పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు? | bangalore atm attacker madhu told to be in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?

Published Sat, Feb 4 2017 2:13 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు? - Sakshi

పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో పరారైన ఘటనలో నిందితుడు చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం.. జనవరి 31న నిమ్మనపల్లికి చెందిన మధుకర్ రెడ్డి అనే ఈ నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 2013 సెప్టెంబర్ నెలలో అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు. 
 
ఇతడిని పట్టుకున్నవారికి రూ. 12 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి అతడికోసం అటు కర్ణాటక పోలీసులతో పాటు ఇటు ఏపీ పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అతడు చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు దొరికినవాడే అసలైన నిందితుడా కాదా అనే విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. పోలీసులు మాత్రం అసలు ఇతడు పట్టుబడిన విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. మధుకర్ రెడ్డి గతంలో కూడా చాలా నేరాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement