
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.
గురువారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పాలేరుతోపాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ కూడా ఎన్నికల్లో నిలబడతారని తెలిపారు. వైఎస్సార్‌టీపీ తర ఫున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment