యాదాద్రి : యాదాద్రి జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.