
ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు
భువనగిరి: అమెరికా కాలిఫోర్నియాలో ఈ నెల 4న మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్‌రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ఉద్రిక్తతల మధ్య సాగాయి. మంగళవారం తెల్లవారుజామున భువనగిరిలోని నివాసా నికి మధుకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అదే సమయంలో మృతుడి భార్య స్వాతి ఆమె కుటుంబ సభ్యులతో అక్క డికి వచ్చారు. మృతుడి బంధువులు స్వాతిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది.
మీ కారణంగానే మధుకర్‌రెడ్డి చని పోయాడంటూ అతడి బంధువులు స్వాతి, ఆమె తండ్రి నర్సింహారెడ్డిపై దాడికి పాల్పడ్డా రు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్తను హత్య చేయించానని అత్తింటి వారు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తన భర్తకు మొదటి నుంచీ మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. భర్త ఆస్తి తనకు ఇవ్వాల్సి వస్తుందనే తమపై దాడి చేశారన్నారు. తన కుమారుడికి చావుకు కోడలు స్వాతే కారణమని మధుకర్ తండ్రి బాల్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం మధుకర్ మృతదేహానికి యాదగిరిగుట్ట రాళ్లజనగాంలో అంత్యక్రియలు నిర్వహించారు.