jyothi uday
-
ఆ ఏటీఎం ఘటనలో మరో ముందడుగు
బెంగళూరు: మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి ఘటనలో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో బాధితురాలు నిందితుడిని ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో గుర్తు పట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధుకర్‌రెడ్డి(43) ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ 2011లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2013లో బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళపై వేటకత్తితో దాడి చేసి, దోచుకున్నాడు. ఇదంతా ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగి. తీవ్రంగా గాయపడిన ఆమె ఎడమ చేతికి పక్షవాతం కూడా వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మధుకర్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని పరప్పణ జైలులో రిమాండ్ చేశారు. విచారణలో అతడు పలు నేరాలకు పాల్పడ్డట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సెక్స్ వర్కర్‌తోపాటు ఏపీలో ఇద్దరు మహిళలను అతడు హత్య చేసినట్లు తేలిందన్నారు. పరప్పణ అగ్రహారం సెంట్రల్ జైలులో శుక్రవారం నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని బాధితురాలు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు. సంబంధిత కథనాలు పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు? బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
మధుకరా.. భయంకరా!
► 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు ► పదుల సంఖ్యలో దోపిడీలు ► బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం ► నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు ► చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు
-
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో పరారైన ఘటనలో నిందితుడు చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం.. జనవరి 31న నిమ్మనపల్లికి చెందిన మధుకర్ రెడ్డి అనే ఈ నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 2013 సెప్టెంబర్ నెలలో అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు. (చదవండి: బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి) ఇతడిని పట్టుకున్నవారికి రూ. 12 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి అతడికోసం అటు కర్ణాటక పోలీసులతో పాటు ఇటు ఏపీ పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అతడు చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు దొరికినవాడే అసలైన నిందితుడా కాదా అనే విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. పోలీసులు మాత్రం అసలు ఇతడు పట్టుబడిన విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. మధుకర్ రెడ్డి గతంలో కూడా చాలా నేరాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు
-
... ఆ ఘటనకు రెండేళ్లు
కొలిక్కిరాని బ్యాంకు ఉద్యోగి జ్యోతిపై దాడి కేసు 15 బృందాలు గాలించినా ఫలితం శూన్యం బెంగళూరు: 15 ప్రత్యేక పోలీసు బృందాలు, 400 మంది పోలీసులు, ఐదు రాష్ట్రాల్లో నిఘా, దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు, ముగ్గురు నగర కమీషనర్ల వ్యూహ రచన ఇవేవీ ఆ నిందితుడి జాడను గుర్తించలేకపోయాయి. బెంగళూరు నగరంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్ పై ఏటీఎంలో దాడి జరిగి ఈనెల 19కు రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. అయినా ఇప్పటికీ దాడికి పాల్పడ్డ నిందితుడి జాడను మాత్రం పోలీసులు తెలుసుకోలేకపోయారు. 2013 నవంబర్ 19న నగరంలోని జేసీ రోడ్ ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్‌పై ఆగంతకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఏటీఎంలో దాడి ఘటన అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో రికార్డు కావడంతో, ఈ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఐదు రాష్ట్రాల్లో నిఘా.... ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్ పై పట్టపగలే ఏటీఎంలో జరిగిన దాడి ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడంతో నిందితుడిని పట్టుకునేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు వందల మంది పోలీసులతో 15 ప్రత్యేక పోలీసు ృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఏటీఎంలోని సీసీ టీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయిన నిందితుడిని ఫొటోలను, ఏటీఎంలో లభించిన నిందితుడి వేలి ముద్రలు తీసుకొని దాదాపు వారం రోజుల పాటు ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఈ కేసును చేధించేందుకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు మరే కేసులోనూ తాము చూడలేదన్నది పోలీసు శాఖలోని ఉన్నతస్థాయి అధికారుల వ్యాఖ్య. ముగ్గురు కమిషనర్లు వ్యూహ రచన చేసినా..... ఇక జ్యోతి ఉదయ్ శంకర్‌పై ఏటీఎంలో దాడి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు కమీషనర్లు ఈ కేసుకు సంబంధించి వ్యూహ రచన చేశారు. ఏటీఎంలో దాడి జరిగిన సమయంలో రాఘవేంద్ర ఔరాద్కర్ బెంగళూరు పోలీస్ కమీషనర్‌గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రత్యేక పోలీసుృబందాలు ఏర్పాటయ్యాయి. అనంతరం ఎం.ఎన్.రెడ్డి బెంగళూరు పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎం.ఎన్.రెడ్డి సైతం ఈ కేసును తాము ఒక సవాల్‌గా తీసుకున్నామని, నిందితుడిని పట్టుకొని తీరతామని ప్రకటించారు. అయినా ఈ కేసును ఛేదించలేక పోయారు. ఇక ఎం.ఎన్.రెడ్డి అనంతరం ప్రస్తుతం మేఘరిక్ నగర పోలీస్ కమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండడం శోచనీయం. ముఖం మార్చుకుని ఉండవచ్చా? ఇక జ్యోతి ఉదయ్‌శంకర్‌పై దాడి అనంతరం నిందితుడి ఫొటోలు అన్ని మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో తనను సులువుగా గుర్తించేందుకు వీలుందని గ్రహించిన నిందితుడు తన ముఖాన్ని మార్చుకొని ఉండవచ్చనే దిశగా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఈ దాడి అనంతరం అతను మరే నేరానికి కూడా పాల్పడలేదని, అందువల్లే అతన్ని పట్టుకోవడం కష్టతరమైందని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏటీఎంలో దాడి తర్వాత లభించిన నిందితుడి వేలి ముద్రలను నగర పోలీసులు అన్ని రాష్ట్రాలకు పంపించారు. అయితే ఈ ఘటన అనంతరం మరే నేర సంఘటనలోనూ నిందితుడి వేలి ముద్రలతో సరిపోలే వేలి ముద్రలు లభించలేదని, అందువల్లే అతని ఆచూకీని కనుక్కోవడం కష్టతరమవుతోందనేది పోలీసు అధికారుల వాదన. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పోలీసులను అలర్ట్ చేస్తూనే ఉన్నామని, అందువల్ల అతన్ని కచ్చితంగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
'ఏటీఎం నిందితుడిని త్వరలో పట్టుకుంటాం'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు నగరంలోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని కర్ణాటక డీజీ లాల్ రుక్మా తెలిపారు. అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. గురువారం లాల్ రుక్మా మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్లో మహిళపై జరిగిన దాడి కేసు దర్యాప్తు కొనసాగుందన్నారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన కార్పోరేషన్ బ్యాంక్ మహిళ మేనేజర్ జ్యోతి ఉదయ్ నగదు తీసుకునేందుకు ఏటీఎంకి వెళ్లింది. ఆమె నగదు తీసుకుని వస్తున్న క్రమంలో ఆగంతకుడు ఏటీఎంలో ప్రవేశించి జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి విచక్షణ రహతంగా గాయపరిచాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం నిందితుడు పరారైయ్యాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి నగదు తీసుకునేందుకు వచ్చిన వారు ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జ్యోతి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఏటీఎంలోని సీసీ కెమెరా పూటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయిన ఆ కేసులో పురోగతి మాత్రం అంతగా కనిపించ లేదు. దాంతో ఏటీఏం కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని విలేకర్లు గురువారం పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నించారు. దాంతో సదరు ఉన్నతాధికారిపై విధంగా స్పందించారు. -
ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు ఏటీఎం దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని తుంకూరులో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గత నెల19న బెంగళూరు ఏటీఎం కేంద్రంలో కార్పోరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై హత్యాయత్నం చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జాయింట్ ఆపరేషన్‌గా చేపట్టిన ఈ వేటలో 200మంది ఏపీ, 200 కర్ణాటక పోలీసులు ఉన్నారు. ఓ నిందితుడి వేటలో నాలుగు వందలమందిని నియమించటం ఇది రెండవసారి. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునేందుకు అప్పటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన 500 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత అదే స్థాయిలో జాయింట్ ఆపరేషన్ ఇదేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. -
దాడికి పక్కా ప్రణాళిక!
-
దాడికి పక్కా ప్రణాళిక!
బెంగళూరు ఏటీఎం కేంద్రాన్ని ముందే పరిశీలించిన నిందితుడు బెంగళూరు, న్యూస్‌లైన్/సాక్షి, అనంతపురం: బెంగళూరులోని ఓ ఏటీఎంలో బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగుడు ఈ దాడికి ముందుగానే వ్యూహరచన చేసినట్లు తేలింది. బాధితురాలు ఏటీఎంలోకి వెళ్లే 15 నిమిషాలు ముందే నిందితుడు అందులోకి వెళ్లి దాడికి అనువైన పరిస్థితి ఉందో లేదో చూసుకున్నట్లు ఏటీఎం సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. మరోవైపు నిందితుడిని గాలించేందుకు కర్ణాటక పోలీసులతోపాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. జ్యోతి ఉదయ్‌పై ఈ నెల 19న దాడి చేసిన నిందితుడు ఏటీఎం కార్డుల కోసం 10వ తేదీన ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ఏపీ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు. జ్యోతి పై దాడి అనంతరం నిందితుడు బెంగళూరు రైల్వేస్టేషన్లో అనంతపురం వైపు వెళ్లే రెలైక్కినట్లు సీసీటీవీ దృశ్యాల్లో తేలడంతో జిల్లాలోని కదిరి, ధర్మవరం, హిందూపురంలో అతను తలదాచుకొని ఉండొచ్చన్న అనుమానంతో ఆదివారం ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బు డ్రా చేసి ఏటీఎం కార్డు ఇమ్మన్నాడు: బాధితురాలు దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు జ్యోతి వద్దకు పోలీసులు ఆదివారం వెళ్లి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు ఏటీఎంలోకి చొరబడి షట్టర్ వేశాక తనను న గదు డ్రా చేసి ఏటీఎం కార్డులు ఇవ్వాలని బెదిరించాడని బాధితురాలు పేర్కొన్నారు. అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశాడని చెప్పారు. -
పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు!!
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడిచేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రం వద్ద కూడా ఈ సైకో కలకలం సృష్టించాడు. ఆ సైకోకు ఇలాంటి వికృత చర్యలు కొత్తకాదు. అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 10న అనంతపురం జిల్లా ధర్మవరం చంద్రబాబునగర్‌లో ప్రమీలమ్మ అనే మహిళపై సైకో దాడి చేశాడు. ఆమె నుంచి రెండు ఏటీఎం కార్డులు లాక్కుని పిన్ నంబర్ తెలుసుకుని ప్రమీలను హత్య చేశాడు. ఆ రాత్రి కదిరికి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. దాంతో ఆ ఏటీఎం కార్డులు పనికిరాకుండా పోయాయి. దీంతో 19న జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు. కదిరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలలో తేలింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. నిందితుడి వ్యహారశైలిని పరిశీలించిన పోలీసులు అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది. -
పోలీసుల అదుపులో ఏటీఎం కేసు అనుమానితుడు
బెంగళూరులో జ్యోతి ఉదయ్ అనే మహిళపై ఇటీవల జరిగిన ఏటీఎం దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల వయసున్న సతీష్ అనే వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా తిపటూరు వద్ద అనుమానితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే, కేసులో అసలు నిందితుడు ఇతడో కాదో అన్న విషయం మాత్రం ప్రస్తుతానికి ఇంకా నిర్ధారణ కాలేదు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. -
దాడిచేసిన వారిని పట్టుకుంటే లక్ష రూపాయలు!!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటీఎం సెంటర్ వద్ద జ్యోతి ఉదయ్ అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడి ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బాధితురాలి సెల్‌ఫోన్‌ను నిందితుడు ఓ సెల్ రీచార్జి దుకాణంలో అమ్మేసినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు ఆ ఫోన్ కొన్న దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాను ఫోన్ కొన్నమాట వాస్తవమే గానీ, అతడి వివరాలు మాత్రం తనకు తెలియవని దుకాణదారు చెబుతున్నాడని, అతడి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారని ఔరాద్కర్ చెప్పారు. కేసు దర్యాప్తు కోసం మొత్తం ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ సంఘటనలో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రం బయట వేచి ఉన్నాడని భావిస్తున్న మరో వ్యక్తి కోసం కూడా ఆ బృందాలు గాలిస్తున్నాయని కమిషనర్ ఔరాద్కర్ తెలిపారు. ఏటీఎం దాదాపు వారం రోజుల నుంచి పనిచేయట్లేదని, తర్వాత అది బాగుపడినా కస్టమర్లు చాలామంది అందులోకి వెళ్లడంలేదని, అలాగే ఉదయం ఏడు గంటల సమయంలో గార్డు కూడా లేడని మరో పోలీసు అధికారి చెప్పారు. ఇక బాధితురాలు జ్యోతి ఉదయ్ (44) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమె తలపైన, ముఖం మీద, ముక్కుమీద నిందితుడు కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. జ్యోతిపై దాడిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. బ్యాంకులన్నీ తమ కస్టమర్ల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన తెలిపారు. లేనిపక్షంలో మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏటీఎం కేంద్రాలు కూడా వినియోగదారులకు బ్యాంకులు అందించే సేవా కేంద్రాలేనని , అక్కడ కూడా వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిదేనని సిద్దరామయ్య సచివాలయంలో విలేకరులతో అన్నారు. కాగా, జ్యోతి ఉదయ్‌పై దాడి జరిగిన ఏటీఎం కియోస్క్ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) భవనానికి అత్యంత సమీపంలోనే ఉంది. అలాగే, ఉల్సూర్ గేట్ పోలీసు స్టేషన్‌కు సరిగ్గా ఫర్లాంగు దూరంలోనే ఉంది. ఇక ప్రతి బ్యాంకు ఏటీఎంలోనూ బయట కూడా తప్పనిసరిగా రెండు కెమెరాలు, లోపల అలారం ఉండాలని, అలాగే గార్డులు కూడా ఉండి తీరాలని.. ఈ నిబంధనలను 24 గంటల్లో అమలుచేయాలని కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. -
'ఏటీఎం' దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్!
రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అతడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హిందుపురం పట్టణంలో మొబైలు ఫోన్ విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుడు హిందుపురానికి చెందినవాడు. పోలీసులు విచారణ నిమిత్తం అతడిని కర్ణాటకకు తరలించారు. కాగా బెంగళూరులో నగదు డ్రా చేసేందుకు బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి షెటర్ మూసివేసి, ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. అలాగే తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్ ఫోన్ తీసుకుని అతడు పరారయ్యాడు. ఏటీఎం నుంచి రక్తం రావడంతో స్థానికులు అనుమానించి షటర్ ఎత్తి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. దాంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఏటీఎంలో మహిళపై ఆగంతకుడు దాడి, అనంతరం జరిగిన తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో పోలీసులు సీసీ పూటేజ్‌లను పరిశీలించారు. నిందుతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కర్ణాటక పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసుల సహాయం తీసుకున్నారు. దాంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనుమానితుడి అరెస్ట్ ను పోలీసులు ఇంకా ద్రువీకరించలేదు. -
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం
-
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో దాడికి గురైన కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌కు కుడివైపు పక్షవాతం వచ్చింది. మంగళవారం ఉదయం డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన ఆమెపై ఒక ఆగంతకుడు వేట కత్తితో దాడి చేయగా తలపై తీవ్రంగా గాయమైన విషయం తెలిసిందే. దాడి అనంతరం షట్టర్ మూసి వెళ్లి పోవడం వల్ల మూడు గంటలు గడిచే వరకూ ఎవరూ గుర్తించక పోవడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం జ్యోతి మాట్లాడగలుగుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ ఎన్కే వెంకటరమణ బుధవారం విలేకరులకు తెలిపారు. దుండగుడు తలపై బలంగా నరకడంతో చిన్న ఎముక ముక్క విరిగి మెదడులోకి చొచ్చుకుపోయిందని, దానిని తొలగించామని డాక్టరు తెలిపారు. దీనివల్ల ఆమె శరీరంలో కుడి వైపు చచ్చుబడిపోయిందని ఆయన చెప్పారు. దాడిలో ఆమె ముక్కు తెగిందని, ముఖంపై పలుచోట్ల గాయాలయ్యాయని వాటినిప్లాస్టిక్ సర్జరీతో సరిచేశామని చెప్పారు. దాడి జరిగిన రోజు రాత్రి ఆమెకు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా, దుండగుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నాయకత్వంలో ఎనిమిది బృందాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టాయి. అయితే ఆగంతకుడు కన్నడం మాట్లాడాడని, డబ్బు తీసివ్వు, డబ్బు తీసివ్వు అంటూ గదమాయించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఏటీఎంల మూత నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను మూయించి వేస్తామని హోం మంత్రి కేజే జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను నియమించాల్సిందిగా బ్యాంకులకు సూచించారు. ప్రత్యేక పోలీసు చట్టాన్ని రూపొందించి, దాని పరిధిలోకి బ్యాంకులను తీసుకు వచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇకమీదట పోలీసుల అనుమతి లేనిదే ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని బ్యాంకులకు సూచించనున్నట్లు చెప్పారు.