ఖమ్మం: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పాలేరు ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్ విజయయ్మ విన్నవించారు. ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్‌టీపీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో భాగంగా షర్మిల, విజయమ్మలు జిల్లాకు వచ్చారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌టీపీ కార్యాలయానికి షర్మిల, విజయమ్మలు భూమి పూజ చేశారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. తన బిడ్డను ఆశీర్వదించాలని పాలేరు ప్రజలను కోరారు.
ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, గొప్ప సంకల్పంతో షర్మిల మీ ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా విజయమ్మ పేర్కొన్నారు. కాగా, పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment