madhukar reddy
-
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
జనరిక్స్‌పై మెడ్‌ప్లస్... మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల రిటైల్ దిగ్గజం మెడ్‌ప్లస్ ‘స్టోర్ జనరిక్’ కాన్సెప్టుపై మరింతగా దృష్టి పెడుతోంది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ కాన్సెప్టును దేశీయంగా తాము తొలిసారి ప్రవేశపెట్టినట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. దీని కింద తమ స్టోర్స్‌లో నాణ్యమైన సొంత బ్రాండ్ ఔషధాలపై ఉత్పత్తిని బట్టి 50–80 శాతం మేర, సగటున 60 శాతం మేర డిస్కౌంటుకే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే మార్కెటింగ్, డి్రస్టిబ్యూషన్ చానల్పరమైన వ్యయాల భారం తమకు ఉండని కారణంగా ఇది సాధ్యపడుతోందని మధుకర్ చెప్పారు. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ మోడల్‌ను క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో ఏడు రాష్ట్రాల్లో 26.2 లక్షల మంది పైచిలుకు కస్టమర్లకు గడిచిన ఆరు నెలల్లో రూ. 139.7 కోట్ల మేర ఆదా అయిందని ఆయన వివరించారు. దేశీయంగా దాదాపు 800 పైగా ఔషధాలు ఉండగా .. 600 పైగా జనరిక్స్‌ను తాము అందిస్తున్నట్లు మధుకర్ చెప్పారు. దిగ్గజ సంస్థలతో జట్టు .. ‘‘సాధారణంగా జనరిక్స్ అంటే అంత నాణ్యమైనవి కాకపోవచ్చనే అపోహ ఉంటోంది. అయితే, బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ అనే తేడా లేకుండా పేటెంటు ముగిసిపోయిన ఔషధాన్ని ఎవరు తయారు చేసినా అది జనరిక్ ఔషధమే. కాకపోతే ఎంత నాణ్యతతో తయారు చేస్తున్నారనేది ముఖ్యం. మా వరకు మేము నాణ్యతకు పెద్దపీట వేస్తూ అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా, విండ్లాస్ బయోటెక్ వంటి దేశీయంగా అగ్రగామి ఔషధ తయారీ సంస్థ (సీడీఎంవో)ల దగ్గర జనరిక్స్‌ను తయారు చేయిస్తున్నాం. అధునాతన టెక్నాలజీలతో వాటి నాణ్యతను మేము కూడా స్వయంగా పరీక్షిస్తాం. పలు దిగ్గజ ఫార్మా సంస్థలకు కూడా ఈ సంస్థలు జనరిక్స్ అందిస్తున్నాయి. తమ ఫ్యాక్టరీల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ యూనియన్ నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నాయి. కాబట్టి నాణ్యత విషయంలో రాజీ ఉండదు. అదే సమయంలో వేల సంఖ్యలో ఉన్న మా స్టోర్స్ ద్వారా విక్రయించడంతో మాకు మార్కెటింగ్పరమైన వ్యయాలు ఉండవు కాబట్టి ఆ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు నేరుగా బదలాయించగలుగుతున్నాం’’ అని మధుకర్ వివరించారు. దేశీ ఫార్మా విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, వైద్య పరీక్షల సేవలనూ గణనీయంగా విస్తరిస్తున్నామన్నారు. మెడ్ప్లస్కి ప్రస్తుతం పది రాష్ట్రాల్లో 4,200 పైచిలుకు స్టోర్స్‌లో సంఘటిత రిటైల్ ఫార్మసీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
గుండెపోటుతో తమ్ముడు.. పెద్ద కర్మరోజు అన్నకు కూడా..
కరీంనగర్: తమ్ముడి మృతి ని తట్టుకోలేక అన్న గుండె ఆగింది. తమ్ముడు గుండెపోటుతో మృతిచెందగా.. పెద్దకర్మరోజు అన్న కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంటలో జరిగింది. రేణికుంటకు చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డికి ఇద్దరు కొడుకులు సంతోష్‌రెడ్డి(30), మధుకర్‌రెడ్డి(26) ఉన్నారు. పెద్దకొడుకు సంతోష్‌రెడ్డి కరీంనగర్లో, మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లికాలేదు. 20 రోజుల క్రితం మధుకర్‌రెడ్డికి జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చేరగా రక్తకణాలు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై ఈనెల 3న మృతిచెందాడు. తమ్ముడి పెద్ద కర్మరోజు సంతోష్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్సకు సుమారు రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సంతోష్ మృతిచెందాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..
భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్‌కు చెందిన ఏనిగ ఉపేందర్‌రెడ్డి కుమారుడు మధూకర్‌రెడ్డి (20), వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్‌పై నవభారత్ వైపు వెళ్తూ ఎన్ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్‌కు ఢీకొట్టారు. దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్, పట్టణ ఎస్ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సంబురాలు.. అంతలోనే విషాదం.. ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్‌లో ఉంటున్న మధూకర్‌రెడ్డి మోటార్ సైకిల్‌పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మధూకర్‌రెడ్డి.. శివను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్‌కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్‌రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.రాము తెలిపారు. -
ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు
-
ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు
భువనగిరి: అమెరికా కాలిఫోర్నియాలో ఈ నెల 4న మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్‌రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ఉద్రిక్తతల మధ్య సాగాయి. మంగళవారం తెల్లవారుజామున భువనగిరిలోని నివాసా నికి మధుకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అదే సమయంలో మృతుడి భార్య స్వాతి ఆమె కుటుంబ సభ్యులతో అక్క డికి వచ్చారు. మృతుడి బంధువులు స్వాతిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. మీ కారణంగానే మధుకర్‌రెడ్డి చని పోయాడంటూ అతడి బంధువులు స్వాతి, ఆమె తండ్రి నర్సింహారెడ్డిపై దాడికి పాల్పడ్డా రు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్తను హత్య చేయించానని అత్తింటి వారు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తన భర్తకు మొదటి నుంచీ మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. భర్త ఆస్తి తనకు ఇవ్వాల్సి వస్తుందనే తమపై దాడి చేశారన్నారు. తన కుమారుడికి చావుకు కోడలు స్వాతే కారణమని మధుకర్ తండ్రి బాల్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం మధుకర్ మృతదేహానికి యాదగిరిగుట్ట రాళ్లజనగాంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
'నా కూతురు ఆరేళ్లుగా నరకం అనుభవించింది'
-
ఆ ఏటీఎం ఘటనలో మరో ముందడుగు
బెంగళూరు: మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి ఘటనలో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో బాధితురాలు నిందితుడిని ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో గుర్తు పట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధుకర్‌రెడ్డి(43) ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ 2011లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2013లో బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళపై వేటకత్తితో దాడి చేసి, దోచుకున్నాడు. ఇదంతా ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగి. తీవ్రంగా గాయపడిన ఆమె ఎడమ చేతికి పక్షవాతం కూడా వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మధుకర్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని పరప్పణ జైలులో రిమాండ్ చేశారు. విచారణలో అతడు పలు నేరాలకు పాల్పడ్డట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సెక్స్ వర్కర్‌తోపాటు ఏపీలో ఇద్దరు మహిళలను అతడు హత్య చేసినట్లు తేలిందన్నారు. పరప్పణ అగ్రహారం సెంట్రల్ జైలులో శుక్రవారం నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని బాధితురాలు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు. సంబంధిత కథనాలు పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు? బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
మధుకర్‌రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరణ
ధర్మవరం అర్బన్: పోలీసు కస్టడీలో ఉన్న అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నాలుగురోజులపాటు ఇతడిని కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధుకర్‌రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబు నగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న 2 ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. ఇంకా పలు కేసులను మధుకర్‌రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలో ఎక్కువగా ఏటీఎంలలో దోపిడీలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇంకా మూడురోజులపాటు మధుకర్‌రెడ్డిని ధర్మవరం పట్టణ పోలీసులు విచారించనున్నారు. దీంతో మధుకర్‌రెడ్డి చేసిన మరిన్ని నేరాలు బయటపడే అవకాశం ఉంది. -
పోలీస్ కస్టడీకి మధుకర్‌రెడ్డి
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డిని కోర్టు అనుమతి మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు ఆదివారం తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రిలో అతడికి వైద్యపరీక్షలు చేయించారు. మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో అతనిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం మధుకర్‌రెడ్డిని పట్టణ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. -
మధుకరా.. భయంకరా!
► 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు ► పదుల సంఖ్యలో దోపిడీలు ► బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం ► నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు ► చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు
-
మధుకరా.. భయంకరా!
4 హత్యలు.. 3 హత్యాయత్నాలు పదుల సంఖ్యలో దోపిడీలు బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో పరారైన ఘటనలో నిందితుడు చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం.. జనవరి 31న నిమ్మనపల్లికి చెందిన మధుకర్ రెడ్డి అనే ఈ నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 2013 సెప్టెంబర్ నెలలో అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు. (చదవండి: బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి) ఇతడిని పట్టుకున్నవారికి రూ. 12 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి అతడికోసం అటు కర్ణాటక పోలీసులతో పాటు ఇటు ఏపీ పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అతడు చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు దొరికినవాడే అసలైన నిందితుడా కాదా అనే విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. పోలీసులు మాత్రం అసలు ఇతడు పట్టుబడిన విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. మధుకర్ రెడ్డి గతంలో కూడా చాలా నేరాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం -
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు
-
చాప్టా (కె) వీఆర్వో మాయాజాలం
♦ ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాల ఫోర్జరీ ♦ గుట్టురట్టయిన బాగోతం ♦ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ కంగ్టి: వీఆర్వో మాయాజాలానికి రైతులు బలయ్యారు. భూమి యాజమాన్య హక్కు పత్రాలపై ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలతో రైతులకు పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధం చేశాడు. అనుమానం వచ్చి సంతకాలను పరిశీలించగా గుట్టురట్టయింది. ఈ ఘటన కంగ్టి మండలంలో వెలుగుచూసింది. కంగ్టి మండలం చాప్టా(కె) క్లస్టర్లో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న నర్సింలు సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. తహసీల్ కార్యాలయం నుంచి పట్టాపాస్‌బుక్‌లు తీసుకొని ఆర్డీఓ సంతకాల కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వాసర్ గ్రామం, తండాకు చెందిన రైతులు సుభాష్, సీతారాం, శ్రీరామ్, అంబుబాయి, జమలాబాయి, ఓంప్రకాష్, లక్ష్మయ్యల భూమి యాజమాన్య హక్కు పత్రాలపై బదిలీపై వెళ్లిన ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలు చేయించి తిరిగి కార్యాలయంలో సమర్పించాడు. సంబంధిత వాసర్ వీఆర్వో రాములు పరిశీలించారు. అనుమానం రావడంతో తహసీల్దార్ వసంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో అప్పటి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలతో సరిపోల్చగా ఫోర్జరీ అని తేలిందని తహసీల్దార్ తెలిపారు. సదరు వీఆర్వో నర్సింలుపై చర్యలకు అనుమతి కోరుతూ బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నివేదిక పంపినట్టు తహసీల్దార్ వసంత్‌కుమార్ తెలిపారు. -
సంగారెడ్డిలో వైస్ పీఠం కాంగ్రెస్‌దే..
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి వైస్ చైర్మన్ పీఠం కాంగ్రెస్‌కే దక్కింది. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు పన్నినా ఎ మ్మెల్యేను ఖంగు తినిపిస్తూ కాంగ్రెస్ హస్తగతం చే సుకుంది. సంగారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా 21వ వార్డు కౌన్సిలర్ గోవర్ధన్‌నాయక్ ఎన్నికయ్యారు. ఈ నెల 3, 4న నిర్వహించిన వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆది వారం ఎన్నికల ప్రొసిడింగ్ అధికారి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిం చారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గోవర్ధన్నాయక్కు 19, టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన ఎంఐఎం 18వ వార్డు కౌన్సిలర్ బిపాషాకు కేవలం 5 ఓట్లు రాగా, బీజేపీ తరఫున పోటీ చేసిన సునీల్‌కు ఆ పార్టీ సభ్యులు సైతం ఓటు వేయలేదు. దీంతో సునీల్ అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఎంఐఎంకు చెందిన 8 మంది సభ్యులతో పాటు టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్, కాంగ్రెస్ కౌన్సిలర్ వీణ టీఆర్ఎస్ కు మద్దతిస్తారని భావించి ఓటింగ్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గోవర్ధన్నాయక్కు మద్దతు తెలిపేవారు చేతులెత్తాలని ఎన్నికల అధికారి సూచించడంతో ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు తెలపడంతో మిగతా ఎంఐఎం కౌన్సిలర్లు అక్క డి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఖంగుతిన్నారు. తమ మద్దతు కోరి సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎవరికి మద్దతివ్వాలో తెలియక చివరి క్షణంలో సమావేశం నుంచి బయటకు వెళ్లి వచ్చిన బిపాషాకు ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ ఇద్దరు కౌ న్సిలర్లు ఓట్లు వేశారు. పది మందికి కేవలం ఐదు ఓట్లే ఎంఐఎంకు వచ్చాయి. పనిచేయని హనుమాన్ యంత్రం బీజేపీ తరఫున మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పోటీ చేసిన సునీల్ చేసిన హనుమాన్ యంత్రం ఏ మాత్రం పనిచేయలేదు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఆదివారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరానికి వచ్చిన సునీల్ మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మీతో పాటు పార్టీ కౌన్సిలర్లకు హనుమాన్ యంత్రం ఉన్న కార్డును అందజేస్తూ ‘మీరు హనుమంతుని మీద ఒట్టేశారు. నాకే ఓటు వేయాలి’ అని లేదం టే హనుమంతుడే మిమ్మల్ని చూసుకుం టాడంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో సునీల్ వెనక్కితగ్గారు. ఇంతలోనే సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరైనా ప్రతిపాదించేందుకు ముందుకు రాలేదు. దీంతో సునీల్ నిరాశకు గురయ్యారు. ఇదిలాఉండగా మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ఆర్.మధుమోహన్‌రెడ్డి పరిశీలించారు.