
విలువలకు పాతరేశారు!
* టీడీపీ సభ్యులపై వైఎస్సార్ సీపీ సీఎల్పీ ధ్వజం
* మమ్మల్ని హంతకులు, ఫ్యాక్షన్ లీడర్లు, స్మగ్లర్లు అంటారా?
సాక్షి, హైదరాబాద్: హుందాగా వ్యవహరించాల్సిన శాసనసభలో అధికార పక్ష సభ్యులు తమను హంతకులు, ఏటీఎం దొంగలు, ఫ్యాక్షన్ లీడర్లు, స్మగ్లర్లు అంటూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి మాట్లాడటం తగదని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ధ్వజమెత్తింది. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరణ ఇస్తుండగా అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఎంతో బాధపడుతున్నామని పేర్కొంది. తమ సభ్యులపై ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులకు సిగ్గూ శరం లేదని వైఎస్సార్ సీపీ సీఎల్పీ మండిపడింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే లు శుక్రవారం అసెంబ్లీ మీడియా వద్ద విలేకరులతో మాట్లాడారు. సభాపతి తమ మనోభావాలను గుర్తిం చి అధికార పక్ష సభ్యులతో తొలుత క్షమాపణలు చెప్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ సభ్యులు తమ గురించి దారుణంగా మాట్లాడుతుంటే శాసనసభ గౌరవం అప్పుడు గుర్తుకు రాలేదా? అని సూటిగా ప్రశ్నించారు.
సిగ్గులేనితనం వారిదా? మాదా?
శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చకు అనుమతిం చిన స్పీకర్ అధికార పార్టీతో ఎక్కువగా మాట్లాడిం చడం, వారికే అవకాశం ఇచ్చి సభను హుందాగా నడపలేదని వైఎస్సార్ సీపీ శాసనసభ పక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. 2004-09 వరకు దివంగత వైఎస్సార్ పాలన స్వర్ణయుగమన్నా రు. శాంతిభద్రతల అంశం చర్చకు రాకుండా సీఎం చంద్రబాబు ఆదేశాలిస్తూ ఎదురు దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. బాబును మెప్పించేందుకు మం త్రులు వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఇది అసెంబ్లీ అనే విషయాన్ని మరిచిపోయి టీడీపీ కార్యాలయంలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాజకీయ పోటీదారులుగా చూడండి..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను రాజకీయ పోటీదారులు గా చూడాలని, కానీ దురదృష్టం కొద్దీ టీడీపీ నేతలు ఆగర్భ శత్రువుల మాదిరిగా చూస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాట్లాడేటప్పుడు స్పీకర్ మైక్‌లు కట్ చేస్తూ అధికార పార్టీ సభ్యులకే అవకాశమిస్తున్నారని చెప్పారు. అప్పుడు గుర్తుకు రాని నియమ నిబంధనలు వైఎస్ జగన్ విషయంలో గుర్తుకు రావటం స్పీకర్ పక్షపాత ధోరణిని తేట తెల్లం చేస్తుందన్నారు.
సీఎం భాష చూస్తే భయమేస్తోంది..
సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలనుద్దేశించి ‘పిచ్చిపిచ్చిగా ఉందా.. తొక్కేస్తా.. ఇతర రాష్ట్రాలకు తరిమే స్తా’ అని మాట్లాడుతుంటే భయమేస్తోందని ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. ఎర్ర చందనం దొంగలకు ఎవరు జెడ్పీటీసీ టికెట్లు ఇచ్చారో.. రౌడీలకు, ఫ్యాక్షన్ లీడర్లకు టికెట్లు ఇచ్చింది ఎవరో తమ ను దారుణంగా అవమానిస్తున్న టీడీపీ సభ్యులు తెలుసుకోవాలని హితవు పలికారు.
జగన్‌ను సస్పెండ్ చేసేందుకు కుట్ర..
ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు బుచ్చయ్య చౌదరి వ్యవహారం గురించి అందరికీ తెలుసని, ఆయనకు ఇప్పు డు నిజంగానే మతిభ్రమించిందని ఎమ్మెల్యే ఎం.సునీల్‌కుమార్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకుడిగా స్పీకర్ స్థానంలో కూర్చోవద్దని సూచించారు. తమ ను, తమ అధినేత జగన్‌ను సస్పెండ్ చేయాలని కుట్ర చేయడం తగదన్నారు. స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టి తమ హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు ఎంతో జుగుప్సాకరంగా ఉందని మరో ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు.