
.పాలేరు రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితి
- జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగునీటి అవకాశం
కూసుమంచి: సాగర్ నుంచి మెుదటి జోన్‌కు నీటిని విడుదల చేయగా ఆ నీరు పాలేరు రిజర్వాయర్‌కు చేరుతుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆదివారానికి నీటి మట్టం 10 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. రోజుకు రెండు క్యూసెక్కుల నీరు చొప్పున పది రోజుల పాటు సాగర్ నీరు రిజర్వాయర్‌కు చేరుతుంది. మెుత్తం జిల్లాలో 32 వేల ఎకరాలకే సాగర్ నీరు పంటలకు అందే అవకాశం ఉంది. కాగా కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు, నాయకన్‌గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట పంచాయతీల్లో మేజర్లు, మైనర్ల ద్వారా సుమారు 12 వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందనుంది. అలాగే పాలేరు చిన్న కాలువ కూడా మెుదటి జోన్‌లోకే వస్తుండటంతో ఈ కాలువ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన 20 వేల ఎకరాలకు కూడా త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పాలేరు అవుట్‌ఫాల్ నుంచి రెండో జోన్ మెుదలవుతున్నందున ఈ జోన్‌కు సాగు నీటిని విడుదల చేయాలంటే సాగర్ నిండాల్సిందేనని అధికారులు చెపుతున్నారు.
పాలేరు నీరు తాగునీటికే....
పాలేరును పూర్థి స్థాయిలో నింపే క్రమంలోనే రెండో జోన్ ఆయకట్టు పరిధిలో తాగునీటì ని విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఖమ్మం నగరానికి నీటిని విడుదల చేస్తారు. రెండో జోన్‌కు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో సాగుకు ఆ నీటిని వినియోగించకుండా తగు చర్యలను ఎన్నెస్పీ అధికారులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.