పాలేరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం | paleru by election polling started | Sakshi
Sakshi News home page

పాలేరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం

Published Mon, May 16 2016 8:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

పాలేరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం - Sakshi

పాలేరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం

పాలేరు(ఖమ్మం జిల్లా): పాలేరులో ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 13 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడుతోన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్‌సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement