చిల్లర కష్టాలకు చెక్
చిల్లర కష్టాలకు చెక్
Published Thu, Nov 24 2016 10:53 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
కలెక్టర్ అరుణ్‌కుమార్
- ఏటీఎం మొబైల్ సేవలు ప్రారంభం
కాకినాడ వైద్యం: నిరుపేదల చిల్లర కష్టాలు తీర్చేందుకు ఏటీఎం మొబైల్ సేవా కేంద్రాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత ఓపీ విభాగంలో ఏటీఎం మొబైల్ సేవాకేంద్రాన్ని కార్డు స్వైప్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన రూ.500, రూ. 1,000 నోట్లతో చిల్లర కోసం తాత్కాలికంగా ఇబ్బందులున్నా, భవిష్యత్తులో దేశానికి, అందరికీ మంచి జరుగుతుందన్నారు. గురువారం నుంచి పాత 500, 1,000 నోట్లు పూర్తిగా చెల్లవన్నారు. ఇంకా ఎవరి వద్దయినా పాతనోట్లు ఉంటే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిసెంబర్ నెలాఖరులోపు జమ చేసుకోవాలని చెప్పారు. ఇతరుల ప్రలోభాలకు తలొగ్గి వారి నగదును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోరాదని, ఒకవేళ అలా చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికొచ్చే ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఏటీఎంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీజీహెచ్‌లో వారం రోజులపాటు మెబైల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సాయిబాబా ప్రకటించారు. రోజుకి రూ.లక్ష మేర రూ. రూ.20, రూ.100 నోట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, రంగరాయ మెడికల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ఛాతి విభాగాధిపతి డాక్టర్ రాఘవేంద్రరావు, సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎఫ్‌ఏసీ హనుమంతరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement