పులివెందుల ఏటీఎం చోరీకేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉద్యోగులే ముఠాగా ఏర్పాడి చోరికి పాల్పడినట్లు సమాచారం.
వైఎస్సార్ జిల్లా: పులివెందుల ఏటీఎం చోరీకేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉద్యోగులే ముఠాగా ఏర్పాడి చోరికి పాల్పడినట్లు సమాచారం.
ఏటీఎంలో డబ్బులు పెట్టే ఉద్యోగులు మరి కొంతమందితో కలిసి తోటి సిబ్బందిపై దాడి చేసి డబ్బును దోచుకుపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అందులో భాగంగా ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పులివెందులలోని ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వెళ్తున్న ఉద్యోగులపై సోమవారం ఉదయం దాడి చేసి రూ.53 లక్షలు ఎత్తుకుపోయిన ఘటన తెలిసిందే.