బెంగళూరు ఏటీఎం కేంద్రాన్ని ముందే పరిశీలించిన నిందితుడు
బెంగళూరు, న్యూస్‌లైన్/సాక్షి, అనంతపురం: బెంగళూరులోని ఓ ఏటీఎంలో బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగుడు ఈ దాడికి ముందుగానే వ్యూహరచన చేసినట్లు తేలింది. బాధితురాలు ఏటీఎంలోకి వెళ్లే 15 నిమిషాలు ముందే నిందితుడు అందులోకి వెళ్లి దాడికి అనువైన పరిస్థితి ఉందో లేదో చూసుకున్నట్లు ఏటీఎం సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది.
మరోవైపు నిందితుడిని గాలించేందుకు కర్ణాటక పోలీసులతోపాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. జ్యోతి ఉదయ్‌పై ఈ నెల 19న దాడి చేసిన నిందితుడు ఏటీఎం కార్డుల కోసం 10వ తేదీన ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ఏపీ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు. జ్యోతి పై దాడి అనంతరం నిందితుడు బెంగళూరు రైల్వేస్టేషన్‌లో అనంతపురం వైపు వెళ్లే రెలైక్కినట్లు సీసీటీవీ దృశ్యాల్లో తేలడంతో జిల్లాలోని కదిరి, ధర్మవరం, హిందూపురంలో అతను తలదాచుకొని ఉండొచ్చన్న అనుమానంతో ఆదివారం ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
డబ్బు డ్రా చేసి ఏటీఎం కార్డు ఇమ్మన్నాడు: బాధితురాలు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు జ్యోతి వద్దకు పోలీసులు ఆదివారం వెళ్లి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు ఏటీఎంలోకి చొరబడి షట్టర్ వేశాక తనను న గదు డ్రా చేసి ఏటీఎం కార్డులు ఇవ్వాలని బెదిరించాడని బాధితురాలు పేర్కొన్నారు. అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశాడని చెప్పారు.
దాడికి పక్కా ప్రణాళిక!
Published Mon, Nov 25 2013 2:31 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement