ఏటీఎంలో మహిళపై దాడి చేస్తున్న ఆగంతకుడు ( ఫైల్ పోటో)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు నగరంలోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని కర్ణాటక డీజీ లాల్ రుక్మా తెలిపారు. అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. గురువారం లాల్ రుక్మా మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్లో మహిళపై జరిగిన దాడి కేసు దర్యాప్తు కొనసాగుందన్నారు.
గతేడాది డిసెంబర్ 2వ తేదీన కార్పోరేషన్ బ్యాంక్ మహిళ మేనేజర్ జ్యోతి ఉదయ్ నగదు తీసుకునేందుకు ఏటీఎంకి వెళ్లింది. ఆమె నగదు తీసుకుని వస్తున్న క్రమంలో ఆగంతకుడు ఏటీఎంలో ప్రవేశించి జ్యోతి ఉదయ్పై దాడి చేసి విచక్షణ రహతంగా గాయపరిచాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం నిందితుడు పరారైయ్యాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి నగదు తీసుకునేందుకు వచ్చిన వారు ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జ్యోతి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఏటీఎంలోని సీసీ కెమెరా పూటేజ్లను పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయిన ఆ కేసులో పురోగతి మాత్రం అంతగా కనిపించ లేదు. దాంతో ఏటీఏం కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని విలేకర్లు గురువారం పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నించారు. దాంతో సదరు ఉన్నతాధికారిపై విధంగా స్పందించారు.