
శ్రీకాకుళం (పొందూరు): డబ్బులు రాలేదనే కోపంతో ఏకంగా ఏటీఎం మిషన్‌నే బద్దలు కొట్టాడో వ్యక్తి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగింది. ఎస్‌ఐ లక్ష్మణరావు చెప్పిన వివరాలు మేరకు.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ నగదు కోసం సోమవారం పొందూరు బస్టాండ్‌లోని టాటా ఏటీఎంకు వెళ్లారు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేయగా నగదు రాలేదు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మిషన్‌ను బద్దలు కొట్టాడు. పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వెంటనే వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment