
బొమ్మలరామారం: హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ కేసుపై కొన్ని రోజులుగా నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, గురువారం నిందితుడిని విచారించారు. వందమందికి పైగా సాక్షులు, అధికారులను విచారించిన కోర్టు, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment