ధర్మవరం అర్బన్ : అంతర్‌రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డిని కోర్టు అనుమతి మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు ఆదివారం తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రిలో అతడికి వైద్యపరీక్షలు చేయించారు. మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో అతనిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం మధుకర్‌రెడ్డిని పట్టణ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు.