Falaknuma Train Accident: No Fatalities Has Reported, Says DGP Anjani Kumar - Sakshi
Sakshi News home page

Falaknuma Express: రైలు ప్రమాద ఘటనపై స్పందించిన డీజీపీ, రైల్వే జీఎం

Published Fri, Jul 7 2023 2:28 PM | Last Updated on Fri, Jul 7 2023 2:57 PM

Falaknuma Train Accident: No Fatalities Has Reported Says DGP - Sakshi

సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని  అరుణ్‌కుమార్‌  పరిశీలించారు.

మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు. 

కాగా యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి 7 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement