atm thief
-
ఈ ఏడాదికూడా మారరా..
-
రైతు దగ్గర రూ.82 వేలు కొట్టేసిన ఏటీఎం దొంగ!
ఖమ్మం: అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ కు వచ్చిన రైతు దగ్గర నుంచి మోసం 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నా కేటుగాడుని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుకు డబ్బులు డ్రా చేయడం తెలవక పోవడంతో వెనుక ఉన్న వ్యక్తి నేను తిసిస్తాను అని చెప్పడంతో నమ్మి తన ఏటీఎం కార్డు ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ఎంతో తెలివిగా ఏటీఎం కార్డు మార్చి 82వేల రూపాయలను కేటుగాడు డ్రా చేసుకున్నాడు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దొంగను పట్టుకున్నారు. పూర్తీ వివరాల్లోకి వెళ్లితే.. మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీస గ్రామానికి చెందిన బోబ్బ వెంకటరెడ్డి అనే రైతు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఖమ్మంకు వచ్చాడు. తన అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు నగరంలోని గాంధీచౌక్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వచ్చాడు. అక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్న క్రమంలో డబ్బులు రాక పోవడంతో వెనుకనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నేను ట్రై చేస్తానని చెప్పి డబ్బులు రావడం లేదని చెప్పి తన కార్డ్ కు బదులు వేరే ఏటీఎం కార్డ్ ఇచ్చి మోసం చేసి తన ఖాతా నుండి 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నట్లు బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్ సిసి ఫుటేజ్, మోసం చేసి రైతుకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ చిరునామా ప్రకారం పోలీసలు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ విజువల్స్ అనుమానం గల వ్యక్తి(కొండబోయిన నరసింహారావు) ఆదివారం అనుమానాస్పదంగా గాంధీచౌక్ పరిసరాలలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన నేరం ఒప్ప్పుకున్నాడు. ఈ నేరంతో పాటు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు నేరాలు, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఇల్లందులో రెండు నేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించారు. అతనిని అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఉన్న 36,000/- రూపాయల నగదు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీన పర్చుకోని రిమాండ్ కు పంపారు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులు జాగ్రత్త లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు డ్రా చేయడం తెలియకపోతే ఇంట్లొ సంబంధించిన వ్యక్తులను వెంట తీసుకొని ఏటీఎం సెంటర్ కి వెళ్లాలే తప్పితే గుర్తుతెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
ఏటీఎం మోసగాడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: ప్రియురాలికి బహుమతులు ఇచ్చేందుకు ఏటీఎం వద్ద అమాయకుల్ని మోసం చేసి దోచుకుంటున్న కేటుగాడిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణలు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వేల్పుల రాజేష్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు గుంటూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో సీటు రావడంతో చేరింది. దీంతో రాజేష్ గుంటూరు మంగళదాస్ నగర్లో అద్దె గదిలో ఉంటూ ప్రేమాయణం కొనసాగించాడు. తన ఖర్చులకు, ప్రియురాలికి బహుమతులు అందించేందుకు అడ్డదారులు తొక్కాడు. అక్టోబర్ మొదటి వారంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించి మాయమాటలు చెప్పి కార్డు కాజేశాడు. అతని ఖాతాలో రూ.8 వేలు డ్రా చేశాడు. అక్టోబర్ 10వ తేదీ ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె కార్డుతో రూ. 64 వేలు డ్రా చేశాడు. నవంబర్ 4వ తేదీన చందన బ్రదర్స్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వృద్ధుడికి డబ్బులు డ్రా చేసేందుకు సహాయపడినట్లుగా నటించి తన వద్ద ఉన్న నకిలీ కార్డు ఇచ్చి మోసం చేశాడు. అనంతరం వృద్ధుడి ఖాతాలోని రూ. 72 వేలు లాగేశాడు. వరుస సంఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి, వేల్పుల రాజేష్‌ను అరెస్టు చేశారు. చోరీ చేసిన రూ. 1.36 లక్షలతో అతడు 23 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. వాటితో పాటు రూ. 40 వేల నగదు, 7 నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. -
పోలీస్ కస్టడీకి మధుకర్‌రెడ్డి
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డిని కోర్టు అనుమతి మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు ఆదివారం తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రిలో అతడికి వైద్యపరీక్షలు చేయించారు. మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో అతనిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం మధుకర్‌రెడ్డిని పట్టణ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. -
అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగకు 15 రోజుల రిమాండ్
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డికి ధర్మవరం కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డిని పదిరోజుల క్రితం చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 అక్టోబర్ 11న చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలు ఎత్తుకెళ్లాడు. అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పట్టణ సీఐ హరినాథ్ తమకు అగించాలని పిటీష¯ŒS వేసి మధుకర్‌రెడ్డిని ధర్మవరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఐ హరినాథ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఏటీఎంలో దొంగతనం, హత్య కేసులో మధుకర్‌రెడ్డి ప్రధాన నిందితుడని తెలిపారు. మధుకర్‌రెడ్డిని ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి ఈనెల 27వతేదీ వరకు అతనికి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. -
మధుకరా.. ఎంత పనిచేశావురా..!
– 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు – పదుల సంఖ్యలో దోపిడీలు – నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు – చివరకు చిత్తూరు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్) / కదిరి/ అనంతపురం సెంట్రల్ : హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలతో దక్షిణాది రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేయడానికి వచ్చిన ఖాతాదారులపై దాడికి తెగబడి సంచలనం సృష్టించిన నిందితుడు కొండయ్యగారి మధుకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు, పదుల సంఖ్యలో దోపిడీలతో నేర చరిత కలిగిన మధుకర్‌రెడ్డి వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా.. ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లితండ్రులకు చెందిన ఓ ఇల్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో జనవరి 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్రెడ్డిను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ఇతన్ని విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలియడంతో తేరుకోలేకపోయారు. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. దీంతో పాటు పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మదనపల్లి పోలీసులను అభినందించిన ఎస్పీ మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్శింహులు, మొహీద్దీన్‌లను అభినందించారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మధుకర్ నేరాల్లో.. మచ్చుకు కొన్ని.. - బెంగుళూరు కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై 2013 నవంబర్ 19న మధుకర్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. - 2013 నవంబర్ 11, 12 తేదీల్లో కదిరి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రంలో రూ.3,700 డ్రా చేశారు. - నవంబర్ 10వ తేదీన ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను చంపి, ఆమె నుంచి లాక్కున్న రెండు ఏటీఎం కార్డులతోనే కదిరిలో ఆ మరుసటి దినం ఉదయం 10.36 గంటలకు రూ.3,500, 12న ఉదయాన్నే 5.54 గంటలకు అదే ఏటీఎం సెంటర్లో ఒక సారి రూ.500, ఇంకోసారి రూ.200 డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను డ్రా చేసినది ఒకటి ఎస్బీఐ ఏటీఎం కార్డు కాగా.. మరొకటి హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
ఏటీఎం దొంగ అరెస్టు
ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి రూ.లక్ష మేర కాజేసి, పోలీసులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన బాణాల ప్రశాంత్ విలాసాల కోసం వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఆంధ్రా బ్యాంకు ఏటీఎం సెంటర్లే టార్గెట్ చేసుకున్నాడు. డెబిట్ కార్డును వాడుకుని ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్లు చూపకుండానే హడావుడిగా వెళ్లిపోయే వినియోగదారులను ప్రశాంత్ గుర్తించేవాడు. ఆ వెంటనే ఏటీఎం సెంటర్లోకి వెళ్లి.. వారి ట్రాన్సాక్షన్‌ను కొనసాగించి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా పలువురి ఖాతాల నుంచి రూ.90 వేల వరకు డ్రా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.80 వేలను రికవరీ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
అనూహ్యంగా పోలీసులకి దొరికిన దొంగ
-
దోపి'ఢీ'
- పేట్రేగుతున్న దొంగలు వరుస దోపిడీలతో హడల్ - యథేచ్ఛగా సొత్తు అపహరణ చోద్యం చూస్తున్న పోలీసులు - భయం నీడలో జనం మెతుకుసీమ నేరాలకు అడ్డాగా మారుతోంది. ఎక్కడెక్కడో హత్యలు చేసి శవాలను జిల్లా సరిహద్దుల్లో పారేసి వెళుతున్నారు. మరోవైపు దొంగలు తెగబడుతున్నారు.. ముత్తూట్ ఫైనాన్స్.. గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఏటీఎంలు ఇలా ఒక్కొక్కటి టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు.. పోలీసులు మాత్రం చేతులు పెకైత్తి చోద్యం చూస్తున్నారు. దొంగలు, హంతకుల నేరాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు అసలు పని వదిలేసి వ్యక్తిగత ‘సేవ’లో మునిగి తేలుతుండటం గమనార్హం. సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో నేరాలకు అడ్డూఅదుపులేకుండాపోతోంది. నిత్యం దోపిడీలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. సీసీఎస్ ఉనికే లేదు. స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీ, ఇంటెలిజెన్సీ బలగాలు విధులను మర్చిపోయి ప్రతిపక్ష నేతల దిన చర్య, ఇతరుల వ్యక్తిగత వివరాలు సేకరించే పనులతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బీరంగూడ ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌లో జరిగిన లూటీ మరిచిపోక ముందే దొంగలు తెగబడి మూడు చోట్ల ఏటీఎంలను టార్గెట్ చేయడం పోలీసుల డొల్ల తనాన్ని తెలియజేస్తోంది. ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డిలోనే పక్కా స్కెచ్‌తో ఏటీఎం పగులగొట్టి నగదు తస్కరించడం సామాన్య ప్రజలను కలవర పెడుతోంది. దొంగలదే పై చేయి ... వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఉన్న కెనరా బ్యాంకు దోపిడీ జరిగి నాలుగు నెలలు గడస్తున్నా ఇప్పటికీ దొంగలు దొరకలేదు. అక్టోబర్ నెల 28న బ్యాంక్ దోపిడీ జరిగింది. దొంగలు స్ట్రాంగ్‌రూమ్ గోడకు కన్నం వేసి ప్రత్యేక లాకర్లను ధ్వంసం చేసి 5 కిలోల బంగారు ఆభరణాలు, 15లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ బ్యాంకును లూటీ చేసింది ఎవరనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలయయ్యారు. ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు. తాజాగా కౌడిపల్లిలో దొంగలు ఏటీఎం పగుల గొట్టడానికి విఫలయత్నం చేశారు. జహీరాబాద్‌లో.. జహీరాబాద్ పట్టణంతో పాటు, నియోజకవర్గం పరిధిలోని బ్యాంకులను, ఏటీఎంలు, ఫైనాన్స్‌లను దొంగలు లక్ష్యంగా చేసుకొని లూటీ చేస్తున్నారు. ఇక్కడ దొంగలు దోచుకోవడమేగాని ఇప్పటి వరకు దొరికింది లేదు. 2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు పడ్డారు.రూ.13.45లక్షల నగదు, 7.5 కిలోల బంగారు నగలు దోచుకుపోయారు. ఆరు నెలలు గడిచినా పోలీసులు వాళ్లను పట్టుకోలేకపోయారు. సంగారెడ్డి డీఎస్పీగా తిరుపతన్న వచ్చిన తరువాత ముత్తూట్ ఫైనాన్స్‌పై కొంత ప్రగతి సాధించారు. సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫి జ్యూయలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. ఈ దొంగలు ఇంకా దొరకలేదు. 2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75లక్షల నగదును దోచుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఒకే రోజు మూడు చోట్ల.... బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దొంగల స్వైర విహారం చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలోని ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 3.24 లక్షలను అపహరించారు. అక్కడి నుంచి కౌడిపల్లి, మెదక్ పట్టణాల్లోని ఏటీఎంలను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. మెదక్‌లో పోలీసులు దొంగలను వెంబడించినప్పటికీ వారిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆరితేరిన వారి పనే.. దొంగలు మొదటగా సీసీ కెమెరాల మీదనే దృష్టి పెడుతున్నారు. కెమెరాలకు హార్డ్ డిస్కును కనెక్ట్ చేసే వైర్లను ముందుగా కత్తిరించడమో...లేదంటే కెమెరా విజన్ గుర్తించి దాని పైకి తిప్పడం చేస్తున్నారు. 2014 నవంబర్ 3న అల్లాదుర్గంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో దొంగలు చోరికి యత్నించారు. అప్పుడు జరిగిన దొంగతనానికి రామచంద్రాపురం మండలం బీరంగూడలో జరిగిన లూటీకి కొంత సారూప్యం ఉందని తేలింది. అనంతర కాలంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ సిమీ ఉగ్రవాదుల పనే అని నల్లగొండ ఉగ్రవాదుల కాల్పుల సంఘటనలో బయటపడింది. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో మొత్తం ఐదుగురు యువకులు పాల్గొనగా.. వారిలో ఇద్దరు మాత్రమే నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగిలిన ముగ్గురు ఏమయ్యారో మన పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు మిగిలిన బ్యాంకు దోపిడీకి పాల్పడిన దొంగల వివరాలు మన పోలీసుల వద్ద లేనే లేవు. వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటి మన పోలీసులు ఒక్క దొంగను కూడా పట్టుకోలేక పోయారు. -
ఏటీఎంల దొంగ దొరికాడు
హైదరాబాద్: కొత్తపేటలో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శరవేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లో పెట్టేశారు. కొత్త కోటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇండిక్యాష్ ఏటీఎంలను ధ్వంసం చేసి అందులోని డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడివల్ల కాకపోవడంతో అలాగే వదిలివెళ్లాడు. ధ్వంసం అయిన ఏటీఎంలను పరిశీలించిన పోలీసులు వాటిల్లోని సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని నిందితుడిని గుర్తించారు. ఆ వెంటనే రంగంలోకి అరెస్టు చేశారు. -
విలువలకు పాతరేశారు!
* టీడీపీ సభ్యులపై వైఎస్సార్ సీపీ సీఎల్పీ ధ్వజం * మమ్మల్ని హంతకులు, ఫ్యాక్షన్ లీడర్లు, స్మగ్లర్లు అంటారా? సాక్షి, హైదరాబాద్: హుందాగా వ్యవహరించాల్సిన శాసనసభలో అధికార పక్ష సభ్యులు తమను హంతకులు, ఏటీఎం దొంగలు, ఫ్యాక్షన్ లీడర్లు, స్మగ్లర్లు అంటూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి మాట్లాడటం తగదని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ధ్వజమెత్తింది. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరణ ఇస్తుండగా అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఎంతో బాధపడుతున్నామని పేర్కొంది. తమ సభ్యులపై ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులకు సిగ్గూ శరం లేదని వైఎస్సార్ సీపీ సీఎల్పీ మండిపడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు శుక్రవారం అసెంబ్లీ మీడియా వద్ద విలేకరులతో మాట్లాడారు. సభాపతి తమ మనోభావాలను గుర్తిం చి అధికార పక్ష సభ్యులతో తొలుత క్షమాపణలు చెప్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ సభ్యులు తమ గురించి దారుణంగా మాట్లాడుతుంటే శాసనసభ గౌరవం అప్పుడు గుర్తుకు రాలేదా? అని సూటిగా ప్రశ్నించారు. సిగ్గులేనితనం వారిదా? మాదా? శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చకు అనుమతిం చిన స్పీకర్ అధికార పార్టీతో ఎక్కువగా మాట్లాడిం చడం, వారికే అవకాశం ఇచ్చి సభను హుందాగా నడపలేదని వైఎస్సార్ సీపీ శాసనసభ పక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. 2004-09 వరకు దివంగత వైఎస్సార్ పాలన స్వర్ణయుగమన్నా రు. శాంతిభద్రతల అంశం చర్చకు రాకుండా సీఎం చంద్రబాబు ఆదేశాలిస్తూ ఎదురు దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. బాబును మెప్పించేందుకు మం త్రులు వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఇది అసెంబ్లీ అనే విషయాన్ని మరిచిపోయి టీడీపీ కార్యాలయంలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ పోటీదారులుగా చూడండి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను రాజకీయ పోటీదారులు గా చూడాలని, కానీ దురదృష్టం కొద్దీ టీడీపీ నేతలు ఆగర్భ శత్రువుల మాదిరిగా చూస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాట్లాడేటప్పుడు స్పీకర్ మైక్‌లు కట్ చేస్తూ అధికార పార్టీ సభ్యులకే అవకాశమిస్తున్నారని చెప్పారు. అప్పుడు గుర్తుకు రాని నియమ నిబంధనలు వైఎస్ జగన్ విషయంలో గుర్తుకు రావటం స్పీకర్ పక్షపాత ధోరణిని తేట తెల్లం చేస్తుందన్నారు. సీఎం భాష చూస్తే భయమేస్తోంది.. సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలనుద్దేశించి ‘పిచ్చిపిచ్చిగా ఉందా.. తొక్కేస్తా.. ఇతర రాష్ట్రాలకు తరిమే స్తా’ అని మాట్లాడుతుంటే భయమేస్తోందని ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. ఎర్ర చందనం దొంగలకు ఎవరు జెడ్పీటీసీ టికెట్లు ఇచ్చారో.. రౌడీలకు, ఫ్యాక్షన్ లీడర్లకు టికెట్లు ఇచ్చింది ఎవరో తమ ను దారుణంగా అవమానిస్తున్న టీడీపీ సభ్యులు తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ను సస్పెండ్ చేసేందుకు కుట్ర.. ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు బుచ్చయ్య చౌదరి వ్యవహారం గురించి అందరికీ తెలుసని, ఆయనకు ఇప్పు డు నిజంగానే మతిభ్రమించిందని ఎమ్మెల్యే ఎం.సునీల్‌కుమార్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకుడిగా స్పీకర్ స్థానంలో కూర్చోవద్దని సూచించారు. తమ ను, తమ అధినేత జగన్‌ను సస్పెండ్ చేయాలని కుట్ర చేయడం తగదన్నారు. స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టి తమ హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు ఎంతో జుగుప్సాకరంగా ఉందని మరో ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు. -
ఆ రాక్షసుడు ఓ సైకో
అనంతపురం: బెంగళూరులోని ఓ ఏటిఎం సెంటర్లో ఈ నెల 19న ఓ మహిళపై రాక్షసంగా దాడి చేసింది ఓ సైకో అని తేలింది. ఆ సైకోకు ఇలాంటి వికృత చర్యలు కొత్తకాదని కూడా తెలిసింది. నిందితుడు గతంలో కూడా ఇటువంటి దోపిడీలకు పాల్పడినట్లు తెలిసింది. అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 10న అనంతపురం జిల్లా ధర్మవరం చంద్రబాబు నగర్లో ప్రమీలమ్మ అనే మహిళపై ఈ సైకో దాడి చేశాడు. ఆమె నుంచి 2 ఏటీఎం కార్డులు లాక్కున్నాడు. పిన్ నంబర్ తెలుసుకుని ప్రమీలను హత్య చేశాడు. ఆ రాత్రి కదిరికి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేల రూపాయలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో ఈ నెల15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేల రూపాయలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. బ్లాక్ చేయించడంతో ఆ ఏటీఎం కార్డులు పనికిరాకుండా పోయాయి. దీంతో ఈ నెల 19న ఏటిఎం కేంద్రంలోనే జ్యోతి ఉదయ్‌పై దాడి చేశాడు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డును దొంగిలించాడు. కదిరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బు డ్రా చేసిన సమయంలో, బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడు ఆ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ద్వారా తెలిసింది. నిందితుడు బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన తరువాత హిందూపురం చేరుకున్నట్లు సమాచారం. సిసి కెమెరాలలోని దృశ్యాలు, ఇతరత్రా సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. నిందితుడి వ్యహారశైలిని పరిశీలించిన పోలీసులు అతనో సైకోగా తేల్చారు. -
బెంగళూరు ఎటిఎం అనుమానితుడు అరెస్టు