫలితాలు హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గంలోని 243 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరుపున దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలో నిలిచారు. ఆమెకు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ మద్ధతు ప్రకటించి ప్రచారం చేశాయి. సీపీఎం అభ్యర్థిగా సీపీఐ మద్ధతుతో పోతినేని సుదర్శన్ పోటీ చేశారు. అధికార టీఆర్ఎస్ తరుపున ఎన్నికల ఇన్చార్జిగా రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యవహరించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియోజకవర్గంలోని 4 మండలాల్లో మోహరించి, విజయం కోసం శ్రమించారు. కాంగ్రెస్ తరుపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, ఇతర మాజీ మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్ధతు ప్రకటించిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ తెలంగాణ నాయకులు కాంగ్రెస్ నేతలతో కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీలు విజయంపై ధీమాతో ఉండగా, ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ఈనెల 19న వెలువడే ఫలితాల్లో తేలనుంది. -
సీఈసీకి ఉత్తమ్ కుమార్ లేఖ
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఈ ఉప ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలుస్తుండటంతో ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని ఆయన తన లేఖలో కోరారు. నియోజకవర్గం పోలింగ్ బూత్ లలో ప్రతి ఈవీఎంకు ప్రింటర్లను అమర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికల సంఘం విధులు నిర్వహించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
'కేసీఆర్ కు ఫ్యాషన్ గా మారింది'
హైదరాబాద్ : పదే పదే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని బీజేపీ నేత రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కేసీఆర్‌కు ప్రజలపై లేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం రఘునందన్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పాలేరులో మేం ఎవ్వరికీ మద్దతు ఇవ్వం అని స్పష్టం చేశారు. -
కేసీఆర్ కు సుచరిత లేఖ
హైదరాబాద్: నాలుగు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి విరమించేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం సీఎంకు ఒక లేఖ రాశారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నికల్లో పలు విపక్షపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పోటీకి దిగొద్దని, ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అభ్యర్థించింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీసీఐ, సీపీఎంలు పోటీకి దిగబోమని ప్రకటించాయి. ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించిన సుచరితారెడ్డి టీఆర్ఎస్ కూడా ఏకగ్రీవానికి సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. పాలేరు ఉప ఎన్నికకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడింది. 29 వతేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలన, మే 2న నామినేషన్ల ఉపసంహరణ, మే 16న పోలింగ్, 19న కౌంటింగ్ జరగనుంది. పాలేరులో అధికార టీఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ మొదటి నుంచీ ఏకగ్రీవ పాట పాడుతున్నప్పటికీ దానిని సకాలంలో, బిగ్గరగా వినిపించడంలో విఫలమైంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అని తేలకముందు వరకు వైఎస్సార్ సీపీ తప్ప మిగతా పార్టీలైన టీడీపీ, సీపీఎం, సీపీఐలు పోటీకి కాలుదువ్వాయి. తుమ్మల రంగంలోకి దిగటంతో మళ్లీ ఏకగ్రీవం అంటూ మాటమార్చాయి. 'సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీకి దిగం' అనే రాసుకోని ఒప్పందానికి వైఎస్సార్ సీపీ ఒక్కటే కట్టుబడింది. -
పాలేరు బరిలోకి ‘నామా’ !
* రాష్ట్ర టీడీపీలో చర్చ * అధినేత నిర్ణయమే తరువాయి సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీపై రాష్ట్ర టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభ్యర్థిత్వం ఖరారైనట్లు ప్రకటన వెలువడడంతోనే టీడీపీలో కూడా పోటీపై చర్చ మొదలైంది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావును బరిలోకి దింపాలన్న డిమాండ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి వచ్చింది. ఈ మేరకు గురువారం ఖమ్మంలో భేటీ అయిన జిల్లా నేతలు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. టీడీపీ అధినేత నిర్ణయం కోసం పార్టీవర్గాలు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ నుంచి తుమ్మల టీఆర్ఎస్లోకి రావడం, మంత్రిగా నియమితులవడం, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వరుసగా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో తనకు పాలేరు అసెంబ్లీ టికె ట్ కావాలని తుమ్మల పట్టుబట్టినా కుదరలేదు. ఆయనకు పాలేరు టికెట్ రాకుండా నామా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అదే పాలేరు నుంచి ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగుతుండడంతో టీడీపీ కూడా బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. -
'పాలేరు ఉప ఎన్నికలో గెలుపు మాదే'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు మాదే అని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో రోడ్డులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేటీఆర్ భేటీ అయ్యారు. పాలేరు ఉప ఎన్నికపై ఈ సందర్భంగా వారిరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.... ఈ ఉప ఎన్నికలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయన్నారు. తుమ్మల అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో నిలబడితే గెలుపు కాయం అని సర్వేలో వెల్లడైందన్నారు. పార్టీలోని సీనియర్లతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో వరుస విజయాలతో తెరాస దూసుకుపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని తెలిపారు. పాలేరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలేరు ప్రజలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. విపక్షాలను ఎదుర్కొని మంచి విజయం సాధిస్తామని వెల్లడించారు. ఖమ్మం కార్పొరేషన్లో కూడా సంపూర్ణ అధిక్యాన్ని సాధించామన్నారు. అదే ఫలితం పాలేరులో పునరావృతమవుతోందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఎవరిని బరిలోకి దింపినా తెరాస పార్టీ మాత్రం చాలా బలంగా ఉందన్నారు. 2014 కంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా బలపడ్డామన్నారు. 27న ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోరమని చెప్పారు. ఈసీ పర్మిషన్ ఇస్తారన్న నమ్మకం ఉంది... ఖమ్మంలోనే ప్లీనరీ ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
పాలేరులో 16న ఎన్నికలు
హైదరాబాద్: వచ్చే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారు. అదే నెల 19న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో పాలేరులో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్లు 29వరకు స్వీకరిస్తారు. వీటి పరిశీలన ఈ నెల30 వరకు ఉండనుంది. మే 2ని నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండనుంది. -
రూ.4 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు
కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వాటర్‌గ్రిడ్ (జలాజలం) పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాలేరులో విలేకరులతో మాట్లాడారు. పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు గోదావరి నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక అందజేసినట్లు పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని కూసుమంచి, నేలకొండపపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్భన్ మండలాలతో పాటు ఖమ్మం నగరానికి, ముదిగొండ మండలంలోని కొన్ని గ్రామాలకు 1.48 టీఎంసీల పాలేరు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మాత్రం శుద్ధిచేయని జలాలను, మిగిలిన మండలాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తామన్నారు. వైరా రిజర్వాయర్ సెగ్మెంట్ పరిధిలో వైరా, కొణిజర్ల, బోనక ల్, ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, సత్తుపల్లి, కొత్తగూడెం, వేంసూరు,పెనుబల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు, నగర పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఇందుకోసం 1.13 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాలకు అశ్వాపురం సమీపంలోని పాములపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. పాలేరు గ్రిడ్ ద్వారా 365, వైరా గ్రిడ్ ద్వారా 565 హ్యాబిటేషన్లకు రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసవి నాటికి ఆయా రిజర్వాయర్లలో ఇన్‌టెక్ వెల్ (బావులు) నిర్మాణ పనులు 50 శాతం మేర అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. రిజర్వాయర్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు... పాలేరు రిజర్వాయర్‌ను సోమవారం వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సత్యపాల్‌రెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్ఈలు జగన్మోహన్రెడ్డి, సురేష్‌కుమార్ పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ మ్యాపులను, రిజర్వాయర్‌లో నిర్మించనున్న ఇన్‌టెక్‌వెల్ స్థలాన్ని చూసి, పలు అంశాలపై చర్చించారు. వారివెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేషం గౌడ్, డీఈఈ మాణిక్యాలరావు, ఏఈ మురళీకృష్ణ ఉన్నారు. -
'ఫ్యాను గాలికి నిప్పు తోడైంది'
ఖమ్మం: వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, వైఎస్ఆర్ సీపీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పాలేరు శాసనసభ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న పోతినేని సుదర్శనరావు విజయం తథ్యం అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నారాయణపురంలో ఆగస్టు 8, 1965లో జన్మించిన సుదర్శన్ రావు 2006లో ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో చిన్నబీరవల్లి ఎంపిటిసిగా ఎన్నికయ్యారు. 1995 నుండి 2000 వరకు బోనకల్ మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా, కొంతకాలం ఎంపిపిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. -
ఈతీరేంది భాయి.... చెప్పేద్దాం గుడ్‌బై!
రాజీనామా బాటలో తెలుగుతమ్ముళ్లు సాక్షి, ఖమ్మం,జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు రాజీనామా బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలే ఈపరిస్థితులకు దారితీస్తున్నాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఆయన తీరుతో విసుగుచెంది కొంతమంది ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొంత మంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సీటు రాకుండా అడ్డుకున్నారని ఏకంగా ఆపార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో పొత్తుతో మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి. జిల్లా టీడీపీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఏకస్వామ్య పోకడలతో పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టికెట్ వచ్చినా బీ-ఫాం ఇవ్వకుండా నామానే అడ్డుకున్నారని బాలసాని ప్రకటించినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలో నామా పెత్తనంపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని పాల్వంచలో ఆవర్గం నేతలు నామా పర్యటనకు అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తును విభేదిస్తూ మైనారిటీ నేతలు రోజుకొకరు రాజీనామాలు ప్రకటిస్తూనే ఉండడం గమనార్హం. ఈ పొత్తును నిరసిస్తూ ఖమ్మం పట్టణంలో నామా వర్గానికి చెందిన మహబూబ్అలీ, ఫయాజ్, రియాజ్, బడే సాహెబ్‌తో పాటు మరికొంత మంది ఇప్పటికే రాజీ నామా చేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అంటేనే మైనారిటీలు మండిపడుతున్నారు. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తన వర్గం అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన తీరును నిరసిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పాలేరులో సామాజిక వర్గం చిచ్చు.. పాలేరు నియోజకవర్గంలో పార్టీ మండల బాధ్యతలు ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. నాలుగు మండలాల పార్టీ బాధ్యతలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీలో చిచ్చు రేపింది. దీనికి అంతటికి కారణం నామానే అని ఇతర సామాజిక వర్గం నేతల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఈ కీలక సమయంలో నామా తన వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదని కూసుమంచి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన బాటలోనే నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది నేతలు పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండలంలో పార్టీ పరంగా గుర్తింపు ఉన్న మరోనేత రెండు, మూడు రోజుల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. పాలేరు సీటు తన అనుచరురాలికి ఇప్పించుకోవడం, బాలసాని టికెట్ విషయంలో రచ్చ జరిగాక కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ నేతలను పట్టించుకోకపోవడం ఆగ్రహం తెప్పించి వారంతా పార్టీకి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారు. రాజీనామా యోచనలో నామా శిబిరం విద్యావేత్త..? నామా శిబిరం నేతగా ఉన్న ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా అనుచర నేతగా గతంలో ఆయన గెలుపునకు కృషి చేసినా.. తనను పట్టించుకోకుండా ఆయన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న ఆవేదనలో సదరు విద్యావేత్త ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు చివరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. సహకారం లేనట్లేనా...? నామా ఎంత బుజ్జగించినా సహకరించేది లేదని బీసీలతో పాటు ఆయనపై వ్యతిరేకత ఉన్న ఇతర సామాజిక వర్గం నేతలు, మైనారిటీలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే గత ఐదేళ్లలో పార్లమెంటరీ నేతగా తమకు చేసింది ఏమీ లేదని, ఒక సామాజిక వర్గానికే అన్ని చేశారని బీసీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని, అదే జరిగితే విదేశాలకు వెళ్లి ఆయన వ్యాపారాలు చూసుకుంటారని, కేడర్‌ను పట్టించుకోరని ప్రస్తుతం పార్టీలోని ఆయన వ్యతిరేక శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలతో నామా ఏమేరకు గట్టెక్కుతారో అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.