yadadri district
-
దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు
-
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
అన్నదాత ఆగమాగం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4,16,600 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 2,20,7 98 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించి వారం రోజులుగా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతోంది. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో «కొనుగోళ్లు పూర్తి కావొస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా ఆలస్యమవుతున్నాయి. మిల్లుల్లో జాగా లేదని... ఖాళీ స్థలం లేదని చెప్పి మిల్లర్లు ధాన్యం లారీలను మిల్లుల్లో అన్లోడింగ్ చేసుకోవడం లేదు. 2022–23 యాసంగి, వానాకాలం, 2024 యాసంగి సీఎంఆర్ 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతోపాటు, ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లతో విక్రయించిన 1.30 లక్షల «మెట్రిక్ టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఈనెల 23వ తేదీలోగా మిల్లుల్లో నుంచి ధాన్యాన్ని కాంట్రాక్టర్ ఖాళీ చేయాలి. ఇంతవరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా బయటకెళ్లలేదు. దీంతో ప్రైవేట్‌కు కొందరు రైతులు అమ్ముకున్నారు. అయినా ఇంకా జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లవ్యాప్తగా ఆయా మిల్లుల్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. రోడ్డెక్కుతున్న రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బీబీనగర్ మండలం గూడూరులో హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కొనుగోలు కేంద్రానికి 120 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు.8 రోజుల క్రితం 40 మంది రైతుల ధాన్యం కాంటా వేసి మిల్లులకు పంపించారు. అక్కడ ఇంకా దిగుమతి కాలేదు. ఇంకా 30 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి ఉంచారు. ఇంకా 60 మంది రైతులు కాంటా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు గంటల పాటు రైతులు రహదారిపై బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ∙భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన రైతులు తడిసి మొలకెత్తిన ధాన్యంతో మంగళవారం కలెక్టరేట్ ఎదు ట ధర్నాకు దిగారు. ∙అడ్డగూడూరు మండలం చౌళ్లరామా రం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ∙పోలింగ్ రోజు భూ దాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతులు తడిసిన ధా న్యం కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని ఆందోళనకు దిగా రు. ∙ఆలేరు మండలం కొలనుపాకలో ధర్నా చేశారు. ఆయా జిల్లాల్లో ఇలా ∙సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా, ఇప్పటివరకు 63,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ప్రతి 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోలు కోత విధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వచ్చే లారీల సిబ్బంది రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా లో ఈనెల 12న గాలివాన భీభత్సం సృష్టించడంతో కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు చా లా వరకు వరదలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు కల్లాలు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందోళనలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 76,437 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. తాలు, తప్ప ఉందని తిరకాసుతో బస్తాకు మూడు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలరోజులు అవుతోందికొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతోంది. వెంట వెంటనే కాంటాలు వేయడం లేదు. వారం రోజుల క్రితం 3 వేల బస్తాలు కాంటా వేసినా మిల్లుకు తరలించలేదు. దీంతో వానకు తడిసి ఎండకు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నాం. – మాధవరెడ్డి, గూడూరు కొనుగోలు వేగవంతం చేస్తాం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. మిల్లుల్లో వడ్లు దించుకోవడానికి స్థలం లేనందున జాప్యం జరుగుతోంది. టెండర్ ధాన్యం, సీఎంఆర్ ధాన్యం ఇంకా మిల్లుల్లో ఉంది అయితే జనగామ, హనుమకొండలకు 20 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించడానికి చర్యలు తీసుకున్నాం. – గోపీకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి -
యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బోల్తా
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది. కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ -
నేనేం పాపం చేశానమ్మా..
భువనగిరి: నవజాత శిశువును ఓ తల్లి కనకరం లేకుండా వదిలేసింది. చెట్ల పొదల్లో విసిరేసిన ఆ శిశువును కుక్కలు పీక్కుతింటూ బయటకు తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. భువనగిరి పట్టణంలోని పాత శిల్పా హోటల్ వెనుక భాగంలో బాబూ జగ్జీవన్‌రామ్ భవనం ఉంది. అక్కడ ఓ పార్టీకి చెందిన నాయకులు శనివారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భవనం సమీపంలోనే సమాధులు, చెట్ల పొదలు ఉన్నాయి. సమావేశం నుంచి బయటికి వచ్చి న ఓ మహిళ చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును కుక్కలు బయటకు లాక్కురావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని ఆమె తోటి నాయకులకు చెప్పగానే వారు అక్కడికి వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ఆ ఆడశిశువు మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
యాదాద్రి జిల్లాలో నాలుగు లంకె బిందెలు లభ్యం?
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద మట్టి తవ్వుతుండగా నాలుగు లంకెబిందెలు దొరికినట్లు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పది రోజుల క్రితం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్ఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ విక్రమ్‌రెడ్డి మంగళవారం సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామంలో విచారించారు. బాధ్యులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిచించి పంచనామా నిర్వహించారు. దొరికిన బిందెలను స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగిస్తామని తహసీల్దార్ వీరాభాయి తెలిపారు. ఖాళీబిందెలా.. లంకె బిందెలా..! 10 రోజుల క్రితం గ్రామానికి చెందిన రైతు కొలను బాల్‌రెడ్డి గ్రామ సమీపంలోని తుమ్మల చెరువు సమీపంలో ఉన్న పట్టాభూమిలో జేసీబీతో మట్టిని తవ్విస్తున్నాడు. ఈ క్రమంలో మట్టితో పాటు 4 బిందెలు బయటపడ్డాయి. జేసీబీ డ్రైవర్ పర్వతం నవీన్‌తో పాటు అక్కడే ఉన్న మక్త అనంతారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు సురేశ్, ధన్‌రాజ్‌లు చూశారు. నవీన్ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, మీకు మద్యం తాగడానికి డబ్బులు ఇస్తానని చెప్పి పంపించాడు. అనంతరం నవీన్ ఆ బిందెలను ఇంటికి తీసుకెళ్లాడు. డబ్బుల విషయమై నవీన్‌కు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో వారు నాలుగు రోజుల తరువాత గ్రామంలో బిందెలు దొరికిన విషయం తెలిసినవారికి చెప్పారు. ఈ విషయం కాస్తా ఆ నోట, ఈ నోట బయటకు పొక్కడంతో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వైరల్ చేశారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే బాధితుడిని ప్రశ్నించగా ఖాళీబిందెలు మాత్రమే దొరకాయని అందులో ఏమీలేవని చెబుతున్నాడు. ఏమీలేక పోతే బిందెలు దొరికిన వెంటనే గ్రామస్తులకు , అధికారులకు గానీ చెప్పకుండా ఎందుకు గోప్యంగా ఉంచారనేది పలు అనుమానాలకు తావిస్తోంది. దొరికినవి ఖాళీ బిందెలా, లంకె బిందెలా అనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. -
Falaknuma Express: రైలు ప్రమాద ఘటనపై స్పందించిన డీజీపీ, రైల్వే జీఎం
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అరుణ్‌కుమార్ పరిశీలించారు. మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 కాగా యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి 7 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. All passengers are safely evacuated and shifted in buses after a fire broke out in the Falaknuma Express near Bhongir rural PS limits. Police, Fire Dept, and Railways are working in coordination. So far, no fatalities have been reported. Out of 18 coaches 11 are detached and… pic.twitter.com/TtgD5BzFP6 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2023 -
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్‌ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్‌లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్‌కు పయనమైంది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
మందు తాగే మేక.. రోజూ మద్యం కోసం యాజమాని వద్ద నిలబడి
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది. దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. కన్న తండ్రినే దారుణంగా..
ఆలేరు రూరల్ (యాదాద్రి జిల్లా): మద్యం తాగి హింసిస్తున్నాడని తండ్రిని ఇద్దరు కొడుకులు కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా,, ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన తిప్పాబత్తిని భాస్కర్ (45), కరుణారాణి దంపతులకు తరుణ్, బాలతేజ సంతానం. కొడుకులిద్దరూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. కొంతకాలంగా భాస్కర్ మద్యానికి బానిసగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉంటున్న కుమారులిద్దరూ మినీ క్రిస్మస్ జరుపుకునేందుకు శనివారం స్వగ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి భాస్కర్ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడగా అడ్డొచ్చిన ఇద్దరు కుమారులను సైతం కర్రతో బాదాడు. ఆదివారం ఉదయం కూడా ఇదే మాదిరి గొడవ జరగడంతో కుమారుల ఆగహ్రం కట్టలు తెచ్చుకుంది. దీంతో ఇద్దరు కొడుకుల్లో ఒకరు తండ్రిని గట్టిగా పట్టుకోగా మరొకరు ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని గొంతులో పొడిచాడు. అనంతరం ఛాతిలో బలంగా మరోమారు పొడవడంతో భాస్కర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. సమాచారం మేరకు ఎస్ఐలు ఇద్రిస్ అలీ, వెంకటశ్రీను ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇద్దరు నిందితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లైన మహిళతో ఎఫైర్.. వీడియో కాల్స్ అడ్డం పెట్టుకొని.. -
మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్‌గా రాజు వెన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్‌గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చాంబర్ ప్రధాన కార్యదర్శిగా ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా సీహెచ్ మంజుల, సలహాదారుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుల కమిటీ సభ్యులుగా బీఎస్ కేశవ్ (గద్వాల), కె.నరేందర్ (షాద్‌నగర్–రంగారెడ్డి), ఎ.నర్సింహ (దేవరకొండ–నల్లగొండ), పి.జమున (జనగామ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ల సమస్యలను సీఎం, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. -
పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ
సాక్షి, యాదగిరిగుట్ట/వలిగొండ : ఉమ్మడి జిల్లాలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. నాడు నరేశ్, ప్రణయ్‌లు పరువుకు బలి కాగా అదే తరహాలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎరుకల రామకృష్ణను దారుణంగా మట్టుబెట్టారు. ఆరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు యువకులు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ ఇంటి వద్ద చదువుకుని.. సిద్దిపేట జిల్లా లకుడారంలో పరువు హత్య కాబడిన రామకృష్ణ వలిగొండ మండలం లిగంరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముండేవాడు. ఇతడి స్వస్థలం హుజూర్నగర్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఊరైన లింగరాజుపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.రామకృష్ణకు తల్లి కలమ్మ, చెల్లి నాగలక్ష్మి, తమ్ముడు రమేష్ ఉన్నారు. రామకృష్ణ ఇంటర్ వరకు వలిగొండలో చదువుకున్నాడు. 2016వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించి కొంతకాలం వలిగొండలోనే విధులు నిర్వహించారు. 2019లో యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఎవరీ వెంకటేశ్ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వెంకటేష్ ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటగా పల్లెపాటి వెంకటేష్ సొంత గ్రామమైన గౌరాయపల్లిలో మస్కూరిగా విధులు నిర్వహించాడు. వెంకటేష్ 10వ తరగతి పూర్తి కాకపోవడంతో గ్రామంలోనే వీఆర్ఏగా పని చేశాడు. ఈ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి వీఆర్ఓగా ఉద్యోగం సాధించాడు. అనంతరం రాజాపేట తహసీల్దార్ కార్యాలయంలో కాల్వపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. సొంత గ్రామమైన గౌరాయపల్లి నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు వచ్చి ఇల్లు నిర్మించుకున్నాడు. ఐదేళ్లుగా వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె భార్గవి ఉన్నారు. భార్గవి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెంకటేష్, ఆయన భార్య, కుమారులు గుట్టలో ఉంటున్నారు. వెంకటేష్ వీఆర్ఓ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గుప్త నిధుల తవ్వకాల్లో.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా ఉంటూ పోలీస్ వాహనం నడుపుతున్న సమయంలో రామకృష్ణకు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో గుప్త నిధులు తవ్వకాల సమయంలో కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో గుప్త నిధులు తవ్వకాలు జరిగే బృందంలో హోంగార్డు రామకృష్ణపై కేసు నమోదు కాగా.. ఆ కేసులో ని«ంధితుడుగా ఉన్న వీఆర్ఓ వెంకటేష్‌ను ఆ కేసులో నుంచి అప్పట్లో పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల కేసులోనే రామకృష్ణను హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటర్ నుంచే.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు భార్గవి ఇంటర్ మొద టి సంవత్సరం చదువుతున్న క్రమంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో రామకృష్ణ స్థానికంగా ఉండే పోలీస్ క్వాటర్స్‌లో ఉండే వాడు. ఆ తర్వాత పోలీస్ క్వాటర్స్‌లో గదిని ఖాళీ చేసిన రామకృష్ణ ప్రేమించిన భార్గవితో మరింత దగ్గర అయ్యేందుకు శ్రీరాంనగర్‌లో భార్గవి తండ్రి వీఆర్ఓ వెంకటేష్ నిర్మించుకున్న ఇంటికి ముందు ఉన్న ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ తరుణంలోనే వెంకటేష్, రామకృష్ణలు ఇ ద్దరు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. ఒప్పుకోకున్నా.. రామకృష్ణ, భార్గవిల వివాహం 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో జరిగింది. అంతకు నెల రోజుల ముందే భార్గవి, రామకృష్ణల ప్రేమ వ్యవహారం వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో వెంకటేష్ తన కూతురు భార్గవిని మందలించాడు. ఈ సమయంలో తనకు రామకృష్ణ అంటే ఇష్టమని తండ్రి వెంకటేష్‌తో భార్గవి చెప్పింది. కళాశాలకు వెళ్లనివ్వకుండా వెంకటేష్ కుమార్తె భార్గవిని ఇంట్లోనే ఉండమన్నాడు. రామకృష్ణపై ఉన్న ప్రేమతో భార్గవి 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో వివాహం చేసుకున్నారు. 10రోజుల క్రితం గుట్టలోనే.. రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భువనగిరితో పాటు యాదగిరిగుట్టలో భూములు అమ్మకా లు, కొనుగోలు చేసేందుకు వచ్చేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. 10రోజుల క్రితం ఎకరం భూమి కావాలని ఓ వ్యక్తితో యాదగిరిగుట్టకు వచ్చాడని తెలిసింది. అంతే కాకుండా రెండు, మూడు రోజుల క్రితం పట్టణంలోని గాయత్రి హోటల్లో భోజనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్లుగా హోంగార్డుగా యాదగిరిగుట్టలోనే విధులు నిర్వహించిన రామకృష్ణకు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య మిర్యాలగూడ అర్బన్: 2018 సెప్టంబర్ 14న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. తిరునగరు మారుతీరావు కూతురు అమృత మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ స్కూల్లో విద్యనబ్యసించే నుంచి ప్రేమించకున్నారు. ఇద్దరూ ఒక్కటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పరువు పోయిందని భావించి అప్పటినుంచి అదును కోసం వేచి చూశాడు. అమృత ఐదు నెలల గర్భవతి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భర్త, అత్తతో కలిసి వచ్చింది. వైద్య పరీక్షలు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన సుపారీ కిల్లర్ పదునైన కత్తితో ప్రణయ్‌ను దారుణంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీరావు కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ మందిరంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నమ్మించి.. మట్టుబెట్టి.. ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లలో రజక కులానికి చెందిన అంబోజు నరేష్, లింగరాజుపల్లిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుమ్మల స్వాతి ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో భయపడి తలదాచుకోవడానికి 2016లో ముంబాయికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు నమ్మించి ఇద్దరినీ స్వగ్రామానికి రప్పించారు. వారం రోజులకు స్వాతి తన ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన ఐదారు రోజుల్లో అంబోజు నరేష్ అదృశ్యం అయ్యాడు. దీంతో నరేష్ తల్లిదండ్రులు భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతి కుటుంబంపై అనుమానం ఉండడంతో అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాసంఘాల కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నరేష్‌ను అదే ఏడాది మే నెలలో కిడ్నాప్ చేసి లింగరాజుపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద హత్య చేసి దహనం చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించారు. పోలీసులు ఆ కోణంలో తిరిగి విచారణ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నిలబడలేదు. -
యాదాద్రి వైభవాన్ని చూసొద్దాం (ఫోటోలు)
-
యాదాద్రి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర
-
యాదాద్రి జిల్లాలో 30వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్..
-
Yadadri: సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు
-
నేడు యాదాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్
-
సాయిధామం బాబాపై లైంగిక వేధింపుల కేసు
-
అవినీతి అధికారుల గుండెల్లో వణుకు
-
పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్ కోసమని వెళ్లి
ఓ వైపు బక్రీద్ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. జుపెన్‌పహాడ్ : మండల కేంద్రానికి చెందిన షేక్ జమాల్(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ తెచ్చేందుకు వెళ్తుండగా.. మధ్యాహ్నం వరకు జమాల్ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్‌తో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో షేక్ జమాల్ అక్కడికక్కడే మృతిచెందగా షేక్ లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు.. కోదాడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్ బషీర్ (35) బైక్‌పై కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వై.సైదులు తెలిపారు. -
ఏం కష్టమొచ్చిందో.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందగా.. చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. కాగా ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్?
అడ్డగూడూరు: పోలీసు దెబ్బలు తాళలేక ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. పోలీసులు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికి లాకప్‌డెత్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి ఫాదర్ బాలస్వామి ఇంట్లో ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేస్తోంది. ఈ నెల 15న బాలస్వామి ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే స్వగ్రామానికి వెళ్లిపోయిన మరియ, ఉదయ్‌ను పోలీసులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారితో పాటు ఉదయ్ స్నేహితుడు శంకర్ వచ్చాడు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుండగా శంకర్ అడ్డుకునేందుకు యత్నించారు. అయితే.. అతన్ని కూడా వదలలేదు. దెబ్బలు తాళలేక మరియ స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులు ఆమెను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. తీవ్రంగా గాయపడిన ఉదయ్, శంకర్ భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా, కేసును నీరుగార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచిర్యాలలో తల్లీకూతుళ్ల హత్య -
బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి
సాక్షి, యాదాద్రి: రామన్నపేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడిని వీడియో తీసిన బురిడీ బాబాల అనుచరులు.. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు సెటిల్మెంట్ చేశారు. దీంతో బాధిత మహిళ రాచకొండ సీపీని ఆశ్రయించింది. విచారణలో పోలీసులు, బాబాల బాగోతం వెలుగు చూసింది. నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సీఐ, ఎస్ఐను సీపీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. -
పరువు పోయిందని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఆలేరు రూరల్: పరువు పోయిందని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జన్నె భిక్షపతి (37) వ్యవసాయంతో పాటు ట్రాలీ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటో మరమ్మతుకు గురవడంతో ఆలేరులోని ఎస్ఎస్ ఆటోమొబైల్ దుకాణంలో విడిభాగాలను ఉద్దెరపై కొన్నాడు. అయితే, కొంత బాకీ తీర్చగా, మిగిలింది తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు నాగేందర్.. గురువారం భిక్షపతిని దూషిస్తూ ఆటోను తీసుకెళ్లాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకు న్నాడు. కాగా, మృతదేహాన్ని ఆటోమొబైల్ షాపు ఎదుట ఉంచి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇప్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: రెండ్రోజుల్లో నిశ్చితార్థం: అప్పు తీర్చేవారు లేరని.. -
అయ్యో పాపం..మండు వేసవిలో కూడా ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లా జగ్గన్న చెరువు కింద గల మాదాపురం ఆయకట్టు రైతులు ఏటా యాసంగి పంటనే సాగుచేస్తారు. వానాకాలం సాగుచేస్తే చెరువు నిండి పంట మునుగుతుందనేది వారి భయం. కానీ వారి అంచనాలు తప్పాయి. మండు వేసవిలోనూ పంటలు నీటమునిగాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువులను నింపేందుకు తుర్కపల్లి మండలం గోపాలపురం చెరువులోకి నీటిని వదలడంతో సోమవారం చెరువు అలుగుపోసింది. అక్కడి నుంచి జగ్గన్న చెరువులోకి నీళ్లు చేరాలి. కానీ ఈ నీళ్లు వరి పంటలను ముంచెత్తుతూ చెరువులోకి వెళ్లాయి. వేసేదే ఒక్క పంట.. అదీ అనుకోని కాలంలో నీటి పాలైందని రైతులువాపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి నీటిపాలైన వరి చేనును చూపుతున్న ఓ రైతు -
టీఆర్ఎస్కు పూల రవీందర్ రాజీనామా
సాక్షి, యాదాద్రి: పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, తాను వరంగల్, జనగామ ధర్నాల్లో పాల్గొని యాదాద్రి భువనగిరి ధర్నాకు హాజరయ్యానని రవీందర్ అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. మనకు టీఆర్ఎస్పార్టీ ముఖ్యం కాదని, పీఆర్టీయూ ముఖ్యమన్నారు. పీఆర్టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. అంతకుముందు భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారిలోఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోటె సత్తయ్య, గౌరవ అధ్యక్షుడు జాలిగామరామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ముత్యంరాములు, వివిధ మండలాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యరద్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదవండి: ‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ -
పునరావాసం కల్పించండి
భువనగిరి టౌన్: బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సోమవారం ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, తమ గ్రామస్తులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని, తాను సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు హైవేపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. -
అమ్మను రోడ్డున పడేశారు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
'గుట్టు'కా దందా!
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ నిషేధిత గుట్కాను కిరాణం షాపులు, పాన్ డబ్బాలకు చేరవేస్తున్నారు. ఎస్ఓటీ పోలీస్‌లు అక్కడక్కడ దాడులు చేసి పట్టుకున్నప్పటికీ వ్యాపారాన్ని అదుపు చేయలేకపోతున్నారు. చైన్ సిస్టంలో గుట్కా దందా.. మాఫియా తీరును పోలి చైన్ సిస్టంలో గుట్కా దందా నడుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా రాష్ట్రంలోకి వస్తుంది. వాహనాల్లో అడుగు భాగంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు పైన నిత్యావసర సరుకులు, కూరగాయలు వేస్తూ, కొందరు కార్లలో తీసుకు వస్తారు. వీరి దగ్గర నుంచి ఒక ప్రాంతాన్ని బట్టి మరొక దళారీ కొనుగోలు చేస్తాడు. అతను మండలంలోని ఒక్కరు, ఇద్దరు ఏజెంట్లను పెట్టుకుంటాడు. వారు రిటైల్(కిరాణం షాపులు, పాన్‌డబ్బాలు)గా లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి చేరవేస్తారు. పోలీస్‌లకు చిక్కరు.. చైన్ సిస్టంలో ఉన్న వారు ఎవరు కూడా పోలీస్‌లకు చిక్కరు. గుట్కా తీసుకొస్తున్న వాహనం ముందు మరో వ్యక్తి ద్విచక్ర వాహనం పోలీస్‌ల తనిఖీలపై సూచనల మేరకు గుట్కా వాహనం ముందుకు వస్తుంది. వాహనం, మొబైల్ నంబర్లు తరచు మారుస్తుంటారు. గుట్కాల కోసం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కాల్ చేస్తారు కానీ, కింది స్థాయి నుంచి కాల్ చేసే పరిస్థితి ఉండదు.(రిటైల్ యజమాని ఏజెంట్‌కు, ఏజెంట్ దళారికి.. కాల్ చేసే పరిస్థితి ఉండదు). గుట్కాలు ఎంపిక చేసే ప్రాంతానికి వచ్చే వరకు తీసుకునే వ్యక్తికి తెలియకుండా చేరవేస్తారు. ఏజెంట్లు కూడా స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ దందా చేస్తున్నారు. ఏజెంట్లు కూడా వాహనాలు మారుస్తూ, కొంత మంది ఏజెంట్లు స్నేహం పేరుతో యువతను మద్యానికి బానిసలుగా మార్చి దందాలో వాడుకుంటున్నారు. ఎస్ఓటీ పోలీస్‌లు గుట్కా ఏజెంట్లపై నిఘా పెట్టి దాడులు చేస్తుండడంతో అప్పుడప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజుల తర్వాత యథావిధిగా నిషేధిత గుట్కా దందా కొనసాగుతోంది. జిల్లాలో రూ.3 కోట్లకు పైగానే దందా జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం నెలకు రూ.3కోట్లకు పైగానే ఉంటుంది. గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్మసాలాగుట్కా(రెండు ప్యాకెట్లను కలిపి తింటారు) తయారు చేస్తారు. ఈ ప్యాకెట్ మీద ధర రూ.9, కొన్నింటి మీద రూ.10 వరకు ఉంటుంది. దళారి వద్దకు వచ్చే సరికి రూ.7, ఏజెంట్ వద్దకు వచ్చే సరికి 8, రిటైల్‌గా వచ్చే సరికి రూ.12 ఉండగా, గుట్కా నమిలేవారి దగ్గరికి వచ్చేసరికి రూ.20 ధర ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో వీటి ధరలు దళారి, ఏజెంట్లు అమాంతం పెంచారు. రిటైల్‌గా ప్యాకెట్‌కు రూ. 40నుంచి రూ.50వరకు అమ్మకం చేస్తున్నారు. ప్రతి మండలంలోని ఏజెంట్ల దందా నెలకు రూ.12లక్షలు ఉండగా, హైదరాబాద్, నల్లగొండ నుంచి తెచ్చుకునే వారిది మరో రూ.3లక్షల వరకు ఉంటుంది. చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోతూరు, వలిగొండ, రామన్నపేట, యాదగిరిగుట్ట పెద్దపెద్ద మండలాల్లో వీటి అమ్మకం చిన్న మండలంలో కంటే రెట్టింపు ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో నిషేధిత గుట్కా కొరతను చూపుతూ అధిక ధరలు అమ్ముతుండడంతో నెల టర్నోవర్, లాభం రెట్టింపు అయ్యిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి తెలిపాడు. నారాయణపురం నుంచి నల్లగొండ.. సంస్థాన్ నారాయణపురం నుంచి నల్లగొండ వరకు ముగ్గురు గుట్కా దందాదారుల కనుసన్నల్లో నిషేధిత గుట్కా దందా గుట్టుగా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి గుట్కా దళారి, ఏజెంట్‌గా నల్లగొండ, చుట్టు పక్కల మండలాల్లోని ఏజెంట్లకు, మునుగోడులోని కొన్ని గ్రామాలకు అమ్మకం చేస్తాడు. చిట్యాల మండలానికి చెందిన మరో ఏజెంట్ చిట్యాల, చౌటుప్పల్, మునుగోడులోని కొన్ని గ్రామాలకు, సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన మరో ఏజెంట్ సంస్థాన్ నారాయణపురం , మర్రిగూడ, మునుగోడు, చౌటుప్పల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నిషేధిత గుట్కా దందా నిర్వహిస్తున్నారు. గత మూడు నెలల్లో నమోదైన కేసులు.. ♦ మే 29న కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి స్విఫ్ట్ కారులో 16 బ్యాగులు గుట్కా ప్యాకెట్లును ఆలేరు మీదుగా తరలిస్తుండగా, రోడ్డు ప్రమాదం జరగడంతో గుర్తించారు. కేసు నమోదు చేశారు. ♦ హైదరాబాద్‌లోని ఘట్కేసర్కు చెందిన ఇమ్రాన్, రాహులు కలిసి భూదాన్ పోచంపల్లి మండలంలో రూ.50వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్‌లోని ఓ కిరాణం షాపులో 1.50లక్షల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ♦ భువనగిరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్న రూ.30వేల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్ మండలంలోని పంతంగిలో ఓ కిరాణం షాపులో రూ.40వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ చౌటుప్పల్ మండలంలోని పీపల్‌పహాడ్‌లో ఓ ఏజెంట్ రూ.50వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ఓ కిరాణం షాపులో రూ.50వేల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ♦ భూదాన్‌పోచంపల్లి మండలంలో ఓ కిరాణం షాపులో రూ.60వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేస్తున్నాం నిషేధిత గుట్కాపై ఇప్పటికే భువనగిరి, చౌటుప్పల్, అలేరులో కేసులు నమోదు చేశాం. సమాచారం ఉంటే గుర్తించి, కేసులు నమోదు చేస్తాం. – నారాయణరెడ్డి, డీసీపీ,యాద్రాది భువనగిరి -
మూసీ పరీవాహకంలో అరటిసాగు?
మూసీ పరీవాహకంలో కలుషిత నీటితో పండించే పంటలు తినడం వల్ల కేన్సర్ వంటి భయానక వ్యాధులు సంభవిస్తుండడంతో ప్రత్యామ్నాయంగా అరటి తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం.. అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి గురువారం జరిగే సీఎం సమావేశానికి సిద్ధమైంది. కంది, పత్తికి సైతం ప్రాధా న్యమివ్వనుండడంతో వరి సాగు తగ్గే అవకాశముంది. సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సమగ్ర రైతు విధానంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమీక్ష కోసం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తల అభిప్రాయాల మేరకు భూసారాన్ని బట్టి పండే పంటలను గుర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించే వరికి బదులుగా కంది, పత్తి ఎక్కువగా సాగయ్యేలా చూడాలని, మూసీ పరీవాహకంలో అరటితోటలు వేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు, వివిధ వర్గాల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతస్థాయి యంత్రాంగం సీఎం సమీక్ష సమావేశానికి హాజరై ప్రతిపాదనల నివేదిక అందజేయనున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లా పరిధిలో రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల మూసీ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత జలాల కారణంగా భూసారం కోల్పోవడమే కాకుండా పంట ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్ వంటి భయానక రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇందులో 95వేల ఎకరాలు దొడ్డురకం, 35ఎకరాల్లో సన్న రకాలను పండించారు. ఇందులో అత్యధికంగా 70వేల ఎకరాల్లో మూసీపరివాహకంలోనే సాగవుతుంది. అయితే విషతుల్యమైన మూసీ ఆయకట్టులో వరిసాగును తగ్గించి అరటితోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే మూసీ పరీవాహకంలో భూమి కూడా అరటితోటలకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరి పరిసరాల్లో తమలపాకు తోటలు పెద్ద ఎత్తున పెంచేవారు. ఇక్కడి తమల పాకులకు అత్యంత డిమాండ్ ఉండేదని రైతులు చెబుతుంటారు. దీని దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. పత్తి, కంది పంటలకూ పెద్దపీట జిల్లాలో వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానంలో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈమేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో గత సీజన్లో 1.60లక్షల ఎ కరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సీజన్లో రెండు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరి సాగుకంటే అధి కంగా పత్తిని ఇప్పటికే సాగు చేస్తున్నారు. అలా గే 27వేల ఎకరాల్లో సాగు చేసిన కందిని 50వేల ఎకరాలకు పెంచే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 2019 వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి3,37,812ఎకరాల్లో సాగు చేయగా, 2020 వానాకాలం సీజన్లో 3,54,750 ఎకరాల్లో వ్య వసాయ సాగు అంచనా వేసింది. అయితే మా రిన ప్రభుత్వ విధానం నేపథ్యంలో వరిసాగును తగ్గించి పత్తి, కందిసాగును పెంచే దిశగా చర్యలు చేపడుతుంది.జిల్లా యంత్రాంగం తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. -
నిన్నటి వరకూ గ్రీన్ జోన్.. ఇవాళ 4 పాజిటివ్
సాక్షి, యాదాద్రి : నిన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి జిల్లాలో తాజాగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలో తొలిసారిగా ఒకేరోజు నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆత్మకూరు(ఏం) మండలం పల్లెర్లలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా వీరందరూ ఈ నెల 5వ తేదీన ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులు. పల్లెర్ల నుంచి మరో ఆరుగురిని, జనగాం నుంచి మరో నలుగురిని బిబినగర్ నిమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణలో శనివారం నాటికీ కేసుల సంఖ్యా చుస్తే... గత కొన్నిరోజుల నుంచి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతూ వస్తున్న కరోనా కేసులు నిన్న పెరిగాయి. శనివారం ఏకంగా రాష్ట్రంలో 31 కేసులు నమోదు అయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధి లోనే 30 కేసులు నమోదు కావ డం ఆందోళన కలిగిస్తోంది. మరో కేసు ముంబై నుంచి వచ్చిన వలస వ్యక్తి అని అధికారులు తెలిపారు. కరోనాతో ఓ వ్యక్తి శనివారం చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరుకుంది. ఇక కరోనా కట్టడికి గాను తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే. చదవండి : దేశంలో కరోనా విలయం.. మరో 3,277 మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం.. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ వెల్లంకి యాదాద్రి జిల్లా
-
చెప్పిందే మెనూ.. పెట్టిందే తిను..!
సాక్షి, యాదాద్రి : ఏం పెట్టినా తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు పొక్కొదు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే బెదిరింపులు.. టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామంటూ వేధింపులు.. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల దుస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాలల వసతి గృహాలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. ఆధ్వానమైన భోజనం, శుభ్రత లేని నీటితోనే వంటలు, నాణ్యతలేని కూరగాయలు, నీళ్ల చారు, మరుగుడొడ్లు పూర్తిస్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భువనగిరి పట్టణ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడరు. పర్యవేక్షణ లేకపోవడంతో షరా మామూలవుతోంది. ఆయా పాఠశాలల అధికారుల నుంచి పెద్ద ఎత్తున ముడుతున్న ముడుపులే పర్యవేక్షణ అధికారుల ఉదాసీనతకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, మోటకొండూరు, తుర్కపల్లి,భువనగిరి మండలాల్లోని మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో సంఘటనలు వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల వెలుగుచూడని సంఘటలు ఉన్నాయి. జిల్లాలో పాఠశాలలు.. జిల్లాలో కేజీబీవీ, మోడల్, ఆర్ఈఐఎస్, టీఆర్డబ్ల్యూఆర్ఎస్, టీఆర్టీడబ్ల్యూఆర్ఎస్ టీడబ్ల్యూ, మైనార్టీ రెసిడెన్షియల్,ఎంజేపీ రెసిడెన్షియల్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు మొత్తం 35 పని చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో 14,214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 5,114 మంది బాలురు, 9,100 మంది బాలికలు చదువుకుంటున్నారు. చదువుకోసం వచ్చిన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కానీ, ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులు ఇబ్బందులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఏదైనా జరిగినప్పుడే.. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో సంఘటనలు జరిగినపుడే అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు ఫలితాలను ఇవ్వడంలేదు. ఆయా సంస్థల్లో బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపా«ధ్యాయులు, వంట మనుషుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిటి శాపంగా మారుతోంది. మంచినీటి కొరత, మరుగుదొడ్లు, మూత్ర శాలలలేక అవస్థలు తీరడం లేదు. మెనూ అమలెక్కడ? విద్యార్థులకు అందాల్సిన మెనూ మెజార్టీ వసతి గృహాల్లో అమలు కావడం లేదు. లక్కపురుగుల బియ్యం, పుచ్చుపట్టిన కూరగాయలు, చాలీచాలనీ నూనె, నీళ్ల పాలు, నీళ్ల చారు, ఉడికీఉడకని అన్నం, రెండు మూడు రోజులకోసారి కోడిగుడ్డు, పండ్లు, అరకొరగా చికెన్ కర్రీ, దేవుని ప్రసాదంలా స్నాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ ఇబ్బందులే. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇలా.. వసతి గృహాలకు సరఫరా అవుతున్న సన్న బియ్యం సివిల్ సప్లై గోదాంలోనే గోల్మాల్ జరుగుతుంది. గోదాం ఇంచార్జ్, బియ్యం రవాణా చేసే కాంట్రాక్టర్‌తో ఆయా సంస్థల ఇంచార్జ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అక్రమాలు జరగుతున్నాయి. విద్యార్థుల హాజరు, సంఖ్యలో ఉన్న తేడాతోపాటు వారికి ఇచ్చే భోజనం తక్కువగా ఉంటుంది. నాసిరకం భోజనం ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ నాణ్యమైన కర్రీలు విద్యార్థులకు అందడం లేదు. దీంతో ప్రతి రోజూ కిలోల కొద్ది భోజనం విద్యార్థులు తినకుండా పారవేస్తున్నారు. పారవేసిన అన్నాన్ని సైతం బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. వారానికి ఒక్కసారి కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నారు.తక్కువ ధరకు దొరికే నాసిరకం గ్రేడ్ త్రీ రకం కూరగాయలు తెచ్చి వండిపెట్టడం వల్ల అవి రుచికరంగా లేక విద్యార్థులు తినడం లేదు. బలవంతంగా తిని కొన్నిసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సరిపడా పాలు సరఫరా అవుతున్నా విద్యార్థులకు మాత్రం సరిగా అందడంలేదు. మూడు రోజుల కోసారి కోడిగుడ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచినూనె, కారం, పాలు, మసాల దినుసులు,పొపు దినుసులు నాసిరకంతోపాటు కోత విధిస్తున్నారు. జిల్లాలో వెలుగుచూసిన ఘటనలు కొన్ని ఫిబ్రవరి 13న భువనగిరి కేజీబీవీలో 50 మంది విద్యార్థులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కేవలం 10మందినే ఆస్పత్రిలో చేర్చారు. మిగతా విద్యార్థులకు పాఠశాలలోనే చికిత్స అందించారు. 2018 మార్చి 31న మోటకొండూరు పాఠశాలలో కలుషిత ఆహారం తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. 2019 ఆగస్టు20న చీకటి మామిడి మహాత్మాజ్యోతీరావ్పూలే వసతి గృహంలో 15 మంది, 2020 మార్చి 20న తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా మోడల్ స్కూల్లో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వెలుగు చూడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. భువనగిరి కేజీబీవిలో నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో ప్రాథమిక విచారణ జరిపి హెడ్కుక్ను సస్పెండ్ చేశాం. ఇన్చార్జ్ అధికారికి మెమో ఇచ్చాం. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. గతంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపించి చర్యలు తీసుకున్నాం. వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.–అండాల్, జీసీడీఓ -
నవదంపతులు ఆత్మహత్యయత్నం.. భర్త మృతి
-
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
‘ఆ కేసులతో సంబంధం లేదు’
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలకు సంబంధించిన కేసులో నింది తుడు శ్రీనివాస్‌రెడ్డి తరఫున వాదనలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టులో మూడు హత్యల్లో బుధవారం నిందితుడి తరఫున ఒక హత్యకు సంబంధించి వాదన పూర్తయింది. న్యాయమూర్తి ఎదుట నిందితుడి తరఫు న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపిస్తూ... శ్రీనివాస్‌రెడ్డికి, ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఫోన్‌నంబర్లు నిందితుడివే అయినా వాటిని ఉపయోగించింది శ్రీనివాస్‌రెడ్డే అని అనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. కేవలం హాజీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు. అనుమానం వ్యక్తం చేసిన వారికి, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు. ఇది కావాలనే పెట్టిన కేసు తప్ప సరైన ఆధారాలు లేవంటూ కోర్టుకు నివేదించారు. మిగిలిన రెండు కేసులకు సంబంధించి వాదనను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. కాగా, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ పిటిషన్ దాఖలు చేశారు. -
భార్య చెవి, ముక్కు కోసిన భర్త
యాదాద్రి భువనగిరి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించి రాధతో గొడవ పడి ఇంట్లోని చేపలను కోసే కత్తితో ఆమెపై దాడిచేసి చెవి, ముక్కు కోసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె బంధువులు హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై రాధ సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. -
ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న బస్సు
చౌటుప్పల్(మునుగోడు): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం స్టేజీ వద్ద ఓ లారీ యూ టర్న్ తీసుకుంటున్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ బ్రేక్ వేసి తన కారును నిలిపాడు. వెనుకే ఉన్న మరో రెండు కార్ల డ్రైవర్లు సైతం బ్రేకులు వేశారు. కార్ల వెనుకే వచ్చిన హైదరాబాద్ కుషాయిగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్ సాయిలు బ్రేక్ వేశాడు. అయితే ఆ వెనుకే వచ్చిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ వాహనాలు ఆగిన విషయాన్ని గుర్తించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న 8 మంది గాయపడ్డారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ
బొమ్మలరామారం: హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ కేసుపై కొన్ని రోజులుగా నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, గురువారం నిందితుడిని విచారించారు. వందమందికి పైగా సాక్షులు, అధికారులను విచారించిన కోర్టు, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. -
వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..
పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ సన్మార్గంలో పయనించాలనే మంచిమాటలు చెప్పాల్సిన వయసులో ఆ వృద్ధుడి బుద్ధి పెడదోవపట్టింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని కుటుంబంలో చిచ్చురేపాడు.. చివరకు వావి వరసలు కూడా మరిచి పశువులా ప్రవర్తించాడు.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతడి తీరులో మార్పు రాలేదు సరికదా ఆగడాలు ఇంకా శృతిమించిపోయాయి. ఈ వయసులో ఇదేం పని నాన్నా అంటూ నిలదీసిన కుమారుడిపైనే కయ్యానికి కాలుదువ్వాడు.. ఆ పెనుగులాటలో కుమారుడు తోసేయగా బండమీద పడడంతో తల పగిలి తండ్రి ప్రాణాలు విడిచాడు.. ఇవీ.. భువనగిరి మండలం బండసోమారంలో వృద్ధుడి హత్యోదంతానికి దారితీసిన కారణాలు. ఉద్దేశపూర్వకంగా చేసినా.. అనుకోకుండా జరిగిన నేరం నేరమే అన్నట్టు చివరకు ఆ వృద్ధుడి కుమారుడు కటకటాలపాలయ్యాడు. భువనగిరి అర్బన్ : వృద్ధుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుమారుడే అతడి మృతికి కారణమని విచారణలో తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన యామల్ల లక్ష్మారెడ్డి(65), రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దాడు. కుమార్తె వివాహం చేశాడు. తండ్రి, కుమారులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మాధవరెడ్డికి వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మాధవరెడ్డికి సిరివేణికుంటకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. అందరూ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి.. లక్ష్మారెడ్డి కొన్నేళ్లుగా చెడు తిరుగుళ్లు తిరుగుతూ గ్రామంలో కొందరు మహిళలలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా అతని బుద్ధి మారకపోగా ఇంట్లో ఉన్న కోడలిపైనే కన్నేశాడు. ఈ విషయం కుమారుడు మాధవరెడ్డికి తెలియడంతో తండ్రి కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తండ్రి వేధింపులు భరించలేక మాధవరెడ్డి గ్రామంలోనే వేరు కాపురం పెట్టాడు. ఆయన తీరుపై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. దీంతో ఇక నుంచి కోడలిని వేధించనని పెద్ద మనుషుల సమక్షంలో లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. వడ్లు ఆరబోసేందుకు వెళ్లి.. లక్ష్మారెడ్డి గత శుక్రవారం ఉదయం వడ్లు ఆరబోసి వస్తానని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో మాధవరెడ్డి కూడా బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో వడ్లు ఆరబోసిన రామస్వామిగుట్టపై లక్ష్మారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో సఖ్యతగా ఉండడాన్ని చూశాడు. మాధవరెడ్డిని చూసిన ఆ మహిళ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మాధవరెడ్డి ఈ వయసులో ఇదేం పని ఇక నీవు మారవా అంటూ నిలదీశాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఇద్దరు ఘర్షణ పడగా మాధవరెడ్డి తండ్రిని నెట్టివేశాడు. దీంతో లక్ష్మారెడ్డి వెల్లకిలా బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి మరణించాడని మాధవరెడ్డి అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు వెళ్లి నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడని నమ్మించాడు. తల్లిని ట్రాక్టర్‌పై ఎక్కించుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. నాన్న ఫోన్ చేయడం లేదని అటూ ఇటూ తిరిగారు. చివరకు బండపై మూలుగు వినిపిస్తోందని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మారెడ్డి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. స్థానికుల సాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మారెడ్డి మృతిచెందాడు. కేసును ఛేదించారు ఇలా.. బాట విషయంలో భూ పంచాయితీ ఉన్న వారే తన తండ్రిని హత్య చేసి ఉంటారని మాధవరెడ్డి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేశాడు. అయితే భర్త గురించి బాగా తెలిసిన రాధమ్మ భూ పంచాయితీ ఉన్న వారిపై, కుమారుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాధవరెడ్డి తండ్రి మరణానికి తానే కారణమని, ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని పెనుగులాటలో కింద పడడంతో మృత్యువాత పడ్డాడని నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటలలోగా ఛేదించిన సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు రాఘవేందర్‌గౌడ్, మధు, ఏఎస్ఐలు పీఎస్ఎన్ ప్రసాద్, వి.సాగర్‌రావు, కానిస్టేబుల్ ఎం. జాన్, యాకుబ్‌ఖాన్, కొండారెడ్డి, వేణును డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లక్ష్యం అదే: కేటీఆర్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే కాకుండా దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మూలంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. కాలుష్యరహితమైన ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఈ పార్క్‌లో ఏర్పాటు కానున్నాయని, రసాయనిక, బల్క్‌డ్రగ్స్ పరిశ్రమలకు అవకాశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు కొనుగోలు చేసిన ఔత్సాహికులు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఉత్పత్తులను ప్రారంభించాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీల యాజమానులకు అగ్రిమెంట్లో నిబంధన విధించారు. ఈ పారిశ్రామిక వాడ ద్వారా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఉద్యోగులకు టౌన్షిప్, రెస్టారెంట్లు, డార్మెటరీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఐటీఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వృత్తి నైపుణ్యంతో కూడిన కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈపార్క్‌కు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 442 ఎకరాల భూమి కేటాయించారు. మొత్తం 450 యూనిట్లు రానున్నాయి. ఇందులో 40 యూనిట్లు మహిళలకు కేటాయించారు. రూ.1,553కోట్ల పెట్టుబడితో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్ సైజు 450 మీటర్ల నుంచి 5 ఎకరాల వరకు నిర్ణయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులు రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్లాట్లను తిరిగి స్వాధీనం పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,600కి గజం చొప్పున భూమి ధర నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్లాట్ల కేటాయింపులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.250కోట్ల నిధులు కేటాయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, సబ్సిడీ లభిస్తాయి. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి. ఎలక్ట్రికల్, డ్రిల్లింగ్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్, డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ వంటి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. టీఎస్ఐపాస్తో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం టీఎస్ఐపాస్ –2014 నూతన పారిశ్రామిక విధా నం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్ర భుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ ధరకు భూమి, ప న్నుల్లో రాయితీ, పెట్టుబడుల్లో రాయితీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్ర మల శాఖ ప్రోత్సహిస్తోంది. టీఎస్ఐపాస్ ద్వా రా గడిచిన మూడేళ్లలో జిల్లాలో 482 చిన్న, సూ క్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఆగస్టు 31 వరకు రూ.4,559 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఆయా పరిశ్రమల్లో 17,618మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీఫ్రైడ్, టీఐడియా ద్వారా 231మంది లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహక పథకాలను అందించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.51కోట్లు మంజూరు చేసింది. పరిశ్రమలు స్థాపించే జనరల్ కేటగిరీ వ్యక్తులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 నుంచి 40శాతం, మహిళలకు అదనంగా 10 శాతం రాయితీ, పావలా వడ్డీ ఇస్తున్నారు. జిల్లాకు తరలిరానున్న మరో 300 పరిశ్రమలు హైదరాబాద్ జంటనగరాలనుంచి పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు తరలించా లని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే మరో 300 వరకు పరిశ్రమలు జిల్లాకు రానున్నాయి. పరిశ్రమలు స్థాపించే వారికి సరసమైన ధరలకు భూముల కేటాయింపు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానంతో అనుమతులు జారీ చేస్తారు. -
గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ శుక్రవారం తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 438 ఎకరాల్లో 1500 కోట్ల వ్యయంతో ఇండస్ట్రీయలైజేషన్ జరిగింది. పార్కు నిర్మాణంతో.. పరిసర గ్రామాల్లోని సుమారు 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలపడంతో.. ప్రారంభోత్సవం కోసం అక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవం రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి నేడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
యాదాద్రి లడ్డూలకు ఫంగస్
సాక్షి, యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విక్రయించే 20 రూపాయల చిన్న లడ్డూలకు ఫంగస్ వచ్చింది. దీంతో వాటిని దేవస్థానం అధికారులు ఆదివారం ఉదయం చెత్త తరలించే ట్రాక్టర్లో గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి పడేశారు. సుమారు 2,500 లడ్డూలకు బూజు రావడంతో వీటిని పెద్దపెద్ద బ్యాగుల్లో నింపి ట్రాక్టర్లో ఉంచి కనిపించకుండా పైనుంచి చెత్త వేసి తరలించారు. వీటి విలువ రూ.50 వేల వరకు ఉంటుంది. పది రోజుల క్రితం తయారు చేసిన ఈ లడ్డూలను భక్తులకు విక్రయించేందుకు కౌంటర్లోకి తీసుకెళ్లి ఉంచారు. అక్కడ గాలి, వెలుతురు సరిగా లేకపోవడంతో లడ్డూలకు బూజు రావడంతో రెండు రోజుల క్రితం తిరిగి వాటిని తయారీ కేంద్రానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం వీటిని ఎవరూ చూడకుండా పెద్దపెద్ద సంచుల్లో నింపి చెత్త ట్రాక్టర్లో తరలిస్తుండగా గమనించిన స్థానికులు పాతగుట్ట రోడ్డు మధ్యలో అడ్డుకున్నారు. డ్రైవర్‌తో గొడవకు దిగడంతో అక్కడే రోడ్డు పక్కన పారబోసి వెళ్లారు.అయితే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడం, కౌంటర్లో గాలి, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల లడ్డూలకు బూజు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఏడాది క్రితం లడ్డూలకు బూజు రావడంతో పడేసిన ఘటనలు ఉన్నాయి. అయినా దేవస్థానం అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. -
ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని.. వివిధ అవసరాల నిమిత్తం ఎంత అసైన్డ్ చేశారు.. ప్రస్తుతం ఉన్నదెంత.. లేకపోతే ఎటుపోయింది.. లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్ శివారులో గల మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లెక్కలు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు వ్యవసాయం, గృహ, సామూహిక ప్రజా అవసరాలు, ప్రభుత్వ అవసరాలకోసం ప్రభుత్వ భూములను అసైన్ చేశారు. ఇందులో వ్యవ సాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాకుండా క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలో వైటీడీఏ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. పునరావాసం కింద బాధితులకు తిరిగి ప్రభుత్వం భూములను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే అసైన్ చేసిన భూములు కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. రియల్ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసెన్ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో కోట్లాది రూపాయల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో గల ప్రభుత్వ అసైన్డ్ భూములను రియల్టర్లు కబ్జా చేసి ఓపెన్ప్లాట్ల వ్యాపారం చేశారు. నిరోధించాల్సిన యంత్రాంగ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ప్రభుత్వం గతంలో భూముల లెక్కలు తేల్చడానికి సర్వే చేపడితే వందకోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా, ,క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది. క్షేత్రస్థాయిలో సరైన రక్షణ లేకపోవడంతో జిల్లాలోని 17 మండలాల్లో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి అందినకాడికి ఆక్రమించి అమ్ముకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా విలువ చేసే 3,370 ఎకరాల భూములను ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. రూ.కోట్లల్లో డిమాండ్ హెచ్ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి రెండు జాతీయ రహదారులు ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. చౌటుప్పల్ డివిజన్లో పరిధిలో 33.608, భువనగిరి డివిజన్లో 49.604 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చౌటుప్పల్ డివిజన్లో 14,140.32 ఎకరాల భూమిని, భువనగిరి డివిజన్లో 23693 ఎకరాల భూమిని రైతులకు అసైన్డ్ చేశారు. సగానికి పైనే అన్యాక్రాంతం ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములు సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. ఆభూముల పక్కనే గల భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు. గతంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల సర్వేలో భూ ఆక్రమణలు బయటపడ్డాయి. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు. రాజకీయ వత్తిడులు, కొందరు ఉన్నతాధికారులప్రమేయంతో ఖబ్జాభూములపై నివేదికలన ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు నమోదు అసైన్ చేసిన భూ ముల క్రయవిక్రయాలు జరిగితే పీఓటీ కేసులు నమోదు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వం లెక్కలు తీస్తున్న జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా లేదు. ఇక్కడ బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ భూములు అవసరం ఉన్నాయి. –రమేశ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల వివరాలు ఎకరాల్లో మండలం మొత్తం ఏరియా వ్యవసాయానికి కేటాయింపు ఆలేరు 3794.08 1457.22 ఆత్మకూరు 8512.05 4302.09 భువనగిరి 8450.05 3341.19 బీబీనగర్ 5544.21 1884.07 బి.రామారం 6698.16 1831.06 మోత్కూర్ 8997.10 4426.23 రాజాపేట 4358.17 2346.34 తుర్కపల్లి 10920.03 4078.29 యాదగిరిగుట్ట 4618.22 1938.24 చౌటుప్పల్ 8057.33 2748.14 పోచంపల్లి 6707.15 5767.74 గుండాల 6094.06 2492.07 రామన్నపేట 7561.02 2830.26 వలిగొండ 7351.345 3218.03 మొత్తం 97665.18 39664.08 -
మైసయ్య.. ఇదేందయ్యా!
సాక్షి, యాదాద్రి: సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడపడం ప్రమాదకరం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జనాల్లో మార్పు రావడం లేదు. సొంత వాహనాలను నడిపేవారి గురించి మనం చెప్పలేం. కానీ ప్రజా రవాణ వ్యవస్థలో పని చేస్తున్న డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సెల్ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. కొండగట్టు లాంటి బస్సు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. బస్సు నడుపుతున్న సంఘటన ఒకటి వెలుగు చూసింది. వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ వెళ్లే నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఏపీ 21 జడ్ 208 ఆర్టీసీ బస్సు డ్రైవర్ మైసయ్య ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తూ కెమరాకు చిక్కాడు. బస్సులో పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి.. తన పాటికి తాను మొబైల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారం గురించి చర్చిస్తూ.. బస్సు నడుపుతున్నాడు మైసయ్య. మైసయ్య వైఖరికి బస్సులో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మైసయ్య ప్రవర్తన పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవరన్నా.. ప్రమాదం జరిగితే నీ ఇంటితో పాటు ప్రయాణికుల ఇళ్లు కూడా మునుగుతాయ్ జర భద్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్ నడుపుతూ.. మొబైల్ ఫోన్ మాట్లాడితే.. రూ. 2 వేలు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. మరి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం అంటున్నారు. ఈ సంఘటనపై నార్కట్ పల్లి డిపో మేనేజర్ స్పందించాల్సి ఉంది. -
మత్స్యగిరీశుడికి మహర్దశ!
సాక్షి, యాదాద్రి: నాలుగున్నర ఫీట్ల ఎత్తుతో మత్స్యం మీద కూర్చున్న లక్ష్మీనరసింహుల ఏకశిలా విగ్రహం..58 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న భారీ క్షేత్రపాలకుడి విగ్రహం.. మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న జయవిజయులు, గరత్మంతులు, ఉత్సవమూర్తుల విగ్రహాలు.. ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో విస్తరించనున్న ఆలయం.. ఇలా మరెన్నో అభివృద్ధి పనులతో మత్స్యగిరీశుడి క్షేత్రం నూతన కళ సంతరించుకుంటోంది. వలిగొండ మండలం వేములకొండ గుట్టపై వెలసిన మత్స్యగిరీశుడి ఆలయం జిల్లాలో మరో అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వాస్తు, ఆగమశాస్త్రం ప్రకారం త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. 2018 విజయదశమి రోజున ఆలయ చైర్మన్, దాతలు, భక్తుల సహకారంతో పనులకు అంకురార్పణ చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకు అనుగుణంగా పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. జరుగుతున్నవి, చేపట్టనున్న పనులు గర్భాలయం వెనుక చేపట్టిన ఉత్సవమూర్తుల ఆలయం, గోపురాల నిర్మాణం పూర్తి కావొచ్చాయి. నాలుగున్నర ఫీట్ల ఎత్తులో మత్స్యం మీద స్వామి,అమ్మవార్లు కూర్చున్న కృష్ణ శిలతో చెక్కిన ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠింనున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో స్వామి,అమ్మవార్ల విగ్రహంతో పాటు జయవిజయులు, గరత్మంతుల విగ్రహాలను తయారు చేయించారు. ఈ విగ్రహాలు సెప్టెంబర్ 5న మత్స్యగిరి కొండపైకి చేరుకోనున్నాయి. ఇప్పటికే నూతన ధ్వజస్తంభం సిద్ధమైంది. దీనికి ఇత్తడి తొడుగు అమర్చనున్నారు. స్వామివారి సేవలు తీసే సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో 8 ఫీట్ల మే విస్తరించనున్నారు. ఇందుకోసం దేవస్థానం నిధులను ఖర్చు చేయనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలతో సీపీఎస్ పనుల ద్వారా సత్యనారాయణ వ్రత మండపానికి పక్కా భవనం నిర్మించనున్నారు. ధ్వజస్తంభం నుంచి స్వామివారి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత చైర్మన్ కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు సమన్వయంతో దాతల సహకారం లభిస్తోంది. కోటి రూపాయల అంచనాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకు వసతులు కల్పించడం కోసం ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షుడు ఎంతో కృషి చేస్తున్నారు. భారీ ఆంజనేయస్వామి విగ్రహం కొండపైన గల శ్రీసీతారామచంద్రస్వామి, ఆలయం ఎదుట 51 అడుగుల ఎత్తులో ఆంజనేయస్వామి నిలువెత్తు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి సుమారు రూ.20లక్షల సొంత నిధులతో ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని, చుట్టూ భక్తులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయస్వామి విగ్రహాం తయారీ తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రారంభించనున్నారు. 42 ఎకరాల స్థల వితరణ వేములకొండ లక్ష్మీనర్సింహస్వామికి 42ఎకరాల స్థల వితరణ చేశారు. వేములకొండకు చెందిన పారిశ్రామికవేత్త గార్లపాటి సురేందర్‌రెడ్డి జీయర్‌స్వామి సమక్షంలో దేవస్థానానికి 42ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో దేవస్థానం పరిసరాల్లో వసతులు మెరుగుపర్చడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. శని, ఆది, సోమవారాలతోపాటు వీకెండ్ రోజుల్లో 20వేల వరకు భక్తులు వచ్చి వెళ్తున్నారు. నూతన సంవత్సరం, కార్తీకమాసం, శ్రావణమాసం, పుణ్యతిథులైన పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి పర్వదినాల్లో భక్తులు సత్యనారాయణ వ్రతాలు, పుట్టువెంట్రుకలు, స్వామివారికి సమర్పించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకుంటారు. విశిష్టమైనది విష్ణు పుష్కరిణి విష్ణు పుష్కరిణి అత్యంత విశిష్టమైనది. ఈపుష్కరిణిలోనే స్వామివారు వేలిశారని భక్తుల నమ్మకం. ఇందులో నీరు ఎప్పుడు ఇంకిపోతుంది. పుష్కరిణిలోని నీటితోనే స్వామివారిని ప్రతిరోజూ అభిషేకిస్తారు. పుష్కరిణిలో చేపల తలలపై స్వామివారి నామాలు దర్శనమిస్తాయి. దీంతో పుష్కరిణిలోని నీటిని పొలాల్లో చల్లితే పెద్ద ఎత్తున పంటలు పండుతాయని భక్తుల నమ్మకం. ఏటేటా పెరుగుతున్న భక్తులు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంలో కాలిబాటన కొండపైకి చేరుకునే భక్తులకు ప్రస్తుతం రోడ్డు వసతిని కల్పించారు. కొండపై ముఖ మంటపం, గోదాదేవి ఆల యం, సత్యానారాయణస్వామి వ్రత మంట పం, మూడు అంతస్తుల రాజగోపురం, పంచముఖ రామలింగేశ్వర ఆలయం, యాగశాల, విశ్రాంతి భవనం,షాపింగ్ కాంప్లెక్స్, సత్రాలు, కోనేరు చూట్టు సీసీ రోడ్డు, లడ్దు ప్రసాద విక్రయ శాల, విశ్రాంతి భవనం ఉన్నాయి. రోడ్డుపైకి ఘాట్‌రోడ్డు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దాతలు, భక్తుల సహకారంతో.. త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. జీయర్‌స్వామి కొండపైన ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా స్వయంభూవుగా వెలసిన లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ రూపం ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారం, తనవంతు ఆర్థిక సహాయంతో గత విజయదశమిన జియర్‌స్వామి ప్రారంభించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. జియర్‌స్వామి చేతుల మీదుగా స్వామివారి దర్శనం కల్పించబోతున్నాం. –కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ గ్రహ పీడలు తొలగిపోతాయి స్వామివారి తీర్థం స్వీకరించిన భక్తుల శారీ రక గ్రహపీడ బాధలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పుష్కరిణిలోని తీర్థంతో ప్రతి నిత్యం స్వామివారికి అభిషేకిస్తాం. భక్తులు ఎవరైనా 11రోజులు ఈవిష్ణు తీర్థాన్ని స్వీకరించినట్లయితే గ్రహదోశం, సంతానప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార వివాహాలు కలుగుతాయని విశ్వాసం. ఈతీర్థాన్ని పంట పొ లాల్లో చల్లితే పాడిపంటలు సమృద్దిగా పండుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. –యాదగిరి స్వామి, అర్చకుడు -
యాదాద్రికి మరో మణిహారం 'ఎయిమ్స్'
సాక్షి, యాదాద్రి: ఎంతో కాలంగా రాష్ట్రం ఎదురుచూస్తున్న ఎయిమ్స్ (ఆలిండియా మెడికల్ సైన్సెన్ ఆఫ్ ఇండియా) మంగళవారం ప్రారంభం కాబోతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన రోజు చెప్పిన విధంగా ఎయిమ్స్ సాకారం కావడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేంద్రం రూ.1,028కోట్లతో ఎయిమ్స్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీబీనగర్ మండలం రంగాపూర్ వద్ద గల నిమ్స్‌ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో వైద్య విద్య కళాశాలను ప్రారంభిస్తున్నారు. 50 సీట్లతో వైద్యవిద్య తరగతులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలో గల నిమ్స్ ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా 50 సీట్లతో ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తారు. మరో 50 సీట్లతో కలిపి వసతులు సమకూరిన తర్వాత మొత్తం 100సీట్లతో ఎంబీబీఎస్ విద్యాబోధన చేయనున్నారు. ఏడాదిన్నర తర్వాత రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నిమ్స్ భవన సముదాయాన్ని ఎయిమ్స్ ఉపయోగించుకుంటుంది. నిమ్స్ భవనసముదాయంతోపాటు ఎయిమ్స్‌కు ఉచితంగా ఇచ్చిన 221 ఎకరాల స్థలంలో ఎయిమ్స్ నిబంధనలకు అనుగుణంగా భవనాలను నిర్మిస్తారు. ప్రస్తుతం ఇలా... 2019–20 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన వైద్యవిద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో నిర్దేశించిన మేరకు ఇక్కడ చేరుతారు. విద్యార్థులకు వైద్య విద్య అందించడానికి డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమించారు. భవిష్యత్‌లో 750 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారు. రోజుకు సుమారు 1,500మంది ఔట్ పేషంట్లు రావచ్చని అంచనా వేశారు. ఎయిమ్స్‌కు అవసరమైన 221 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో మార్గం సుగమమైంది. ముందుగా 50 ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాబోధన చేయనున్నారు. ఇందుకోసం విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో రంగాపూరంలోని నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ పనిచేయనుంది. ఇందులో 100ఎంబీబీఎస్ సీట్లతోపాటు 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోగులకు 15 నుంచి 20సూపర్ స్పెషాలిటీ సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ పరిధిలో జరిగే వైద్యరంగ పరిశోధనలు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహిస్తారు. సుశిక్షితులైన వైద్య ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఏర్పాట్లు పూర్తి నిమ్స్ భవనంలోని ఏబ్లాక్‌లో ఎయిమ్స్ వైద్య యూనివర్సిటీ మెడికల్ కళాశాల తరగుతులు నిర్వహిస్తారు. దీంతో పాటు మరో రెండు బ్లాక్‌లను కేటాయించారు. వీటిలో వీఐపీ లాంజ్, డైరెక్టర్స్ చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్, వైద్యుల గదుల ఏర్పాటు, రికార్డు రూంలుతో పాటు బ్లాక్‌లోని అన్ని ఫ్లోర్లకు అనుకూలంగా ఉండే విధంగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఏసీ, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు పూర్తయ్యాయి. బాల్కనీలో ఫైర్ సేఫ్టీ వర్క్స్, కిచెన్, డైనింగ్ హాల్ పనులు పూర్తి కావొచ్చాయి. -
నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ప్రగతి భవన్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్తారు. ఉదయం పదిన్నరకు యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులను తనిఖీ చేస్తా రు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్, టెంపుల్ సిటీ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. యాదాద్రిలో మధ్యాహ్న భోజ నం చేసి హైదరాబాద్ బయలుదేరతారు. -
క్లాస్ లీడర్ కాలేదని..
రామన్నపేట: ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం... ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ముందుకెళ్లాలనే జీవితసూత్రం తెలియని ఓ టీనేజీ విద్యా కుసుమం రాలిపోయింది. చదువులో మేటిగా నిలిచినా కేవలం ఓ పోటీలో ఓడిపోయాననే మనోవేదనతో ఓ విద్యార్థి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటలోని కొమ్మాయిగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న చిందం విజయ్ కుమార్, విజయలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. విజయ్ కుమార్ రామన్నపేట బస్టాండ్ ఎదురుగా కిరాణా షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండో కుమారుడైన చిందం చరణ్ కుమార్ (13) స్థానిక కృష్ణవేణి హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా స్కూల్ లీడర్, క్లాస్ రిప్రజెంటేటివ్ (లీడర్), గర్ల్స్ లీడర్ పదవులకు మూడు రోజుల కిందట ఎన్నికలు నిర్వహించారు. క్లాస్ రిప్రజెంటేటివ్ బరిలో చరణ్ నిలవగా అతనికి పోటీగా మరో విద్యార్థిని నిలిచింది. ఈ నెల 16న మోడల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో అతను ద్వితీయ స్థానంలో నిలిచాడు. మొదటిస్థానం దక్కలేదని కొంత అసంతృప్తితో ఉన్నా అదే రోజు క్లాస్‌లో స్వీట్లు పంచినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆ రోజు నుంచి అతను ముభావంగా ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు పాఠశాల నుంచి వచ్చిన చరణ్... బ్యాగ్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో అదే రోజు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో చరణ్ కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశారు. రాత్రంతా అతని కోసం వెతుకున్న తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారి ద్వారా రైల్వేట్రాక్‌పై ఓ విద్యార్థి మృతదేహం ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా చరణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. స్కూలు ఎన్నికల్లో ఓడిపోయాయనే బాధతో తన కుమారుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి విజయ్ కుమార్ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నల్లగొండ రైల్వే ఎస్ఐ టి.అచ్యుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చురుకైన విద్యార్థి... చరణ్ కుమార్ పాఠశాలలో చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. చదువులో, క్రీడల్లో తమను ప్రోత్సహించేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. పేద పిల్లలకు నోట్ పుస్తకాలు, ఆర్థిక సాయం కూడా చేసేవాడని పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే చరణ్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, చరణ్ కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఆయనవెంట సర్పంచ్‌లు గోదాసు శిరీషపృద్వీరాజ్, ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి ఎడ్ల నరేందర్‌రెడ్డి ఉన్నారు. -
అమ్మాయి చేతిలో ఓడిపోయానని..
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఎలక్షన్లో ఓడిపోయాననే మనస్థాపంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు. వివరాలు.. సాయి చరణ్ అనే విద్యార్థి రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. సాయి చరణ్ పోటీలో నిలిచాడు. అయితే ఈ ఎన్నికల్లో సాయి చరణ్‌తో పాటు నిల్చున్న మరో బాలికను క్లాస్ లీడర్‌గా ఎన్నుకున్నారు విద్యార్థులు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపినికి గురైన సాయి కిరణ్ నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పోయి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆగని అక్రమాలు..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ప్రైవేట్ వ్యక్తులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా, కార్యాలయాల సమయంలోనే విధులను నిర్వహించాలని చెప్పినా.. లంచాలు వసూలు చేయొద్దని ఆదేశించినా..అధికారుల తీరు మారడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇదే అదనుగా కార్యాలయాల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం పెచ్చుమీరి పోతోంది. వీరికి సబ్‌రిజిస్ట్రార్లతోపాటు అందులో పనిచేసే సిబ్బంది వారు నియమించుకున్న ప్రైవేట్ సిబ్బంది పూర్తి అండదండలు అందిస్తున్నారనేది బహిరంగ సత్యం. ‘ఏసీబీ’ తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు.. భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వందలాది డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ వద్ద పెండింగ్‌లో ఉండడం ఇక్కడ కొసమెరుపు. రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేస్తూ బీబీనగర్ అధికారుల ఉదాంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఆక్రమించిన బినామీ భూములను జిరాక్స్ కాపీలతో రిజిస్ట్రేషన్ చేస్తూ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లారు. ఇలా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమాల పర్వం జోరుగా సాగుతోంది. పలు కార్యాలయాల్లో అక్రమాల జాతరే.. భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూర్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాల జాతర కొనసాగుతోంది. ఆయా కార్యాలయాల చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. వీటిని తొలగించే ప్రయత్నం ఎవరివల్ల కావడం లేదు. ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగానే అధికారులు వెంటనే డాక్యుమెంట్ రైటర్ల వద్దకు పంపిస్తారు. వారి వద్ద నుంచే డాక్యుమెంట్లు, చలాన్లు చెల్లిస్తారు. భూమికి ఉన్న విలువను బట్టి ప్లాటు, ఎకరాల్లో రిజిస్ట్రేషన్లకు వంతుల వారీగా డబ్బులు నిర్ణయించి రైటర్లే వసూలు చేస్తారు. ఇక్కడ అంతా రైటర్లదే హవా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వద్ద డాక్యుమెంట్ల వారిగా రేట్లు నిర్ణయిస్తారు. సమస్యాత్మక భూములుంటే.. సమస్యాత్మక భూములు ఉంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాదని పక్కన పెట్టేస్తారు. రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సామాన్యుడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. లంచం ఇవ్వకపోతే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. సమస్యలు లేకున్నా సృష్టించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. అయితే జిరాక్స్ కాపీలపై తప్పుడు ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోడాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు ముట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ తతంగం అంతా పూర్తి చేస్తారు. ఏరోజుకారోజు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా సాయంత్రం అధికారులు, ఉద్యోగులు లె క్కలు చూసుకుని వాటాలు పంచుకుని ఇంటికి వెళ్తారు. కార్యాలయాల చుట్టూ అద్దె భవనాలు.. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అలాగే యాదగిరిగుట్టలో కొనసాగుతున్న కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు విచ్చలవిడిగా వెలిశాయి. జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు గదులను అద్దెకు తీసుకుని పాగా వేశారు. కొన్నిచోట్ల ఇతరులకు అద్దె భవనాలు దొరక్కకుండా డాక్యుమెంట్ రైటర్లే కార్యాలయాల చుట్టుపక్కల గల భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రికార్డులు పంపించరు.. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్ల రికార్డులను స్కానింగ్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నేరుగా యజమానికి చేరవేయాలి. కానీ ప్రతి చోట అలా జరగడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు తాము చేయించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకుని తమ వద్దే ఉంచుకుని పంపిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బీబీనగర్‌లో రాత్రి పొద్దుపోయే వరకు.. బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడురోజుల క్రితం రాత్రి 10గంటలు దాటిన రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఉండడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి విధి నిర్వహణ కోసం రానీయవద్దని ఇటీవల ఆశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంటర్ల అనుచరులు ఏసీబీకి పట్టుబడ్డారు. పలు అవకతవకలకు కారణం అవుతున్న ప్రైవేట్ సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే విధి నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ కొనసాగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలేనని ఆరోపణలు ఉన్నా యి. అయితే మధ్యాహ్నం సర్వర్ పని చేయకపోవడం వల్లే అనుమతి తీసుకుని పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేశామని అధికారులు సంజాయిషీ ఇస్తున్నారు. తారస్థాయికి చేరిన అవినీతి.. భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, యాదగిరిగుట్ట, మోత్కూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయిలో కొనసాగుతోంది. జిల్లాలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లాట్లు, భూములు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో రియల్టర్లు తొందరగా పని పూర్తి చేయడం, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు, సమస్యాత్మక భూములు రిజిస్ట్రేషన్లు చేయించడం కోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజేబుతున్నారు. యాదగిరిగుట్టలో.. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన తరువాత ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్ వాహిద్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హుజూర్నగర్ నుంచి సైదులును ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన తరువాత హైదరాబాద్ నుంచి జహంగీర్ వచ్చారు. ఆయన్ని కూడా మార్చి ప్రస్తుతం దేవరకొండ నుంచి శ్రీనివాస్‌రావును సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్ డీఆర్లు తనిఖీలు చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. పైచిత్రం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇటీవల రాజాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, భూమిని భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడకి వచ్చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు అదనంగా మరో రూ.20వేలు అధికారులకు చెల్లించాలని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి కదా ఎందుకు చెల్లించాలని అడగ్గా తనకేమీ తెలియదని అంతా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు జరుగుతుందని సదరు రైటర్ సెలవిచ్చారు. అయితే అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అక్కడనుంచి వెనుదిరిగిపోయారు. యాదగిరి గుట్టలో ఒక్కచోటే కాదు జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తతంగం కొనసాగుతోంది. -
పందిట్లో విద్యుత్ షాక్ ...నలుగురు మృతి
-
పెళ్లింట తీవ్ర విషాదం
భూదాన్‌పోచంపల్లి: రెండు రోజులపాటు బాజాభజంత్రీలు, కుటుంబసభ్యులు, బంధువులతో సందడిగా మారిన పెళ్లి ఇంటిపై విధి కరెంటు రూపంలో కన్నెర్రజేసింది. పారాణి కూడా ఆరక ముందు కరెంట్‌షాక్‌తో పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి, మేనత్త మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిందం సాయిలు(60) రెండో కుమారుడైన ప్రవీణ్ (23) వివాహం ఈ నెల 19న ఇదే మండలం రేవనపల్లి గ్రామానికి చెందిన యువతితో జరిగింది. శుక్రవారం పెళ్లి కుమార్తె ఇంట్లో చిన్నవిందు ఉండడంతో సాయిలు కుటుంబసభ్యులు, బంధువులంతా కలిసి వెళ్లారు. సాయంత్రం పోచంపల్లి మండలంలో వర్షం కురిసింది. వీరంతా రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. పెళ్లి సందర్భంగా ఇంటికి జే వైరు ద్వారా సీరియల్ బల్బులను అమర్చారు. పెళ్లి కుమారుడి మేనత్త శ్యామల గంగమ్మ ఆ జే వైరుపై తెలియక తడిబట్టలు ఆరేసింది. దీంతో ఆమెకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు పెళ్లికుమారుడి తల్లి చిందం గంగమ్మ పట్టుకోగానే ఆమెకూ షాక్ తగిలింది. గంగమ్మకు రక్షించబోయి సాయిలు, తర్వాత పెళ్లి కుమారుడు ప్రవీణ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు పట్టుకోవడంతో వారందరికీ షాక్ తగిలింది. ఏమైందో తెలియక సాయిలు పెద్ద కుమారుడైన చిందం భాస్కర్ ఫీజు తీసేయడంతో కింద పడిపోయారు. అప్పటికే తీవ్ర గాయాలైన వీరిని పోచంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వారు మృతిచెందారని చెప్పారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల ఘటనపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలు, బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనికి ట్విటర్లో స్పందించిన కేటీఆర్.. శనివారం బిట్టు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడా రు. ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నామన్నా రు. సీఎం కేసీఆర్ సైతం హాజీపూర్ ఘటనపై సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. చట్ట పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తామని, ప్రజలందరూ దయచేసి సంయమనం పాటించాలని కోరారు. హాజీపూర్ సంఘటనపై ప్రతి ఒక్కరికీ బాధగా ఉందని, రాజకీయాలు వద్దని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడి బాధితులను కలవాల్సిందిగా సూచిస్తామన్నారు. స్థానిక ఎస్ఐ, సీఐల నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, రాచకొండ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుతామన్నారు. తాను ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని బాధితులకు, గ్రామస్తులకు తెలియజేయాలని సర్పంచ్ బిట్టు శ్రీనివాస్‌కు కేటీఆర్ సూచించారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యంత దారుణంగా హత్యలకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఘటనలు బాధాకరమన్న ఆయన హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. కాగా హత్యకు గురైన చిన్నారుల కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ... బొమ్మల రామారం మండలం మాల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. నెలాఖరులో హాజిపూర్ గ్రామాన్ని సీఎం,కేటీఆర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
యాదాద్రి ఫస్ట్, వికారాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6, 10, 14 తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మొత్తం 77.46 శాతం ఓటింగ్ నమోదవగా అందులో మహిళలు 77.68 శాతం, పురుషులు 77.24 శాతం, ఇతరులు 7.64 శాతం ఓటేశారు. జిల్లాలవారీగా చూస్తే 87.02 శాతం పోలింగ్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా తొలిస్థానం లో నిలవగా వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 70.40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 534 జెడ్పీటీసీ స్థానాలకు(ఏకగ్రీవమైన 4 స్థానాలు మినహా) 2,426 మంది, 5,659 ఎంపీటీసీ స్థానాలకు (158 ఏకగ్రీవా లు మినహా) 18,930 మంది పోటీపడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు సగటున ఐదుగురు, ఎంపీటీసీ స్థానాలకు సగటున ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలవారీగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32,045 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 2,488 పోలింగ్ బూత్ లలో ఎస్ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహించింది. మొత్తం 2,879 రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఎన్నికల విధుల కోసం 1.86 లక్షల మంది సిబ్బంది ని ఎంపిక చేసింది. 54,604 మంది భద్రతా సిబ్బంది ని సేవల వినియోగించుకుంది. సాధారణ పరిశీలకులుగా 15 మందిని, వ్యయ పరిశీలకులుగా 37 మందిని, సహాయ వ్యయ పరిశీలకులుగా 528 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 2,832 మందిని నియమించింది. మొత్తం 65 వేల బ్యాలెట్ బాక్సులు, దాదాపు 3.5 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఓటేసినందుకు గుర్తుగా వేసే నల్లటి సిరా రంగు కోసం 42 వేల ఇండెలిబుల్ ఇంక్ ఫాయల్స్ ఉపయోగించారు. 1.6 లక్షల పేపర్ సీళ్లను ఉపయోగించారు. -
చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
సాక్షి, హైదరాబాద్ : నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన చిన్నారి ప్రణతి చివరకు శాశ్వత నిద్రలోకి చేరుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. కాగా గురువారం యాదగిరిగుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద రాచకొండ పోలీసుల వాహనం ఢీకొని ప్రణతి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో పాటు కొన్న అవయవాలు పని చేయకపోవడంతో ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు.వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రణతి కోలుకోవాలని, మెరుగైన వైద్యం అందించడానికి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చివరి వరకూ ప్రయత్నించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: (చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం) -
చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం
సాక్షి, నల్గొండ : యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో మూడేళ్ల చిన్నారిపై నుంచి పోలీసులు వాహనం దూసుకెళ్లింది. వివరాలు.. యాదగిరి గుట్ట పాత నరసింహస్వామి ఆలయంలో ఈ ఘోరం జరగింది. దేవాలయం ప్రాంగణంలో దైవదర్శనానంతరం తండ్రితో కలిసి ప్రణతి(3) నిద్రిస్తున్న సమయంలో రాచకొండ పోలీసుల వాహనం ప్రణతిపై నుంచి దూసుకెళ్లింది. వెంటనే ఆ చిన్నారిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కామినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రసాద రావు మాట్లాడుతూ.. కడుపులోపల బలమైన గాయం కావడంతో లోపల రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో ప్రణీత మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిందన్నారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చే సమయానికే పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొన్ని అవయవాలు పనిచేయడం లేదని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. రాచకొండ కమీషన్ మహేష్ భగవత్ ప్రణీతను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు. -
బీజేపీని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలి
బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కేంద్రం ఇప్పటికే జిల్లాకు ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందని గుర్తు చేశారు. సాక్షి, యాదాద్రి: బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి భువనగిరి కార్యకర్తలు ప్రధా ని మోదీకి బహుమతి ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పీవీ శ్యామ్‌సుందర్‌రావు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త తనకు తాను అభ్యర్థిగా భావించుకుని పీవీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమయం మూడు రోజులే ఉన్నం దున కార్యకర్తలు పూర్తిస్థాయిలో పని చేస్తే కచ్చితంగా గెలుస్తామన్నారు. మోదీ ప్రధాని అయితే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం ఏయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందన్నారు. జాతీ య రహదారులను అభివృద్ధి చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అభ్యర్థి పీవీ శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో ఇప్పటి రకు గెలిచిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. త మ స్వప్రయోజనాల కోసం ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. బీజేపీ మో దీ ప్రభుత్వం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు మం జూరు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెదిరె శ్రీరాంరెడ్డి, దాసరి మల్లేశం, నర్ల నర్సింగ్‌రావు, సుర్వి లావణ్య, చందా మహేందర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి, యాదాద్రి : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరమల్ల ప్రసన్న-రేపాక గణేష్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గణేష్ వివాహానికి నిరాకరించడంతో.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను పోలీసులు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. -
ఎంపీటీసిల లెక్క తేలింది..!
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) లెక్క తేలింది. సవరించిన జాబితా ప్రకారం ఎంపీటీసీల సంఖ్య 177గా నిర్ధారించారు. జిల్లాలో కలిసిన గుండాలతో కలుపుకుని 17 మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాలను రూపొందించారు. తుది జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను 16 మండలాలతో ఏర్పాటు చేశారు. అయితే పాత మండలాలు 14 మాత్రమే ఉండగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతోపాటు జిల్లాలో మోటకొండూరు, అడ్డగూడురు రెండు నూతన మండలాలు ఏర్పాటు చేశారు. మూడు మండలాలు అదనంగా చేరడంతో జిల్లాలో ప్రస్తుతం మండలా సంఖ్య 17కు చేరింది. ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 17 మండలాలతో కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. 3,500 జనాభాకు ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తక్కువగా ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ముందుగా జారీ చేసిన ముసాయిదా పై పలు అభ్యంతరాలు వచ్చాయి. ఎంపీటీసీల్లో విలీనమైన గ్రామాల మధ్యన దూరం తగ్గించాలని, ఓటర్ల సంఖ్యను 3,500 నుంచి 2000 కు తగ్గించాలంటూ సుమారు 20 అభ్యంతరాలు వచ్చాయి. 177 ఎంపీటీసీలు నూతన ముసాయిదా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలను ఖరా రయ్యాయి. గతంలో జిల్లాలో 207 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 177కు తగ్గిపోయాయి. మేజర్ గ్రామపంచాయతీలైన ఆలే రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలుగా మారాయి. భువనగిరి మున్సిపాలిటీలో రాయిగిరి, బొమ్మాయపల్లి, పగిడిపల్లి గ్రామాలు ఇలా మొత్తం మున్సిపాలటీల్లో 17 పంచాయతీలు విలీనం అయ్యాయి. గతంలో 2,500 మందికి ఒక ఎంపీటీసీ స్థానం ఉండగా ప్రస్తుతం 3,500కు పెంచారు. కాగా జిల్లాలో వలిగొండ మండలంలో17 అత్యధికంగా ఎంపిటీసీలు ఉండగా,మోత్కూరులో అతి తక్కువగా 4 ఎంపిటీసీలు ఉన్నాయి. ఆలేరు అడ్డగూడురు, మోటకొండూరులో ఏడేసీ చొప్పున ఎంపీటీసీలు ఉండగా, ఆత్మకూర్(ఎం) లోఎనిమిది ఎంపిటీసీ స్థానాలుఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. ఎంపీటీసీ,జెడ్పీటీసీల సంఖ్య ఖరారు కావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది.రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడు ఆదేశించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు జాబితాలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేస్తోంది. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఆలేరు 7, భువనగిరి 13, బీబీనగర్ 14 , బొ మ్మలరామారం 11, చౌటుప్పల్ 12, మోట కొండూర్ 7, మోత్కూర్ 4, నారాయణపురం13, రాజాపేట 11, వలిగొండ 17, యాద గిరిగుట్ట 9, ఆత్మకూర్ 8, భూదాన్‌పోచంపల్లి 10, అడ్డగూడూరు 7, రామన్నపేట 15, తుర్కపల్లి 10, గుండాల 9 ఉన్నాయి. రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి భువనగిరి(వలిగొండ) : జిల్లాలో చాలా మం దికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదని వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. వలిగొండలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చాలా మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేదన్నారు. దీంతో వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రానివారందరికీ వెంటనే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వేముల మహేందర్, మా టూరి బాలరాజు, చిర శ్రీశైలంరెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, ముగిలి పాక గోపాల్, కృష్ణ, అంజనేయులు, సత్తిరెడ్డి, కిష్టయ్య, రాంచందర్ పాల్గొన్నారు. 3న భాషా పండితుల సమావేశం భువనగిరిటౌన్ : హైదరాబాద్‌లోని కొత్తపేటలో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఈనెల 3వ తేదీన భాషా పండితుల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జీడిపల్లి సైదులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలుగు, హిందీ ఉర్దూ పండిట్లతో పాటు పీఈటీలందరూ హాజరుకావాలని కోరారు. -
పేరున్న ఊరు పుట్టపాక
పోగు, పోగు కలిపి వస్త్రం నేస్తారు. నైపుణ్యం ఉన్నవారు చేసే పనే. అయితే ఆ వస్త్రాన్ని తయారుచేయడంలో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ వస్తున్నారు పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు. తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, తమలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. ఆ కళానైపుణ్యం పుట్టపాక గ్రామానికి అవార్డులు కురిపిస్తోంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె.. చేనేతల పరంగా విశ్వవిఖ్యాతి గాంచింది. ఇక్కడి కళాకారులు తమ కళా నైపుణ్యంతో మరుగున పడిన ప్రాచీన కళ ‘తేలియా రుమాల్’ను ఏనాడో వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగులోని ప్రతిభను చూసి వస్త్ర ప్రపంచం పుట్టపాకను కీర్తించడం మొదలైంది. తేలియా రుమాల్ ఒక్కటే కాదు, ఇక్కడి కళాకారులు చేనేత వస్త్రతయారీనే ఒక ప్రయోగశాలగా మార్చారు! నూతన ఒరవడి సృష్టించారు. తేలియా రుమాల్‌ను, ఖతాల్ చీరలను నిలువు దారంపై డిజైన్ చేయడంలో వీరు విలక్షణమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. అసలు నిలువు దారం డిజైన్లు చేసి రంగులు అద్దడం ప్రపంచానికి పరిచయం చేసింది పుట్టపాక కళాకారులే. ఏ ప్రాంత ప్రజల అభిరుచికి తగినట్లుగా ఆ ప్రాంతం వారి కోసం వస్త్రాలు రూపొందించడంలో వీరు ఘటికులు. వీరి చేనేత కళా నైపుణ్యానికి ఇంతవరకు రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు వరించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు వస్త్రం తయారీ మొదలైందీ ఇక్కడే. ఆ గుర్తింపు కూడా గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవడానికి ఒక కారణం. ఈ గ్రామ జనాభా 4,550 ఉంటే, అందులో 3 వేల జనాభా చేనేత కళాకారులదే! ఎండలో చల్లగా, చలిలో వెచ్చగా తేలియా రుమాలు అనేది ఒక రకమైన వస్త్రం. ఇది అతి ప్రాచీన కళావిశేషం. గజం నర్సింహ అనే పుట్టపాక చేనేత కళాకారుడు ఆ ప్రాచీన తేలియా రుమాలుకు పునరుజ్జీవం పోశారు. 21 రోజుల పాటు సాగే ‘యజ్ఞం’ అది. మొదట ఆముదపు పొట్టును కాల్చి బూడిద చేస్తారు. నువ్వుల నూనెతో బూడిదను కలిపి, నూలును అందులో ఉంచుతారు. రోజంతా నీటితో కలిపిన గొర్రె పేడలో నానబెడతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నూలును ఉతికి శుభ్రపరుస్తారు. ఆరబెడతారు. మళ్లీ అందులోనే పెడతారు. ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తారు. ఆ తర్వాత వస్త్రం అవసరాన్ని బట్టి వార్పుపై అవసరమైనంత పొడవులో దారాలను తీస్తారు. మగ్గంపై కావాల్సిన తీరులో డిజైన్లతో కూడిన వస్త్రాన్ని రూపొందిస్తారు. ఇలా తేలియా రుమాలు వస్త్రంతో తలపాగాలు, చీరలు, దుపట్టాలతో పాటు ఇతర దుస్తులను తయారు చేస్తారు. ఇవి ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండడమే కాక çసువాసనలు వెదజల్లుతాయి. ఇలా తయారు చేసే చీరలైతే డిజైన్లను బట్టి ముప్పై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక చీర నేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం పుట్టపాకలో నేసే ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలకు ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం. తెల్ల దారానికి ప్రకృతి రంగులైన గుమ్మడి రంగు, తేలియా రంగు, ఇండిగో, నల్ల రంగులను ఉపయోగిస్తారు. మొదటగా తెల్ల దారాన్ని జిగురు తొలగించేందుకు గానూ ఒక రోజు నీళ్లలో నానబెట్టి నీడలో ఆరబెడతారు. వారం రోజులు అయ్యాక జిగురు తొలగిస్తారు. ఆ తర్వాత దారాన్ని శుద్ధి చేయడం కోసం కిలో దారానికి 150 కరక్కాయ పిందె పొడి, అల్లం 10 గ్రాములు కలిపి శుద్ధి చేస్తారు. ప్రకృతి రంగులు ఎలా వస్తాయి? గుమ్మడి రంగు: గుమ్మడి రంగు వేయడానికి అడవి పసుపు, తేయాకు, కత్తాకు కలిపి గుమ్మడి రంగును రూపొందిస్తారు. తేలియా రంగు : సున్నపు రాయి (కుంకుమ రాళ్లు), అడవి పసుపు, నువ్వుల నూనె, నిమ్మకాయతో కలిపి తయారు చేస్తారు. ఇండిగో రంగు : ఇండిగో కేక్, కాస్టిక్, కుంకుడు రసం, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. నల్ల రంగు : పాత ఇనుప సామాను 25 రోజులు నీటిలో నానబెట్టి తుప్పు పట్టిస్తారు. తాటిబెల్లం, ఇనుప తుప్పు, నల్ల కరక్కాయ పొడి, కుంకుడు రసం, నిమ్మ రసం కలిపి నల్లటి రంగుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన రంగులతోనే ప్రాచీన తేలియా రుమాల్ అనే వస్త్రానికి రంగులు అద్దుతారు. ఈ రంగులతోనే పుట్టపాక ప్రపంచ ఖ్యాతి సాధించింది. తొలి ççసహకార సంఘం ఓసారి ఏడుగురు చేనేత కళాకారులు కలిసి ఓ డిజైన్ రూపొందించి, చేనేత వస్త్రాలు తయారు చేశారు. ఆ సమయంలో ‘ఆప్కో’ సంస్థ చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాలను తయారు చేయిస్తూ కొనుగోలు చేస్తోంది. ఇక్కడ కార్మికులు తయారు చేసిన డిజైన్లు కొయ్యలగూడెం సహకార సంఘం ద్వారా ఆప్కోకు పంపాలనుకున్నారు. కానీ, కొయ్యలగూడెం చేనేత సహకారసంఘం సభ్యులు వస్త్రాన్ని ఆప్కోకు పంపలేదు. దీంతో మనకు కూడా ఒక సంఘం కావాలని చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పాటైన సంఘంలో నాలుగు వందల కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా వెయ్యి మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలు తయారు చేసేవారు. ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు పట్టుచీరలు, స్పన్, సిల్క్ చీరలు తయారు చేసేవారు. ఆ రోజుల్లో స్పన్ సిల్క్ చీర ధర రూ. 200 ఉండేది. ప్రస్తుతం దాని ధర రూ.10 వేలకు పైగా ఉంటుంది. అప్పట్లో గజం గోవర్థన్, గజం అంజయ్య, రాపోలు అంజయ్య, గుండు జగన్నాథం, గజం రాములు, గజం నర్సింహులు అనే వారు మాస్టర్ వీవర్స్‌గా మారి చేనేత కళాకారులకు ముడి సరుకులు ఇస్తూ, తయారు చేయించేవారు. ఆ క్రమంలోనే తేలియా రుమాల్‌ను ఆధునిక డిజైన్లతో తయారుచేయించడం మొదలు పెట్టారు. పట్టు చీరలు, మస్రే చీరలు, తలపాగా, దుపట్టా (చున్నీ)లను తయారు చేసేవారు. డబల్ ఇక్కత్ తేలియా రుమాల్ వస్త్రంతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధునిక సాంకేతికతకు కూడా అందని డిజైనింగ్ పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు సహా ఎందరో ప్రముఖులకు చేరాయి. వారి ప్రశంసలకు నోచుకున్నాయి. దాంతో పుట్టపాక చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందించడం మొదలు పెట్టారు. అవార్డుల వెల్లువ చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఆయనతో పాటు గజం గోవర్థన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం గజం గోవర్ధన్ (2011), గజం అంజయ్య (2013) లకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 2009 సంతు కబీర్ అవార్డును చేనేత దిగ్గజం గజం రాములుకు ప్రకటించగా, అప్పటికే ఆయన మృతి చెందడంతో ఆయన భార్య రాంబాయమ్మ అవార్డును అందుకున్నారు. 2010 సంవత్సరానికి సంతు కబీర్ అవార్డును గజం అంజయ్య అందుకున్నారు. ముందు ఏడాది జాతీయ చేనేత అవార్డును గజం భావనాఋషి అందుకున్నారు. 2010 జాతీయ చేనేత అవార్డును ఐదుగురు కళాకారులు గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య, ఏ.నాగరాజు, గజం యాదగిరిలు అందుకున్నారు. రాంబాయమ్మ కూడా వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. చేనేత జాతీయ అవార్డు కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి సంయుక్తంగా అందుకున్నారు. 2016 చేనేత జాతీయ అవార్డు పుట్టపాక గ్రామానికి చెందిన గజం శ్రీనివాస్‌కు రాగా, ఇదే గ్రామానికి చెందిన చెరుపల్లి భావనాఋషికి నేషనల్ మెరిట్ అవార్డు లభించింది. వీరే కాక ఈ గ్రామానికి చెందిన చాలామంది చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు. వస్తు మార్పిడి నుంచి విదేశీ ఎగుమతుల వరకు! వందేళ్ల క్రితం పుట్టపాకలో కొద్దిమంది చేనేత కళాకారులు ఉండేవారు. చేనేత వస్త్రాలను తయారు చేసి, ప్రజలకు అందజేసి, వారివద్ద నుంచి ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు, వస్తువులను తీసుకునేవారు. అప్పట్లో సాదా బట్టలు, టవల్స్, దోతులు, అంచు చీరలు అమ్మేవారు. ఏమైనా శుభకార్యాలప్పుడు వస్త్రాలు కావాలని చెబితే, నేసి ఇచ్చేవారు. రానురాను తయారు చేసిన వస్త్రా లను మూట కట్టుకొని, భుజాన వేసుకొని, పరిసర ప్రాంత గ్రామాలతో పాటు ఉమ్మడి జిల్లా చుట్టుపక్కల కూడా తిరుగుతూ అమ్మేవారు. అప్పుడు నేసిన వస్త్రాలన్నీ వస్తు మార్పిడి కిందే చేసేవారు. 1950 కి ముందు నాటికి ఇక్కడి చేనేత కళాకారుల సంఖ్య 200 లకు చేరుకుంది. వారు షావుకారుల వద్ద మగ్గాలు నేసేవారు. షావుకార్లు కళాకారులకు నూలు, రంగులు, ముడి సరుకులు ఇచ్చి తయారు చేయించేవారు. ఇలా కార్మికులు తయారు చేసిన వస్త్రాలను దేశంలోనే కాకుండా అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో గజం నర్సింహ ప్రాచీన తేలియా రుమాల్ వస్త్ర తయారీలో సిద్ధహస్తుడు. గ్రామంలో ఐదారుగురు షావుకారులు ఉండేవారు. ఇక్కడ నేసిన చేనేత వస్త్రాలకు పేరు ప్రఖ్యాతులు రావడంతో.. శ్రీకాకుళం, గుంటూరు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలకు చెందిన చేనేత కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. గజం నర్సింహ ముంబయి, సోలాపూర్ ప్రాంతాలకు మొట్టమొదటగా ఎగుమతి చేశారు. తర్వాత్తర్వాత కలకత్తా, చెన్నై, గుజరాత్, బెంగళూరులతో పాటు సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, అరబ్ దేశాలకు ఎగుమతులు జరిగాయి. నైపుణ్యానికే ఈ గుర్తింపు పుట్టపాకలోని చేనేత కళాకారులను నైపుణ్యవంతులుగా తయారు చేయడమే నా లక్ష్యం. అందుకోసమే చేనేతను అభివృద్ధి చేసి, కళాకారులను ప్రోత్సహిస్తున్నా. చేనేతకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. చేనేత కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటా. – గజం గోవర్ధన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకుందాం: బిక్షమయ్యగౌడ్
సాక్షి. యాదగిరిగుట్ట : కాంగ్రెస్ సారథ్యంలో వస్తున్న ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రజాఫ్రంట్తోనే నేరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బీర్ల అయిలయ్య, కళ్లెం కృష్ణ, కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా తుర్కపల్లి : తనను ఆశీర్వదిస్తే.. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ఆలేరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం : గొంగిడి
సాక్షి, యాదగిరిగుట్ట : ఆలేరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని, టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గొంగిడి సునీతను గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని వంగపల్లి, చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామాల్లో గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమి ఎన్ని మాయలు చేసినా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. నాలుగున్న సంవత్సరాలుగా ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గొంగిడి సునీతకే దక్కిందన్నారు. రెండు నెలలుగా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలంతా నీరాంజనాలు పలికారని, పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడానికి ఇప్పటికే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించారని, మరోసారి చట్టసభలకు ఇక్కడి ప్రజలు పంపిస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి భూములను ససశ్యామలం చేస్తారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేపాక స్వామి, ఎంఈ అజ్జు, కానుగు రాజీవ్, హబీబ్, దయ్యాల భరత్, కానుగు దశరథ ఉన్నారు. టీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని తాళ్లగూడెంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు సైదగాని సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు సాగర్, శరత్, గంధమల్ల రాములు, బాలకృష్ణ, ప్రభాకర్, కృష్ణమూర్తి, నర్సింహ, రాజు, సాయి ఉన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్‌గౌడ్, రాంపల్లి బాలరాజు, ఈదులకంటి భాస్కర్, గుజ్జ బాలరాజు తదితరులున్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం ఆత్మకూరు(ఎం) : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెర్ల, కప్రాయపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతను మరోమారు అసెంబ్లీకి మరోమారు పంపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, రెతు సమితి జిల్లా కోఆర్డినేటర్ కోరె భిక్షపతి, మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు బీసు చందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఏనుగు దయాకర్‌రెడ్డి, నాయకులు దేవరపల్లి ప్రవీన్‌రెడ్డి, కాంబోజు భాను, బండ సాయి, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సామ నరేందర్‌రెడ్డి, నిమ్మరెడ్డి నరేందర్‌రెడ్డి ఉన్నారు. కూటమిని కుప్పకూల్చాలి మోటకొండూర్ : కుట్రలతో ప్రజల ముందుకు వస్తున్న ప్రజాకూటమిని కుప్పకూల్చాలని టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంతో పాటు ఆరెగూడెం, గిరిబోయినగూడెం, మేడికుంటపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధితో ఏ పార్టీ పోటీపడలేక ప్రజాకూటమి పేరుతో ప్రజల ముందుకువస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పాటుపడిన ఘనత గొంగిడి సునీతకే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి సునీతను అధిక మెర్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ బుగ్గ పర్వతాలు, ఎగ్గిడి బాలమ్మబాలయ్య, బొట్ల యాదయ్య, బొట్ల నర్సింహ, ఏదుల్ల సురేందర్‌రెడ్డి, సీస బాలరాజుగౌడ్, గుండు పెంటయ్యగౌడ్, బొలగాని నాగమణిమోహన్గౌడ్, పైళ్ల రంగారెడ్డి, సిరబోయిన నర్సింగ్‌యాదవ్, అనంతుల జంగారెడ్డి, ఆడెపు విజయ, రామదాస్గౌడ్, ఏనుగు అంజిరెడ్డి, చంద్రారెడ్డి, మోకాళ్ల అనంతరెడ్డి, కొరటికంటి విజయ్‌కుమార్‌గౌడ్, కొండ మహేష్, మల్గ లోకేష్, హరీష్, వీరస్వామి, గంధమల్ల మధు, జివిలికపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
యాదాద్రి ఉదంతం : కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: నేరాలను అదుపులోకి తెచ్చాం, ప్రజలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే గొప్పగా పనిచేస్తోందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంటున్న బాలికల అక్రమ రవాణాపై స్పందించాలని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టలో ఇలాంటి అసాంఘిక , అమానవీయ వ్యభిచార ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి చిన్నపిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపడం క్షమించరాని నేరమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే కిడ్నాప్, అపహరణ కేసులను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,283 మంది చిన్నారులు కనిపించకుండా పోయారనీ, ఇంకా 912 చిన్నారుల ఆచూకీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమాధానమేదీ..? ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని 2017లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రైతులకు నీరివ్వకపోతే పాపం చేసినట్టేనని వ్యాఖ్యానించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మరి పంటలకు సాగునీరు లేక రోడ్డెక్కిన రైతన్నలకు కేసీఆర్ నేడు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసమే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. -
ఆశలు సమాధి చేస్తూ..
భువనగిరి క్రైం : కుమారుడిని డాక్టర్‌గా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు.. మెడిసిన్ విద్యకోసం అతన్ని రష్యాకు పంపించారు. మరో ఆరు నెలలైతే కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడనుకున్న తరుణంలో విధి వారి ఆశలను చిదిమేసింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆ యువకున్ని మృత్యువు కబళించింది. భువనగిరికి చెందిన నవీన్‌కుమార్ రష్యాలోని ఓ సరస్సులో నీట మునిగి చనిపోవడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. వారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. కాగా నవీన్ మృతదేహం మంగళవారం దేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భువనగిరిలోని ఆర్బీనగర్కు చెందిన గుజ్జ హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు కుమారులు. యాదగిరి భువనగిరి లోని చిన్నవ్యాపారం చేస్తుంటాడు. హేమలత గృహిణి. వీరి పెద్దకొడుకు నవీన్(22) పదో తరగతి వరకు భువనగిరిలోని కృష్ణవేణి హైస్కూల్లో చదివాడు. ఇంటర్ బోడుప్పల్‌లోని ఓ ప్రై వేటు కళాశాలలో.. తరువాత ఎంబీబీఎస్ చేసేందుకు 2013లో రష్యా దేశంలోని ఓరెన్‌బర్గ్ సీటీలోని ఓరెన్‌బర్గ్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. తన తండ్రి కష్టం విలువ తెలిసిన నవీన్ వారి ఆశలను బతికిస్తూ చదువులో మంచి ప్రతిభను కనబరిచేవాడు. తన స్నేహితుల్లో ఎవరికైనా ఆపద వస్తే తనే ముందుండే వాడని, అందరి కష్టాలను పంచుకుని ధైర్యం చెప్పేవాడని తోటి స్నేహితులు చెబుతున్నారు. మరో ఆరునెలల్లో కోర్సు పూర్తి నవీన్ ఎంబీబీఎస్ కోర్సు మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. ఈ క్రమంలో తనకు ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలలపాటు కళాశాల సెలవు ప్రకటించింది. ఈ సెలవుల్లో విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకుని స్నేహితులంతా కలిసి వారు ఉంటున్న నగరానికి 1,757 కీమీ దూరంలో ఉన్న స్ట్రావోపూల్ నగరంలోని కోమ్సోమోలీస్కిపూల్ అనే సరస్సుకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ మంచు పడే అవకాశాలు తక్కువగా ఉండడంతో అంతా కలిసి వెళ్లారు. అప్పటికే వారు విహారయాత్రకు వెళ్లి వారం రోజులు అవుతుంది. శుక్రవారం ఏడో రోజులో భాగంగా ఆ సరస్సు దగ్గరికి వెళ్లారు. సాయంత్రం సమయంలో నలు గురు మిత్రులు కలిసి అక్కడికి వెళ్లారు. నవీన్‌తో ఉన్న మరో మిత్రుడికి ఈత రాకపోవడంతో నవీన్ ఆ మిత్రుడికి తోడుగా అక్కడే కూర్చున్నాడు. మిగతా ఇద్దరు మిత్రులు నీటిలో దిగి ఈత కొడుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో పాటు నీరు బాగా చలిగా ఉంది. దీంతో నీటిలో ఉన్న మిగతా ఇద్దరు స్నేహితులు నీటిలో నుంచి బయటికి వచ్చారు. కానీ వీరు బయటికి వస్తున్న క్రమంలోనే నవీన్ నీటిలో ఈత కొట్టడానికి దూకాడు. మిగతా స్నేహితులు నవీన్‌ను గమనించలేదు. నవీన్ ఈత కొడుతుండగా నీటి ప్రవాహం ఒకేసారిగా పెరిగి నీరు పూర్తిగా చల్లగా అవడంతో నవీన్ ఉక్కిరిబిక్కిరై బిగుసుకుపోయి నీటిలో ఈదలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన మహిళ అక్కడే ఉన్న స్నేహితులకు చెప్పడంతో వారు వెంటనే నీటిలోకి దూకి వెతికారు. కానీ నవీన్ ఆచూకీ లభించలేదు. వారు వెంటనే బయటికి వచ్చి సరస్సు గార్డ్స్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గార్డ్స్ స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటల సుధీర్ఘ గాలింపు తరువాత నవీన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన నవీన్ తోటి మిత్రులు అక్కడే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటిదాక తమతో నవ్వుకుంటూ కబుర్లు చెప్పి న స్నేహితుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాధతో వెంటనే ఈ విషయాన్ని నవీన్ తల్లిదండ్రులకు ఎలా తెలియజేయాలో అర్థం కాక సతమతుమవుతూనే నవీన్ తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశారు. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు విషయం తెలుసుకున్న నవీన్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ది గ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అయోమయం చెందారు. చేతికి వచ్చిన కొడుకు ఇక లేడు అనే విషయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డాక్టర్‌గా చూడలనుకున్నా కొడుకును విగతజీవిగా చూడాల్సివస్తుందే..అని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. నవీన్ మృతదేహం మంగళవారం నాటికి మన దేశానికి వస్తుందని నవీన్ కుటుంబ సభ్యులు తెలిపారు. తనతో ఉన్న స్నేహితులు మృతదేహాన్ని అక్కడి దేశ నిబంధనల ప్రకారం తీసుకొస్తున్నారని చెప్పారు. -
తండ్రిని చంపిన కొడుకు
-
యాదాద్రి జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
మృతి కేసు మాఫీకి రూ.2.5 లక్షలు!
రేపల్లె: ఓ బ్యూటీపార్లర్‌లో చనిపోయిన యువతి మృతి కేసు మాఫీ కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆమె మృతదేహం వద్దే వేలంపాట నిర్వహించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెలోని డూ అండ్ డై బ్యూటీపార్లర్‌లో తెలంగాణలోని యాదాద్రి జిల్లా రెడ్లరేపాలెంకు చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని సిరి తల్లిదండ్రులు చెబుతున్నా.. వారిని బెదిరిస్తూ.. కేసును మాఫీ చేసేందుకు వేలంపాట నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉంటున్న సిరి బుధవారమే ఈ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేరింది. ఉరిపోసుకున్నట్లు చెబుతున్నా.. ఆమె గదిలోని దుస్తులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. బ్యూటీపార్లర్‌లో జరుగుతున్న ‘వ్యవహారాలకు’ ఒప్పుకోకపోవడం లేదా బయటకు చెబుతానని బెదిరించడం వల్లే ఆమెను నిర్వాహకులే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువకుడు మృతిచెందటంతో మనస్తాపానికి గురై.. యువతి ఉరి వేసుకుని మృతిచెందిందంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులు కొత్త కథనం తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా... బ్యూటీ పార్లర్ అసలు నిర్వాహకురాలి జాడలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేత సమక్షంలో.. కేసు మాఫీ కోసం బ్యూటీపార్లర్ నిర్వాహకుల స్థానంలో అంతా తానై ఓ కాంగ్రెస్ పార్టీ నేత రాజీ ప్రయత్నాలు చేశారు. సిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ విలపిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఉర్మిళ, యాదయ్యలను, బంధువులను బెదిరిస్తూ.. మృతదేహం ఉన్న గదిలోనే ఆమె మృతి కేసు మాఫీకి పాట నిర్వహించారు. నిర్వాహకుల తరఫున రూ.2.50 లక్షలకు మధ్యవర్తిత్వం చేశారు. అనంతరం సిరి తల్లిదండ్రులు, బంధువులను బయటకు పంపించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి ఒకరు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి కేసు మాఫీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత తంతు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలి తండ్రి 2001లో పట్టణంలో జరిగిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. హత్య కేసు అనంతరం వడ్రంగి పనిచేసే వ్యక్తి చిన్నచిన్నగా కలప వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. బ్యూటీపార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని, రాత్రి సమయాల్లోనూ పురుషుల రాకపోకలు అధికంగా ఉంటాయని చుట్టుపక్కలవారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
నకిలీ పాస్ పుస్తకాలు ఇస్తే పీడీయాక్ట్
సాక్షి, యాదాద్రి : నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం హన్మాపురంలో జరిగిన రైతుబంధు పథకం సభలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రైతు కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాపరిపాలన అంతా అంధేరి పాలనగా సాగిందన్నారు. మన ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లు కేటాయించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు చెక్కులు ఇస్తున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ సిబ్బంది 95 శాతం పూర్తి చేశారని అభినందించారు.100శాతం భూ వివాదాలు లేకుండా రికార్డుల ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితి వేదికలకు రూ. 300ల కోట్లు కేటాయించామన్నారు. రూ.12 లక్షలతో ఒక మోడల్ రైతు వేదిక నిర్మిస్తామన్నారు. తెలంగాణ దేశంలోనే మోడల్రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రైతు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను తీరుస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించబోతున్నామన్నారు. ఇంతవరకు పాలించిన ప్రధానులు, ముఖ్యమంత్రులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షల అప్పులు రైతులకు మిగిల్చారని ఆరోపించారు. హన్మాపురం గ్రామంలో 555 రైతులకు రూ. 45.18.085 లక్షలను రైతు బంధు ద్వారా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి దశదిశను చూపించే రైతుబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. 58 లక్షల మంది రైతులకు మొదటి విడతలో రూ.5,700ల కోట్లు, రెండవ విడతలో నవంబర్ 18న రూ. 5,700ల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుల బీమాకోసం రూ. 500ల కోట్లు సీఎం కేటాయించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రైతు బంధు చెక్కులు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. తనకు వచ్చే రైతు బంధు చెక్కుల మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్ర అధికారి వాకాటి కరుణ, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యువతిపై అత్యాచార యత్నం
-
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో మెరుగైన సౌకర్యాలు కల్పిండానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. సురక్షిత ప్రయాణం ఆర్టీసీలోనేనని పతి ఒక్క ప్రయాణికుడికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్లకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో జరిగే జనరల్ బాడీ సమావేశానికి డిపో మేనేజర్లు వెళ్లాలని ఆదేశించారు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌రూ.1000కోట్ల బడ్జెట్ ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్‌తో గతేడాది రూ.66కోట్లతో 1400బస్సులు, ఈ సారి రూ.75కోట్ల బడ్జెట్లో 1100బస్సులు కొత్తవి నడుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 230 మినీ బస్సులు తిప్పుతున్నామని, ఇందులో వందకు పైగా ఎసీ బస్సులున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా 8బస్సులు ఇచ్చినట్లు తెలిపారు. 97 డిపోల్లో 27వరకు లాభాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న 49 డిపోలను సగానికి పైగా లాభాలకు తీసుకువచ్చామని, పూర్తిగా నష్టాల్లో ఉన్న డిపోలను కూడా లాభాల బాటలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. బస్సు, డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉన్న నిరుపేదలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..ఆ జిల్లాలో బస్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు సేవలు అందించే పల్లె వెలుగు బస్సులు భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు 34కొత్త బస్సులు కావాలని అడిగారు. యాదాద్రి నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు వెళ్లడం సంతోషకరమన్నారు. యాదగిరిగుట్టకు మినీ బస్సులు వేయాలని మంత్రిని ఆమె కోరారు. సమావేశంలో రిజినల్ కో ఆర్డినేటర్ సువర్ణరెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కాలే సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఆర్టీసీ ఓఎస్డీ కృష్ణకాంత్, నల్లగొండ, సూర్యాపేట డీవీఎంలు మధుసూదన్, ఎంఆర్‌సీరెడ్డి, డిపో మేనేజర్ రఘు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. -
బాణసంచా.. తేనెతుట్టెను కదిపింది!
సాక్షి, మోత్కూరు: అంతిమ యాత్రలో కాల్చిన బాణసంచా వారికి ప్రాణసంకతమైంది. అంతిమయాత్ర నిర్వహించే సమయంలో తేనెటీగలు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆయన అంత్యక్రియల్లో భాగంగా బంధువులు, గ్రామస్తులు బాణసంచా కాల్చారు. బాణసంచా అక్కడి వేపచెట్టు పై ఉన్న తేనె తుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కుమ్మడిగా దాడి చేయడంతో సుమారు 40మంది గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
నిర్ణయమే తరువాయి..
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన మధిర గ్రామాల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం తీరొక్క రకంగా వివరాలు సేకరించారు. జిల్లాలోని 14 పూర్వ మండలాలతో పాటు జనగామ జిల్లాలోని గుండాల మండలం నుంచి 95 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు రూపొందించిన జాబితా ప్రకారం ఇవి పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగి ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 115 గ్రామాల నుంచి నూతన పంచాయతీల కోసం ప్రజ ల నుంచి లిఖిత పూర్వక దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 784 మధిర గ్రామాలు ఉన్నాయి. వీటిలో 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు 371 ఉండగా, 500 కంటే తక్కువ జనాభా కలిగినవి 413 ఉన్నాయి. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారుల లెక్కల్లో 81 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగినట్టు నిర్ధారించి నివేదికను పంపారు. అధికారులు సేకరించిన వివరాలు ఏ ప్రాతిపదికనంటే.. 500మంది కంటే ఎక్కువ, రెండు కిలో మీటర్లకు పైన దూరం ఉన్న మధిర గ్రామాలు 18 600 మంది కంటే ఎక్కువ జనాభా రెండు కిలోమీటర్ల పైన గ్రామాలు 8 750 మందికి మించి రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్న గ్రామాలు 8 1.000 కంటే ఎక్కువ జనాభా, రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్నవి 4 మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం, 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 68 నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500 లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 22 ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 37 కొత్త పంచాయతీలపై ఆశలు.. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొత్త గ్రామ పం చాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు అర్హత కలిగిన మదిర గ్రామాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రిజన తండాలు, మధిర గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రకటించడంతో అర్హత కలిగిన గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా నూతన పంచాయతీలు ఏర్పాటు చేసి కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఆయా గ్రామల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పట్టపగలే దుండగలు ఓ ఇంట్లోకి చొరబడి చోరికి యత్నించారు. దీన్ని అడ్డుకున్న అశ్విని(16)కి గుళికలు తాగించి సొమ్ముతో పరారయ్యారు. ఆబాలికను కుటుంబసభ్యులు మైరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలమాకులు మల్లయ్య, పద్మ దంపతులకు కుమార్తె అశ్వినితోపాటు కుమారుడు కిరణ్ ఉన్నారు. అశ్విని స్థానిక జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా తమ్ముడు మిత్రులతో ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నసమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా, సూట్‌కేస్‌ను పగులగొట్టి చోరికి యత్నిస్తుండగా అశ్విని ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహం చెందిన వారు హత్యకు పన్నాగం పన్నారు. వరి పొలంలో చల్లేందుకు తీసుకువచ్చిన గుళికల మందు ప్యాకెట్‌ను ఇంట్లో గుర్తించారు. వెంటనే నీటిలో కలిపి బాలికకు తాగించారు. ఆ తర్వాత ఇంటి ముందు, వెనుక తలుపులకు బయటనుంచి గొళ్లెం వేసి వెళ్లిపోయారు. చాలా సేపటి నుంచి బాలిక కనిపించకపోవడంతో.. స్థానికులు ఇంటికి వచ్చి గమనించారు. లోపలి నుంచి అరుపులు వస్తుండడంతో గొల్లెం తీసి లోనికి వెళ్లగా కిందపడి కొట్టకుంటూ కన్పించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా ఇంటికి వచ్చిన వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చౌటుప్పల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ ఘతుకానికి పాల్పడింది తెలిసిన వ్యక్తులేనని అశ్విని తల్లి పద్మ వాపోయింది. పొలానికి తెచ్చిన గుళికలు తమ బిడ్డ ప్రాణాలను బలిగొన్నాయా.. ఆమె రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అశ్విని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దొంగలు గుళికలు ఎందుకు తాగించారన్న వాదనలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బతుకు జట్కా బండి
సీఎం కేసీఆర్ సారు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఒక్కసారి మా టాంగా ఎక్కాలె.. మా కష్టాలు చెప్పుకుంటాం. గుట్టను బాగా అభివృద్ధి చేస్తున్న సీఎం.. మా టాంగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని మాకు బతుకుదెరువు చూపాలె. – యాదగిరిగుట్ట టాంగా కార్మికులు అభివృద్ధి మాట ఎలా ఉన్నా రయ్యిరయ్యిమని తిరిగే బస్సులు, ఆటోల వల్ల మా ఉపాధి దెబ్బతిన్నది. యాదాద్రికి వచ్చే భక్తులు సరదాకైనా మా టాంగాలో ప్రయాణిస్తే మా కుటుంబాలు పస్తులుండే బాధ తప్పుతుంది. – టాంగా కార్మికులు యాదాద్రి నుంచి యంబ నర్సింహులు : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యంలేని రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న టాంగాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వృత్తినే నమ్ముకున్న టాంగా కార్మికులు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నారు. టాంగాలో ఎక్కి ఒక్కసారైనా ప్రయాణం చేయాలని ఆశపడే కొందరు భక్తుల వల్ల కొద్దోగొప్పో ఉపాధి పొందుతున్నారు. గుట్టకు పెరుగుతున్న భక్తుల రద్దీతో గిరాకీ పెరుగుతుందని భావించిన టాంగా కార్మికుల ఆశలు అడియాసలవుతున్నాయి. తరతరాలుగా టాంగాలనే నమ్ముకున్న వీరు మరో పనిచేయలేక కుటుంబాలను పోషించుకోవడానికి జవసత్వాలను కూడదీసుకుని బతుకు బండి లాగుతున్నారు. విశాలమైన రోడ్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు టాంగాల వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటితరం ఇబ్బందులు.. తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సుమారు 60 సంవత్సరాలు టాంగాలే ప్రధాన రవాణా సౌకర్యం. యాదగిరిగుట్టలో ఆర్టీసీ డిపోలేని రోజుల్లో.. హైదరాబాద్, వరంగల్ మధ్య గల రాయగిరి రైల్వే స్టేషన్లో దిగే వందలాది మంది భక్తులు స్వామి వారిని చేరుకోవాలంటే టాంగాలనే ఆశ్రయించే వారు. యాదగిరిగుట్ట బస్ డిపో ఏర్పాటు తర్వాత కూడా ప్రయాణికులు టాంగాల్లోనే ప్రయాణం చేశారు. రాయగిరి, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, యాదగిరిగుట్ట, సైదాపురం, మల్లాపురం.. ఇలా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 100 మంది టాంగాలను నడిపే చాలా కుటుంబాల్లో రెండో తరమూ టాంగాలపైనే ఆధారపడింది. మా కష్టాలు తీరాలంటే సీఎం సారు మా టాంగా ఎక్కాలి. ఏళ్ల నుంచి టాంగాలు నడుపుకుంటున్నా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. టాంగాలు, గుర్రాలు కొనుక్కోవడానికి బాకీలు ఇస్తే బాగుండు. సీఎం కేసీఆర్ సారు మా టాంగా ఎక్కితే మా కష్టాలు చెప్పుకుందుము. – అంజయ్య, టాంగాల యూనియన్ అధ్యక్షుడు చారాణా కిరాయి నుంచి టాంగా.. నా వయసు 65 ఏళ్లు. యాబై ఏళ్లుగా టాంగా కొడుతున్నా. రాయగిరి స్టేషన్ నుంచి గుట్ట వరకు మా నాయిన టాంగా కొట్టేవాడు. గుర్రాల్ని మేపుకుంట ఆడుకుంటున్న సమయంలో మా నాయనకు చేతకాకుండా అయింది. నేను 15 ఏళ్ల వయసులో టాంగా ఎక్కిన. అప్పట్ల టాంగా లో ప్రయాణిస్తే 25 పైసలు. రోజుకు రూ.10 నుంచి రూ.12 సంపాదించే వాడిని. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని బతికించుకున్నా. ఇప్పుడు చానా కష్టమైతున్నది. – దూడల కృష్ణ, గుండ్లపల్లి -
ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం స్టేజి వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం హైదరబాద్ నుంచి సూర్యపేటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్లా పడింది. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. కొందరికి స్వల్పగాయలు కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం
-
పెళ్లికొడుకు మిస్సింగ్
-
యాదాద్రి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం
-
ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు
-
ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు
భువనగిరి: అమెరికా కాలిఫోర్నియాలో ఈ నెల 4న మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్‌రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ఉద్రిక్తతల మధ్య సాగాయి. మంగళవారం తెల్లవారుజామున భువనగిరిలోని నివాసా నికి మధుకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అదే సమయంలో మృతుడి భార్య స్వాతి ఆమె కుటుంబ సభ్యులతో అక్క డికి వచ్చారు. మృతుడి బంధువులు స్వాతిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. మీ కారణంగానే మధుకర్‌రెడ్డి చని పోయాడంటూ అతడి బంధువులు స్వాతి, ఆమె తండ్రి నర్సింహారెడ్డిపై దాడికి పాల్పడ్డా రు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్తను హత్య చేయించానని అత్తింటి వారు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తన భర్తకు మొదటి నుంచీ మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. భర్త ఆస్తి తనకు ఇవ్వాల్సి వస్తుందనే తమపై దాడి చేశారన్నారు. తన కుమారుడికి చావుకు కోడలు స్వాతే కారణమని మధుకర్ తండ్రి బాల్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం మధుకర్ మృతదేహానికి యాదగిరిగుట్ట రాళ్లజనగాంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
-
గ్యాస్ సిలిండర్ పేలుడు : ముగ్గురికి గాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బీబీనగర్ మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఎస్సై సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన పెద్దపాటి లచ్చిరెడ్డి ఇంట్లో వంట చేస్తుండగా శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో లచ్చిరెడ్డి, అతని భార్య రాజమ్మకు తీవ్రగాయాలు కాగా.. లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద శబ్ధం రావడాన్ని గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. పేలుడు ధాటికి ఇళ్లు పాక్షికంగా దెబ్బతింది. -
భర్తను జీవచ్ఛవంలా చూడలేక..
ఆ దంపతులది.. రెక్కాడితే డొక్కాడని కుటుంబం..ఫుట్‌పాత్‌పై దుస్తులు విక్రయించుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు..ఒక్కగానొక్క కూతురుతో ఉన్నంతలో హాయిగానే జీవనం సాగిస్తున్నారు..పచ్చని ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది..ఉన్నట్టుండి ఇంటిపెద్ద స్పృహతప్పి పడిపోయాడు..తలకు గాయమై కాళ్లు చేతులు చచ్చుబడి పోయాయి. పేద కుటుంబంపై మోయలేని భారం.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు.. భర్త జీవచ్ఛవంలా మారడాన్ని చూసి ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. ఆదరించేవారు లేక.. భర్తను అలా చూడలేక.. చావే శరణ్యమనుకుని ఏడాది కూతురుతో సహా అగ్నికి ఆహుతై పోయింది. ఈ విషాదకర ఘటన మోటకొండూరు మండలం నాంచారిపేటలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం), మోటకొండూరు:యాదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన బచ్చె నవీన్‌కు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(24)తో ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వివాహనంతరం హైదరాబాద్‌లోని నాచారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పుట్ పాత్ల వద్ద రెడిమేడ్ దుస్తులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 18నెలల ఒక పాప మాధురి కలదు. నెల రోజుల క్రితం నవీన్ స్పృహతప్పి పడి పోయాడు. కాళ్లు చెతులు కూడా పడిపోయాయి. తొలుత కూతురుపై పోసి.. ఆపై తానూ.. సమస్యలన్నీ చుట్టుముట్టడంతో నవ్య తట్టుకోలేక పోయింది. కూతురికి పట్టెడన్నం పెట్టలేని దుస్థితి.. భర్తకు చికిత్స చేయించలేక మదనపడిపోయింది. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుని తెల్లవారుజామున కూతురుతోటి బాత్రూములోకి వెళ్లింది. తొలుత మాధురిపై కిరోసిన్ పోసి.. ఆపై తానూ పోసుకుని నిప్పంటించుకుంది. మౌన వేదన.. కాసేపటికే మంటలకు తాళలేక భార్య, కుమార్తె కేకలు వినిపిస్తున్నా..అక్కడే ఉండి కాపాడలేని స్థితిలో ఉన్న నవీన్ వేదన కలచివేసింది. వారి కేకలను విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి బాత్ రూము తలుపులు పగులగొట్టేసరికి నవ్య అప్పటికే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న మాధురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ ఎస్.మోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ రఘువీరారెడ్డి, మోటకొండూరు ఎస్ఐ రాజు, ఆర్ఐ సుగుణ, వీఆర్వో పరమేషం సందర్శించారు. శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికూతురు ఒకే సారి బలవన్మరణానికి పాల్పడటంతో పలువురు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారి సహా తల్లి బలవన్మరణం
మోటకొండూరు: భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(21)కు నాలుగేళ్ల క్రితం నాంచారిపేటకు చెందిన గచ్చ నరేష్‌తో వివాహమైంది. వారికి ఒక కుమార్తె మాధురి ఉంది. గత కొంతకాలంగా నరేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు . దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ్య గురువారం రాత్రి బాత్రూంలో కుమార్తెతో పాటు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దర్జాగా కబ్జా..!
రాఘవాపురంలో 24 ఎకరాలు భూమి ఆక్రమణ సీఎం కేసీఆర్‌కు బాధితుడి ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు.. 15 మంది అరెస్ట్.. ఆరుగురు పరారీలో.. సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. అధికారులు, రాజకీయ నాయకులు రికార్డులను తారుమారు చేసి ఎన్ఆర్ఐకి చెం దిన 24ఎకరాల భూమిని కబ్జా చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రాజకీయ నేతలు, అధికారులు కలిసి అక్రమిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో జరిగిన భూ అక్రమణ దందాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్‌లో భూ దాన్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిని శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. తాజాగా బీబీనగర్ మండలం రాఘవాపురంలో సుమారు రూ.10 కోట్లు వి లువచేసే 24ఎకరాల భూమి(ఎకరం రూ.35 లక్షలు) స్థా నిక ఎంపీపీ భర్త టీఆర్ఎస్ నేత గోలి పింగల్‌రెడ్డి, మరో 22మంది కలిసి అక్రమంచిన ఘటన వెలుగుచూసింది. ఏం జరిగిందంటే..: బీబీనగర్ మండలం రాఘవాపురం లో హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వర్రావు మరో 11మందికి సంబంధించి న సర్వే నెంబర్ 567లోని 12ఎకరాల 22 గుంటలు, 569 లోని 9ఎకరాల 19గుంటలు, 583లోని 2ఎకరాలు మొ త్తం 24ఎకరాల ఒక గుంట భూమిని 1992లో ఎన్ఆర్ఐ దీపక్‌కాంత్‌వ్యాస్ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అలా గే తన భార్య శ్వేతవ్యాస్ పేరుమీద 586 సర్వే నెంబర్లోని 2ఎకరాల 6 గుంటలు, తన సోదరుడు విమల్కాంత్ వ్యా స్ పేరుపై 583సర్వేనెంబర్‌లోని 2ఎకరాల భూమి కొన్నా డు. 586, 583 సర్వే నెంబర్ల భూములు జస్తీ పార్వతీదేవి నుంచి కొనుగోలు చేసి పాస్‌బుక్‌లు, టైటిల్ డీడీలు పొందాడు. అనంతరం దీపక్ యూఎస్ఏ వెళ్లిపోయాడు. నకిలీ పాస్‌బుక్‌లు, స్టాంప్‌లతో.. దీపక్‌కాంత్‌కు చెందిన రెండు గుంటలు తక్కువ 24 ఎకరాలను బీబీనగర్‌కు చెందిన కొమ్మిడి వంశీకృష్ణారెడ్డి, భట్టగూడెంకు చెందిన వ్యక్తి జొన్నవాడ మహిపాల్‌రెడ్డి కబ్జా చే శాడు. 2007నుంచి ఈసర్వే నెంబర్లలోని భూములు రెవె న్యూ రికార్డుల్లో పట్టాదారులుగా దీపక్‌కాంత్ వ్యాస్ ఉండ గా కబ్జాలో మాత్రం వంశీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పేర్లు వస్తున్నారుు. మరో దీపక్‌కాంత్‌ను సృష్టించారు కబ్జాదారులు భూ యజమానికి దీపక్‌కాంత్‌వ్యాస్‌కు బదులుగా కొత్త దీపక్‌కాంత్‌ను సృష్టించారు. అధికారులను మచ్చిక చేసుకుని రెవెన్యూ రికార్డుల్లోని దీపక్‌కాంత్ ఆధార్‌కార్డును తీసుకొని నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాస్‌బుక్ తయారు చేశారు. ఈ పాస్‌బుక్‌లో దీపక్‌కాంత్‌కు బదులుగా గుర్తుతెలియని వ్యక్తి ఫొటో పెట్టి నకిలీపాస్బుక్లు పొందారు. మే 18, 2016న దీపక్‌కాంత్ హైదరాబాద్‌లో ని గడ్డి అన్నారంకు చెందిన బండారు జితేందర్‌కుమార్, హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన జిల్లాల రవీం దర్‌రెడ్డి, మలిపెద్ది అరవింద్‌రెడ్డికి జీపీఏ చేసినట్లు రి కార్డులు సృష్టించి సేల్‌డీడీ కోసం బీబీనగర్ తహాసీల్దార్ కార్యాలయంలో ఆర్జీ చేశారు. కాగా రెవెన్యూ రికార్డుల్లో పట్టదారు, కబ్జదారుల పేర్లు వేర్వేరుగా వస్తుండడంతో తహసీల్దార్ సెల్ డీడీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఇది అక్కడికే ఆగిపోయింది. ఆతర్వాత దీపక్‌కాంత్‌వ్యాస్‌కు సం బంధించిన మ ద్యవర్తికి భూమి కబ్జా అరుున విషయం తెలిసింది. మధ్య వర్తిని మచ్చిక చేసుకోవడాదనికి కబ్జాదారులు రూ.50లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. 24ఎకరాల భూమి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు పలుకుతుండడంతో మధ్యవర్తి అక్రమార్కులకు సహకరించలేదు. భూమి కబ్జా అయిన విషయాన్ని దీపక్‌కాంత్ వ్యాస్‌కు మధ్యవర్తి సమాచారం చేరవేశాడు. కాగా దీపక్‌కాంత్ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పోయాయి.దీపక్ కాంత్ తన భూమికబ్జా జరిగిన విషయం, పట్టాదారు పాస్‌పుస్తకా లు పోయిన విషయాన్ని సెప్టెంబర్‌లో ముఖ్య్యమంత్రి కే సీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన సీఎం విచారణ జరపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూచించారు. ఈ మేరకు డిప్యూటీ సీ ఎం అక్టోబర్ 13న బీబీనగర్ తహసీల్దార్ అశోక్‌రెడ్డిని త న కార్యాలయానికి పిలిపించి జరిగిన విషయాన్ని తెలుసుకుని కబ్జాదారులకు నోటీస్‌లు ఇవ్వాలని ఆదేశించారు. నిజమైన భూమి యజమాని దీపక్ కాంత్ వ్యాస్‌కు పట్టాదారు, టైటిల్ డీడ్ డూప్లికేట్ ఇవ్వాలని ఆదేశించారు.అరుుతే సేల్ డీడ్ కోసం ఈ సంవత్సరం మే 18న దరఖాస్తు చేసుకున్న కబ్జాదారులైన వంశీకృష్ణారెడ్డి, మహిపాల్‌రెడ్డికి నవంబర్ 17న తహసీల్దార్ నోటీస్‌లు ఇచ్చారు. వీరిలో మహిపాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందాడు. అయితే వెంటనే ఆ భూమితో మాకెలాంటి సంబంధంలేదని కబ్జాదారులు బీబీనగర్ తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చా రు. తహసీల్దార్ విచారణ అనంతరం జరిగిన తప్పును గుర్తించి దీపక్‌కాంత్ వ్యాస్‌కు డూప్లికేట్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు ఇచ్చారు. కబ్జా విషయాన్ని దీపక్‌కాంత్ రాచకొండ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ క మిషనర్ ఇన్సపెక్టర్ నవీన్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. దీంతో భూకబ్జాతోపాటుఅందులో ఉన్న వారందరిపై కేసు నమోదు చేశారు. వెంచర్‌చేసి అమ్మకానికి పెట్టారు బీబీనగర్ చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోలిపింగల్రెడ్డి, పంజాల పెంటయ్య, కొమ్మిడి మల్లారెడ్డి, బిజిలియాదగిరి, బుయ్యసాంబయ్య, కొర్ని మహేష్, బానోతు లక్ష్మణ్‌లతోపాటు మొత్తం 21 మంది కలిసి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని వెంచర్ ప్రారంభించారు. అమ్మకానికి పెట్టిన సమయంలో విషయం బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్..! బీబీనగర్ తహసీల్దార్‌కార్యాలయం, భువనగిరి ఆర్డీవో కార్యాలయం రబ్బర్ స్టాంప్‌లను తయారు చేశారు. భూ యజమానికి సంబంధించిన నకిలీ ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌లను శంకర్ అనే వ్యక్తి ఫోటో పెట్టి తయారు చేశారు. బీబీనగర్‌లో సబ్‌రిజిస్టార్ కార్యాలయం ఉన్నా గుట్టు చ ప్పుడు కాకుండా పనికానిచ్చేందుకు చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఎంచుకున్నారు. అక్కడి అధికారులు సిబ్బం ది, డాక్యుమెంట్ రైటర్ సహకారంతో పని పూర్తి చేశారు. 15 మంది అరెస్ట్ : భూ ఆక్రమణలో ప్రేమయం ఉన్న 21 మందిలో శనివారం పోలీసులు 15 మంది అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఆరుగురు ప రారీలో ఉన్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
మళ్లీ తెరపైకి వచ్చిన నయీం గ్యాంగ్
-
యాదాద్రి సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఫోన్: 9849906059 భువనగిరి జోన్ డీసీపీ పి.యాదగిరి ఫోన్: 9490616421 ఇతర ముఖ్య అధికారులు జేసీ: గుగులోతు రవి డ్వామా పీడీ: దామోదర్‌రెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి: దివ్య డీపీవో: శ్రీనివాస్‌రెడ్డి డీఎస్వో: సంధ్యారాణి సివిల్ సప్లై డీఎం: సత్యనారాయణ మండలాలు 16: (భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, ఆత్మకూర్(కొత్తది), ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు(కొత్తది), తుర్కపల్లి, బొమ్మలరామారం, మోత్కూరు, అడ్డగూడూరు(కొత్తది) రెవెన్యూ డివిజన్లు 2: (భువనగిరి, చౌటుప్పల్) మున్సిపాలిటీలు 1: (భువనగిరి) గ్రామ పంచాయతీలు: 304 ఎమ్మెల్యేలు: ఫైళ్ల శేఖర్‌రెడ్డి(భువనగిరి), గొంగిడి సునీత(ఆలేరు), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(మునుగోడు), వేముల వీరేశం(న కిరేకల్), గాదరి కిషోర్(తుంగతుర్తి) ఎంపీ: బూర నర్సయ్యగౌడ్ ప్రధాన పరిశ్రమలు: ఇనుము, ఎక్స్పో్లజివ్స్, కెమికల్, ఆటోమెుబైల్స్, ప్లాస్టిక్, క్రషర్, శానిటరీ, బాంబినో, గ్లాస్ ఇండస్ట్రీస్, పోచంపల్లి పట్టు చీరల తయారీ పర్యాటకం, ఆలయాలు: యాదాద్రి ఆలయం, కొలనుపాక జైనదేవాలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి, సుంకిశాల వెంకటేశ్వర దేవాలయం, భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయం, భువనగిరి ఖిలా, కొలనుపాక పురావస్తు శాఖ మ్యూజియం, పోచంపల్లి గ్రామీణ పర్యాటక కేంద్రం, చౌటుప్పల్ మండలం ఆందోళ్‌మైసమ్మ జాతీయ రహదారులు 2: (బీబీనగర్ మండలం కేపాల్–ఆలేరు మండలం టంగుటూరు వరకు ఎన్‌హెచ్ 163, చౌటుప్పల్ మండలంలో ఎన్‌హెచ్ 67) రైల్వే లైన్లు: బీబీనగర్, ఆలేరు మీదుగా ఖాజీపేట వరకు, బీబీనగర్, వలిగొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు హైదరాబాద్ నుంచి దూరం: 50 కి.మీ. ఖనిజ సంపద: ఇసుక, ఎర్రమట్టి, రాతిగుట్టలు -
ఇవిగో.. ‘యాదాద్రి’ భవనాలు!
► 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అవసరం ► నాలుగైదు చోట్ల ప్రభుత్వ స్థలాల గుర్తింపు ► అన్ని వివరాలతో 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక భువనగిరి కేంద్రంగా నూతనంగా ఏర్పాటయ్యే యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనాలు, స్థల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేశారు. - భువనగిరి భువనగిరి : భువనగిరి కేంద్రంగా నూతనంగా ఏర్పాటవుతున్న యాదాద్రి జిల్లాకు ఇప్పటికిప్పుడు అవసరమైన కార్యాలయాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నూతన జిల్లాలు దసరా నుంచి ఏర్పాటుకానున్న నేపథ్యంలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పక్కాభవనాల వివరాలను అధికారులు గుర్తించారు. సుమారు 60 నుంచి 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను, 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించి సీఎంకు సమర్పించడానికి నివేదికను సిద్ధం చేశారు. అన్ని కార్యాలయాల ఏర్పాటుకు లక్ష అడుగుల భవనాలు అవసరం ఉన్నా సర్దుబాటు చేసే విధంగా అధికారులు భవనాలను గుర్తించారు. సోమవారం నాడు సీఎం కేసీఆర్‌తో జిల్లా కలెక్టర్ సమావేశం ఉన్నందున ఈ మేరకు సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధంచేసి ఉంచారు. ఇప్పటికిప్పుడు జిల్లా ఏర్పాటు జరిగినా.. ఇప్పటికిప్పుడు జిల్లా కేంద్రమైతే అవసరమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అసరమైన భవనాలను అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ భవానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో సీఈఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం ఇలా పలు శాఖల భవనాల్లో ఆయా శాఖల జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇండోర్ స్టేడియంలో మూడు వేల అడుగులు, టీటీడీ కల్యాణమంటపంలో 4వేల చదరపు అడుగులు, పాత సీసీ బ్యాంకు అవరణలో2500 చదరపు అడుగులు, మీనానగర్ గ్రంథాలయంలో 1800 చదరపు అడుగులు, సింగన్నగూడెం ప్రభుత్వ కమ్యునిటీహాల్‌లో 1000 చదరపు అడుగులు, మీసేవ భవనం మొదటి అంతస్తులో 1500 చదరపు అడుగులు, ఆర్‌ఆండ్‌బీ ఈఈ క్యాంపు కార్యాలయంలో 1000 చదరపు అడుగులు, సమ్మద్ చౌరస్తా, అర్బన్‌కాలనీ, సంజీవనగర్, హౌసింగ్బోర్డులలోని కమ్యూనిటీ హాల్లు, అనంతారంలోన డ్యామా కార్యాలయాల్లో 40 వేల చదరపు అడుగుల స్థలా న్ని అధికారులు గుర్తిం చారు. దీంతోపాటు ప్రస్తుతం కార్యాలయం కొనసాగుతున్న ఎంపీడీ ఓ, పశుసంవర్థకశాఖ ఏ డీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని స్రీశక్తి భవనం, కొత్త మున్సిపల్ కార్యాలయం పూర్తి చేసి పాత భవనాల్లో 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. దీంతో పాటు వర్తకసంఘ భవనం, ధర్మశాల పైభాగంలోని మీటింగ్ హాల్,రైల్వేగేట్ సమీపంలోని 10,000 చదరపు అడుగుల ప్రభుత్వ భవనంతోపాటు నూతనంగా నిర్మించిన మరో 20 ప్రైవేట్ వ్యక్తుల భవనాలను గుర్తించారు. అందుబాటులో మరిన్ని కార్యాలయాలు.. అధికారులు గుర్తించిన భవనాలతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న డివిజన్‌స్థాయి కార్యాలయాలు జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలం గా ఉన్నాయి. ఆర్డీఓ కార్యాలయం, ఆర్డీఓ బంగ్లా, డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీబంగ్లాలు ఉన్నత స్థాయి కార్యాలయాలకు ఉపయోగపడతాయి. జాతీయ రహదారి పక్కన ఉన్న రహదారి బంగ్లా, ఆర్‌ఆండ్‌బీ కార్యాలయం, పశుసంవర్థక శాఖ కార్యాలయం, కోఆపరేటివ్ బ్యాంకు కార్యాలయం, పట్టణపోలీస్ స్టేషన్, నీటిపారుదల శాఖకార్యాలయం, కోర్టు భవనాల సముదాయం, జూనియర్ కళాశాల సముదాయం, తహసీల్దార్కార్యాయం,ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో సుమారు 50 ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. 30 ఎకరాలు ఒకేచోట.. భవనగిరిని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ఒకే చోట 30 ఎకరాల స్థలం ఉండాలని సీఎం చెప్పడంతో అధికారులు ఆ దిశగాస్థలాన్ని గుర్తించారు. గతంలో దిల్ సంస్థలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు జాతీయ రహదారి బైపాస్ పక్కన ఐటీఐ సమీపంలో గల ప్రభుత్వ స్థలం.. ఇలా నాలుగైదు ప్రతిపాదనలుసిద్ధం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను సీఎం కేసీఆర్ ముందు పెట్టనున్నారు.