![Drunken Husband Cuts Wife Nose And Ears in Yadadri - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/3/woman.jpg.webp?itok=IXbC_iS6)
యాదాద్రి భువనగిరి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించి రాధతో గొడవ పడి ఇంట్లోని చేపలను కోసే కత్తితో ఆమెపై దాడిచేసి చెవి, ముక్కు కోసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె బంధువులు హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై రాధ సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment