పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు
Published Fri, Nov 29 2013 9:07 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
కర్ణాటక రాజదాని బెంగళూరులోని ఏటీఎం కేంద్రంలో సుమారు పది రోజుల కిందట పట్టపగలే ఓ మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన అగంతకుడిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం బ్యాంక్ ఉద్యోగిపై ఏటీఎంలో విచాక్షనాత్మకంగా దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుణ్ణి పట్టిచ్చిన వారికి ప్రకటించిన నజరానాను ఇటీవల రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచారు.
ఇప్పటికే కర్ణాటక ప్రకటించిన నజరానా రూ. లక్షతోపాటు అనంతపురం పోలీసుల తరఫున మరో రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని చిత్తూరు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ బుధవారం రాత్రి అనంతపురంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడి సంఘటన తర్వాత నిందితుడిని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు చర్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలోని రాంనగర్ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
Advertisement