atm attack case
-
ఏటీఎంను బద్దలు కొట్టిన వ్యక్తి.. డబ్బులు రాలేదని కోపంతో..
శ్రీకాకుళం (పొందూరు): డబ్బులు రాలేదనే కోపంతో ఏకంగా ఏటీఎం మిషన్నే బద్దలు కొట్టాడో వ్యక్తి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మణరావు చెప్పిన వివరాలు మేరకు.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ నగదు కోసం సోమవారం పొందూరు బస్టాండ్‌లోని టాటా ఏటీఎంకు వెళ్లారు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేయగా నగదు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మిషన్‌ను బద్దలు కొట్టాడు. పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వెంటనే వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మదనపల్లి మధుకర్‌కు 12 ఏళ్ల జైలు
బనశంకరి: ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే బ్యాంకు ఉద్యోగినిపై కొడవలితో దాడి చేసిన కేసులో దోషిగా తేలిన కె.మధుకర్‌రెడ్డికి బెంగళూరులోని 65వ సిటీ సివిల్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 12 ఏళ్ల కారాగారవాసం విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2013 నవంబరు 19న ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూరు కార్పొరేషన్ సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ డబ్బులు తీసుకుంటూ ఉండగా మధుకర్ కొడవలితో గాయపరిచి కొంత డబ్బు ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.(చదవండి: ‘నేను శివుణ్ణి.. కాళికను’: పద్మజ కేకలు) ఈ ఘటనపై ఎస్జే పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తలకు తీవ్ర గాయాలపాలైన బాధితురాలు కొద్దినెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. పోలీసులు మూడేళ్ల పాటు గాలించినా నిందితుని ఆచూకీ లబించలేదు. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బెంగళూరు నేరాన్ని బయటపెట్టాడు. ఎస్జే పార్కు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసకుని విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. హత్యాయత్నం నేరం కింద 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆది నుంచి నేరచరిత్ర చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా దిగువపల్లి గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డికి నేర చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్‌లో నారాయణ అనే ఉద్యోగిపై హత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వృద్ధున్ని హత్య చేసి నగదు దోచుకున్నాడు. బెంగళూరులో మహిళపై దాడికి పాల్పడ్డాడు. సొంతూరులో నీటి విషయంలో ఆనందరెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి 2005లో కడప సెంట్రల్ జైలుకెళ్లాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి 2011లో తప్పించుకుకెళ్లి నేరాలకు పాల్పడ్డాడు. -
ఏటీఎం చోరీకేసు ఛేదించిన పోలీసులు!!
వైఎస్సార్ జిల్లా: పులివెందుల ఏటీఎం చోరీకేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉద్యోగులే ముఠాగా ఏర్పాడి చోరికి పాల్పడినట్లు సమాచారం. ఏటీఎంలో డబ్బులు పెట్టే ఉద్యోగులు మరి కొంతమందితో కలిసి తోటి సిబ్బందిపై దాడి చేసి డబ్బును దోచుకుపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అందులో భాగంగా ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పులివెందులలోని ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వెళ్తున్న ఉద్యోగులపై సోమవారం ఉదయం దాడి చేసి రూ.53 లక్షలు ఎత్తుకుపోయిన ఘటన తెలిసిందే. -
'ఏటీఎం నిందితుడిని త్వరలో పట్టుకుంటాం'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు నగరంలోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని కర్ణాటక డీజీ లాల్ రుక్మా తెలిపారు. అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. గురువారం లాల్ రుక్మా మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్లో మహిళపై జరిగిన దాడి కేసు దర్యాప్తు కొనసాగుందన్నారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన కార్పోరేషన్ బ్యాంక్ మహిళ మేనేజర్ జ్యోతి ఉదయ్ నగదు తీసుకునేందుకు ఏటీఎంకి వెళ్లింది. ఆమె నగదు తీసుకుని వస్తున్న క్రమంలో ఆగంతకుడు ఏటీఎంలో ప్రవేశించి జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి విచక్షణ రహతంగా గాయపరిచాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం నిందితుడు పరారైయ్యాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి నగదు తీసుకునేందుకు వచ్చిన వారు ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జ్యోతి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఏటీఎంలోని సీసీ కెమెరా పూటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయిన ఆ కేసులో పురోగతి మాత్రం అంతగా కనిపించ లేదు. దాంతో ఏటీఏం కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని విలేకర్లు గురువారం పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నించారు. దాంతో సదరు ఉన్నతాధికారిపై విధంగా స్పందించారు.