సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఇక ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనపై క్లూస్ టీం దర్యాప్తు ముగిసింది. ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కాలిపోయిన బోగీలను ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించింది. ఎస్-4 బోగోలోని బాత్‌రూమ్ వద్ద పొగలు వ్యాపించినట్టు నిర్ధారణ చేశారు. ఎస్-4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించినట్టు తెలిపారు. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. క్లూస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘మోదీజీ.. గవర్నర్ తమిళిసైకు ఆ విషయం చెబితే బాగుండేది’
Comments
Please login to add a commentAdd a comment