ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్ | Another Suspected arrest in Bangalore ATM attack case | Sakshi
Sakshi News home page

ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్

Published Sat, Dec 7 2013 10:14 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్ - Sakshi

ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్

బెంగళూరు : బెంగళూరు ఏటీఎం దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని తుంకూరులో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గత నెల19న బెంగళూరు ఏటీఎం కేంద్రంలో కార్పోరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్పై హత్యాయత్నం చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జాయింట్ ఆపరేషన్గా చేపట్టిన ఈ వేటలో 200మంది ఏపీ, 200 కర్ణాటక పోలీసులు ఉన్నారు. ఓ నిందితుడి వేటలో నాలుగు వందలమందిని నియమించటం ఇది రెండవసారి.

గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకునేందుకు అప్పటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన 500 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత అదే స్థాయిలో జాయింట్ ఆపరేషన్ ఇదేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement