సంగారెడ్డిలో వైస్ పీఠం కాంగ్రెస్‌దే.. | sangareddy wise chairmen congress only.. | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో వైస్ పీఠం కాంగ్రెస్‌దే..

Published Mon, Jul 14 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

సంగారెడ్డిలో వైస్  పీఠం కాంగ్రెస్‌దే..

సంగారెడ్డిలో వైస్ పీఠం కాంగ్రెస్‌దే..

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి వైస్ చైర్మన్ పీఠం కాంగ్రెస్‌కే దక్కింది. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు పన్నినా ఎ మ్మెల్యేను ఖంగు తినిపిస్తూ కాంగ్రెస్ హస్తగతం చే సుకుంది. సంగారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా 21వ వార్డు కౌన్సిలర్ గోవర్ధన్‌నాయక్ ఎన్నికయ్యారు. ఈ నెల 3, 4న నిర్వహించిన వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆది వారం ఎన్నికల ప్రొసిడింగ్ అధికారి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిం చారు.
 
 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గోవర్ధన్‌నాయక్‌కు 19, టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన ఎంఐఎం 18వ వార్డు కౌన్సిలర్ బిపాషాకు కేవలం 5 ఓట్లు రాగా, బీజేపీ తరఫున పోటీ చేసిన సునీల్‌కు ఆ పార్టీ సభ్యులు సైతం ఓటు వేయలేదు. దీంతో సునీల్ అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఎంఐఎంకు చెందిన 8 మంది సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్, కాంగ్రెస్ కౌన్సిలర్ వీణ టీఆర్‌ఎస్    కు మద్దతిస్తారని భావించి ఓటింగ్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు.
 
  కాంగ్రెస్  తరపున పోటీ చేసిన గోవర్ధన్‌నాయక్‌కు మద్దతు తెలిపేవారు చేతులెత్తాలని ఎన్నికల అధికారి సూచించడంతో ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు తెలపడంతో మిగతా ఎంఐఎం కౌన్సిలర్‌లు అక్క డి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఖంగుతిన్నారు. తమ మద్దతు కోరి సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎవరికి మద్దతివ్వాలో తెలియక చివరి క్షణంలో సమావేశం నుంచి బయటకు వెళ్లి వచ్చిన బిపాషాకు ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ ఇద్దరు కౌ న్సిలర్‌లు ఓట్లు వేశారు. పది మందికి కేవలం ఐదు ఓట్లే ఎంఐఎంకు వచ్చాయి.
 
 పనిచేయని హనుమాన్ యంత్రం
 బీజేపీ తరఫున మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పోటీ చేసిన సునీల్ చేసిన హనుమాన్ యంత్రం ఏ మాత్రం పనిచేయలేదు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఆదివారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా సమావేశ మందిరానికి వచ్చిన సునీల్ మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీతో పాటు పార్టీ కౌన్సిలర్‌లకు హనుమాన్ యంత్రం ఉన్న కార్డును అందజేస్తూ ‘మీరు హనుమంతుని మీద ఒట్టేశారు. నాకే ఓటు వేయాలి’ అని లేదం టే హనుమంతుడే మిమ్మల్ని చూసుకుం టాడంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో సునీల్ వెనక్కితగ్గారు.

ఇంతలోనే సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్‌లు సమావేశానికి హాజరైనా ప్రతిపాదించేందుకు ముందుకు రాలేదు. దీంతో సునీల్ నిరాశకు గురయ్యారు. ఇదిలాఉండగా మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ఆర్.మధుమోహన్‌రెడ్డి పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement