bangalore atm attack
-
ఆ ఏటీఎం ఘటనలో మరో ముందడుగు
బెంగళూరు: మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి ఘటనలో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో బాధితురాలు నిందితుడిని ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో గుర్తు పట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధుకర్‌రెడ్డి(43) ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ 2011లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2013లో బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళపై వేటకత్తితో దాడి చేసి, దోచుకున్నాడు. ఇదంతా ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగి. తీవ్రంగా గాయపడిన ఆమె ఎడమ చేతికి పక్షవాతం కూడా వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మధుకర్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని పరప్పణ జైలులో రిమాండ్ చేశారు. విచారణలో అతడు పలు నేరాలకు పాల్పడ్డట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సెక్స్ వర్కర్‌తోపాటు ఏపీలో ఇద్దరు మహిళలను అతడు హత్య చేసినట్లు తేలిందన్నారు. పరప్పణ అగ్రహారం సెంట్రల్ జైలులో శుక్రవారం నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని బాధితురాలు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు. సంబంధిత కథనాలు పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు? బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
మధుకరా.. భయంకరా!
► 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు ► పదుల సంఖ్యలో దోపిడీలు ► బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం ► నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు ► చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు
-
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో పరారైన ఘటనలో నిందితుడు చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం.. జనవరి 31న నిమ్మనపల్లికి చెందిన మధుకర్ రెడ్డి అనే ఈ నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 2013 సెప్టెంబర్ నెలలో అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు. (చదవండి: బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి) ఇతడిని పట్టుకున్నవారికి రూ. 12 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి అతడికోసం అటు కర్ణాటక పోలీసులతో పాటు ఇటు ఏపీ పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అతడు చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు దొరికినవాడే అసలైన నిందితుడా కాదా అనే విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. పోలీసులు మాత్రం అసలు ఇతడు పట్టుబడిన విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. మధుకర్ రెడ్డి గతంలో కూడా చాలా నేరాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు
-
కొన్ని నగరాల్లో రాత్రిపూట ఎటీఎంలు క్లోజ్!
-
కొన్ని నగరాల్లో రాత్రిపూట ఎటీఎంలు క్లోజ్!
ముంబయి : కొత్త ఏడాదిలో బ్యాంక్‌లు వినియోగదారులకు ఒక షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాయి. ఏటీఎంలు రాత్రిపూట పని చేయాలా వద్దా అనే దానిపై ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని నగరాల్లో రాత్రిసమయాల్లో ఏటీఎంలు మూసి వేయనున్నట్లు ఆర్బీఐకి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బెంగళూరులో ఓ బ్యాంకు ఉద్యోగినిపై దాడి జరిగిన నేపథ్యంలో ఏటీఎంలలో భద్రత విషయం మీడియాకెక్కింది. దాంతో పలు బ్యాంకులు తమ ఏటీఎంలకు సెక్యూరిటీ కల్పించలేమని చేతులెత్తేయడంతో అక్కడ దాదాపు వెయ్యికిపైగా ఏటీఎంలు మూసివేశారు. మరోవైపు వీటి సంరక్షణ భారం తమది కాదన్నట్టు బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారుడిపైనే మోపేందుకు నడుం కడుతున్నాయి. వాడుకునేవాడికి వాడుకునేంత అన్నట్లు వినియోగదారుడి నెత్తినే బరుపు మోపనున్నాయని సమాచారం. ఇక ఏటీఎంల వద్ద భద్రతకు కస్టమర్లే ప్రతి లావాదేవీకి ఆరు రూపాయలు చెల్లించాలనే ప్రతిపాదనను బ్యాంకులు చురుకుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భద్రత నేపథ్యంలో కొన్ని నగరాల్లో రాత్రి సమయాల్లో ఏటీఎంలను మూసివేయాలనే ప్రతిపాదనను తెరమీదకు తేవటం విశేషం. మరి దీనికి ఆర్బీఐ ఆమోదం తెలుపుతుందో లేదో చూడాలి. -
ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు ఏటీఎం దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని తుంకూరులో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గత నెల19న బెంగళూరు ఏటీఎం కేంద్రంలో కార్పోరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై హత్యాయత్నం చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జాయింట్ ఆపరేషన్‌గా చేపట్టిన ఈ వేటలో 200మంది ఏపీ, 200 కర్ణాటక పోలీసులు ఉన్నారు. ఓ నిందితుడి వేటలో నాలుగు వందలమందిని నియమించటం ఇది రెండవసారి. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునేందుకు అప్పటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన 500 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత అదే స్థాయిలో జాయింట్ ఆపరేషన్ ఇదేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు?
-
అనంత పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు?
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్లచెరువు ప్రాంతానికి చెందిన సైకో నారాయణరెడ్డి అనే వ్యక్తిని నిందితునిగా గుర్తించినట్లు సమాచారం. నారాయణరెడ్డి గతంలో 2008 సంవత్సరంలో ఓ మహిళ హత్య, చోరీ కేసులో నిందితుడు. పోలీసులు విడుదల చేసిన ఏటీఎం నిందితుడి ఫొటోతో.. సైకో నారాయణరెడ్డి పోలికలు చాలావరకు ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా ఏటీఎం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలుమార్లు కథనాలు వినిపించాయి గానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేకపోయారు. పట్టుకున్న వారికి, సమాచారం ఇచ్చిన వారికి మూడు లక్షల రూపాయల నజరానా ఇస్తామని చెప్పినా కేసులో ముందడుగు పడలేదు. ఇప్పుడు ఈ కొత్త పేరు బయటకు వచ్చినా ఇది కూడా ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. -
వాడు సైకో కాకపోవచ్చు!
*స్పష్టమైన తెలుగులో సంభాషణ *కదిరి ఏటీఎం కేంద్రంలో గుంతకల్లుకు చెందిన మహిళతో మాట్లాడిన వైనం కదిరి : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ నెల 10న ప్రమీలమ్మను చంపిన హంతకుడు.. 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి..19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతగాడి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తుంటే సైకో కాదని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు బృందంలోని ఓ పోలీస్ అధికారిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా...ఈ కేసుకు సంబంధించిన పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఈనెల 10న ధర్మవరంలో ప్రమీలమ్మను హత్య చేసేముందు రెండు ఏటీఎం కార్డులను బలవంతంగా లాక్కొని, సీక్రెట్ పిన్ నంబర్లను సైతం ఆమెతోనే చెప్పించుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 11న ఉదయం 10.30 ప్రాంతంలో అతను కదిరి ఏటీఎం కేంద్రంలోకి వచ్చాడని ఇన్నాళ్లూ తాము భావించామని, అయితే ఉదయం 5.30 గంటలకే వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ బట్టి తెలుసుకున్నామని చెప్పారు. సుమారు 25 నిమిషాల పాటు ఏటీఎంలో గడిపి, ఆ తర్వాత ఓ దినపత్రికను కొనుక్కొని మళ్లీ ఏటీఎంలోకి వచ్చాడన్నారు. ఆ రోజు ఉదయం అతను ఉపయోగించిన ఏటీఎం కార్డు ప్రమీలమ్మదేనని గుర్తించామన్నారు. అయితే ... ఆ కార్డుకు సంబంధించిన బ్యాంకు ఖాతా 2012 ఏప్రిల్ 28వ తేదీనే క్లోజ్ అయినట్లు తెలిపారు. అందుకే అతను పలుమార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. అదే రోజు ఉదయం 10.30 ప్రాంతంలో ప్రమీలమ్మ కుమారునికి సంబంధించిన ఏటీఎం కార్డు ఉపయోగించి మూడు దఫాలుగా డబ్బు డ్రా చేశాడన్నారు. అతను ఏటీఎంలో ఉన్నప్పుడు అతని ముందు డబ్బు డ్రా చేసిన మహిళతో కాసేపు మాట్లాడాడని, ఆమె ప్రస్తుతం గుంతకల్లులో ఉద్యోగం చేస్తోందని వివరించారు. గతంలో కదిరిలో పనిచేసిన కారణంగా ఆమె ఆ రోజు ఇక్కడకు వచ్చినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. గీతల చొక్కా వేసుకున్న అతన్ని గతంలో తానెప్పుడూ చూడలేదని, ఆ రోజు డబ్బు డ్రా చేసేటప్పుడు మాత్రం ఇలా చేయండంటూ తనకు స్పష్టంగా చక్కటి తెలుగులోనే సలహా ఇచ్చాడని ఆమె తమతో చెప్పిందన్నారు. 12న ఉదయం 5.30 గంటలకు మరోసారి అదే ఏటీఎం కేంద్రానికి వచ్చి.. మళ్లీ ఆ కార్డుతోనే డబ్బు డ్రా చేశాడని, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడని తెలిపారు. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి, కదిరిలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి పోలికలు సరిపోయాయని, వాడే వీడని తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆ అధికారి ధీమా వ్యక్తం చేశారు. ‘ఏటీఎం’ అనుమానితున్ని ప్రశ్నించిన పోలీసులు ఏటీఎం దొంగ పోలీసులకు పట్టుబడ్డాడంటూ శుక్రవారం రాత్రి నగరంలో వదంతులు వ్యాపించాయి. వన్‌టౌన్ ఎస్ఐ ధరణి కిశోర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామ్‌నగర్‌లోని ఏడీబీ ఏటీఎంలోకి ఓ వ్యక్తి తొంగిచూస్తుండడం గమనించిన సెక్యూరిటీ గార్డు ప్రసాద్ అతనిని నిలదీశాడు. అయితే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తనకు డీఎస్పీ తెలుసంటూ ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రామ్‌నగర్‌కు చేరుకున్నారు. అప్పటికే వన్‌టౌన్ పోలీసులు తీసుకెళ్లారని తెలియడంతో, స్టేషన్ వద్దకు వెళ్లారు. సుమారు అరగంట అనంతరం స్టేషన్‌కు చేరుకున్న ఎస్ఐ ధరణికిశోర్ విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే, విలేకరులు పట్టుబట్టడంతో అతనిని వారి ముందు హాజరుపరిచారు. ఏటీఎం నిందితుని ఆనవాళ్లు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విలేకరులు ఆరా తీయగా, తాను కర్నూలు జిల్లా వాసినని, రాప్తాడు హెడ్మాస్టర్ ఇంటికి పెయింట్ వేసేందుకు కూలీగా వచ్చానని తెలిపాడు. బజ్జీలు తినేందుకు మారుతీనగర్ నుంచి రామ్‌నగర్ ఏడీబీ బ్యాంక్ వద్దకు మిత్రులతో కలసి వచ్చానని అన్నాడు. మిత్రుల కోసం ఏటీఎం కేంద్రం వద్ద నిలుచుని ఉండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపాడు. -
పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు
కర్ణాటక రాజదాని బెంగళూరులోని ఏటీఎం కేంద్రంలో సుమారు పది రోజుల కిందట పట్టపగలే ఓ మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన అగంతకుడిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం బ్యాంక్ ఉద్యోగిపై ఏటీఎంలో విచాక్షనాత్మకంగా దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుణ్ణి పట్టిచ్చిన వారికి ప్రకటించిన నజరానాను ఇటీవల రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచారు. ఇప్పటికే కర్ణాటక ప్రకటించిన నజరానా రూ. లక్షతోపాటు అనంతపురం పోలీసుల తరఫున మరో రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని చిత్తూరు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ బుధవారం రాత్రి అనంతపురంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడి సంఘటన తర్వాత నిందితుడిని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు చర్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలోని రాంనగర్ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
'ఏటీఎం' దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్!
రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అతడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హిందుపురం పట్టణంలో మొబైలు ఫోన్ విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుడు హిందుపురానికి చెందినవాడు. పోలీసులు విచారణ నిమిత్తం అతడిని కర్ణాటకకు తరలించారు. కాగా బెంగళూరులో నగదు డ్రా చేసేందుకు బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి షెటర్ మూసివేసి, ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. అలాగే తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్ ఫోన్ తీసుకుని అతడు పరారయ్యాడు. ఏటీఎం నుంచి రక్తం రావడంతో స్థానికులు అనుమానించి షటర్ ఎత్తి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. దాంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఏటీఎంలో మహిళపై ఆగంతకుడు దాడి, అనంతరం జరిగిన తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో పోలీసులు సీసీ పూటేజ్‌లను పరిశీలించారు. నిందుతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కర్ణాటక పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసుల సహాయం తీసుకున్నారు. దాంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనుమానితుడి అరెస్ట్ ను పోలీసులు ఇంకా ద్రువీకరించలేదు. -
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం
-
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో దాడికి గురైన కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌కు కుడివైపు పక్షవాతం వచ్చింది. మంగళవారం ఉదయం డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన ఆమెపై ఒక ఆగంతకుడు వేట కత్తితో దాడి చేయగా తలపై తీవ్రంగా గాయమైన విషయం తెలిసిందే. దాడి అనంతరం షట్టర్ మూసి వెళ్లి పోవడం వల్ల మూడు గంటలు గడిచే వరకూ ఎవరూ గుర్తించక పోవడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం జ్యోతి మాట్లాడగలుగుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ ఎన్కే వెంకటరమణ బుధవారం విలేకరులకు తెలిపారు. దుండగుడు తలపై బలంగా నరకడంతో చిన్న ఎముక ముక్క విరిగి మెదడులోకి చొచ్చుకుపోయిందని, దానిని తొలగించామని డాక్టరు తెలిపారు. దీనివల్ల ఆమె శరీరంలో కుడి వైపు చచ్చుబడిపోయిందని ఆయన చెప్పారు. దాడిలో ఆమె ముక్కు తెగిందని, ముఖంపై పలుచోట్ల గాయాలయ్యాయని వాటినిప్లాస్టిక్ సర్జరీతో సరిచేశామని చెప్పారు. దాడి జరిగిన రోజు రాత్రి ఆమెకు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా, దుండగుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నాయకత్వంలో ఎనిమిది బృందాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టాయి. అయితే ఆగంతకుడు కన్నడం మాట్లాడాడని, డబ్బు తీసివ్వు, డబ్బు తీసివ్వు అంటూ గదమాయించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఏటీఎంల మూత నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను మూయించి వేస్తామని హోం మంత్రి కేజే జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను నియమించాల్సిందిగా బ్యాంకులకు సూచించారు. ప్రత్యేక పోలీసు చట్టాన్ని రూపొందించి, దాని పరిధిలోకి బ్యాంకులను తీసుకు వచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇకమీదట పోలీసుల అనుమతి లేనిదే ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని బ్యాంకులకు సూచించనున్నట్లు చెప్పారు.