started
-
పుష్ప విలన్ జాలిరెడ్డి పెళ్లి పనులు షురూ (ఫోటోలు)
-
ఇవాళ అర్ధరాత్రి నుంచే ‘రైతుభరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
సాక్షి,మహబూబ్‌నగర్:గతంలో కొడంగల్ నియోజకవర్గం వివక్షకు గురైంది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొడంగల్‌వైపు చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో నాలుగు కొత్త పథకాలను ఆదివారం(జనవరి26) రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. భూమికి, విత్తనానికి ఎంత సంబంధం ఉందో రైతుకు, కాంగ్రెస్‌కి అంతే అనుబంధం ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం.వ్యవసాయం అంటే దండగ కాదు పండగ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల లబ్ధి. 70 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలిచ్చాం. 13 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.సర్పంచ్ ఊళ్లో లేకపోతే పదవి నుంచి దిగిపో అంటాం. మరి ప్రతిపక్షనేత సభకు రాకపోతే ఏమనాలి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రేషన్ కార్డులివ్వాలనిపించలేదు.పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతిరెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు..ఏ పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తుంటే విమర్శిస్తున్నారు. వాళ్లలా కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి మేము దోచుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటారు. పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే వాళ్లకు కడుపు మంట వస్తోంది. అందుకే వారి కడుపు మంట తగ్గడానికి ఈనో ప్యాకెట్లు పంపుతున్నాం’అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. -
ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన
దేశంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అలా ఉద్యోగాలు దొరకనివారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతున్నారు. అలాంటివారిని చూసి, ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి చెందిన ఎంఏ చాయ్‌వాలా. వివరాల్లోకి వెళితే..చదువుకు ఫుల్స్టాప్ పెట్టి..ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాడు. అతని పేరు రాజ్ జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే.. ‘నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్బీఎస్ చౌరస్తాలో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్‌వాలా అని పేరు పెట్టాను’ అని తెలిపారు.తల్లి ఇచ్చిన డబ్బుతో..రాజ్ జైస్వాల్ బీఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందామనుకున్నాడు. ఆర్థిక పరిస్థుతుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, అవేవీ అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకుని ఎంఏ చాయ్ వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజ్ జైస్వాల్‌కు అండగా నిలిచింది. ఆమె తన తగ్గరున్న డబ్బు ఇచ్చి, టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది.రోజుకు 300 టీల విక్రయంఅందరూ ఇంట్లో తయారుచేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ మరింత రుచిగా ఉంటుందని రాజ్ జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజూ వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రూ.10 నుంచి రూ.40 ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజూ రాజ్ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తుంటాడు. ఈ లెక్కన రాజ్ ప్రతీనెలా టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవవచ్చు. ఇది కూడా చదవండి: 14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్‌కు రూ. 10 లక్షల జరిమానా -
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
-
హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు
త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఆదివారం జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, అధికారులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సమావేశంలో బీజేపీ నేతలు అభినందనలు తెలియజేయనున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలను ఖండిస్తూ, పలు రాజకీయ తీర్మానాలను కూడా ఆమోదించనున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 2025 మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. -
హజ్‌యాత్రలో అంతిమ ఘట్టం షురూ
సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. -
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
చార్ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్‌కు చేరుకున్న తరువాత కూడా చార్ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్‌లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. -
అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!
మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు (ఫొటోలు)
-
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
విశాఖలో పోలీస్ కమాండో పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు. విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్‌పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్‌సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
తొలి ΄పౌరుడు తనే!
సమర సింహారెడ్డి, అక్సా ఖాన్ జంటగా తెలుగు శ్రీను దర్శకత్వంలో ‘మగపులి’ సినిమా ఆరంభమైంది. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్’ (రైతే ప్రపంచంలో తొలి ΄పౌరుడు) ఉపశీర్షిక. ఎమ్బీడబ్ల్యూడీఏ సమర్పణలో నారాయణ స్వామి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి రైతు టి. రంగడు కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు సుమన్ క్లాప్ ఇచ్చారు. ‘‘నిరుద్యోగులు, రైతులు, రాజకీయ నాయకుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు తెలుగు శ్రీను. ‘‘ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల కన్నడలో సినిమాలు చేశాను. ఇప్పుడు మాతృ భాషలో సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు సమర సింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్. జె, కెమెరా: శివారెడ్డి యస్వీ. -
బీజేపీలో దరఖాస్తుల వెల్లువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు మొదటిరోజే ఏకంగా 182 దరఖాస్తులు సమర్పి చారు. ఐతే కొందరు ఒకటికి మించి స్థానాలకు తమ దరఖాస్తులను సమర్పి చడంతో... వాస్తవానికి 63 నియోజకవర్గాలకే అభ్యర్థులు అప్లికేషన్లు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దర ఖాస్తుల స్వీకరణ నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీనేతలు సుభాష్చందర్జీ, మల్లేశం గౌడ్లతో రాష్ట్ర పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 4 చోట్ల పోటీకి దరఖాస్తు చేసిన శ్రీవాణి: సికింద్రాబాద్ నుంచి పోటీకి రవిప్రసాద్‌గౌడ్ మొదటగా ఈ కమిటీకి దరఖాస్తు సమర్పి చారు. భద్రాచలం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వేములవాడ సీటుకు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అప్లికేషన్ పెట్టుకున్నారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా నాలుగు చోట్ల పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశమివ్వాలంటూ వేర్వేరు దరఖాస్తులు సమర్పించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ కోసం సామా రంగారెడ్డి దరఖాస్తు చేశారు. – కిషన్‌రెడ్డి పరిశీలన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అప్లికేషన్ ఇచ్చి న వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా నియోజకవర్గం వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. మీడియా ముందు హంగామా చేసే వారి దరఖాస్తులు పక్కన పెట్టాలని పార్టీనాయకులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇది ముగిశాక మూడు స్థాయిల్లో అంటే జిల్లా, రాష్ట్ర, జాతీయపార్టీ స్థాయిలలో వడపోత కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ నేతల సమాచారం. – 25 స్థానాలకు ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా పార్టీ ముఖ్యనేతలు, కచ్చి తంగా గెలిచే అవకాశాలున్న వారిని దాదాపు 25 స్థానాల వరకు కేవలం ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా సిద్దం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున ప్రతిపాదిత పేర్లతో రఫ్ జాబితా సిద్ధం చేసి రాష్ట్రపార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డుకు సమర్పి చవచ్చునని సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 113మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎక్కడికక్కడ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ సైతం పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోనూ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల ప్రక్రియ మొదటిరోజే వేగం పుంజుకుంది. రాబోయే ఆరు రోజుల్లో (ఈ నెల 10 వరకు) భారీగానే దరఖాస్తులు అందుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీ సేవలు మరింత పటిష్టం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అంబులెన్స్, అమ్మ ఒడి, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి, 34 హర్సె వాహనాలు ఉన్నాయి. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆశ కార్యకర్తలకు సెల్ ఫోన్ బిల్లు: హరీశ్‌రావు తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్సులు 316 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455కు పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచి్చందన్నారు. గతంలో అంబులెన్స్ చేరుకునే సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడది 15 నిమిషాలకు తగ్గిందని తెలిపారు. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం ద్వారా రోజుకు 4 వేల మంది గర్భిణులకు, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని అన్నారు. ఆ ఒక్క శాతం లోపంతో చెడ్డపేరు వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది 99 శాతం బాగా పనిచేస్తున్నప్పటికీ, ఒక్క శాతం లోపం వల్ల కూడా చెడ్డపేరు వస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా లోపాలు మాత్రమే కాకుండా చేస్తున్న మంచిని కూడా చూపాలని కోరారు.బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని చెప్పారు.ఆ పార్టీ రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు. -
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
రిలయన్స్ ఎంజే క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాక్‌లోని ఎంజే చమురు, గ్యాస్ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెల్లడించాయి. ఈ బ్లాక్‌లోని మరో రెండు క్షేత్రాలైన ఆర్–క్లస్టర్ నుంచి 2020 డిసెంబర్లో, శాటిలైట్ క్లస్టర్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఎంజే క్షేత్రం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేజీ–డీ6 బ్లాక్‌లోని మొత్తం మూడు క్షేత్రాల నుంచి రోజుకు 30 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కాగలదని రిలయన్స్–బీపీ తెలిపాయి. ఇది దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో సుమారు మూడో వంతు ఉంటుందని, డిమాండ్‌లో 15 శాతానికి సరిపోవచ్చని పేర్కొన్నాయి. ఎంజే క్షేత్రంలో కనీసం 0.988 టీసీఎఫ్ గ్యాస్ ఉంటుంది. -
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
న్యూజిలాండ్ లో మొదలైన న్యూ ఇయర్ సంబరాలు
-
BRS ఆవిర్భావం తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం
-
బిగ్ క్వశ్చన్: చంద్రబాబు చావు తెలివితేటలు..!
-
షోరూమ్ ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి
-
వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ?
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విలన్‌గా.. దక్షిణాదిన తిరుగు లేని విలన్‌గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది. చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి -
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
-
PSLV-C52 రాకెట్ ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్‌డౌన్
-
హైదరాబాద్‌లో ప్రారంభమైన దేవి నవరాత్రుల సందడి
-
గుడ్‌న్యూస్ : హెచ్-1బీ రిజిస్ట్రేషన్ షురూ
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి(మార్చి10)నుంచి ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది.లాటరీ ద్వారానే హెచ్-1బీ వీసాలు అందజేస్తామని, కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దరఖాస్తుదారుడు యూఎస్సీఐఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు(రూ.729)ప్రతి దరఖాస్తుదారుడు చెల్లించాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందించాలి. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు. కాగా హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంది. తద్వారా భారతీయులకు ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. గత ఏడాది యూఎస్సీఐఎస్కు సుమారు 2.67 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇందులో 60 శాతానికి పైగా భారత్‌కు చెందినవారు. ఈ ఏడాది కూడా దాదాపు 70 శాతం అంటే సుమారు 60వేల వీసాలు భారతీయులకి దక్కనున్నాయని అంచనా. -
ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 26 వరకు రోజుకు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు సెషన్లలో ఒక్కటి లేదా నాలుగు దఫాల్లోనూ విద్యార్థులు పరీక్షకు హాజరుకావచ్చు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే జేఈఈ ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోనున్నారు. నాలుగు దఫాలు కలిపి పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21.75 లక్షలు కాగా అత్యధికులు ఫిబ్రవరి సెషన్‌కే మొగ్గు చూపారు. మొదటి దశ (ఫిబ్రవరి) 6,61,761, రెండో దశ (మార్చి) 5,04,540, మూడో దశ (ఏప్రిల్) 4,98,910, నాలుగో దశ (మే)కు 5,09,972 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలివిడత పరీక్షకు 87,797 మంది హాజరైనట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం ఈసారి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లం, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీలోనూ పరీక్షలు రాయొచ్చు. అయితే అత్యధిక శాతం మంది ఆంగ్లంలో రాసేందుకు మొగ్గుచూపుతుండడం విశేషం. హిందీ, గుజరాతీ, బెంగాలీ తప్ప తక్కిన ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు చాలా తక్కువమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 371 మంది మాత్రమే తెలుగు మాధ్యమంలో పరీక్ష హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 13 మాధ్యమాలకు కలిపి 384 ప్రశ్నపత్రాలు ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. నాలుగు సెషన్లకు కలిపి నాలుగు లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేశారు. పరీక్ష విధానంలో మార్పు ఈసారి జేఈఈ సిలబస్, పరీక్ష విధానంలో కూడా ఎన్టీఏ మార్పులు చేశారు. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 30 చొప్పున ప్రశ్నలున్నాయి. ఒక్కోదాన్లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 న్యూమరికల్ ప్రశ్నలు ఇచ్చారు. న్యూమరికల్ ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు చాయిస్ ఇవ్వగా. 5 ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. నిపుణులు ఏమంటున్నారంటే.. ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షల్లో 30 శాతం సిలబస్‌ను తొలగించినా జేఈఈలో సిలబస్‌ను తగ్గించకుండా 25 శాతం వరకు చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆందోళన తప్పుతుందని చెబుతున్నారు. ‘2019–20 ప్రశ్నపత్రాలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉండి డిఫికల్టీ లెవల్ తగ్గింది. ఈసారి డిఫికల్టీ స్థాయి మరింత తగ్గుతుంది. ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి అయినందున ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ రాసే విద్యార్థులు 99 పర్సంటైల్ స్కోర్ చేసే అవకాశముంటుంది. గత మూడేళ్ల మెయిన్ పర్సంటైల్ గమనిస్తే ఫిజిక్స్‌లో 70 శాతం మార్కులు స్కోర్ చేస్తే 99 పర్సంటైల్ వచ్చింది. ఈసారి 50 శాతం మార్కులు సాధించినా 99 పర్సంటైల్ రావచ్చని పేర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి 2 గంటల ముందే చేరుకోవాలి.. – విద్యార్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏన్టీఏ సూచించింది. – పరీక్షలు ఉదయం సెషన్లో 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. – పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. – రఫ్ వర్క్ కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. – పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లే ముందు విద్యార్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పై భాగంలో రాసి ఇన్విజిలేటర్‌కు తప్పనిసరిగా అందించాలి. – మధుమేహం ఉన్న విద్యార్థులు తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, షుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. -
ప్లిస్కోవా శుభారంభం
న్యూయార్క్: ఒకవైపు కరోనా వైరస్ భయం... మరోవైపు పలువురు టాప్ స్టార్లు గైర్హాజరు... ఇంకోవైపు కఠినమైన ఆంక్షలు... ప్రేక్షకులకు లేని ప్రవేశం... ఖాళీ ఖాళీగా స్టాండ్స్... ఎలాగైతేనేం సోమవారం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు తెర లేచింది. మొదటి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)... 2016 చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) అలవోక విజయాలతో శుభారంభం చేసి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో 2016 రన్నరప్ ప్లిస్కోవా 6–4, 6–0తో అనెహెలినా కలినినా (ఉక్రెయిన్)పై 63 నిమిషాల్లో గెలుపొందగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కెర్బర్ 6–4, 6–4తో 88 నిమిషాల్లో ఐలా టొమ్లియానోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. కలినినాతో జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా ఏడు ఏస్‌లు సంధించి, 16 అనవసర తప్పిదాలు చేసింది. టొమ్లియానోవిచ్తో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో 27వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా) 7–5, 6–3, 6–1తో అందుఆర్ (స్పెయిన్)పై నెగ్గగా... 18వ సీడ్ లాజోవిచ్ (సెర్బియా) 1–6, 6–4, 4–6, 4–6తో జెరాసిమోవ్ (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. ప్రేక్షకులకు ప్రవేశం లేకపోవడంతో ఖాళీగా ఉన్న గ్యాలరీలు -
అక్కడ బాక్సింగ్ మొదలైంది...
మనాగ్వా (నికరాగ్వా): కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్లు నిరవధిక వాయిదా పడిన తరుణంలో... సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాలో మాత్రం బాక్సింగ్ పోటీలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దేశ రాజధాని అయిన మనాగ్వాలో జరిగిన ఎనిమిది బౌట్లను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ బౌట్లకు వేదికగా నిలిచిన అలెక్సిస్ అర్గొయె జిమ్‌లో 8 వేల సీటింగ్ సామర్థ్యం ఉండగా... 10 శాతం మందే ప్రత్యక్షంగా వీక్షించారు. బౌట్లను తిలకించేందుకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించారు. తమది పేద దేశమని బాక్సర్లకు పూట గడవాలంటే వారు బౌట్లో అడుగుపెట్టాల్సిందేనని టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. దాంతో పాటు తమకు కరోనా అంటే భయం లేదని కూడా వారన్నారు. -
నిమ్స్ ఓపీ సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు మం గళవారం నుంచి మొదలయ్యాయి. దేశంలో అ మలవుతున్న లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా బోసిపోయినట్లున్న ఆస్పత్రికి మళ్లీ రోగుల రాక మొదలైంది. రవాణా సదుపాయం లేకపోవడం ఒక కారణమైతే..నిమ్స్‌లో కరోనా అనుమానితులకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో చాలామంది ఆస్పత్రికి రావడానికి భయపడిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను నాన్–కరోనా ఆస్పత్రిగా ప్రకటించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న రోగులు నిమ్స్‌కు రావడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సాధారణంగా అవుట్ పేషెంట్ విభాగాలను పాత భవనంలో ఓపీ బ్లాక్‌లోనూ, స్పెషాలిటీ బ్లాక్‌లోనూ నిర్వహిస్తారు. ప్రస్తుతం అన్ని ఓపీ సేవలను ఒక దగ్గరే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మిలీనియం బ్లాక్‌లో స్క్రీనింగ్ టెస్ట్.. ఓపీ సేవల కోసం వచ్చిన ప్రతిరోగికి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే ఓపీ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే వారిని గాం ధీ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. ఇలా మంగళవారం 280 మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. అందులో తొమ్మిది మందిలో కరోనా వైరస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తూ ఆయా రోగులను గాంధీకి తరలించినట్టు సమాచారం. గతంలో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ లక్షణాలు కన్పించిన నేపథ్యంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
స్టేషన్‌ఘన్‌పూర్: పేదల సొంతింటి కలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో 2 లక్షల 83 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, లక్షా 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా రూ.7,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం ఇచ్చిన మాట తప్పరని, ఏది చెప్పారో అదే చేస్తారని అన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని, ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ47 ఉపగ్రహ వాహకనౌక బుధవారం నింగిలోకి ఎగరనుం ది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.28కి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభిం చారు. సోమవారం ఎంఆర్ఆర్ కమిటీ ఆధ్వర్యం లో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించి రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రయోగపనులు లాంచ్ ఆథరైజేషన్ బోర్టు (ల్యాబ్)కు అప్పగించారు. కౌంట్‌డౌన్‌లో భాగంగా నాలుగోదశ, రెండోదశలో ద్రవ ఇందనాన్ని నింపే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ 47 ద్వారా 714 కిలోల బరువున్న కార్టోశాట్–3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నా రు. మంగళవారం ఇస్రో చైర్మన్ శివన్ షార్కు చేరుకుని రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. తిరుమలలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ కె.శివన్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని పీఎస్ఎల్వీ సీ–47 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి, పూజలు చేయిం చారు. అనంతరం శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సూళ్లూరుపేట చేరుకుని చెంగాళమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చంద్రయాన్ – 2 ప్రయోగానికి ఇస్రో మరోమారు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. -
పింక్ బాల్‌తో మనోళ్ల ప్రాక్టీస్
ఇండోర్: భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్ బాల్‌తో అతను డిఫెన్స్ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్ ప్రాక్టీస్ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పిల్లలతో కోహ్లి గల్లీ క్రికెట్... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్ నెట్టింట బాగా వైరల్ అయింది. చెక్ షర్ట్, జీన్స్ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ ‘లైక్’ చేశారు. చీకట్లో కాస్త క్లిష్టం కావొచ్చు; పింక్ బాల్‌పై పుజారా వ్యాఖ్య బెంగళూరు: డేనైట్ టెస్టు కోసం ఉపయోగించే గులాబీ బంతితో రాత్రయితే దాన్ని చూడటంలో సమస్య ఎదురవుతుందని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘నేను ఇదివరకే దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో ఆడాను. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుంది. అయితే పగటి సమయంలో పింక్‌బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందేమో! అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా మారొచ్చు’ అని పుజారా అన్నాడు. టీమిండియాలో కెప్టెన్ కోహ్లి సహా చాలా మందికి పింక్‌బాల్‌తో ఆడటం కొత్త. పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది. రెడ్‌బాల్ కంటే ఎక్కువ కష్టపడాలి... రెడ్‌బాల్‌తో పోలిస్తే పింక్‌బాల్‌తో ఆడేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘నా వరకైతే గులాబీ బంతి ఆటకు నేను కొత్త. ఇది కాస్త భిన్నంగా అనిపించింది. మా దృష్టంతా బంతి స్వింగ్, సీమ్‌పైనే ఉంటుంది. నా అంచనా ప్రకారం బంతిని శరీరానికి దగ్గరగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు. -
పాక్ మీదుగా రయ్రయ్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు పాకిస్తాన్ గగనతలాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారత్, పాకిస్తాన్ల మధ్య విమానయాన సేవలను మంగళవారం పునరుద్ధరించింది. బాలాకోట్ దాడుల అనంతరం దాదాపు నాలుగున్నర నెలల తర్వాత అన్ని పౌర విమానాలను తమ భూభాగంలోకి అనుమతించింది. ఈ మేరకు పాకిస్తాన్ విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమానయాన సేవలను పునరుద్ధరించనున్నట్లు భారత్ పేర్కొంది. ఇరు దేశాల గగనతలాలపై విమానాలు తిరిగేందుకు ఎలాంటి ఆంక్షల్లేవని భారత పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు చాలా మేలు కలుగుతుందని పేర్కొంది. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో విమానాలను దారి మళ్లించడం ద్వారా రూ.491 కోట్ల నష్టాలను చవిచూసిన ఎయిరిండియా విమాన సంస్థకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఉన్న 11 గగనతలాల్లో కేవలం రెండింటినే అందుబాటులో ఉంచింది. అయితే తన గగనతలంపై విధించిన తాత్కాలిక ఆంక్షలను భారత్ ఎత్తేసింది. దీనివల్ల వాణిజ్య విమానయాన సంస్థలకు పెద్దగా లాభం చేకూరలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో జూలై 2 వరకు స్పైస్‌జెట్ రూ.30.73 కోట్లు, ఇండిగో 25.1 కోట్లు, గోఎయిర్ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు జూలై 3న రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. -
ఇక షురూ
దాదాపు ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు అఖిల్. ‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి చిత్రాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా ఆరంభమైన సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్ పదిరోజులపాటు సాగుతుందట. నెక్ట్స్ ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట టీమ్. ప్రస్తుతం హీరోపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఎంపికయ్యారు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
రూ 8 కోట్లతో ఆసుపత్రి నిర్మాణంపనులు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం కడపలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలకు, శాశ్వత భవన నిర్మాణాల కోసం నేషనల్ ఆయుష్ మిషన్ కింద రూ. 8 కోట్లు కేటాయించింది. అధికారుల సమన్వయ లోపం, స్థలం కేటాయింపులు తదితర సమస్యలు శాపంగా మారాయి, దీనిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు హోమియోపతికి పట్టిన గ్రహణం వీడింది. కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పక్కన గల స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గుడివాడ, రాజమండ్రి తరువాత కడపలో మాత్రమే ఈ వైద్యశాల ఉండడం గమనార్హం. కడప రూరల్: కడప నగరంలో 1984లో 45 పడకల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఏర్పాటైంది. మొదట్లో ఈ ఆసుపత్రి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండేది. కొన్నేళ్లుగా పాత రిమ్స్‌లో అసౌకర్యాల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం కడప పాత రిమ్స్‌లో కొనసాగుతున్న ఆసుపత్రిలో నాటి నుంచి నేటి వరకు పట్టిన సమస్యల జబ్బు వీడలేదనే చెప్పవచ్చు. ఇక్కడకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 250 మందికి పైగా వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. అయితే ఇన్ పేషెంట్లకు అవకాశం ఉన్నా ఎవరూ అడ్మిట్ కాకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో 45 పడకలను కింద, పై భాగాల్లో ఏర్పాటు చేశారు.ఇక్కడ నెలకొన్న సమస్యల కారణంగా పై భాగంలో ఏర్పాటు చేసిన గది పనికి రాకుండాపోయింది. దీంతో 45 పడకల వైద్యశాల కాస్తా 19 పడకల ఆసుపత్రిగా మారింది. ఇందులో పక్షవాతం, ఆస్తమా, థైరాయిడ్, మధుమేహం, చర్మ సంబంధిత తదితర వ్యాధులకు వైద్యం లభిస్తుంది. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేనందున చాలా మంది ఈ వైద్యం పట్ల మక్కువ చూపుతున్నారు. నిధులు కేటాయించినా.. ఈ ఆసుపత్రికి శాశ్వత భవన నిర్మాణం కోసం కడప నగరం జయనగర్ కాలనీలోని సర్వే నెంబరు 752–291–01లో 34 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ మేరకు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఆయుష్ మిషన్’ కింద రూ. 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ‘ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ ఆసుపత్రి భవన సముదాయాలను నిర్మించాలి. అయితే కేటాయించిన స్థలం చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో కడప పాత రిమ్స్‌లోనే వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దాదాపు 42 సెంట్ల స్థలంలలో ఆసుపత్రిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ భవన నిర్మాణాల కోసం ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ వారు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ స్థలంలో ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. -
ఇక సినిమా హాలు మీ ఊరికే..
సాక్షి, న్యూఢిల్లీ : సినిమా హాలు ఏంటి? మన ఊరికి రావడమేంటని అనుకుంటున్నారా?. ఇప్పటివరకూ మనం మొబైల్ ఆస్పత్రులు, క్యాంటీన్లను మాత్రమే చూసుంటాం. కొత్తగా మొబైల్ సినిమా హాలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సతీష్ కౌశిక్, పారిశ్రామికవేత్త సునీల్ చౌదరి ‘పిక్చర్ టైం’ బ్రాండ్ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఓ కంటెయినర్, బెలూన్ లాంటి పెద్ద టెంటు సాయంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 60x30 అడుగుల వైశాల్యంలో ఉండే ఈ తాత్కాలిక థియేటర్లో సుమారు 200 సీట్లు ఉంటాయి. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకొని నిలిచే మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. ఏసీ సదుపాయం కూడా ఉంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమా హాలుకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాలకు దీంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి ఇలాంటి యూనిట్లు 10 వరకు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది చివరకు వీటి సంఖ్యను 150కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర 30-60 రూపాలయల వరకు ఉంటుందని వారు తెలిపారు. -
మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు: జేసీ
వీపనగండ్ల: జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం సంగినేనిపల్లిలో డీఆర్డీఏ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటి గ్రేడ్ ధాన్యానికి రూ.1590, రెండవ గ్రేడ్‌కు రూ.1550 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీ బ్యాగులు, ధాన్యం వివరాలను ఆన్లైన్ చేసేందుకు ట్యాబ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొన్న ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తామని తెలిపారు. డీఆర్డీఓ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బీపీఎం భాషనాయక్, జిల్లా మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మయ్య, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, సర్పంచ్ వీరయ్య, ఏపీఎం వెంకటేష్, విండో చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
ఆదిలాబాద్‌టౌన్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ఈనెల 13వరకు జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,314 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. 11 మంది ఏసీఓలను, 1524 మంది ఏఈలను, 259 సీఈలను 520 స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. 24 జిల్లాలకు సంబంధించి 5,64,626 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ అనురాధ తెలిపారు. తెలుగు, ఉర్దూ జవాబు పత్రాలు 90,233, హింది 68,450, ఆంగ్లం 65,196, గణితం 98,794, సామాన్యశాస్త్రం 98,215, సాంఘిక శాస్త్రం 1,43,739 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. డీఈవో క్యాంప్ ఆఫీసర్‌గా, డెప్యూటీ ఈఓ, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మూల్యాంకనం ఉదయం 9 నుంచిమధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు జరగనుంది. రోజుకో ఉపాధ్యాయుడికి 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేసేందుకు ఇవ్వనున్నారు. స్పాట్ బహిష్కరణ వాయిదా.. స్పాట్ బహిష్కరిస్తామని ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో స్పాట్ బహిష్కరణ వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. 34 డిమాండ్లతో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. చర్చలు జరిపిన డెప్యూటీ సీఎం త్వరలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్పాట్ యథావిధిగా జరగనుంది. కాగా డీటీఎఫ్ సంఘం స్పాట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. -
పోతారం పంప్‌హౌస్ ప్రారంభం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండల పరిధిలోని పోతారం పంప్‌హౌస్‌ను చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోక, నీరులేక మూలకు పడ్డ పోతారం చెరువుకు నీరు ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనమన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గురించి, ఈ ప్రాంత ప్రజల బాధను సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగానే,, వారు పోతారం పూర్తి చేయాలని అధికారులకు ఆదే«శాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌వారు టీఆర్ఎస్ చేసే మంచి పనులకు ఎప్పుడూ అడ్డుపడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సింగిల్‌విండో చైర్మన్ పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, బొట్ల ప్రసాద్, కుంట కృష్ణవేణి, సమిరిశెట్టి విమల పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రాజెక్టుల బాట
-
ఇవాల్టి నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం
-
‘అల’వోకగా
సర్కారు బడుల్లో..‘ఆనంద లహరి’ జిల్లాలో 135 పాఠశాలలు ఎంపిక మొదటి దశ ప్రారంభం 1.2 తరగతులకు నూతన అభ్యసన ప్రక్రియ రిషివ్యాలీ తరహాలో విద్యాబోధన విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించిందేకు విద్యాశాఖ అధికారులు ఆనందలహరి (అల)పథకాన్ని రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతి విద్యార్థులకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో తరగతి గదులను నూతనంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు ఆడుకుంటూ అక్కడే ఉన్న బోధనోపకరణాలను సందర్భోచితంగా ఉపయోగించుకుంటారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి, మండలానికి రెండు పాఠశాలల వంతున ఎంపిక చేశారు. మొదటి దశలో రెవెన్యూ డివిజన్లలో ‘ఆనందలహరి’ కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం ప్రారంభించారు. - రాయవరం(మండపేట) రాష్ట్ర వ్యాప్తంగా ఈ ‘అల’ అభ్యసన విధానం అమలు చేసేందుకు 1,342 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 135 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి దశలో ఏడు రెవెన్యూ డివిజన్లలో ప్రారంభిస్తుండగా..కాకినాడ రూరల్ మండలం పండూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. మిగిలిన డివిజన్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. స్వీయం..సరళం.. ‘అల’ విధానంలో ఆయా పాఠశాలల్లో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు ఈ విధానంలో బోధన సాగిస్తారు. విద్యార్థులు పుస్తకాలను ఇంటి నుంచి తీసుకుని రావాల్సిన పనిలేదు. ఐదుగురు ఒక విద్యార్థులకు ఒక ట్యాబ్ వంతున ఇస్తారు. ఇక్కడ బోధన అంతా స్వీయ అభ్యసనంతో పాటు సరళమైన విధానంలో ఉంటుంది. ఒక అడుగున్న టేబుల్ చెస్ బోర్డు తరహాలో ఏర్పాటు చేసి కుర్చీలు ఉంటాయి. గోడ అంతా బ్లాక్ బోర్డు ఉంటుంది. పిల్లలకు బ్లాక్ బోర్డు మీద కొంత భాగం కేటాయిస్తారు. అక్కడే అందుబాటులో షెల్ఫ్ ఉంటుంది. అందులో బోధన ఉపకరణాలను తీసుకుని పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల సహకారంతో సొంతంగా అవగాహన పొందుతారు. విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాబోధన ఉంటుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థికి సహకారంగానే ఉంటాడు. బోధన అభ్యసన పద్ధతులను, గుర్తించిన విధానం మేరకు వారి స్థాయిని గుర్తిస్తారు. ఈ విధానంలో ఎప్పటికప్పుడు ఏ మేరకు విద్యార్థులు అవగాహన చేసుకుకున్నారో? లేదో? స్పష్టమవుతోంది. కృత్యాధార బోధన ద్వారా గణిత భావనలు సందర్భానుసారంగా ఆసక్తికరంగా, ఆనందకరంగా వైవిధ్యంగా ఉండడంతో ఆసక్తిగా పాల్గొంటారు. మొదటి దశలో ఆనందలహరి ప్రారంభమైన పాఠశాలలివే.. రెవెన్యూ డివిజన్ పాఠశాల కాకినాడ పండూరు రాజమహేంద్రవరం కొంతమూరు అమలాపురం భట్లపాలెం పెద్దాపురం మరువాడ రామచంద్రపురం ఉండూరు రంపచోడవరం బోసిగూడెం ఎటపాక యర్రంపేట విద్యార్థులకు చేరువవుతుంది.. ఈ విధానం తప్పనిసరిగా విద్యార్థులకు చేరువవుతుంది. ఇటు విద్యార్థులపై అటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేని రీతిలో ఆటపాటలతో కూడిన బోధన సాగుతుంది. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనం చేరుతుంది. రిషివ్యాలీ విధానంలో ఆనందలహరి ఉంటుంది. ఈ విధానం తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఇప్పటికే ఈ విధానంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ. -
అంతర్గత భద్రతకు మెరైన్ పోలీసు వ్యవస్థ
పల్లిపాలెం(సఖినేటిపల్లి) : అంతర్గత భద్రతకు మెరైన్ పోలీసు వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం గ్రామంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మాణ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన నూతన మెరైన్ పోలీసు స్టేషన్ భవనాన్ని డిప్యూటీ సీఎం రాజప్ప ప్రారంభించారు. అలాగే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యారావు అద్యక్షతన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప ముఖ్య అతిథిగా మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని అన్నారు. అలాగే రాష్ట్రాభివృద్థికి శాంతిభద్రతల అంశం చాలా కీలకమని, దీనికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తీర ప్రాంత భద్రతలో 21 మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. తీర రక్షణలో కేంద్రం కోస్ట్‌గార్డ్ వ్యవస్థ, రాష్ట్రం మెరైన్ వ్యవస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్టేషన్లకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకునేందుకు తగిన నిధులు బడ్జెట్లో కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అలాగే పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించారు. మత్య్సకారుల సంక్షేమానికి ప్రభత్వం పలు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ, సెప్టెంబర్‌లో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సౌత్ కోస్టల్ జోన్ ఇన్చార్జ్ ఐజీ ఎన్.సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా ఉన్న తీరంలో భద్రతకు 21 స్టేషన్లు పనిచేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫిషింగ్ హార్బర్, మెరైన్ స్టేషన్లు ఏర్పాటుకు సహకరించిన దాతలను హోం మంత్రి రాజప్ప, ఎమ్మెల్యేలు సత్కరించారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, గ్రామ సర్పంచ్ చొప్పల చిట్టిబాబు, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లాటి శేషాలక్ష్మి, ఓఎస్డీ (సివిల్) రవిశంకర్‌రెడ్డి, మెరైన్ డీఎస్పీలు రాజారావు, నరసింహరావు, సీఐ ఎం శ్యాంకుమార్, తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్‌బాబు, రాజోలు సీఐ క్రిష్టోఫర్, మలికిపురం ఎంపీపీ జి.గంగాభవాని, జెడ్పీటీసీ సభ్యురాలు మంగెన భూదేవి, సర్పంచ్‌లు బందెల పద్మ, భాస్కర్ల గణపతి, నాయకులు వనమాలి మూలాస్వామి, రావూరి మాణిక్యాలరావు, చింతా వీరభద్రేశ్వరరావు, ముప్పర్తి నాని పాల్గొన్నారు. అంతర్వేది దేవస్థానంలో.. గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్ భవనానికి హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సూర్యారావు సహకారంతో స్థానిక కస్పా కోఆపరేటివ్ సొసైటీ అధ్వర్యంలో ఈభవనం నిర్మించనున్నారు. తాడి నీలకంఠం, జంపన ప్రసాదరావు పాల్గొన్నారు. -
ప్రజాశ్రేయస్సే పరమావధి
పోలీసు శాఖ ఉత్తమ సేవలు డీజీపీ సాంబశివరావు రాజవొమ్మంగి : ప్రజలు నిశ్చింతగా, ప్రశాంత వాతావరణంలో జీవించేలా సేవలు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. రాజవొమ్మంగిలో రూ.2 కోట్లతో నిర్మించిన ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్సుకు ఆయన గురువారం ప్రారంభించారు. తొలుత ఈ రెండస్తుల ఆధునిక పోలీస్‌స్టేషన్ ఎదుట నెలకొల్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాశ్రేయస్సే పోలీస్ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. గతంలో ఏజెన్సీకు రావాలంటూ ఒక రకమైన ఆందోళన వుండేదని పదేళ్లలో పోలీస్‌శాఖ పనితీరు మెరుగుపడడంతో ఏజెన్సీలో ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నామన్నారు. ఏమాత్రం ఏమరపాటు లేకుండా శాంతి భద్రలకు విఘాతం కలగకుండా తమ పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.నక్సల్స్ ప్రభావంతో గతంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్నాళ్లు అభివృద్ధికి దూరంగా వున్నామో తెలియంది కాదని, అటువంటి దుష్పరిణామాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్ చారిత్రాత్మకమైనది అల్లూరి సందర్శించిన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్ చారిత్రాత్మకమైనదని, దీనిని మరింత అభివృద్ధి చేసి ప్రజాసందర్శనకు వీలుగా పెడతామన్నారు. అల్లూరి తైలవర్ణ చిత్రాలు, ఆనవాళ్లతో ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాజవొమ్మంగి పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని ఆయన ఆశక్తిగా తిలకించారు. డీజీపీకి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు జ్ఞాపిక అందజేశారు. ఆయనతో పాటు ఐజీపీ ఆంధ్రారీజన్ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్.రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాశ్, ఓఎస్డీ రవిశంకరరెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం అస్మి హాజరు కాగా స్థానిక సీఐ వెంకట త్రినాథ్, ఎస్సైలు రవికుమార్, వెంకట నాగార్జున కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాఠశాల చిన్నారులతో మమేకమైన డీజీపీ రాజవొమ్మంగి శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో డీజీపీ సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. డీజీపీ అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వక పోవడంతో ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు వన్నాయా అని అడిగిన ప్రశ్నకు పిల్లలు టాయ్‌లెట్స్ డోర్స్లేవని బదులిచ్చారు. దీంతో వెంటనే రూ.25 వేల నగదు అందజేసి వెంటనే మరుగుదొడ్లను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని ఆయన రంపచోడవరం ఏఎస్పీని ఆదేశించారు. ఇంకా అవసరమైతే నగదు అందజేస్తానని అన్నారు. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వున్నారా అని ప్రశ్నించిన డీజీపీ ఆ వెంటనే మరో రూ.8 వేల నగదు అందజేసి ప్రతి ఒక్కరికీ జామెట్రీ బాక్స్ (కాంపాస్ బాక్స్‌లు) కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
-సందడి తగ్గిన కేంద్రాలు -నేడు 8001 నుంచి 16,000 వరకూ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన బాలాజీచెరువు (కాకినాడ) / రాజమహేంద్రవరం రూరల్ : ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్–17 కౌన్సెలింగ్ గురువారం కాకినాడలో జేఎన్టీయూకే, జగన్నాథపురంలోని ఆంధ్రా పాలిటెక్నిక్, భానుగుడి మహిళా పాలిటెక్నిక్, బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రారంభమైంది. మహిళా పాలిటెక్నిక్‌లో 83, ఆంధ్రా పాలిటెక్నిక్‌లో 80, జేఎన్టీయూకేలో 83 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు. బొమ్మూరులో 229 మంది పరిశీలన చేయించుకున్నట్టు ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద పరిశీలనకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు కాస్త ఇబ్బందులు తప్పలేదు. చాలా మంది విద్యార్థులకు ఆన్లైన్లో చెల్లించే విధానం తెలియక నేరుగా డబ్బులు చెల్లించాలనుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఎస్టీ అభ్యర్థుల పత్రాల పరిశీలనకు ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలను నిర్ణయించగా పలువురు తెలియకజేఎన్టీయూకే కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఈ ఏడాది సందడి కనిపించలేదు. గతంలో విద్యార్థులు, తల్లిదండ్రుల రద్దీ ఎక్కువగా ఉండడం, వారి సౌకర్యార్థం టెంట్లు, వాటర్ సదుపాయం కల్పించకపోవడంతో ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కాకినాడలో ఏ కేంద్రం వద్దా వందకు మించి అభ్యర్థులు లేరు. శుక్రవారం 8001 నుంచి 16 వేల వరకూ ర్యాంకు గల అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. అభ్యర్థులు ఎవరికైనా సందేహాలుంటే 95810 77666 నంబర్లో సంప్రదించవచ్చని కో ఆర్డినేటర్ దీక్షితులు సూచించారు. -
బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ ప్రారంభం
-
ఏపీలో మొదలైన గ్రూప్-3 ప్రిలిమ్స్ పరీక్ష
-
శుభారంభం
ఏలూరు సిటీ : భవిష్యత్‌కు మేలిమలుపుగా నిలిచే పదో తరగతి పరీక్షల కోలాహలం శుక్రవారం మొదలైంది. తొలి రోజు పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ మొదటి భాష పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 246 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా.. 49,331 మంది విద్యార్థులకు గాను 48,991 మంది హాజరయ్యారు. 340 మంది పరీక్ష రాయలేదు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేముందు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. వారివెంట తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు రావడంతో పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాలు కిటకిటలాడాయి. ఎండను సైతం లెక్కచేయకుండా వారంతా బయటే వేచివున్నారు. మొక్కవోని దీక్షతో.. పలుచోట్ల దివ్యాంగులు పరీక్ష రాశారు. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన తానాల దుర్గాభవానికి క్యాన్సర్ కారణంగా ఎడమ కాలిని తొలగించగా.. కృత్రిమ కాలు ధరించి ఉత్సాహంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకుని పరీక్ష రాసింది. ఒక విద్యార్థి డిబార్ తొలి రోజు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. నరసాపురం మండలం ఎల్బీ చర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థి కాపీ కొడుతుండటాన్ని గమనించిన ఇన్విజిలేటర్ అతడిని అధికారులకు అప్పగించగా డిబార్ చేశారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు జిల్లాలో పదో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీఈవో ఆర్ఎస్.గంగాభవాని చెప్పారు. విద్యార్థులెవరైనా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినా.. అందుకు ఇన్విజిలేటర్ సహకరించినా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తొలి రోజు పరీక్షలకు 99.35 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. -
పది పరీక్షలు ప్రారంభం
99.7 శాతం హాజరు భానుగుడి (కాకినాడ): తమ జీవితంలో తొలి పబ్లిక్ పరీక్షను పదో తరగతి విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తోడురాగా ఆత్మస్థైర్యంతో పరీక్షా కేంద్రాలవైపు అడుగులు వేశారు.జిల్లాలో 304 కేంద్రాల్లో శుక్రవారం నుంచి ప్రారభమైన ఈ పరీక్షలకు 67,148 మంది విద్యార్థులకు 66,929 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. తొలి పరీక్షలో 99.7 శాతం విద్యార్థులు హాజరైనట్టు డీఈవో అబ్రహం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో అబ్రహం, అబ్జర్వర్ వవజాక్షి జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించాయి. -
కాపు వెబ్సైట్ ప్రారంభం
అమలాపురం టౌన్ (అమలాపురం) : కాపు వెల్ఫేర్ డాక్కామ్ అసోసియేషన్ రూపొందించిన వెబ్సైట్ ద్వారా అందించే ఉచిత సేవలను కాపు యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ వెబ్సైట్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌లోని ఐబీఎం సాఫ్ట్వేర్ ఉద్యోగి డాక్టర్ యాళ్ల శ్రీనివాసవరప్రసాద్ కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం, ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డ సుమారు రెండు కోట్ల మంది కాపులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చే ప్రయత్నంగా ఈ వెబ్సైట్ ప్రారంభించినట్టు చెప్పారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్‌లో కాపు విద్యావంతులతో సోమవారం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 22న జిల్లాకు వస్తున్న మంజునాథ కమిషన్‌కు ఈ వెబ్సైట్ ద్వారా కాపుల మనోభావాలు, ఆవేదనను తెలియజేయనున్నట్టు చెప్పారు. ఈ వెబ్సైట్లో కాపులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు. త్వరలో కాపు వెల్ఫేర్ డాట్కాం మొబైల్ హెల్ప్ పేరుతో మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఈ వెబ్సైటులో 1.50 లక్షల మంది కాపుల వివరాలను పొందుపరిచానని చెప్పారు. kapuwelfare.comకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కాపు మిత్ర టీమ్ కన్వీనర్ బండారు రామమోహనరావు, కాపు ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు నంధ్యాల నాయుడు, కాపు మిత్ర టీమ్ సభ్యులు కరాటం ప్రవీణ్, నిమ్మకాయల సురేష్, ముత్యాల శరత్‌బాబు, మద్దింశెట్టి రాంబాబు, నిమ్మకాయల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మణిమకొండ జాతర
వనదేవతలకు మంగళస్నానం మోతుగూడెం (రంపచోడవరం) : ఒడిశా ప్రభుత్వం ఆంధ్రాలోని చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద రెండేళ్లకోసారి నిర్వహించే మణిమకొండ జాతరలో సోమవారం గిరిజన పూజారులు వనదేవతల మంగళస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వనదేవతలైన కన్నమరాజు, బాలరాజు, పోతురాజు, ముత్యాలమ్మ ఉత్సవ మూర్తులను సీలేరు నది దాటించి ఉరేగింపుగా పొల్లూరు గ్రామానికి తీసుకువచ్చి భక్తుల సందర్శన నిమిత్తం గంటసేపు ఉంచారు. అనంతరం ఊరేగింపుగా రథాన్ని పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గిరిజన పూజారులు గృహ కింద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేయగా, అమ్మవారు వారి పూజలకు సంతృప్తి చెంది పూజారులకు ‘బంగారు చేప’ అవతారంలో దర్శినమిచ్చిందన్నారు. దాంతో పూజారులు వనదేవతలకు గంగా జలంతో మంగళస్నానం చేయించి రూపంలేని దేవతమూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేయించారు. తిరిగి వనదేవతలను సాయంత్రం మూడు గంటలకు ఒడిశా తరలించారు. ఐటీడీఏ పీవో చినబాబు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు ఎల్.మోహన్‌రావు, లక్కవరం ఫారెస్ట్ రేంజర్ జి.ఉషారాణి, ఎమ్మార్వో జగన్మోహన్రావు, తులసిపాక పీహెచ్సీ డాక్టర్ క్రాంతికిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్యాంప్రసాద్ తదితరులు వనవదేవతలను దర్శించుకున్నారు. -
నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రలు
దివ్యదర్శన యాత్ర ప్రారంభం దేవాదాయ శాఖ ఆర్జేడీ చంద్రశేఖర్‌అజాద్ అడ్డతీగల (రంపచోడవరం) : దివ్యదర్శన యాత్ర ద్వారా నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రల భాగ్యం కల్పిస్తున్నట్టు దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నిరుపేద భక్తులకు దేవాదాయశాఖ కల్పించిన ఉచిత తీర్థయాత్ర సదుపాయాన్ని జిల్లాలోనే ప్రథమంగా సోమవారం అడ్డతీగల నుంచి ఆర్జేడీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే అధ్యాత్మిక అనుభూతితో సమాజ హితానికి తోడ్పడడానికి కట్టుబడి తోటి వారిని ఉత్తేజపర్చాలనే బృహత్తర సంకల్పాన్ని పాదుకొల్పాలనేది దివ్యదర్శన యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్ర నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుందన్నారు. జిల్లా నుంచి 18 నుంచి 70 ఏళ్ల ఆరోగ్యవంతులు ఏడాదికి 10 వేల మంది వరకూ రాష్ట్రంలోని 9 పెద్ద దేవాలయాల దర్శనం కల్పిస్తామని ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఒకే కుటుంబంలో అత్యధికంగా ఐదుగురు వరకూ వెళ్లవచ్చన్నారు. ప్రతి వారం ఒక మండలంలో ఉన్న 200 మంది నిరుపేదలకు దివ్యదర్శన యాత్రలో భాగస్వాములను చేస్తామని ఆర్జేడీ చెప్పారు. యాత్రలో భక్తులు చేయకూడని పనులను ఆయన వివరించారు. భక్తులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందితో దీక్షా ప్రమాణం చేయించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబుతో కలిసి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. గోవిందనామస్మరణతో భక్తులు దివ్యదర్శన యాత్రకు బయలుదేరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కన్వీనర్ తణుకు వెంకటరామయ్య, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్లు సతీష్‌కుమార్, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, ఇతర సిబ్బంది, సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
విజయవాడలో సాక్షి టీవీ నూతన స్టూడియో
-
కల్పరసకు తొలి అడుగు
తీతకు నడుంకట్టిన కొబ్బరి రైతులు ప్రభుత్వ అనుమతిపై ఉప ముఖ్యమంత్రి రాజప్పకు కృతజ్ఞతలు అమలాపురం : కొబ్బరి రైతుల దశ మార్చనున్న కొబ్బరి కల్పరస (కొబ్బరినీరా)కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాని సేకరణకు కోనసీమ రైతులు నడుంకట్టారు. కొబ్బరి చెట్టు నుంచి శాస్త్రీయ పద్ధతిలో దానిని సేకరించేందుకు తొలి అడుగు వేశారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కల్పరస సేకరణకు అమలాపురం రూరల్ మండలం చిందాడగరువుకు చెందిన రైతు మట్ట నాగేశ్వరరావు బుధవారం తన తోటలో శ్రీకారం చుట్టారు. కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (కేసీఎఫ్పీవో) సభ్యుడైరన నాగేశ్వరరావు తన తోటలో మొదటిగా మూడుచెట్ల నుంచి కల్పరససేకరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పొత్తులకు నైలాన్ తాడుకట్టి, పొత్తును మసాజ్ చేస్తున్నారు. ఇలా వారం రోజులు చేసి తరువాత దీని నుంచి కల్పరసను సేకరిస్తామని నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. 2015లో కేరళలోని కాసరఘోడ్లో సీపీసీఆర్‌ఐ కల్పరస సేకరణపై ఇచ్చిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రక్రియను రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ అడ్డాల గోపాలకృష్ణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మట్టా మహాలక్ష్మి ప్రభాకర్ పర్యవేక్షించారు. -
బీచ్ ఫెస్టివల్‌కు ముస్తాబు అవుతున్న విశాఖ
-
కోడిపందేల సమరం మదలైంది
-
డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్ : క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి తెలిపారు. బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో జిల్లా స్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డైట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఈ (ట్రైనింగ్ కళాశాల) ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఐహెచ్జిఎన్ ప్రసాదు, ప్రభుత్వ మోడల్ హైస్కూలు హెచ్ఎం ఆర్.నాగేశ్వరరావు, జిల్లా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డి.వి.సుబ్బరాజు, రాష్ట్ర ప్రైవేటు డీఎడ్ కళాశాలల సంఘ కార్యనిర్వాహక సభ్యుడు ఆర్.కె.విశ్వనాథరావు మాట్లాడారు. ఎంపీడీఓ ఎ.రమణారెడ్డి, తహసీల్దార్ జి.భీమారావు, ఎంఈఓ కె.నరసింహారెడ్డి, పీఈటీల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీలు తొలి రోజు బాలుర క్రీడా పోటీల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, బాలికల విభాగంలో ఖోఖో, కబడ్డీ, చెస్, టెన్నికాయిట్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్య పోటీలు, సాహిత్య విభాగంలో వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అమలాపురం జో¯ŒS బాలికల గ్రిగ్స్ ప్రారంభం పుల్లేటికుర్రు(అంబాజీపేట) : పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో సోమవారం ప్రారంభమైన అమలాపురం బాలికల గ్రి గ్స్ ఆటల పోటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సా గాయి. మూడురోజులు జరిగే పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1000 మంది క్రీడాకారులు, 70 మం ది పీఈటీలు పాల్గొన్నారని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు, హెచ్ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజిం గ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలి పారు. మొదటి రోజు విజేతల వివరాలను ప్రకటించారు. మార్చ్‌పాస్ట్‌లో ముమ్మిడివరం, గోపవరం, పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూళ్లు, 800 మీ టర్ల రన్నింగ్ సీనియర్స్ విభాగంలో దొమ్మేటి మ నీషా (అంబాజీపేట), ఎ¯ŒSఎస్వవీ శరణ్య (భాష్యం, అమలాపురం), టి.ప్రియ (పాలగుమ్మి), హాకీ సీనియర్స్ విభాగంలో పి.లక్షి్మవాడ, ముని పల్లి, గొల్లవిల్లి స్కూళ్లు, టేబుల్ టెన్నిస్ సింగి ల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, జూనియర్స్ సింగిల్స్ విభాగంలో శానపల్లిలంక, వీరవల్లిపాలెం, జగన్నాథపురం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరి పట్నం పాఠశాలలు వరుసగా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. . అలరించిన ఊఫింగ్ డ్రిల్ గ్రిగ్స్ ప్రారంభం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరం జెడ్పీ హైస్కూలుకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నిర్వహించిన ఊ ఫింగ్ డ్రిల్ ఆకట్టుకుంది. ఈ డ్రిల్‌లో వారికి ప్రధానోపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీవిశ్వనాథం, వ్యాయామ ఉపాధ్యాయు డు ఎ.ఉమామహేశ్వరరావు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అభినందించారు. -
యూరప్‌లో మొదలైన క్రిస్మస్ వేడుకలు
-
చిల్లర కష్టాలకు చెక్
కలెక్టర్ అరుణ్‌కుమార్ - ఏటీఎం మొబైల్ సేవలు ప్రారంభం కాకినాడ వైద్యం: నిరుపేదల చిల్లర కష్టాలు తీర్చేందుకు ఏటీఎం మొబైల్ సేవా కేంద్రాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత ఓపీ విభాగంలో ఏటీఎం మొబైల్ సేవాకేంద్రాన్ని కార్డు స్వైప్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన రూ.500, రూ. 1,000 నోట్లతో చిల్లర కోసం తాత్కాలికంగా ఇబ్బందులున్నా, భవిష్యత్తులో దేశానికి, అందరికీ మంచి జరుగుతుందన్నారు. గురువారం నుంచి పాత 500, 1,000 నోట్లు పూర్తిగా చెల్లవన్నారు. ఇంకా ఎవరి వద్దయినా పాతనోట్లు ఉంటే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిసెంబర్ నెలాఖరులోపు జమ చేసుకోవాలని చెప్పారు. ఇతరుల ప్రలోభాలకు తలొగ్గి వారి నగదును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోరాదని, ఒకవేళ అలా చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికొచ్చే ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఏటీఎంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీజీహెచ్‌లో వారం రోజులపాటు మెబైల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సాయిబాబా ప్రకటించారు. రోజుకి రూ.లక్ష మేర రూ. రూ.20, రూ.100 నోట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, రంగరాయ మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఛాతి విభాగాధిపతి డాక్టర్ రాఘవేంద్రరావు, సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎఫ్ఏసీ హనుమంతరావు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల పోటీలు
శోభనాద్రిపురం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : బాపులపాడు మండలంలోని శోభనాద్రిపురంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తున్న గూటీ లాగుడు పోటీలు తొలిరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 57 అంగుళాల ఎత్తులోపు ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎడ్ల పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పోటీలను తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పోటీలను ప్రారంభించారు. తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కలపాల సూర్యనారాయణ, నిర్వాహకులు చింతపల్లి సుమన్, మొవ్వా బోసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మెట్రో పరుగు ఎప్పుడు ?
-
పి.గన్నవరంలో గడపగడపకు వైఎస్ఆర్సీపీ
తూర్పుగోదావరి: జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. టీడీపీ హామీల వైఫల్యం, అవినీతిపై ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. -
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని 5వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పార సీతయ్య, ఎస్కె నయీం, షఫీ, ఖాజాగౌడ్, నాయకులు కుక్కడపు బాబు, కమదన చందర్రావు, కందరబోయిన వేలాద్రి, మున్సిపల్ డీఈ లక్ష్మానాయక్, శెట్టి భాస్కర్, వంటిపులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుద్ధ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ బర్మావత్ శంకర్ నాయక్, ఈఓఆర్డీ కొల్లు వైష్ణోయోగి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీ వారోత్సవాలు ప్రారంభం
కోదాడఅర్బన్: భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) 60 వార్షికోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 7 వరకు నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లి వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కోదాడ పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ఈ ఉత్సవాలను స్థానిక కరూర్ వైశ్యాబ్యాంక్ మేనేజర్ భార్గవ శ్రీరామ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎల్లవేళలా సేవలందిస్తూ ఎల్ఐసీ దేశీయ బీమా రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ఎస్బీఎం పి.వెంకటేశ్వర్లు, ఏడీఎం చెన్నకేశవులు, ఎఓ హరి, ఏబీఎం కోట్యానాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు బీబీనాయక్, ప్రసాద్‌బాబు, పలువురు డెవలప్మెంట్ ఆఫీసర్లు, లియాఫీ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొన్నారు. -
దివ్యవాణి క్రైస్తవ టీవీ చానల్ ప్రారంభం
హైదరాబాద్: దివ్యవాణి క్యా థలిక్ క్రైస్తవ చానల్ బుధవారం ప్రారంభమైంది. బుధవారం సికింద్రాబాద్ సెయిం ట్ మేరీస్ స్కూ ల్ ఆవరణలో చానల్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాటికన్ ప్రతినిధి ఆర్చ్ బిషప్ సాల్వతోరే ఫెన్నాఖియో ముఖ్య అతిథిగా హాజరై చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో తొలిసారిగా తెలుగులో టీవీ చానల్ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దివ్యవాణి చానల్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఆర్చ్ బిషప్ మల్లవరకు ప్రకాశ్, టీవీ చానల్ సీఈవో ఫాదర్ ఉడుముల బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. -
వంతెన ప్రారంభం
మాగనూర్: మండల పరిధిలోని కృష్ణానదిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత జూన్ 23 నుంచి బ్రిడ్జి పై సీసీ రోడ్డు నిర్మాణం కొరకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటూ వాహన రాకపోకలను నిల్పివేసిన విషయం పాఠకులకు విధితమే. కాగ ఎట్టకేలకు బ్రిడ్జిపై వాహనాలు వెళ్లుటకు మంగళవారం రాత్రి నుంచి అధికారులు అనుమతించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నిల్చిపోయిన వ్యాపారాలు పునఃప్రారంభం కానున్నాయి. -
వేద పరీక్షలు ప్రారంభం
రాజమహేంద్రవరం కల్చరల్ : స్థానిక ఇన్నీసుపేట హోతావారి వీధిలోని వేదశాస్త్ర పరిషత్ కార్యాలయంలో శనివారం వేదశాస్త్ర పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు వచ్చారు. తొలి రోజు యజుర్వేద పరీక్షలు జరిగాయి. ఆది, సోమవారాల్లో కూడా ఇదే విభాగంలో జరుగుతాయి. 23, 24 తేదీల్లో రుగ్వేదం, అధర్వణ వేదం, సామవేదాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రాజమహేంద్రవరం వేదశాస్త్ర పరిషత్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ఇచ్చే పట్టాలకు ఎంతో గుర్తింపు ఉంటుంది. ఇక్కడ పట్టాలు తీసుకున్న విద్యార్థులకు తిరుపతి వేద విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. -
ఎస్సార్డీపీకి శ్రీకారం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు...సిటీని విశ్వనగరిగా నిలిపేందుకు బృహత్తర ప్రణాళికలతో రూపొందించిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఒకటో ప్యాకేజీలోని కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లలో బహుళ వరుసల ఫ్లై ఓవర్లతో నగరానికి కొత్తరూపునివ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ కేబీఆర్ పార్కు వద్ద పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆంక్షలు అడ్డు కావడంతో ప్రస్తుతం ఇతర జంక్షన్లపై దృష్టి సారించింది. వాటిల్లో భూసేకరణ ఆటంకాలు లేని..తక్కువ ఆస్తులు మాత్రమే సేకరించాల్సిన మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీల వద్ద పనులకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో మైండ్‌స్పేస్ వద్ద హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్ఎంఆర్) పనులు కూడా జరగాల్సి ఉన్నందున సంబంధిత అధికారులు అక్కడ పనులు చేపట్టారు. మెట్రోరైలు కోసం అవసరమైన పిల్లర్లు నిర్మించాల్సి ఉండటంతో అక్కడ ఎక్స్కావేషన్ పనులు జరుపుతున్నారు. పిల్లర్ల నిర్మాణం జరిగాక బ్లాస్టింగ్లు వంటివి చేయకుండా ఉండేందుకు ఈ పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ భారీ పరిమాణంలో దాదాపు 60 వేల క్యూబిక్ మీటర్ల మేర పెద్దపెద్ద బండరాళ్లుండటంతో రాక్ కట్టింగ్ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ పనుల్ని పూర్తిచేసి, భూమిని చదును చేసి హెచ్ఎంఆర్కు అప్పగించేందుకు వేగిరపడుతున్నారు. హెచ్ఎంఆర్ పిల్లర్లకు తవ్వకాలు పూర్తయ్యాక మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయో డైవర్సిటీ పార్కు వైపు, మైండ్ స్సేస్ జంక్షన్ నుంచి రహేజా ఐటీ పార్కు వైపు మూడు వరుసల్లో అండర్‌పాస్ నిర్మించనున్నారు. ఒక్కో వైపు దాదాపు 200 మీటర్ల మేర అండర్‌పాస్ నిర్మిస్తారు. అనంతరం దుర్గం చెరువు నుంచి డెలాయిట్ వరకు 2 ప్లస్ 2 లేన్లతో ఫ్లై ఓవర్ నిర్మించాలనేది లక్ష్యం. మరోవైపు అయ్యప్పసొసైటీ వద్ద సైతం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా జంక్షన్లలో భూసేకరణతోపాటు వాటర్, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల వంటి యుటిలిటీస్ తొలగింపు పనులు తదితరమైనవి జరగాల్సి ఉన్నందున తొలుత మైండ్‌స్పేస్, అయ్యప్పసొసైటీల వద్ద పనులు ప్రారంభించారు. ఇదీ ప్యాకేజీ.. ఎస్సార్డీపీ నాలుగో ప్యాకేజీలో భాగంగా బయో డైవర్సిటీ పార్క్ జంక్షన్, అయ్యప్పసొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్లవద్ద పనులున్నాయి.ఈ ప్యాకేజీ అంచనా వ్యయం దాదాపు రూ. 200 కోట్లు కాగా, మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద పనుల అంచనా రూ. 65 కోట్లు. అండర్‌పాస్‌లు.. ఎస్సార్డీపీ పనుల్లో మైండ్‌స్పేస్, బయో డైవర్సిటీ, అయ్యప్ప సొసైటీ జంక్షనతోపాటు, బైరామల్‌గూడ జంక్షన్, కామినేని హాస్పిటల్ జంక్షన్, చింతల్‌కుంట చెక్‌పోస్టు జంక్షన్, ఎల్బీనగర్ జంక్షన్ల వద్ద అండర్‌పాస్‌లు రానున్నాయి. మిగతా ప్యాకేజీల్లో భూసేకరణ తర్వాత పనులు.. ఎస్సార్డీపీలో భాగంగా మొత్తం ఐదుప్యాకేజీల్లో 18 ప్రాంతాల్లో పనులకు టెండర్లు పిలిచారు. వీటిల్లో ఒకటో ప్యాకేజీ అయిన కేబీఆర్ పార్కుచుట్టూ ఆరుజంక్షన్లలో రెండు వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమై, భూసేకరణ ఇబ్బందులతో రెండు జంక్షన్లను తాత్కాలికంగా ఉపసంహరించుకొని, నాలుగు జంక్షన్ల వద్ద పనులు చేపట్టబోగా పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీనాశ్రయించడంతో స్టే ఇచ్చింది. రెండో ప్యాకేజీలో ఎల్బీ నగర్, బైరామల్‌గూడ, కామినేని హాస్పిటల్ , చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్లున్నాయి. ప్యాకేజీ–3ను ఉపసంహరించుకున్నారు. ఐదో ప్యాకేజీలో ఒవైసీ హాస్పిటల్, బహదూర్‌పురా జంక్షన్లున్నాయి. భూసేకరణలు పూర్తయి, యుటిలిటీస్ తొలగింపు పనులు జరిగాక ఈ ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. -
ఖైరతాబాద్ లడ్డూ తయారీకి శ్రీకారం
తాపేశ్వరం (మండపేట) : వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందించేందుకు తాపేశ్వరంలోని సురుచిఫుడ్స్ సంస్థ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అందులో భాగంగా లడ్డూ తయారీ కోసం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతులు ఆదివారం పందిరి ఏర్పాటుకు రాటముహూర్తం చేశారు. 2010వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందజేసిన సురుచి ఫుడ్స్ సంస్థ అప్పటి నుంచి ఏయేటికాయేడు లడ్డూ పరిమాణాన్ని పెంచుతూ ఖైరతాబాద్ గణనాథునికి లడ్డూను కానుకగా అందజేస్తోంది. 2011లో 2400 కిలోల లడ్డూ తయారు చేయగా, 2012లో 3,500 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6,000 కిలోల లడ్డూను స్వామివారికి అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా లడ్డూను కానుకగా స్వీకరించడంపై అక్కడి నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ప్రసాదం పంపిణీ వివాదస్పదమవుతుండటంతో ఈ ఏడాది లడ్డూ కానుక స్వీకరణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లడ్డూను కానుకగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారే సొంతంగా తయారుచేసుకోవాలని భావిస్తే అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ఉత్సవ కమిటీకి మల్లిబాబు తెలిపారు. 500 కిలోల లడ్డూ తయారు చేసి ఇవ్వాలన్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు లడ్డూ తయారీ చేపడుతున్నట్టు మల్లిబాబు తెలిపారు. ఏటా మాదిరి పందిరి ఏర్పాటు కోసం సురుచి సంస్థ ఆవరణలో మల్లిబాబు, భారతి దంపతులు రాటముహూర్తం చేశారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించే వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో మంజ్రా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ద్వారా జరుగుతున్నాయని, వాటిలో భారత దేశం 30 శాతంతో ముందుకు వెళ్తోందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీకృత విధానంతో మొబైల్ అప్లికేషన్లు, హెల్త్‌కేర్ అప్లికేషన్లు, రోబోటిక్ సర్వీస్‌లు వంటి వాటిలో వినూత్న ఆవిష్కరణలు జరిపి సున్నిత సమస్యలకు సాంకేతికతను జోడించి పరిష్కరించాలన్నారు. అనంతరం రాజ్‌కుమార్ భయ్యాను వర్సిటీ అధ్యాపకులు సత్కరించారు. మొబైల్ అండ్ క్లౌడ్ ల్యాబ్ హెడ్ సతీ‹ష్నారాయణ్ శ్రీరామ్, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కృష్ణమోహన్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎంహెచ్ కృష్ణప్రసాద్, కరుణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి చెస్ పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : స్థానిక న్యూస్ హైస్కూల్లో ఆదివారం జిల్లా స్థాయి యూత్ చెస్ పోటీలను టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 12, 13వ తేదీలలో మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, కౌన్సిలర్ అవుట రవీదంర్, న్యూస్ స్కూల్ కరస్పాండెంట్ గంట్ల అనంతరెడ్డి, ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, చెస్ ప్రతినిధులు మేడ విశ్వప్రసాద్, ఇబ్రహీం, పి.డి. కుమార్, ఎ. తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బయో డీజిల్ సరఫరా ప్రారంభం
హెచ్‌పీసీఎల్ టెర్మినల్ వద్ద ప్రారంభించిన సబ్ కలెక్టర్ గోకవరం : గోకవరంలోని హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో బయో డీజిల్ సప్లయి స్టేషన్ ప్రారంభమైంది. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ లాంఛనంగాప్రారంభించారు. తొలుత ప్లాంట్ సీనియర్ మేనేజర్ దామోదరన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్లాంట్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్, డ్రైవర్, వర్కర్, సెక్యూరిటీ తదితర విభాగాల వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మరణించిన హెల్పర్ వీరబాబు కుటుంబానికి ఉద్యోగుల తరఫున రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా బయో డీజిల్ సప్లయి స్టేషన్‌ను హెచ్పీసీఎల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం రాజమహేంద్రవరం, కాకినాడలోని సుమారు 12 బంకులకు బయో డీజిల్ సరఫరా చేస్తారని తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించారు. బయోడీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం ఉండదన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.